ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎలోన్ మస్క్ ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్‌ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన, అనిశ్చితితో పాటు పలు అంశాలు లేఆఫ్స్‌కు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా.. జూన్ నెల ముగిసే లోపు మరింత మందికి ఉద్వాసన పలకనుందని సమాచారం.
దీనికి తోడు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఏఐ కారణమని తెలుస్తోంది. గత కొంత కాలంగా మస్క్ తన దృష్టిని ఈవీ వైపు కాకుండా ఏఐ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు సారించడం, ఈవీల తయారీ కంటే రోబోట్యాక్సీ వంటి ప్రాజెక్ట్‌లకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నైతికత క్షీణించిందని కొందరు ప్రస్తుత ఉద్యోగులు చెప్పారు.
లేఆఫ్‌ల ముగింపుకు సంబంధించి మస్క్ నుండి స్పష్టమైన సూచన లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు ఆజ్యం పోసింది. ఇక టెస్లా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులు సేల్స్, హెచ్‌ఆర్‌తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment