ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా పవర్ తో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. రెండు సంస్థల మధ్య ఇంకా ఒప్పందాలు కుదుర్చుకోలేదు అని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ టెస్లా బెంగళూరు కేంద్రంగా కొత్త కంపెనీని రిజిస్టర్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారత మార్కెట్లో ప్రవేశించనుంది. టాటాసన్స్ విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ వసతుల కల్పనపై దృష్టి సారించింది.
టాటా పవర్, టెస్లా కలిసి మహారాష్ట్రలో ప్రఖ్యాత సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఒకరితో ఒకరు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి వివరాలు ప్రస్తుతానికి తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్‌లో టెస్లా తన మోడల్ త్రీ ఎలక్ట్రిక్ సెడాన్ కారుతో అడుగు పెట్టనున్నది. అందుకోసమే ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలికంగా అవసరమైన చార్జింగ్ వసతుల కల్పనపైనా టెస్లా ద్రుష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టాటా పవర్‌తో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టెస్లా మోడల్ 3 భాగాలను మొదట దిగుమతి చేసుకొని త్వరగా మార్కెట్ లోకి తీసుకురావాలని యోచిస్తుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment