Tesla Model 3
-
మస్క్ ఆవిష్కరణలు.. 2006 నుంచి 2024 వరకు (ఫోటోలు)
-
టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?
టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్లో జనవరి 2024లో జరిగే సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
Tesla Cars: ఇండియాలో ఇక టెస్లా కార్లు.. ధర ఎంతంటే..?
టెస్లా తన కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ టెస్లాకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఇండియాలో ప్రవేశిస్తే మొదటి మోడల్ కారు ధర 25వేల యూరోలు(రూ.22 లక్షలు) ఉండనుందని సమాచారం. ఈ మోడల్కారును మొదట జర్మనీలో తర్వాత భారతదేశంలో లాంచ్ చేయనున్నారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలో టెస్లా మోడల్ వై క్రాస్ఓవర్ పేరుతో కారు లాంచ్ చేయబోతుంది. మోడల్ వై అనేది మోడల్ 3 సెడాన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతుంది. ఈ క్రాస్ఓవర్ ఎస్యూవీను తయారుచేసేందుకు 2020 నుంచి కంపెనీ పనిచేస్తోంది. మూడు వరుసల్లో ఏడుగురు ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్లు తెలిసింది. టెస్లా చాలారోజుల నుంచి భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం.. టెస్లా వాహనాలను వచ్చే ఏడాది నుంచి దేశంలోకి అనుమతిస్తారు. కంపెనీ రానున్న రెండేళ్లలో భారత్‌లో తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో గుజరాత్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పింది. టెస్లా భారతదేశంలో రూ.16 వేల కోట్లతో కొత్త ప్లాంట్ ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ కంపెనీల నుంచి రూ.1.24 లక్షల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా దేశంలో బ్యాటరీలు కూడా తయారు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతవారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ ఎలాన్‌మస్క్‌ను కలవాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా మంత్రిని కలవలేకపోయానని క్షమాపణలు చెబుతూ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. త్వరలో మంత్రిని కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
హమాస్ ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం..‘టెస్లా నా ప్రాణం కాపాడింది’
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజా వణుకుతోంది. గాజా నగరం శవాల దిబ్బగా మారిపోతుంది. నగరంలోని మార్చురీలు నిడిపోయాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. హమాస్‌ను తుద ముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ సమీపంలో దాడులకు తెగబడ్డారు. దీంతో సామాన్యులు తమ ప్రాణాల్ని కాపాడుకోడవం కోసం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ దేవుడిపై భారం వేస్తున్నారు. అంతటి భయానక వాతావరణంలో హమాస్ టెర్రరిస్ట్‌ల బీభత్సం సృష్టిస్తూ కురించిన బుల్లెట్ల వర్షం టెస్లా ఎలక్ట్రిక్ కార్ తన ప్రాణాలు కాపాడిందంటూ ఆ కారు ఓనర్ గద్గద స్వరంతో చెప్పాడు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థ వాల్లా (walla) ఓ కథనాన్ని ప్రచురించింది. మెషిన్ గన్స్‌తో బీభత్సం హమాస్ దాడి ప్రారంభమైన సమయంలో కారు యజమాని టెస్లా మోడల్ 3 కారులో తప్పించుకునేందుకు ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అయితే, ఊహించని విధంగా అతనికి హామాస్ దాడి ప్రారంభమైన సమయంలో మరో ప్రాంతానికి వెళుతుండగా కలాష్నికోవ్స్ రైఫిల్స్ ,భారీ మెషిన్ గన్స్‌తో టెర్రరిస్టులు వస్తున్న కారు ఎదురు పడింది. ఎలక్ట్రిక్ కారని వాళ్లకి తెలియదు అంతే టెర్రరిస్టుల వాహనం తనవైపుకు దూసుకు వచ్చింది. రెప్పపాటులో తనది ఎలక్ట్రిక్ కారు (టెస్లా మోడల్ 3) అని తెలియకపోవడంతో ఈవీలో లేని ఇంజన్ ట్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని కారుపై కాల్పులు జరిపారు. ఇలా చేస్తే కారు ఆగిపోవడం లేకపోతే ఇంధన ట్యాంక్ పేలిపోతుందని భావించారు. అయితే ఈవీ కార్ కావడంతో ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాడు. వాళ్ల బుల్లెట్లు నన్ను ఏం చేయలేకపోయాయ్ అతని టైర్లను కాల్చినప్పటికి తన కారు యాక్సిలరేటర్‌ను రేజ్ చేసి డ్యూయల్-డ్రైవ్ ఫీచర్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకునేందుకు సాయం చేసిందని చెప్పాడు. పైగా, ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు బ్యాటరీ వెడెక్కలేదు. టెస్లా కారులో ఉన్న తనని టెర్రరిస్ట్‌లు కురిపించిన బుల్లెట్లు సైతం తనని ఏం చేయలేకపోయానని అన్నారు. అతని భార్య టెస్లా యాప్ ద్వారా తన కారు లొకేషన్, ఎమర్జెన్సీ రూమ్‌ల గురించి సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు చెప్పాడు. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్‌లోని సూపర్‌చార్జర్ల గురించి కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని టెస్లా సూపర్ఛార్జర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. I think he deserves an highland. looking for the dashcam videos as well. pic.twitter.com/DJhrGwBubg — Michael Lugassy (@mluggy) October 12, 2023 -
గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన ఎలక్ట్రిక్ కారు ఇదే!
జనరల్ మోటార్స్ 1996లో మొదటి ఆధునిక ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేసినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచ మార్కెట్ క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2008లో టెస్లా కంపెనీ లాంచ్ చేసిన తన ఎలక్ట్రిక్ కారు తర్వాత ఆ రంగం శర వేగంగా విస్తరించడం మొదలు పెట్టింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొంటూ కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం గూగుల్‌లో ఎక్కువ వెతికిన వాటిలో టెస్లా కారు అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి చెందిన నాలుగు మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సర్చ్ చేసిన మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి. partcatalog.com విడుదల చేసిన డేటా ప్రకారం.. టెస్లా మోడల్ 3 కారును ప్రపంచంలో అత్యధికంగా వెతికారు. ఈ కారు కోసం నెలకు 2,240,000 మంది సర్చ్ చేశారు. టెస్లా మోడల్ ఎస్, మోడల్ వై & మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కార్లు ఆ తర్వాత స్థానాలలో ఉన్నాయి. టెస్లా కాకుండా ఆ తర్వాత స్థానాలలో ఆడి ఇ-ట్రాన్ (2021 నుంచి నెలకు ఒక మిలియన్ సార్లు), పోర్స్చే టేకాన్ (నెలకు మిలియన్ సార్లు కూడా), తర్వాత వోక్స్ వ్యాగన్ ఐడి.4(823,700) కార్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్ పరంగా కూడా టెస్లా (11,100,000)ను ఎక్కువ మంది సర్చ్ చేశారు. (చదవండి: e-nomination: చందాదారులకు చుక్కలు చూపిస్తున్న ఈపీఎఫ్ఓ వెబ్సైట్..!) -
టెస్లా అయితే కాదు..! టాప్ ఎలక్ట్రిక్ కారు ఇదే..!
ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా కార్లు భారీ ఆదరణను పొందాయి. ఐతే అమెరికా మార్కెట్లలో టెస్లాకు అనుహమైన దెబ్బ తగిలింది. అమెరికా కన్స్యూమర్ రిపోర్ట్స్- 2022 ప్రకారం అత్యుత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఫోర్డ్ ముస్టంగ్ మాక్-ఈ (Ford Mustang Mach-E) అగ్రస్థానంలో నిలిచింది. రెండు సంవత్సరాల పాటు ఈ టైటిల్‌ను కలిగి ఉన్న టెస్లా మోడల్ 3ని అధిగమించింది. ఈ కన్స్యూమర్ రిపోర్ట్స్ అత్యుత్తమ కార్లు, ఎస్ యూవీ, ట్రక్కులను హైలైట్ చేస్తుంది. టెస్లా మోడల్-3 కు పోటీగా ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాక్-E వెలుగులోకి వచ్చింది. ఫోర్డ్ 2020లో Mach-E, దాని ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును విక్రయించడం ప్రారంభించింది. ఐతే అమెరికా వాసులు మాత్రం టెస్లా కార్ కంటే ఫోర్డ్ ముస్తాంగ్ మాక్-ఈ కారును ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. టెస్లా మోడల్ 3 స్పెసిఫికేషన్ టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 586 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ స్పెసిఫికేషన్ ఫోర్డ్ ఎలక్ట్రిక్ ముస్టాంగ్ మాక్ ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఇంజిన్ 600 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోంది.వేగంగా ఛార్జింగ్ అయ్యే DC బ్యాటరీ కేవలం 10 నిమిషాల ఛార్జ్ తర్వాత 47-మైళ్ల దూరం నడుస్తుంది. -
సేల్స్‌లో సెన్సేషన్.. టెస్లాకు గట్టిపోటీ.. ఈ పొట్టి ఈవీ కార్!
ఎలక్ట్రిక్ కార్లకు కేర్ ఆఫ్ అడ్రస్ టెస్లా. ఈ కంపెనీకి చెందిన కార్లు అమ్మకాల విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తాయి. ఇప్పుడు ఆ కంపెనీ పోటీగా చైనాకు చెందిన ఒక ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో దూసుకెళ్తుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ 3కి వులింగ్ హాంగ్ గ్వాంగ్ మినీ కారు చైనాలో గట్టి పోటీని ఇస్తుంది. చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్(సీపీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ పొట్టి ఎలక్ట్రిక్ కారు 2021లో టెస్లా మోడల్ వైని అధిగమించింది. చైనాలో 2021లో 3,95,451 యూనిట్ల గ్వాంగ్ మినీ ఎలక్ట్రిక్ కార్లను సంస్థ విక్రయించింది. కంపెనీ జూన్ 2020 నుంచి కేవలం 19 నెలల్లో 5,00,000 యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. ఈ చైనీస్ కంపెనీ టెస్లా విక్రయించిన మొత్తం(3,20,743) యూనిట్ల కంటే ఎక్కువగా ఈ కార్లను విక్రయించినట్లు తెలిపింది. డిసెంబర్ 2021లో 50,000 యూనిట్లకు పైగా అమ్ముడైన ఏకైక ఎలక్ట్రిక్ వాహనం అని సీపీసీఏ తెలిపింది. ఈ చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ డిసెంబర్ 2021లో 50,561 యూనిట్లను విక్రయించడం ద్వారా చైనాలో ఆల్ టైమ్ నెలవారీ రికార్డును సాధించింది. 2021లో చైనాలో 187,227 యూనిట్లు విక్రయించిన రెండో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా బైడ్ క్విన్ నిలిచింది. టెస్లా మోడల్ 3 150,890 యూనిట్లతో మూడవ స్థానంలో నిలచింది. గత ఏడాది డిసెంబర్ నెలలో 30,102 యూనిట్ల టెస్లా మోడల్ 3 కార్లను విక్రయిస్తే, మోడల్ వై 40,500 యూనిట్లను విక్రయించింది. టెస్లా మోడల్ 3 అమ్మకాలు 2020లో ఇదే నెలతో పోలిస్తే గత నెలలో 26.5 శాతం పెరిగింది. ధర రూ.3 లక్షలు గ్వాంగ్ మినీ ఈవీ కారును సంస్థ చైనాలో 28,800 యువాన్లకు(దాదాపు రూ.3.35 లక్షలు) విక్రయిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్లు(దాదాపు 106 మైళ్ళు) వరకు వెళ్లనుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎస్ఎఐసి మోటార్, వులింగ్ మోటార్స్, యుఎస్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ఉమ్మడి భాగస్వామ్యంలో భాగంగా ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును తయారు చేశారు. స్థానికంగా దీనిని కేవలం వులింగ్ అని పిలుస్తారు. (చదవండి: ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. ఇక ముందుగానే ఖాతాలోకి పెన్షన్!) -
టెస్లా కార్లలో ‘కలకలం..!’
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా కార్లలోని రియర్ వ్యూ కెమెరా, ట్రంక్ లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించడంతో ఈ సమస్యను తనిఖీ చేయడానికి టెస్లా తన 4,75,000 ఎలక్ట్రిక్ వాహనదారులకు రీకాల్ ఆర్డర్లను జారీ చేసింది. ఈ సమస్య వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు భావించి రీకాల్ చేసినట్లు పేర్కొంది. రీకాల్ చేయబడ్డ యూనిట్లు టెస్లా మోడల్ 3, మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు. టెస్లా రీకాల్ ఆర్డర్‌ను యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) ధృవీకరించింది. 2014 నుంచి 2021 మధ్య కాలంలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ వాహనలను సంస్థ రీకాల్ చేసింది. ఈ మోడల్ 3 ఈవీలలో వెనుక ట్రంక్ తెరిచినప్పుడు, మూసివేసినప్పుడు వెనుక కెమెరా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. కొన్ని టెస్లా కార్లలోని ఫ్రంట్ ట్రంక్ లో ఉన్న లోపం వల్ల భారీ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ గుర్తించింది. కారు ప్రయాణిస్తున్న సమయంలో ముందు ఉన్న ట్రంక్ ఒకేసారి ఆటోమెటిక్‌గా తెరుచుకోవడంతో ముందు వెళ్తున్న వాహనాలు, రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని టెస్లా పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 4,75,000 ఈవీలను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. (చదవండి: చేనేతకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా) -
Viral Video : వేగంగా వెళ్తున కారు.. అకస్మాత్తుగా కూలిన భారీ చెట్టు
ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లా ఒక నూతన అధ్యాయం మొదలు పెట్టింది. ఎలన్‌మస్క్ నేతృత్వంలో వచ్చిన కార్లు అనతి కాలంలోనే యూజర్ల మనసులు దోచుకోవడంతో ఈ కంపెనీకి తిరుగే లేకుండా పోయింది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో సక్సెస్ కావన్న కంపెనీలే ఇప్పుడు అదే రూట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టెస్లా నుంచి ఇప్పటికే అనేక సక్సెస్ఫుల్ మోడల్స్ మార్కెట్లో ఉండగా లేటెస్ట్ కారుగా మోడల్ ఎస్ ప్లెయిడ్‌ని ఎలన్‌మస్క్ ఇటీవల మార్కెట్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ మోడల్ గురించి ఎలన్‌మస్క్ మాట్లాడుతూ... ఈ కారు వేగంలో పోర్షేను సేఫ్టీలో వోల్వోను మించిన కారంటూ చెప్పారు. ఆయన ఎందుకు అలా అన్నారో కానీ ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఘటన మాత్రం టెస్లా కార్లు ఎంత సేఫ్టీ అనే విషయాన్ని అన్యాపదేశంగా చెబుతున్నాయి. ఇటీవల అమెరికాను టోర్నోడోలు ముంచెత్తాయి. వేగంగా వీచిన గాలుల దాటికి పెద్ద చెట్లు కూకటి వేళ్లతో కూలిపోయాయి. భారీ గోడౌన్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ టోర్నోడో విశ్వరూపం ప్రదర్శిస్తున్న సమయంలోనే ఒంటారియాలో వేగంగా వెళ్తున్న ఓ టెస్లా మోడల్ 3 కారుపై భారీ చెట్టు కూలి పోయింది. సుమారు 2000 పౌండ్లు ( 907 కేజీలు) బరువు ఉన్న ఆ చెట్టు ఒక్క సారిగా మీద పడటంతో ఈ కారు తుక్కుతుక్కు అవుతుందని అనుకున్నారు. WATCH: 2,000lb tree falls on @Tesla Model 3 in Ontario in high winds this week. All occupants okay. Teslas continue to be rated the safest cars on the road. @elonmusk $TSLA @WholeMarsBlog @DriveTeslaca Credit Sam Fursey: https://t.co/85PASnUFI7 pic.twitter.com/mYMDeqvyFb — Gary Mark • Blue Sky Kites (@blueskykites) December 16, 2021 టెస్లా సంస్థ తమ కార్ల బిల్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల భారీ చెట్టు మీద పడినా కొద్ది సొట్టు పోవడం, కొంచెం అద్దం పగిలిపోవడం మినహా పెద్దగా డ్యామేజీ ఏమీ జరగలేదు. కారులో ప్రయాణిస్తున వ్యక్తులు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఇటీవల ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. ఈ వీడియో చూసిన వారు టెస్లా కార్ల నాణ్యతను ప్రశంసిస్తున్నారు. చదవండి : టెస్లాకు గట్టి పోటీ.. ఛార్జింగ్ లేకున్నా 50 కిమీ దూసుకెళ్తుంది! -
చరిత్ర తిరగ రాసిన టెస్లా కంపెనీ
అమెరికా రెంటల్ కార్ కంపెనీ హెర్జ్, టెస్లాతో భారీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం హెర్ట్జ్ కంపెనీ 1,00,000 టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లను ఆర్డర్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో ఇప్పటి వరకు ఇది ఒక రికార్డు అని బ్లూమ్ బెర్గ్ న్యూస్ తెలిపింది. రాబోయే 14 నెలల్లో టెస్లా కంపెనీ దశల వారీగా లక్ష కార్లను డెలివరీ చేయనుంది. ఈ డీల్ వివరాలు బయటకు రావడం ఆలస్యం టెస్లా కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి 14.9 శాతంగా షేర్ల విలువ పెరిగింది. ఈ టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లు యుఎస్, ఐరోపాలో అద్దెకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, ఈ అద్దె కార్లను ప్రోత్సహించడం కోసం మౌలిక సదుపాయాలను కలిపించడానికి భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది. ఈ ఆర్డర్ టెస్లాకు ఒక పెద్ద వరం. టయోటా, జనరల్ మోటార్స్ వంటి దిగ్గజాలతో పోలిస్తే కంపెనీ ఇప్పటికీ తక్కువ మొత్తంలో వాహనాలను విక్రయిస్తుంది. 2020లో ఈ ఆటోమేకర్ ప్రపంచవ్యాప్తంగా 5,00,000 వాహనాలను విక్రయించింది. ఈ కొత్త కార్ల ప్రచార కోసం రాబోయే వాణిజ్య ప్రకటనలో టామ్ బ్రాడీ నటించనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది. (చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ తీపికబురు) -
మస్క్ కాస్కో.. టెస్లాకు పోటీగా ఇండియన్ కార్
రౌద్రం, రణం, రుధిరం సింపుల్‌గా ఆర్ఆర్ఆర్ భారతీయ మూవీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. మీన్ మెటల్ మోటార్ సింపుల్‌గా ఎంఎంఎం. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తాజాగా ఆసక్తి రేపిన స్టార్టప్. ఫస్ట్ ఇండియన్ సూపర్ కార్ తెస్తామంటూ రూట్‌మ్యాప్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన టెస్లాతో ఢీ అంటే ఢీ అంటున్నాడు భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్త శర్‌తక్‌పాల్. టెస్లా ఎస్ ప్లెయిడ్ 3ని మించిన ఫీచర్లతో కారు తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. టెస్లాకు సవాల్ విసిరాడు. సాక్షి, వెబ్‌డెస్క్: రెండు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకునే నేర్పు... గరిష్ట వేగం గంటకి 350 కిలోమీటర్లు.... 100 హార్స్ పవర్ కలిగిన శక్తివంతమైన ఇంజన్.... ఒక్క సారి రీఛార్జీ చేస్తే చాలు 700 కి.మీల ప్రయాణం చేయగల సామర్థ్యం, .. ఇవన్నీ చదువుతుంటే టెస్లా కంపెనీ ఎస్ ప్లెయిడ్ 3 ఎలక్ట్రిక్ కారు గుర్తొస్తుందా.. కానీ ఇది ఎస్ ప్లెయిడ్ కాదు ఎంఎంఎం అజానీ ఎలక్ట్రిక్ కారు. తయారు చేస్తోంది ఏ విదేశీ కంపెనీయో కాదు పక్కా భారతీయ సంస్థ. దాని ఓనర్ శర్‌తక్‌పాల్. ఇండియా వర్సెస్ టెస్లా భారత్‌లో దిగుమతి సుంకాలు ఎక్కువని, వాటిని తగ్గిస్తే ఇండియాలో టెస్లా ఈవీ కార్లనె తెస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. దీనికి ప్రతిగా ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే పన్ను రాయితీ గురించి ఆలోచిస్తామంటూ భారత ప్రభుత్వం ఫీలర్ వదిలింది. మరోవైపు ఈవీ వెహికల్స్ తయారు చేసే సత్తా భారతీయులకు ఉందంటూ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అధినేత భవీష్ అగర్వాల్ స్పందించారు. టెస్లాకి సవాల్ ఈవీ వాహనాలు.. ఎలన్‌మస్క్... భారత్‌ల మధ్య రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఇంతలోనే ఎలన్‌మస్క్‌కు షాక్ ఇచ్చే న్యూస్ మరో భారతీయుడైన శర్‌తక్‌పాల్ నుంచి వచ్చింది. ఎలన్‌మస్క్ తనకు ఆదర్శమని, ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో టెస్లా ఓ బ్రాండ్ అని.. కానీ తాము బ్రాండ్ కిల్లర్ అంటూ సవాల్‌కు సై అన్నాడు. త్వరలో తన కంపెనీ నుంచి రాబోతున్న సూపర్ ఎలక్ట్రిక్ కారు విశేషాలను తెలియజేశాడు. భారత సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎంఎంఎం మీన్ మెటల్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్. సింపుల్‌గా ఎంఎంఎం. ఈ స్టార్టప్‌ని ముగ్గురు మిత్రులతో కలిసి 19 ఏళ్ల శర్‌తక్‌పాల్ 2012లో నెలకొల్పాడు. ఆ తర్వాత 2014లోనే భవిష్యత్తును అంచనా వేసి అజానీ అనే బ్రాండ్ నేమ్‌తో ఇండియన్ మేడ్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలని ఎంఎంఎ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టార్టప్‌లో శ్రమిస్తున్న వారి సంఖ్య నాలుగు నుంచి ఇరవైరెండుకి పెరగగా.... ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్టు చివరి చేరుకుంది. త్వరలోనే అజానీ కారుతో సంచలనాలు సృష్టిస్తామంటూ తమ మార్కెట్ స్ట్రాటజీని ఇటీవల ఎంఎంఎ వెల్లడించింది. ఎంఎంఎం అజానీ ఎంఎఎం ప్రైవేట్ లిమిలెడ్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కారుగా వస్తోన్న అజానీ గరిష్ట వేగం గంటలకు 350 కిలోమీటర్లు, ఇందులో అమర్చిన 120 కిలోవాట్ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు స్పీడ్ మోడ్‌లను బట్టి కనిష్టంగా 550 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 986 బ్రేక్‌హార్స్ పవర్ ఇంజన్‌తో కేవలం రెండు సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడు అందుకోగల నేర్పు దీని స్వంతం. మార్కెట్లో హల్చల్ చేస్తోన్న స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కారుని డిజైన్ ఉంటుంది. కంపెనీ రిలీజ్ చేసిన ఫోటోలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మార్కెట్‌కి వచ్చేది అప్పుడే అజానీ కారు 2022 ద్వితియార్థంలో అజానీ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఎంఎంఎం ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. అనంతరం 2023 ప్రారంభంలో యూకేలో ఈ కారుని ఫస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆ మరుసటి ఏడాది యూఏఈలో అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జెండా పాతిన తర్వాత 2025లో ఇండియాకు అజానీని తీసుకువస్తామని చెబుతున్నారు. ఇండియాలో ఈ కారు ధర ఇండియాలో కనిష్టంగా 89 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అన్నింటా భిన్నమే ప్రస్తుతం కార్ మాన్యుఫ్యాక్లరింగ్ యూనిట్లో ఐదో వంతు ఉండే యూనిట్‌తోనే అజానీ కార్లు తయారు చేయబోతున్నట్టు ఎంఎంఎం ప్రకటించింది. ఈ మేరకు కారు ఎయిరోడైనమిక్స్, రీసెచ్చ్ అండ్ డెవలప్మెంట్లకు సంబంధించి ఎంఎంఎం టీమ్ సభ్యులు అమెరికా, జర్మనీలకు చెందిన ఇంజనీర్లతో కలసికట్టుగా పని చేస్తున్నారు. వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరిస్తున్నారు. రెండేళ్లలో మార్పు ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇటు ప్రభుత్వం, అటు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా.. మౌలిక సదుపాయల కొరత ఎక్కువని ఎంఎంఎం సీఈవో శర్‌తక్‌పాల్ అంటున్నారు. రెండేళ్లలో ఈ సమస్య తీరిపోతుందని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించి పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇండియా వెనుకబడి ఉందని, అజానీ రాకతో ఈ పరిస్థితులో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు
దేశియ రోడ్లపై టెస్లాకార్లు రయ్.. రయ్ మంటూ ఎప్పుడు తిరుగుతాయా అని ఎదురు చూస్తున్న అభిమానులకు టెస్లా శుభవార్త చెప్పింది. యూజర్ ఇంటర్ ఫేస్‌లో హిందీ లాంగ్వేజ్‌ను యాడ్ చేసింది. దేశంలో చమురు ధరలు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఈవీ మార్కెట్ పై కన్నేసిన ఆటోమొబైల్ సంస్థలు ఈవీ వాహనాల్ని తయారు చేసి, భారత్ లో విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రముఖ ఈవీ వెహికల్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ త్వరలో భారత్‌లో టెస్లా కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూఐలో హిందీ లాంగ్వేజ్ ఇప్పటికే భారత్ లో ఐటీహబ్ గా పేరొందిన బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా పేరుతో ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి హెడ్ గా ప్రశాంత్ ఆర్.మీనన్ ను ఎంపిక చేశారు. ప్రశాంత్ మీనన్ సైతం టెస్లా కార్లను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా టెస్లా కార్ యూజర్ ఇంటర్ ఫేస్(UI)లో రష్యన్,గ్రీక్,ఫిన్నిష్ క్రొయేషియన్ లాంగ్వేజ్‌తో పాటు హిందీ లాంగ్వేజ్‌ను యాడ్ చేసింది. దీంతో ఇండియన్ ఆటోమొబైల్ నిపుణులు టెస్లా కారు ఇండియన్రోడ్లపై తిరిగే సమయం దగ్గరలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో టెస్లా మోడల్ 3 కొద్ది రోజుల క్రితం భారత్‌లో టెస్లా మోడల్ 3 కార్ ట్రయల్స్ నిర్వహించారు.ఈ ట్రయల్స్‌లో రోడ్లపై టెస్లా కార్ల డ్రైవింగ్ సులభంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు నిర్ధారించారు. దీంతో టెస్లా మోడల్-3 రెడ్ కలర్ కార్‌ను బెంగళూరులో డెలివరీ చేసింది. భారత్‌లో తొలిసారి విడుదల చేయనున్న ఈ కారు ధర రూ.70 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. టెస్లా మోడల్ -3 అమెరికన్ మార్కెట్లో ప్రారంభ ధర సుమారు రూ .30 లక్షలు ($ 39,990) కు విక్రయిస్తున్నారు. కార్లపై అధిక కస్టమ్స్ సుంకం విధించడం వల్ల, భారత్ కు వచ్చే టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ .70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. -
Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో
భారత్‌లో ఇకపై ప్రముఖ ఎలక్ట్రిక్ టెస్లా కార్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై సందడి చేయనున్నాయి. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్లా-3 నెంబర్ మోడల్ కార్లను ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ కార్లతో ప్రపంచ దేశాల్ని ఆకర్షిస్తున్న టెస్లా ఇక భారత్ మార్కెట్ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో టెస్లా కార్లు ముంబైకి చెందిన ఓ ప్రాంతంలో టెస్ట్ ట్రయల్స్ నిర్వహింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విలాసవంతమైన తన కార్లను భారతీయులను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో షోరూంలను, డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బెంగళూరు (కర్ణాటక) కేంద్రంగా టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో రిజిస్టర్ చేయించింది. దీంతో పాటు ముంబై హెడ్ ఆఫీస్ గా..కొన్ని ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి ఈ ఏడాది చివరి నాటికి కార్లను విడుదల చేసేందుకు సంస్థ ప్రతినిథులు నిర్విరామంగా కృషి చేస్తున్నారట. బ్లూ డ్యూయెల్ మోటార్ టెస్లా 3వ నెంబర్ మోడల్ కారు టైర్లు 18ఇంచెంస్, ఏరో బాడీ కిట్ మోడల్, స్టాండర్డ్ రేంజ్ ప్లస్ వేరియంట్ల కోసం 54 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, లాంగ్ రేంజ్ పెర్ఫార్మెన్స్, 82 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. దాదాపు 381 కిమీ నుండి 614 కిలోమీటర్ల మధ్య లో టెస్లా-3 దూసుకుపోనుంది. ఆకట్టుకునే ఫీచర్లతో చైనాలో తయారై దేశీయ మార్కెట్లో అడుగుపెట్టబోతున్న ఈ టెస్లా కారు ధర సుమారు రూ.55లక్షల నుంచి 70లక్షల మధ్యలో ఉండనుంది. అయితే టెస్లా 3వ నెంబర్ మోడల్ కారు భారత్ లో విడుదల అవుతుందా లేదా అనే అంశంపై టెస్లా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతో పాటు ఇది కంప్లీట్లీ బిల్ట్-అప్ (సిబియు) లేదా కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (సికెడి) ను ఎంచుకుంటుందా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. చదవండి: Tesla S Plaid : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్ Tesla Spotted In Pune Ahead Of India Launchpic.twitter.com/uRs4VoFGyc — Marketing Maverick (@MarketingMvrick) June 12, 2021 -
టెస్లా ప్రియులకు గుడ్ న్యూస్!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశంలోని మూడు మహా నగరాల్లో షోరూమ్‌లను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కడైతే బాగుంటుందనే ప్రదేశాల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. దేశంలో తన వ్యాపారకలాపాలు విస్తరించడానికి ఒక ఎగ్జిక్యూటివ్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఇండియాలో వ్యాపారసేవలు కొనసాగించడానికి జనవరిలో స్థానికంగా సంస్థను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2021 మధ్య నాటికి మోడల్ 3 సెడాన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై, దక్షిణాదిన టెక్ సిటీ అయిన బెంగళూరులో షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు తెరిచేందుకు టెస్లా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ మూడు నగరాలలో షోరూంలు తెరిచేందుకు 20,000 నుంచి 30,000 చదరపు అడుగుల వరకు ఉన్న వాణిజ్య భవనాల కోసం గాలిస్తున్నారు. టెస్లాకు అవసరమైన షోరూం స్థలాన్ని చూసిపెట్టే బాధ్యతను గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ గ్రూప్‌నకు అప్పగించినట్లు సమాచారం. ఈ సంస్థ గత కొన్ని వారాలుగా స్థలాలను సర్వే చేస్తున్నది. సంపన్న కస్టమర్లు సులభంగా వచ్చేలా చూసేందుకు షోరూంలకు స్థలాలను గుర్తించడంపై ఈ సంస్థ దృష్టి సారించింది. చదవండి: ప్రతి నెల పదివేల పెన్షన్ కావాలా? -
టాటా పవర్‌తో టెస్లా చర్చలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా పవర్ తో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. రెండు సంస్థల మధ్య ఇంకా ఒప్పందాలు కుదుర్చుకోలేదు అని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ టెస్లా బెంగళూరు కేంద్రంగా కొత్త కంపెనీని రిజిస్టర్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారత మార్కెట్లో ప్రవేశించనుంది. టాటాసన్స్ విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ వసతుల కల్పనపై దృష్టి సారించింది. టాటా పవర్, టెస్లా కలిసి మహారాష్ట్రలో ప్రఖ్యాత సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఒకరితో ఒకరు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి వివరాలు ప్రస్తుతానికి తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్లో టెస్లా తన మోడల్ త్రీ ఎలక్ట్రిక్ సెడాన్ కారుతో అడుగు పెట్టనున్నది. అందుకోసమే ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలికంగా అవసరమైన చార్జింగ్ వసతుల కల్పనపైనా టెస్లా ద్రుష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టాటా పవర్‌తో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టెస్లా మోడల్ 3 భాగాలను మొదట దిగుమతి చేసుకొని త్వరగా మార్కెట్ లోకి తీసుకురావాలని యోచిస్తుంది. చదవండి: మస్క్, బెజోస్‌లను అధిగమించిన అదానీ! వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్! -
ఇక మన రోడ్లపైనా ఎలక్ట్రిక్ కార్ల హవా
ముంబై, సాక్షి: ఇటీవల ప్రపంచ మార్కెట్లను వేడెక్కిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ దేశీయంగానూ ఊపందుకోనుంది. 2021లో పలు దిగ్గజ కంపెనీలు దేశీ మార్కెట్లో విభిన్న ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల పోటీకి ఆడి, జాగ్వార్, టెస్లా తదితరాలు సై అంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి గతంలో ఎన్నడూలేని విధంగా దేశీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పలు మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 2,500 వాహనాల వరకూ దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం మద్దతిస్తున్నట్లు చెప్పారు. దీంతో అత్యున్నత సాంకేతికతతో కూడిన ఆధునిక వాహనాలు దేశీ రహదారులపై పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. ఆటో రంగ నిపుణులు వెల్లడించిన వివరాలు చూద్దాం.. ఆడి ఈ-ట్రాన్ ఆడి సంస్థ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ-ట్రాన్ కీలక మోడల్. పూర్తి ఎలక్ట్రిఫికేషన్ దిశలో ఆడి తీసుకువస్తున్న ఈ-ట్రాన్ బ్రాండ్ దేశీయంగా విడుదలకానున్న తొలి విలాసవంత(హైఎండ్) కారుగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 17,641 వాహనాలు విక్రయమయ్యాయి. దేశీ మార్కెట్లో తొలిగా విడుదలైన మోడల్‌గా ప్రయోజనాలు పొందే వీలుంది. తొలి దశలో పూర్తిగా నిర్మితమైన వాహనం(సీబీయూ)గా తక్కువ సంఖ్యలోనే దిగుమతికానున్నాయి. అయితే రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా విడివిడిగా యాక్సిల్స్‌ను నడిపించే శక్తితో వాహనం, అమ్మకాలు వేగాన్ని అందిపుచ్చుకోనున్నాయి. జనవరి చివర్లో విడుదలకానున్న ఈ-ట్రాన్ గరిష్టంగా 357 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. జాగ్వార్ 1-పేస్ 2019 వరల్డ్ కార్గా ఎంపికైన జాగ్వార్ 1-పేస్ వాహనాలు ఇటీవల పరిశీలనాత్మకంగా ముంబైలో సందడి చేస్తున్నాయి. యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ సైతం రేసులోకి రానుండటంతో అతిత్వరలోనే కారు విడుదల తేదీ ఖరారయ్యే వీలుంది. 90 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీతో, 394 బీహెచ్పీ గరిష్ట శక్తిని అందుకోనుంది. టాప్ఎండ్ హెచ్ఎస్ఈ మోడల్ ద్వారా దేశీయంగా తయారవుతున్న రెండో ఎలక్ట్రిక్ లగ్జరీ కారుగా నిలవనుంది. గరిష్టంగా 470 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. అంచనా ధర రూ. 1.5-2 కోట్లు. (జీప్ స్పీడ్‌కు ఫియట్ క్రిస్లర్ సై) టెస్లా మోడల్-3 యూఎస్ కంపెనీ టెస్లా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు మోడల్-3 దేశీయంగా విడుదలకానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశాక ఆసక్తి బాగా పెరిగింది. గ్లోబల్ ఆటో రంగంలో సంచలనాలకు నెలవుగా నిలుస్తున్న మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగవంత విక్రయాలను సాధిస్తోంది. టెస్లా ఇంక్ తయారీలో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న ఈ వాహనం ఎంట్రీలెవల్ విభాగంలో పోటీకి దిగనుంది. 5 సెకన్లలోపే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల మోడల్-3 గరిష్టంగా 420 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. డాష్‌బోర్డుకు అనుసంధానించిన ల్యాప్‌టాప్ మోడల్ 15 అంగుళాల టచ్ స్క్రీన్‌తో రానుంది. ఏప్రిల్ తదుపరి మార్కెట్లో విడుదలకావచ్చు. అంచనా ధర: రూ. 60 లక్షలు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) పోర్ష్ టేకెన్ కంపెనీకున్న దశాబ్దాల ఇంజినీరింగ్ సామర్థ్యాలతో నాలుగు డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారును టేకెన్ బ్రాండుతో పోర్ష్ రూపొందించింది. కోవిడ్-19 కారణంగా విడుదల ఆలస్యమైన టేకెన్ ఫిబ్రవరిలో దేశీ మార్కెట్లలో ప్రవేశించే వీలుంది. పోర్ష్ నుంచి వస్తున్న తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇది. ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో అత్యంత శక్తికలిగిన కారు కూడా. 79.2 కిలోవాట్స్ బ్యాటరీ, 600 బీహెచ్పీ శక్తితో రూపొందింది. గరిష్టంగా 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. 3.5 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 800 వోల్డ్ ఫాస్ట్ చార్జింగ్ ద్వారా 20 నిముషాల్లోనే 80 శాతం చార్జింగ్కు వీలున్నట్లు కంపెనీ చెబుతోంది. అంచనా ధర: రూ. 2.2-2.5 కోట్లు వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ స్వీడిష్ దిగ్గజం వోల్వో రూపొందించిన పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ 40 రీచార్జ్. వోల్వో తయారీ ఎస్60 మోడల్ విడుదల తదుపరి మార్కెట్లో ప్రవేశించనుంది. ట్విన్ మోటార్లు కలిగిన రీచార్జ్ 408 బీహెచ్పీ పవర్‌ను కలిగి ఉంది. 78 కిలోవాట్ల బ్యాటరీతో వెలువడనుంది. ఏసీ లేదా 150 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. తొలిసారి ఆండ్రాయిడ్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌ను వోల్వో ఏర్పాటు చేసింది. గరిష్టంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. అంచనా ధర: రూ. 50 లక్షలు. టాటా ఆల్ట్రోజ్ఈవీ ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో విలాసవంత మోడళ్ల హవా ప్రారంభంకానున్నప్పటికీ మరోపక్క దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టి సాగుతోంది. దేశంలోనే చౌక ఎలక్ట్రిక్ కారుగా టాటా నెక్సాన్ ఈవీను తీసుకువచ్చిన కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ ఈవీని రూపొందించింది. అందుబాటు ధరల ఈ కార్ల వినియోగదారులు టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ నెట్వర్క్ ద్వారా లబ్ది పొందేందుకూ వీలుంటుంది. గరిష్టంగా 300 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంది. ఫిబ్రవరిలో మార్కెట్లో ప్రవేశించవచ్చు. అంచనా ధర: రూ. 14 లక్షలు. -
ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?
న్యూయార్క్, సాక్షి: ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల తయారీ, మరోపక్క స్పేస్ఎక్స్తో ప్రయోగాలు.. వెరసి ఏడాది కాలంగా ఈ ఇంజినీర్ సరికొత్త రికార్డులను సాధిస్తూనే ఉన్నాడు. అతడే టెస్లా ఇంక్ చీఫ్ ఎలన్ మస్క్. బుధవారం టెస్లా ఇంక్ షేరు 3 శాతం బలపడటంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 716 బిలియన్ డాలర్లను అధిగమించింది. దీంతో కంపెనీ ప్రమోటర్‌గా 20 శాతం వాటా కలిగిన మస్క్ వ్యక్తిగత సంపద 181.1 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు చేరువయ్యాడు. జెఫ్ బెజోస్ సంపద 183.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ప్రస్తుతం అమెజాన్ మార్కెట్ విలువ 1.57 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అమెజాన్‌లో బెజోస్ 11 శాతం వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 2017 అక్టోబర్ నుంచీ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలుస్తుండటం విశేషం! (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) ఏడాది కాలంలో ఏడాది కాలంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయంతో టెస్లా ఇంక్ చీఫ్ ఎలన్ మస్క్ పలు రికార్డులను సాధిస్తూ వస్తున్నారు. మరోపక్క అమెజాన్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ కంపెనీకి ప్రయివేట్ అంతరిక్ష సేవల్లో స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కార్ప్ ద్వారా సైతం మస్క్ పోటీనిస్తుండటం గమనార్హం! కాగా.. గత ఏడాది కాలంలోనే మస్క్ సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్లమేర జంప్‌చేసింది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతంగా సంపదను పెంచుకున్న నలుగురిలోనూ మస్క్ చోటు సాధించారు. ఈ కాలంలో టెస్లా షేరు ఏకంగా 743 శాతం దూసుకెళ్లింది. కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ లాభాలు ఆర్జించడం ద్వారా అమెరికా స్టాక్ ఇండెక్స్ ఎస్అండ్పీ-500లో చోటు సాధించడం ఇందుకు ప్రధానంగా దోహదపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎస్అండ్పీ-500కు ప్రాతినిధ్యం వహించే కంపెనీలలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. (అమెజాన్.. జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్) ఆటో దిగ్గజంగా బుధవారం(6న) టెస్లా షేరు పుంజుకోవడంతో మార్కెట్ విలువ రీత్యా టెస్లా ఇంక్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటో దిగ్గజంగా మరింత బలపడింది. నిజానికి పూర్తిస్థాయి ఆటో కంపెనీ కాకున్నప్పటికీ కంపెనీ మోడల్-3 ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయిస్తోంది. అయితే ఆటో దిగ్గజాలు ఫోర్డ్ మోటార్, జనరల్ మోటార్స్ విక్రయిస్తున్న కార్ల సంఖ్యతో పోలిస్తే ఇవెంతో తక్కువ అయినప్పటికీ మార్కెట్ విలువలో వీటిని గతేడాదిలోనే అధిగమించేసింది. టెస్లాలో మస్క్‌కు అదనంగా స్టాక్ అప్షన్లు సైతం ఉన్నాయి. వీటి విలువ 40 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012, 2018లలో కంపెనీ నుంచి వీటిని మస్క్ పొందారు. (ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్) టాప్-5 ఇలా గతేడాది ప్రపంచంలోని టాప్-500 కుబేరుల సంపదకు 1.8 ట్రిలియన్ డాలర్లు జమయ్యింది. అయితే టాప్-5 కుబేరుల వాటానే దీనిలో 100 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. తదుపరి 20 మంది మొత్తం సంపద 50 బిలియన్ డాలర్లు ఎగసింది. వెరసి సంపద సృష్టిలోనూ టాప్‌లో ఉన్న కంపెనీలే రికార్డులు సాధించినట్లు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కాగా.. ఇటీవల చైనాకు చెందిన బాటిల్డ్ వాటర్ కంపెనీ అధినేత జాంగ్ షంషాన్ తొలిసారి ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరో ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. 15.2 బిలియన్ డాలర్ల సంపదతో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు టెస్లా వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో ప్రవేశించనున్నట్టు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అక్టోబరు 2న టెస్లా క్లబ్ ఇండియా ట్వీట్‌కు సమాధానంగా వెల్లడించారు. 2016లోనే భారత్‌కు రావాలని భావించి బుకింగ్స్ కూడా స్వీకరించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కంపెనీ తన ఆలోచనను విరమించుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఉండనుంది. ఆన్లైన్ వేదిక ద్వారా..: ఒకట్రెండేళ్ల వరకు డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని టెస్లా నిర్ణయించింది. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా మాత్రమే కార్యకలాపాలను నిర్వహించనుందని వాహన విక్రయంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఎండీ ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇక భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతోంది. తయారీ లేదా అసెంబ్లింగ్ ప్లాంటుతోపాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని భావిస్తోంది. ఈ విషయాలను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధ్రువీకరించారు. తొలుత విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి, అమ్మకాలనుబట్టి తయారీ ప్లాంటు నెలకొల్పుతుందని చెప్పారు. మోడల్–3కి జనవరిలో బుకింగ్స్: టెస్లా ముందుగా మోడల్–3 లగ్జరీ కారును ప్రవేశపెట్టనుంది. దీని కోసం జనవరిలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తిగా తయారైన కారును ఇక్కడికి దిగుమతి చేయనున్నారు. కారు ధర రూ.55–60 లక్షలు ఉండనుంది. డెలివరీలు మార్చి చివరి నుంచి ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కంపెనీ తయారు చేసే కార్లలో ఇదే చవకైనది. ఒకసారి చార్జీ చేస్తే 381 నుంచి 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. -
కొత్త ఏడాదిలో మనకూ మోడల్-3 కార్లు!
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో అమెరికన్ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ దేశీయంగా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా జనవరి నుంచి మోడల్-3 కార్ల బుకింగ్స్ ప్రారంభమయ్యే వీలున్న్టట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టెస్లా ఇంక్ తయారీ మోడల్-3 కార్లు అత్యంత వేగంగా విక్రయయవుతున్న విషయం విదితమే.. 2017లో మార్కెట్లో ప్రవేశించిన మోడల్-3 కార్లు ఎలక్ట్రిక్ విభాగంలో అత్యధిక అమ్మకాలను రికార్డును సాధించాయి. దీంతో ఈ ఏడాది(2020) టెస్లా ఇంక్ షేరు 700 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో కంపెనీకి చోటు లభించడం కూడా దోహదం చేసింది. కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ అమ్మకాలలో మోడల్-3, మోడల్-Y కార్ల వాటా 89 శాతానికి చేరడం గమనార్హం! వెరసి మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రీత్యా ప్రపంచంలోనే టాప్ ఆటో కంపెనీగా టెస్లా ఇంక్ ఆవిర్భవించింది. (నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్) 2016లోనే.. భారత మార్కెట్లో ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌లోనే టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా 2021 జనవరిలో మోడల్-3 కార్ల బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. తద్వారా జూన్‌చివరికల్లా కార్ల డెలివరీలను ప్రారంభించాలని టెస్లా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2016లోనే మస్క్ మోడల్-3 సెడాన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఈ బాటలో వీటిని కొత్త ఏడాదిలో అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీ మార్కెట్లో కార్ల ధరలు రూ. 55-60 లక్షల మధ్య ఉండవచ్చని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఐకియా ఇండియా నష్టం రూ. 720 కోట్లు) పేటీఎమ్ నేత తొలుత 2016లోనే ఈకామర్స్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మోడల్-3 కారును బుక్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో టెస్లా ఇంక్ కార్ల తయారీ ప్లాంటును సందర్శించారు కూడా. కాగా.. పారిశ్రామికవేత్తలు మహేష్ మూర్తి, విశాల్ గొండాల్, సుజయత్ అలీ తదితరులు 1,000 డాలర్లు చెల్లించడం ద్వారా మోడల్-3 కార్లను బుక్ చేసుకున్నట్లు ఆటో వర్గాలు పేర్కొన్నాయి. మోడల్-3 కారు 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని, గంటకు 162 మైళ్ల వేగాన్ని సాధించగలదని తెలియజేశాయి. 0-60 మైళ్ల స్పీడ్‌ను 3.1 సెకండ్లలోనే అందుకోగలదని వెల్లడించాయి. ఇప్పటికే టెస్లా ఇంక్.. మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను ఆశించిన స్థాయిలో విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. ఇకపై మోడల్-3 కారు విక్రయాలను మరింత పెంచే ప్రణాళిల్లో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో భారత్ మార్కెట్‌పై దృష్టి సారించినట్లు వివరించాయి. ఇందుకు వీలుగా భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపైనా ఆసక్తిని చూపుతున్నట్లు వెల్లడించాయి. -
నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్
న్యూయార్క్: ప్రస్తుతం మోడల్-3 ఎలక్ర్రిక్ కార్లతో ప్రపంచ మార్కెట్లో దూసుకెళుతున్న టెస్లా ఇంక్ ఒకప్పుడు నిధుల లేమితో సతమతమైంది. దీంతో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. టెస్లా ఇంక్‌ను అమ్మివేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కంపెనీ అమ్మకం కోసం ఒకప్పుడు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్‌ను సంప్రదించినట్లు మస్క్ చెబుతున్నారు. అయితే తన ప్రతిపాదనలపై సమావేశమయ్యేందుకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ నిరాకరించినట్లు వెల్లడించారు. కాగా.. 2024కల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికల్లో యాపిల్ ఉన్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో మస్క్ ట్వీట్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. పదోవంతుకే మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి సమయంలో ఎదురైన ఆర్థిక సమస్యలతో టెస్లాను విక్రయించాలని భావించినట్లు మస్క్ పేర్కొన్నారు. ఇందుకు టిమ్ కుక్‌ను సంప్రదించినప్పటికీ తనతో సమావేశమయ్యేందుకు అంగీకరించలేదని తెలియజేశారు. నిజానికి కంపెనీ ప్రస్తుత విలువలో పదోవంతుకే అంటే 60 బిలియన్ డాలర్లకే టెస్లా ఇంక్‌ను యాపిల్‌కు విక్రయించాలని ఆలోచించినట్లు వెల్లడించారు. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) మోడల్-3 కష్టకాలం ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ ఆటో కంపెనీగా నిలుస్తున్న టెస్లా ఇంక్ రూపొందించిన మోడల్-3 కార్లను అభివృద్ధి చేసే బాటలో 2017లో కష్టకాలాన్ని ఎదుర్కొంది. కార్ల ఉత్పత్తిని పెంచేందుకు నిధులు లేకపోవడంతో మస్క్‌కు ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే కార్ల ఉత్పత్తిని చేపట్టలేకపోవచ్చని కాలిఫోర్నియాలోని ఫ్రెమంట్ ప్లాంటు ఉద్యోగులకు మస్క్ చెప్పారు. అయితే ఇది జరిగిన కొద్ది వారాలకే ఫ్యాక్టరీ పైకప్పు ప్రాంతంలో నిద్రిస్తున్న మస్క్ త్వరలోనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించుకోనున్నట్లు ఉద్యోగులకు తెలియజేశారు. యాపిల్ ప్రణాళికల్లో మార్పు సరిగ్గా మూడేళ్ల క్రితమే టెస్లా ఇంక్‌కు పూర్తిస్థాయి పోటీదారుగా నిలవాలన్న ప్రణాళికలనుంచి ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీవైపు దృష్టి మరల్చుకుంది. గతంలో టెస్లా కంపెనీలో పనిచేసిన పలువురుని ప్రాజెక్ట్ టైటన్‌లో ఇటీవల ఉద్యోగులుగా యాపిల్ చేర్చుకుంది. డ్రైవ్ టెరైన్, కార్ ఇంటీరియర్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించుకుంది. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలనూ కొనుగోలు చేసింది. తద్వారా 2024కల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికలను ఆవిష్కరించింది. కాగా.. మస్క్ వ్యాఖ్యలపై స్పందించేందుకు యాపిల్ ప్రతినిధి ఒకరు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇదే విధంగా కుక్‌ను మస్క్ ఎప్పుడు సంప్రదించారన్న అంశంపై టెస్లా సైతం జవాబివ్వలేదని తెలియజేసింది. షేరు జోరు 2017 నుంచి చూస్తే.. టెస్లా ఇంక్ షేరు 1400 శాతం ర్యాలీ చేసింది. అయినప్పటికీ యాపిల్ మార్కెట్ విలువతో పోలిస్తే మూడో వంతుకంటే తక్కువగానే ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు వార్తలతో ఈ వారం యాపిల్ షేరు బలపడగా.. టెస్లా షేరు డీలాపడినట్లు తెలియజేశారు. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.24 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడిన టెస్లా కంపెనీ వరుసగా 4 త్రైమాసికాలలో లాభాలు ఆర్జించడం ద్వారా ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో చోటు సంపాదించింది. తద్వారా అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాదిలోనే షేరు 700 శాతం ర్యాలీ చేయడం విశేషం! దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) 607 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా ఆవిర్భవించింది. వెరసి అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తదుపరి 150 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా మస్క్ అవతరించడం గమనార్హం! -
టెస్లా కార్లూ, షేర్లూ- మనకు భలే ఆసక్తి
ముంబై, సాక్షి: ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ తయారీ కార్లపై దేశీయంగా పలువురు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టెస్లా ఇంక్ కౌంటర్లోనూ పెట్టుబడులకు దేశీ ఇన్వెస్టర్లు క్యూకడుతున్నారు. నిజానికి దేశీయంగా టెస్లా తయారీ కార్లు అందుబాటులో లేనప్పటికీ అటు కంపెనీ కార్లు కొనేందుకు, ఇటు షేర్లలో పెట్టుబడులకు పలువురు భారతీయులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు చూద్దాం. కొత్త ఫేవరెట్ ఈ ఏడాది(2020) దేశీ ఇన్వెస్టర్లు అమెరికన్ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మరింత ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ తదితర టెక్ దిగ్గజాల షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ కౌంటర్‌పై దృష్టిసారించినట్లు తెలియజేశారు. యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ తదితర దిగ్గజాలు దేశీయంగా ఇన్వెస్టర్లు, వినియోగదారులకు చిరపరిచతమే అయినప్పటికీ టెస్లా ఇంక్ పట్ల ఆసక్తి చూపడం విశేషమని ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. వెరసి దేశీ ఇన్వెస్టర్లకు తాజాగా టెస్లా ఇంక్ షేరు హాట్ ఫేవరెట్‌గా మారినట్లు తెలియజేశారు. (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) పెట్ట్టుబడులు.. నవంబర్‌లో టెస్లా ఇంక్ కౌంటర్లో ఇన్వెస్టర్లు 2.5 మిలియన్ డాలర్లను(రూ. 18 కోట్లకుపైగా) ఇన్వెస్ట్ చేసినట్లు దేశీ బ్రోకింగ్ సంస్థ వెస్టెడ్ ఫైనాన్స్ వెల్లడించింది. మార్చి చివరికల్లా ఈ పెట్టుబడులు 76,000 డాలర్లుగా మాత్రమే నమోదైనట్లు తెలియజేసింది. ఇదేకాలంలో టెస్లా ఇంక్‌లో దేశీ పెట్టుబడులు 10 మిలియన్ డాలర్లకు(రూ. 73 కోట్లకుపైగా) చేరినట్లు మరో బ్రోకింగ్ సంస్థ స్టాకాల్ వెల్లడించింది. ఈ కాలంలో టెస్లా ఇంక్ షేరు 450 శాతం దూసుకెళ్లడం గమనార్హం! కాగా.. కొంతమంది ఇన్వెస్టర్లు టెస్లా ఇంక్‌లో పెట్టుబడుల కోసమే ఖాతాలను తెరచినట్లు వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో వీరమ్ షా పేర్కొన్నారు. దేశీయంగా ఉనికిలేనప్పటికీ ఒక కంపెనీలో ఈ స్థాయి పెట్టుబడులను ఊహించలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. (టెస్లా షేరు జెట్ స్పీడ్- ఎందుకంట?) 1000 డాలర్లు టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ ఇటీవల భారత్‌లోనూ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇటీవల ఈ కంపెనీ కార్లు, షేర్లపై ఆసక్తి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో కార్లను విడుదల చేయనున్నట్లు మస్క్ అక్టోబర్‌లో ట్వీట్ ద్వారా ప్రస్తావించారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఎలన్ తాజాగా భారత్ మార్కెట్‌పై దృష్టి పెట్టి ఉండవచ్చని ఆటో వర్గాలు అభిప్రాయపడ్డాయి. .(టెస్లా జోరు- ఇక ఎస్అండ్పీలో చోటు!) 33 ఏళ్ల గౌరవ్ జున్‌జున్‌వాలా అనే వ్యక్తి టెస్లా ఇంక్ తయారీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు కోసం ముందుస్తుగా 1,000 డాలర్లను బుకింగ్ ఫీజుగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ బయోగ్రఫీని చదివిన గౌరవ్.. టెస్లా ఇంక్పట్ల మక్కువను పెంచుకున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో టెస్లా ఇంక్ షేర్లలో 1,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసిన గౌరవ్ తదుపరి 30 షేర్ల చొప్పున సిప్కింద కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. టెస్లాలో పెట్టుబడులు తదితర అంశాలపై గౌరవ్ స్పందిస్తూ.. మస్క్ బాటలోనే తాను ఆలోచిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం! -
టెస్లా జోరు- ఇక ఎస్అండ్పీలో చోటు!
టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రిక్ కార్ల అమెరికన్ దిగ్గజం టెస్లా ఇంక్.. ఇటు ఆర్థిక ఫలితాలు, ఆటు షేరు ర్యాలీలోనూ జోరు చూపుతోంది. ఈ ఏడాది(2020) రెండో త్రైమాసికంలో 10.4 కోట్ల డాలర్ల(రూ. 780 కోట్లు) నికర లాభం ఆర్జించింది. తద్వారా వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను సాధించింది. దీంతో ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో చోటు సాధించేందుకు అర్హత సాధించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. క్యూ2(ఏప్రిల్-జూన్)లో టెస్లా మొత్తం ఆదాయం 6.04 బిలియన్ డాలర్లను తాకింది. కాగా.. బుధవారం 1.5 శాతం బలపడి 1592 డాలర్ల వద్ద ముగిసిన షేరు ఫ్యూచర్స్‌లో మరో 4.5 శాతం ఎగసింది. ఇప్పటికే కంపెనీ మార్కెట్ విలువ 295 బిలియన్ డాలర్లను దాటడంతో ఆటో దిగ్గజం టయోటాను వెనక్కి నెట్టింది. వెరసి మార్కెట్ విలువ రీత్యా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా టెస్లా నిలుస్తోంది. టెస్లా షేరు 12 నెలల్లో 500 శాతం ర్యాలీ చేయగా.. 2020లో ఇప్పటివరకూ 200 శాతంపైగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే! కారణాలున్నాయ్ కోవిడ్-19 అనిశ్చితులలోనూ క్యూ2లో టెస్లా ఇంక్ అంచనాలను అధిగమిస్తూ 90,650 వాహనాలను విక్రయించగలిగింది. మోడల్ 3, మోడల్ Y కార్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ రెండు మోడళ్ల కార్లను రూపొందించేందుకు తాజాగా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో 110 కోట్ల డాలర్ల(రూ. 8250 కోట్లు) అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ప్రకటించారు. తద్వారా 5,000 మందివరకూ ఉపాధి లభించనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే మూడు ప్లాంట్లను కలిగి ఉంది. ఇటీవల యూఎస్‌లో భారీ ఆసక్తి నెలకొన్న కంపెనీ తయారీ మోడల్ 3 కారు ప్రారంభ ధర 38,000 డాలర్లు(రూ. 28.5 లక్షలు) అంటూ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలుత దైమ్లర్తో జత 134 ఏళ్ల క్రితమే ఆధునిక కార్ల తయారీని ప్రారంభించిన జర్మన్ దిగ్గజం.. దైమ్లర్ 2009 మే నెలలో టెస్లా ఇంక్‌లో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టెక్నాలజీ ఆధారిత కార్ల తయారీపై దృష్టితో ప్రారంభమైన స్టార్టప్.. టెస్లా ఇంక్‌కు 5 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. అయితే తదుపరి కాలంలో టెస్లా తయారీ టెక్నాలజీ ఆధారిత కార్లను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంపై దైమ్లర్ సందేహించినట్లు తెలుస్తోంది. దీంతో 2014 డిసెంబర్లో టెస్లాలో గల 10 శాతం వాటాను దైమ్లర్ విక్రయించింది. అయితే దైమ్లర్తో జట్టుకట్టడం ద్వారా టెస్లా.. కార్ల దీర్ఘకాలిక భద్రత, నియంత్రణ తదితర అంశాలను అవగాహన చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది తదుపరి దశలో కంపెనీకి ఉపయుక్తంగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. -
టెస్లా షేరు జెట్ స్పీడ్- ఎందుకంట?
కోవిడ్-19 కష్టకాలంలోనూ గ్లోబల్ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు లాభాలతో కదం తొక్కుతోంది. అమెరికాలో లిస్టయిన ఎలక్ట్రిక్ కార్ల ఈ స్పెషలిస్ట్ కంపెనీ షేరు పలు రికార్డులు సృష్టించడం ద్వారా ఇటీవల తరచుగా వార్తలకెక్కుతోంది. ఇందుకు యూఎస్‌లోని పలు రాష్ట్రాలలో లాక్డవున్లు కొనసాగుతున్నప్పటికీ వాహన విక్రయాలను పెంచుకోగలగడం, ఎస్అండ్పీ ఇండెక్స్‌లో చోటు లభించనున్న అంచనాలు వంటి అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. జోరు తీరు సోమవారం నాస్డాక్, ఎస్అండ్పీ ఇండెక్సులు 2-1 శాతం మధ్య వెనకడుగు వేయగా.. టెస్లా ఇంక్ షేరు 3 శాతం క్షీణించి 1497 డాలర్ల వద్ద ముగిసింది. అయితే తొలుత 16 శాతం దూసుకెళ్లింది. 1795 డాలర్లకు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 321 బిలియన్ డాలర్లను తాకింది. తద్వారా అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన టాప్-10 కంపెనీల జాబితాలో చోటు సాధించింది. అంతేకాకుండా మార్కెట్ విలువలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీఅండ్‌జీ)ను వెనక్కి నెట్టింది. అయితే చివర్లో అమ్మకాలు ఊపందుకుని చతికిలపడటంతో మార్కెట్ విలువ దాదాపు 278 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. 200 శాతం ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా ఇంక్ షేరు 200 శాతం దూసుకెళ్లింది. ఈ నెల(జులై)లోనే 38 శాతం లాభపడింది. ఈ బాటలో మార్కెట్ విలువరీత్యా జులై మొదటి వారంలో జపనీస్ ఆటో దిగ్గజం టయోటాను అధిగమించిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్-జూన్(క్యూ2) కాలంలో అంచనాలను మించుతూ 90,650 కార్లను విక్రయించడం ప్రభావం చూపింది. మోడల్ 3, మోడల్ Y కార్లు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతక్రితం జనవరి-మార్చిలో 72,000 వాహనాలు విక్రయించగా.. పరిశ్రమవర్గాలు 83,000 వాహన అమ్మకాలను అంచనా వేశాయి. కాగా.. మరోపక్క ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో టెస్లా ఇంక్ షేరుకి త్వరలో చోటు లభించనున్న అంచనాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ ఫండమెంటల్స్‌కు మించి స్పెక్యులేటివ్‌గా పొజిషన్లు తీసుకుంటున్నట్లు బేర్ ట్రాప్స్ రిపోర్ట్ ఎడిటర్ లారీ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నారు. ఎస్అండ్పీలో చోటు లభిస్తే ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ తదితర మరిన్ని సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల టెస్లా ఇంక్ షేరు దూకుడు చూపుతున్నట్లు విశ్లేషించారు. అంచనాలు అధికం గతేడాది టెస్లా దాదాపు 25 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఈ బాటలో ఇటీవల వాహన విక్రయాలు పెరుగుతున్న కారణంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించగలదన్న అంచనాలు బలపడుతున్నాయి. దీంతో 2025కల్లా కంపెనీ ఆదాయం 100 బిలియన్ డాలర్లను తాకవచ్చని జేఎంపీ సెక్యూరిటీస్ నిపుణులు జో ఓషా అంచనా వేశారు. అయితే టెస్లా ఇంక్ షేరుకి జో వేసిన 1500 డాలర్ల టార్గెట్‌ను ఇప్పటికే అధిగమించడం గమనార్హం! కంపెనీ ఏప్రిల్-జూన్ ఫలితాలను ఈ నెల 22న వెల్లడించనుంది. లాక్‌డవున్ కారణంగా గ్లోబల్ ఆటో కంపెనీలు జనరల్ మోటార్స్, టయోటా, ఫియట్ క్రిస్లర్, ఫోర్డ్ వంటి కంపెనీల అమ్మకాలు నీరసిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. అయితే టెస్లాను పూర్తిస్థాయి ఆటో దిగ్గజ కంపెనీలతో పోల్చడం సరికాదని ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
ఉపాధి జోష్- నాస్డాక్ రికార్డ్
గత నెల(జూన్)లో ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. డోజోన్స్ 92 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 25,827 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 14 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 3,130 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 53 పాయింట్లు(0.55 శాతం) పురోగమించి 10,208 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎస్అండ్పీ వరుసగా నాలుగో రోజు లాభపడింది. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 1.4-2.8 శాతం మధ్య ఎగశాయి. జూన్‌లో 4.8 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగినట్లు కార్మిక శాఖ తాజాగా వెల్లడించింది. విశ్లేషకులు వేసిన అంచనాలకంటే ఇవి 1.8 మిలియన్లు అధికంకావడం గమనార్హం! ఫలితంగా నిరుద్యోగిత 13.3 శాతం నుంచి 11.1 శాతానికి దిగివచ్చింది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. నేడు యూఎస్ మార్కెట్లకు సెలవు. ప్యాకేజీపై అంచనాలు జులై 4 బ్రేక్ తదుపరి ప్రభుత్వం లేదా ఫెడరల్ రిజర్వ్ మరోసారి ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌నిచ్చే చర్యలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 కారణంగా మార్చి- ఏప్రిల్ మధ్య ఏకంగా 22 మిలియన్ల ఉద్యోగాలకు కోత పడటంతో మరోసారి సహాయక ప్యాకేజీలకు వీలున్నట్లు భావిస్తున్నారు. కాగా.. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వచ్చే వారం మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లు చవిచూడవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అండ బ్లూచిప్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్ప్ 0.8 శాతం పుంజుకోవడంతో ఎస్‌అండ్‌పీకి బలమొచ్చింది. కాగా.. విశ్లేషకుల అంచనాలను మించి రెండో క్వార్టర్లో 90,650 వాహనాలను విక్రయించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 8 శాతం జంప్ చేసింది. 1209 డాలర్ల వద్ద ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఏప్రిల్-జూన్‌లో కార్ల విక్రయాలు 8 శాతం పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. టెస్లా షేరు ఈ ఏడాది 190 శాతం దూసుకెళ్లడం విశేషం! -
టెస్లా మోడల్-3 ఎలక్ట్రిక్ కారు, రెండులక్షల బుకింగ్స్
న్యూఢిల్లీ పెనుభూతంలా తరుముకొస్తున్న వాయుకాలుష్య భయంతో ఎకో కార్లకు, ఎలక్ట్రిక్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్ కంపెనీ మోడల్-3 ఎలక్ట్రిక్ కారును విడుదలచేసింది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకోసం పరిశోధనలు చేస్తూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టెస్లా తమ ఎలక్ట్రిక్ సెన్సేషన్ కారును మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టెస్లా మోడల్-3 ఎలక్ట్రిక్ కారు విడుదల కాగానే దీనికోసం టెక్నాలజీ ప్రియులు, కారు ప్రియులు క్యూ కట్టారు. తాజాగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్ మోడల్ 3 బేసిక్ మోడల్ ధర ఇంతకుముందెన్నడూ లేని అందుబాటు ధరలో 35వేల డాలర్ల(సుమారు రూ.23లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 346 కి.మీ.లు ప్రయాణించవచ్చు. 2017 చివరిలో ఈ కారు డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఏడాదికి 5లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమని తెస్లా సీఈవో ఎలోన్ మస్క చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ రోడ్లపై కనిపించే టూ అండ్ త్రి సీట్ల కార్లలో ఇది చవకైనదనీ 6 సెకన్లలో60కి.మీ వేగంతో దూసుకెళుతుందని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల 32 వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్టు మస్క తెలిపారు. కంపెనీ నుంచి విడుదలైన అతి తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు ఇదే. .