
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలో యూఎస్ కంపెనీ బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం టాటా పవర్ తాజాగా వెల్లడించింది. తద్వారా టాటా పవర్ రెనవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో 10.53% వాటాను బ్లాక్‌రాక్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది.
అబుదాబి కేంద్రంగా గల ముబడాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపె నీ సైతం కన్సార్షియంలో భాగం కానున్నట్లు పేర్కొంది. ఇందుకు మూడు సంస్థల మధ్య తప్పనిసరి ఒప్పందం కుదిరినట్లు టాటా పవర్ వివరించింది. ముబడాలాతో కలసి బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్.. ఈక్విటీ, తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే సెక్యూరిటీల ద్వారా 52.5 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది.
దీంతో టాటా పవర్ రెనెవబుల్స్‌లో 10.53% వాటాను పొందనున్నట్లు వెల్లడించింది. దేశీ పునరుత్పాదక ఇంధన అగ్రగణ్య కం పెనీలలో టాటా పవర్ రెనవబుల్ ఎనర్జీ ఒకటికాగా.. 4.9 గిగావాట్ల ఇంధన ఆస్తులను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment