భారత్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స‍్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు.
అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు.
భారత్‌లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.
కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment