టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ స్థాయిలో టెస్లా ఫ్యాక్టరీలను నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా త్వరలో టర్కీలోనూ టెస్లా ఫ్యాక్టరీని నిర్మించనున్నారు.
టర్కీలో టెస్లా ఫ్యాక్టరీని నిర్మించాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను కోరినట్లు ఆ దేశ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ తెలిపింది. అయితే రెసెప్ అభ్యర్ధనపై ఎలాన్ మస్క్ సుమఖత వ్యక్తం చేశారు.
78వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్‌కు హాజరయ్యేందుకు న్యూయార్క్‌లోని టర్కీ హౌస్‌ను టర్కీ అధ్యక్షుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్, ఎలాన్ మస్క్‌ల మధ్య సంభాషణలు జరిగాయి. వారిద్దరి భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్‌లింక్‌కు సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎర్డోగాన్ చెప్పారని కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ తెలిపింది.
మరో దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ సేవలు
టర్కీలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్‌ను పొందేందుకు టర్కీ అధికారులతో కలిసి పనిచేయాలని స్పేఎక్స్ భావిస్తున్నట్లు ఎలాన్ మస్క్ సైతం తెలిపారు. అనంతరం,సెప్టెంబర్ చివరిలో ఇజ్మీర్‌లో జరిగే టర్కిష్ ఏరోస్పేస్, టెక్నాలజీ ఫెస్టివల్ టెక్నోఫెస్ట్‌కు హాజరు కావాలని ఎర్డోగాన్..ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించారు.
ప్రపంచ వ్యాప్తంగా 7 టెస్లా ఫ్యాక్టరీలు
త్వరలో కాలిఫోర్నియాలో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని కలవనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై దృష్టి సారించేలా తమ చర్చలు ఉంటాయని ఎలాన్ మస్క్ ఓ పోస్ట్‌లు పేర్కొన్నారు. కాగా,టెస్లా ప్రస్తుతం ఆరు ఫ్యాక్టరీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మెక్సికో ఉత్తర న్యూవో లియోన్ రాష్ట్రంలో 7వ ఫ్లాంట్‌ను నిర్మిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment