Tata Power Company Ltd.
-
టాటా పవర్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం జంప్‌చేసి రూ. 632 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 481 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం వృద్ధితో రూ. 12,085 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 10,379 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి 1.75 డివిడెండ్ ప్రకటించింది. జులై 7న వార్షిక వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 1,439 కోట్లనుంచి రూ. 2,156 కోట్లకు ఎగసింది. ఇక మొత్తం ఆదాయం 28 శాతం మెరుగుపడి రూ. 42,576 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 33,239 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. క్యూ4లో ఎక్సెప్షనల్ ఐటమ్స్‌కు ముందు కన్సాలిడేటెడ్ నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 775 కోట్లకు చేరగా.. పూర్తి ఏడాదికి 61 శాతం అధికంగా రూ. 2,298 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా.. -
టాటా పవర్ రీన్యూలో బ్లాక్‌రాక్ రూ.4,000 కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలో యూఎస్ కంపెనీ బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం టాటా పవర్ తాజాగా వెల్లడించింది. తద్వారా టాటా పవర్ రెనవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో 10.53% వాటాను బ్లాక్‌రాక్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. అబుదాబి కేంద్రంగా గల ముబడాలా ఇన్వెస్ట్మెంట్ కంపె నీ సైతం కన్సార్షియంలో భాగం కానున్నట్లు పేర్కొంది. ఇందుకు మూడు సంస్థల మధ్య తప్పనిసరి ఒప్పందం కుదిరినట్లు టాటా పవర్ వివరించింది. ముబడాలాతో కలసి బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్.. ఈక్విటీ, తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే సెక్యూరిటీల ద్వారా 52.5 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో టాటా పవర్ రెనెవబుల్స్లో 10.53% వాటాను పొందనున్నట్లు వెల్లడించింది. దేశీ పునరుత్పాదక ఇంధన అగ్రగణ్య కం పెనీలలో టాటా పవర్ రెనవబుల్ ఎనర్జీ ఒకటికాగా.. 4.9 గిగావాట్ల ఇంధన ఆస్తులను కలిగి ఉంది. -
మదుపరుల ఇంట కనకవర్షం కురిపిస్తున్న ఈ కంపెనీ స్టాక్స్!
కరోనా మహమ్మారి తర్వాత తిరిగి వేగంగా పుంజుకుంది ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోక తప్పదు. రోజు రోజుకి రాకెట్ వేగంతో షేర్ మార్కెట్ దూసుకెళ్తుంది. ఈ మధ్య యువతరం మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో మార్కెట్ జీవనకాల గరిష్టాలకు చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. వారి బందువులు గుర్తించలేని స్థితిలో సంపాదిస్తున్నారు. మరికొందరికీ మార్కెట్ పై ఎటువంటి జ్ఞానం లేకపోవడంతో చేతులు కాల్చుకుంటున్నారు. సాదారణంగా ఒక కంపెనీకి చెందిన ఒకటి లేదా రెండు షేర్లు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయి. కానీ, టాటా గ్రూప్‌కు చెందిన ఏకంగా 8 కంపెనీల షేర్లు మదుపరుల పాలిట కల్పవృక్షం లాగా మారాయి. మన దేశంలో టాటా గ్రూప్‌కు ఉన్న విలువ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాటా గ్రూప్ అంటే "ఒక నమ్మకం". మన దేశంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించే ఏకైక సంస్థగా టాటా గ్రూప్ నిలిచింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వంటి 8 కంపెనీల షేర్లు మదుపరులకు గత 20 నెలలుగా భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికి 10 రేట్లకు పైగా పెరిగాయి. 2020 మార్చి నుంచి డిసెంబర్ 3 వరకు టాటా గ్రూప్‌కు చెందిన స్టాక్ ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ ధరలు: టాటా మోటార్స్ షేర్ ధర - ఏప్రిల్ 3 రూ.65.30 - రూ. 480.30 (డిసెంబర్ 3వ తేదీ) టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.550.20 - రూ.5,890 (డిసెంబర్ 3వ తేదీ) టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ షేర్ ధర - మే 11 - రూ.27.30 -రూ.225.60(డిసెంబర్ 3వ తేదీ) టాటా మోటార్స్ లిమిటెడ్ - డీవీఆర్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 30 - రూ.30 - రూ.258.30(డిసెంబర్ 3వ తేదీ) టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.59.45 - రూ.280.20(డిసెంబర్ 3వ తేదీ) ఎన్ఈఎల్ సీఓ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.121.30 - రూ.738.05(డిసెంబర్ 3వ తేదీ) టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 19 - రూ.216.05 - రూ.1303.25(డిసెంబర్ 3వ తేదీ) టాటా స్టీల్ బీఎస్ఎల్ లిమిటెడ్ షేర్ ధర - ఏప్రిల్ 3 - రూ.15.55 - రూ.85.35(డిసెంబర్ 3వ తేదీ) (చదవండి: దేశ చరిత్రలో రికార్డు.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు తగ్గట్లేదుగా!) -
టాటా పవర్‌తో టెస్లా చర్చలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా పవర్ తో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. రెండు సంస్థల మధ్య ఇంకా ఒప్పందాలు కుదుర్చుకోలేదు అని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ టెస్లా బెంగళూరు కేంద్రంగా కొత్త కంపెనీని రిజిస్టర్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారత మార్కెట్లో ప్రవేశించనుంది. టాటాసన్స్ విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ వసతుల కల్పనపై దృష్టి సారించింది. టాటా పవర్, టెస్లా కలిసి మహారాష్ట్రలో ప్రఖ్యాత సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఒకరితో ఒకరు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి వివరాలు ప్రస్తుతానికి తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్లో టెస్లా తన మోడల్ త్రీ ఎలక్ట్రిక్ సెడాన్ కారుతో అడుగు పెట్టనున్నది. అందుకోసమే ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలికంగా అవసరమైన చార్జింగ్ వసతుల కల్పనపైనా టెస్లా ద్రుష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టాటా పవర్‌తో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టెస్లా మోడల్ 3 భాగాలను మొదట దిగుమతి చేసుకొని త్వరగా మార్కెట్ లోకి తీసుకురావాలని యోచిస్తుంది. చదవండి: మస్క్, బెజోస్‌లను అధిగమించిన అదానీ! వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్! -
మార్కెట్లో కొత్త రికార్డులు
అంతటా సానుకూల పరిణామాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 28,500 మార్కును, నిఫ్టీ 8,500 మార్కును అధిగమించాయి. ప్రస్తుత శీతాకాల సమావేశంలో మరిన్ని సంస్కరణలు ఉండొచ్చన్న ఆశలు ఒకవైపు.. చైనా, యూరప్‌లో అదనంగా ఆర్థిక సహాయక ప్యాకేజీలు రావొచ్చన్న అంచనాలు మరోవైపు ఇందుకు దోహదపడ్డాయి. చైనా అనూహ్యంగా వడ్డీ రేట్లను తగ్గించడం మరో కారణంగా నిల్చింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్టమైన 28,541.96 స్థాయిని, నిఫ్టీ 8,534.65 పాయింట్ల స్థాయిని తాకాయి. చివరికి 164.91 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,499.54 వద్ద, 52.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8,530.15 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో 467 పాయింట్ల (1.66 శాతం) మేర పెరిగినట్లయింది. ‘డిజిన్వెస్ట్‌మెంట్’లో ఇన్వెస్ట్: ఎల్ఐసీ ఇదిలావుండగా... కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ (వాటాల విక్రయం) మొదలెట్టిన పక్షంలో తాము మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తామని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ తెలిపారు. ఐపీవో బాటలో 13 సంస్థలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో దాదాపు డజను పైగా కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్, వీడియోకాన్ డీ2హెచ్ సహా 13 కంపెనీలు ప్రాస్పెక్టస్ ముసాయిదాను సెబీకి సమర్పించాయి. అటు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్..ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇవన్నీ మే లో ఎన్నిక ఫలితాల అనంతరం సెబీకి పత్రాలు సమర్పించాయి. వీటిలో లావాసా కార్పొరేషన్, యాడ్‌ల్యాబ్స్, ఓర్టెల్ కమ్యూనికేషన్స్, మాంటెకార్లో ఫ్యాషన్స్ సంస్థల ఐపీఓలకు సెబీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.