టెస్లా అయితే కాదు..! టాప్ ఎలక్ట్రిక్ కారు ఇదే..! | This car replaces Tesla Model 3 as Consumer Reports top electric car | Sakshi
Sakshi News home page

టెస్లా అయితే కాదు..! టాప్ ఎలక్ట్రిక్ కారు ఇదే..!

Published Sun, Feb 20 2022 11:31 AM | Last Updated on Sun, Feb 20 2022 11:34 AM

This car replaces Tesla Model 3 as Consumer Reports top electric car - Sakshi

ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా కార్లు భారీ ఆదరణను పొందాయి. ఐతే అమెరికా మార్కెట్లలో టెస్లాకు అనుహమైన దెబ్బ తగిలింది.  


అమెరికా కన్స్యూమర్ రిపోర్ట్స్- 2022 ప్రకారం అత్యుత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఫోర్డ్ ముస్టంగ్ మాక్-ఈ (Ford Mustang Mach-E)  అగ్రస్థానంలో నిలిచింది. రెండు సంవత్సరాల పాటు ఈ టైటిల్‌ను కలిగి ఉన్న టెస్లా మోడల్ 3ని అధిగమించింది. ఈ కన్స్యూమర్ రిపోర్ట్స్ అత్యుత్తమ కార్లు, ఎస్ యూవీ, ట్రక్కులను హైలైట్ చేస్తుంది.  టెస్లా మోడల్-3 కు పోటీగా ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాక్-E వెలుగులోకి వచ్చింది.  ఫోర్డ్ 2020లో Mach-E, దాని ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును విక్రయించడం ప్రారంభించింది. ఐతే అమెరికా వాసులు మాత్రం టెస్లా కార్ కంటే ఫోర్డ్ ముస్తాంగ్ మాక్-ఈ కారును ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.


టెస్లా మోడల్ 3 స్పెసిఫికేషన్
టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది.  టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది.  ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 586 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 


ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ స్పెసిఫికేషన్
ఫోర్డ్ ఎలక్ట్రిక్ ముస్టాంగ్ మాక్ ఈ  ఆల్-ఎలక్ట్రిక్ ఇంజిన్ 600 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోంది.వేగంగా ఛార్జింగ్ అయ్యే DC బ్యాటరీ కేవలం 10 నిమిషాల ఛార్జ్ తర్వాత 47-మైళ్ల దూరం నడుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement