భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట‍్ల ఏర్పాట్లపై రోజుకో వార్త ప్రధానాంశంగా మారుతోంది. తాజాగా, టెస్లా ప్రతినిధులు దేశీయంగా టెస్లా కార్ల తయారీపై త్వరలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారని సమాచారం. ఇప్పటికే ఈ భేటీకి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీని నిర్మించి అతి తక్కువ ధరకే వాటిని వాహనదారులకు అందించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే మస్క్ చైనాలో టెస్లా కార్లను తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసి ఇక్కడ అమ్మకాలని చూశారు. అందుకు కేంద్రం సైతం తిరస్కరించింది. ఈ తరుణంలో అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం భారత్‌లో టెస్లా కార్ల ఉత్పత్తిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్లే మస్క్ సైతం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
అయితే, దేశీయంగా తయారీ సంస్థలకు ఎలాంటి ప్రొత్సహకాలు అందిస్తున్నామో, టెస్లాకు సైతం అదే విధమైన రాయితీలు ఉంటాయి. అంతే తప్పా టెస్లా కోసం ఎలాంటి ప్రత్యేక పాలసీలు అమలు చేయడం లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పియూష్ గోయల్‌తో టెస్లా ప్రతినిధులు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
పియూష్‌తో జరిపే సమావేశంలో భారత్‌లో టెస్లా కార్లను తయారు చేసి చైనా కంటే తక్కువ ధరకే అమ్ముతామని టెస్లా చెప్పనుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. చైనాలో టెస్లా మోడల్3 సెడాన్ కారును 32,200 డాలర్లకు అమ్ముతుండగా..ఆ ధర కంటే తక్కువగా అంటే 25శాతం తగ్గించి రూ.20 లక్షల (24 వేల డాలర్ల) ధరకే అందుబాటులోకి తేవాలని టెస్లా భావిస్తున్నట్లు రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీనిపై అధికారికంగా స్పందించడానికి టెస్లా ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు.
చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
Comments
Please login to add a commentAdd a comment