అమెరికా రెంటల్ కార్ కంపెనీ హెర్జ్, టెస్లాతో భారీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం హెర్ట్జ్ కంపెనీ 1,00,000 టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లను ఆర్డర్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో ఇప్పటి వరకు ఇది ఒక రికార్డు అని బ్లూమ్ బెర్గ్ న్యూస్ తెలిపింది. రాబోయే 14 నెలల్లో టెస్లా కంపెనీ దశల వారీగా లక్ష కార్లను డెలివరీ చేయనుంది. ఈ డీల్ వివరాలు బయటకు రావడం ఆలస్యం టెస్లా కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి 14.9 శాతంగా షేర్ల విలువ పెరిగింది.
ఈ టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లు యుఎస్, ఐరోపాలో అద్దెకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, ఈ అద్దె కార్లను ప్రోత్సహించడం కోసం మౌలిక సదుపాయాలను కలిపించడానికి భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది. ఈ ఆర్డర్ టెస్లాకు ఒక పెద్ద వరం. టయోటా, జనరల్ మోటార్స్ వంటి దిగ్గజాలతో పోలిస్తే కంపెనీ ఇప్పటికీ తక్కువ మొత్తంలో వాహనాలను విక్రయిస్తుంది. 2020లో ఈ ఆటోమేకర్ ప్రపంచవ్యాప్తంగా 5,00,000 వాహనాలను విక్రయించింది. ఈ కొత్త కార్ల ప్రచార కోసం రాబోయే వాణిజ్య ప్రకటనలో టామ్ బ్రాడీ నటించనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment