
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజా వణుకుతోంది. గాజా నగరం శవాల దిబ్బగా మారిపోతుంది. నగరంలోని మార్చురీలు నిడిపోయాయని ఐక‍్యరాజ్య సమితి వెల్లడించింది. హమాస్‌ను తుద ముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ సమీపంలో దాడులకు తెగబడ్డారు. దీంతో సామాన్యులు తమ ప్రాణాల్ని కాపాడుకోడవం కోసం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ దేవుడిపై భారం వేస్తున్నారు.
అంతటి భయానక వాతావరణంలో హమాస్ టెర్రరిస్ట్‌ల బీభత్సం సృష్టిస్తూ కురించిన బుల్లెట్ల వర్షం టెస్లా ఎలక్ట్రిక్ కార్ తన ప్రాణాలు కాపాడిందంటూ ఆ కారు ఓనర్ గద్గద స్వరంతో చెప్పాడు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థ వాల్లా (walla) ఓ కథనాన్ని ప్రచురించింది.
మెషిన్ గన్స్‌తో బీభత్సం
హమాస్ దాడి ప్రారంభమైన సమయంలో కారు యజమాని టెస్లా మోడల్ 3 కారులో తప్పించుకునేందుకు ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అయితే, ఊహించని విధంగా అతనికి హామాస్ దాడి ప్రారంభమైన సమయంలో మరో ప్రాంతానికి వెళుతుండగా కలాష్నికోవ్స్ రైఫిల్స్ ,భారీ మెషిన్ గన్స్‌తో టెర్రరిస్టులు వస్తున్న కారు ఎదురు పడింది.
ఎలక్ట్రిక్ కారని వాళ్లకి తెలియదు
అంతే టెర్రరిస్టుల వాహనం తనవైపుకు దూసుకు వచ్చింది. రెప్పపాటులో తనది ఎలక్ట్రిక్ కారు (టెస్లా మోడల్ 3) అని తెలియకపోవడంతో ఈవీలో లేని ఇంజన్ ట్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని కారుపై కాల్పులు జరిపారు. ఇలా చేస్తే కారు ఆగిపోవడం లేకపోతే ఇంధన ట్యాంక్ పేలిపోతుందని భావించారు. అయితే ఈవీ కార్ కావడంతో ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాడు.
వాళ్ల బుల్లెట్లు నన్ను ఏం చేయలేకపోయాయ్
అతని టైర్లను కాల్చినప్పటికి తన కారు యాక్సిలరేటర్‌ను రేజ్ చేసి డ్యూయల్-డ్రైవ్ ఫీచర్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకునేందుకు సాయం చేసిందని చెప్పాడు. పైగా, ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు బ్యాటరీ వెడెక్కలేదు. టెస్లా కారులో ఉన్న తనని టెర్రరిస్ట్‌లు కురిపించిన బుల్లెట్లు సైతం తనని ఏం చేయలేకపోయానని అన్నారు. అతని భార్య టెస్లా యాప్ ద్వారా తన కారు లొకేషన్, ఎమర్జెన్సీ రూమ్‌ల గురించి సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు చెప్పాడు.
ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్‌లోని సూపర్‌చార్జర్‌ల గురించి కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని టెస్లా సూపర్‌ఛార్జర్‌లను ఉచితంగా అందిస్తామని తెలిపారు.
I think he deserves an highland. looking for the dashcam videos as well. pic.twitter.com/DJhrGwBubg
— Michael Lugassy (@mluggy) October 12, 2023