US - India
-
భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..
అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అధిక శాతం దేశీ డిమాండ్ (వినియోగం)పై ఆధారపడి ఉన్న విషయాన్ని తన తాజా నివేదికలో గుర్తు చేసింది. దీనికితోడు అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఎక్కువ భాగం సేవల రూపంలో ఉన్నందున, ట్రంప్ పాలనా యంత్రాంగం వీటిని లక్ష్యంగా చేసుకోకపోవచ్చని తెలిపింది. భారత్ సహా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలన్నింటి నుంచి వచ్చే దిగుమతులపై అదే మోతాదులో తాము కూడా సుంకాల మోత మోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీ సమక్షంలోనే స్పష్టం చేయడం గమనార్హం. అమెరికా ప్రతీకార సుంకాలు ఎక్కువగా వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్‌పై ప్రభావం చూపిస్తాయని, ఆ దేశాలు అమెరికాతో అధిక వాణిజ్య మిగులు కలిగి ఉన్నట్టు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. అమెరికాతో ఎక్కువగా సేవల వాణిజ్యం నడుపుతున్న జపాన్‌పైనా సంకాలు ఏమంత ప్రభావం చూపించబోవన్నారు. ధరల ఆజ్యంతో అధిక వడ్డీ రేట్లుఅమెరికా విధించే ప్రతీకార సుంకాలు ధరలకు ఆజ్యం పోస్తాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా అధిక వడ్డీ రేట్లకు దారితీయొచ్చని రాణా అభిప్రాయపడ్డారు. ‘భారత్ వృద్ధి కోసం ఎగుమతులపై అంతగా ఆధారపడి లేదు. కాబట్టి అమెరికా టారిఫ్‌ల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుంది’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. జ్యుయలరీ, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, కెమికల్స్‌పై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు. అయితే, భారత్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్స్‌పై అమెరికా అధిక సుంకాలు విధించకపోవచ్చని, అలా చేయడం అమెరికాలో ఆరోగ్య వ్యయాలను పెంచుతుందన్నారు. అదే సమయంలో టెక్స్టైల్స్, కెమికల్స్ అధిక టారిఫ్‌ల రిస్క్ ఎదుర్కోవాల్సిరావచ్చన్నారు. ట్రంప్ మొదటి విడత పాలనను గుర్తు చేసుకుని చూస్తే మొత్తం మీద భారత్‌పై పడే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని ఫువా విశ్లేషించారు.ప్రభావం ఏ మేరకు..?ట్రంప్ టారిఫ్‌లతో భారత జీడీపీపై 0.1–0.6 శాతం మేర ప్రభావం పడొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపైనా సగటు వ్యత్యాసం మేర టారిఫ్‌లు మోపితే, అలాంటి పరిస్థితుల్లో భారత్ చేసే ఎగుమతులపై అమెరికా నికర టారిఫ్ రేట్లు 6.5 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అలా కాకుండా, విడిగా ప్రతీ ఉత్పత్తిపై రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం మేర అదనంగా టారిఫ్ పెంచేస్తే అప్పుడు భారత ఎగుమతులపై పెరిగే సుంకాల భారం 6.5–11.5 శాతం మధ్య ఉంటుందని వివరించింది.2024–25లో వృద్ధి 6.3 శాతమే: ఎస్బీఐ రీసెర్చ్దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) 6.2–6.3 శాతమే వృద్ధి చెందొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జాతీయ శాంపిల్ కార్యాలయం (ఎన్ఎస్వో) జూన్, సెపె్టంబర్ త్రైమాసికాల అంచనాలను పెద్దగా సవరించకపోవచ్చని పేర్కొంది. 6.4 శాతం వృద్ధి నమోదు కావొచ్చని ఎన్ఎస్వో లోగడ అంచనా వేయడం గమనార్హం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండడం స్థిరత్వాన్ని తీసుకొస్తుందని, ఇతర రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గడం విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతుందని, అది వినియోగ ఆధారిత వృద్ధికి దారితీస్తుందని అంచనా వేసింది. భారత్ 2024–25, 2025–2026 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్నది ఐఎంఎఫ్ అంచనాగా ఉంది. మరోవైప ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సైతం వచ్చే రెండేళ్ల పాటు భారత్ జీడీపీ 6.7–6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు తక్కువే అయినప్పటికీ, అదే ఆదాయ స్థాయి కలిగిన దేశాల కంటే ఎగువనే ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్ఫార్మాపై టారిఫ్‌లతో అమెరికన్లపైనే ప్రభావం..-ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను భారత ఫార్మా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు విధించేలా అమెరికా నిర్ణయం తీసుకుంటే, అమెరికన్ వినియోగదారులపైనే ప్రధానంగా ప్రభావం పడుతుందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి దేశీయ పరిశ్రమ వేచి, చూసే ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు. అమెరికాకు భారత్ ఏటా 8 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతులు చేస్తోందని చెప్పారు. అమెరికన్ అధ్యయన నివేదికలను ఉటంకిస్తూ.. భారత ఔషధ ఎగుమతులతో అమెరికాలోని హెల్త్‌కేర్ వ్యవస్థకు 2013–2022 మధ్య 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయినట్లు భాను తెలిపారు. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 బిలియన్ డాలర్లు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో (మన ఔషధాలతో వాళ్లకు ఇంత ఆదా అవుతున్నప్పుడు) మనపై టారిఫ్‌లు విధిస్తామంటే ఏమనగలం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ నుంచి ఫార్మా దిగుమతులపై అమెరికాలో ఎటువంటి సుంకాలు లేవు. ఈ ఆరి్థక సంవత్సరం మొత్తం ఫార్మా ఎగుమతులు 29 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు భాను తెలిపారు. -
మారాల్సిన దౌత్యం తీరు
దౌత్య కెమిస్ట్రీ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు ఒక నిర్మాణాత్మక వాతావరణాన్ని అందిస్తుంది. ఇలాంటి సంబంధం ఉద్రిక్తతలను తగ్గిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దౌత్యం అనేది పూర్తిగా నాయకత్వ స్థాయి కెమిస్ట్రీ పైనే ఆధారపడదు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు అదృష్టవ శాత్తూ పరస్పర ప్రయోజనం, ప్రజా మద్దతుకు చెందిన దృఢమైన చట్రంపై ఆధారపడి ఉన్నాయి. జాతీయ ప్రయోజనాలకు సంబంధించి, బహుళ రంగాలలో అనేక సంవత్సరాల పరిణామ క్రమంపై కూడా ఇవి నిర్మితమై ఉన్నాయి. అయితే మనం జీవిస్తున్నది విచ్ఛిన్న మవుతున్న ప్రపంచం. దీంట్లో ఆత్మసంతృప్తికి కాలం చెల్లిపోయింది.మారిన సవాళ్లునేడు మనం ఎదుర్కొంటున్న వాస్తవాలు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలానికి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచ దౌత్య చలనశీలత మారిపోయింది. యుద్ధం– సంఘర్షణ, కొల్లగొట్టే పోటీ, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచీకరణకు చెందిన క్షీణిస్తున్న ఆకర్షణలు భౌగోళిక రాజకీయాలను నిర్వచిస్తున్నాయి. ట్రంప్ తన ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదా నికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అమెరికన్ రాజకీయాల్లో జన రంజక, స్థానికవాదపు ఉప్పెనపై ఆయన స్వారీ చేస్తున్నారు.మోదీ అమెరికా పర్యటన ఫలితాలను మీడియా మొత్తంగా విశ్లే షించింది. ఇప్పుడు భారతదేశంపై ట్రంప్ ప్రాపంచిక దృక్పథం చూపిన ప్రభావం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ట్రంప్ విలువ ఇవ్వలేదని కాదు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గగనతలం, భూమి, సముద్రం, అంతరిక్షం, సైబర్‌స్పేస్‌తో సహా వివిధ రంగాలను ఉన్నతీకరించడానికి, సైనిక సహకారాన్ని పెంచడానికి ఇరు పక్షాలూ ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టమైంది. ఎఫ్–35 జెట్ల వంటి అధు నాతన విమానయాన వ్యవస్థల అమ్మకాలకూ, సహ ఉత్పత్తికీ ప్రణాళి కలు ఉన్నాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్ వాణిజ్యం, వలసల కోసం ఉమ్మడి వ్యూహాత్మక దృష్టి కూడా ఉంది. ఇవి మరింత సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయి.అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ‘ప్రతీకార’ సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ప్రాథమికంగా దెబ్బతీస్తాయి, వ్యాపార అనిశ్చితులు పెరుగుతాయి, భౌగోళిక రాజకీయ అంతరాలు తీవ్రమ వుతాయి. దేశాలు అమెరికాతో తమ వాణిజ్య సంబంధాలను తిరిగి అంచనా వేయవలసి ఉంటుంది. ఇప్పటికే ఏర్పర్చిన సరఫరా గొలు సులు, అలాగే ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కూడా ప్రభావితం కావచ్చు. అమెరికా సుంకాలను విధించడం వల్ల ఉత్పత్తి ఖర్చులు ప్రభావిత మవుతాయి. ఇది వినియోగదారులను దెబ్బతీస్తుంది. అధిక ద్రవ్యో ల్బణానికి దోహదం చేస్తుంది. వాస్తవానికి, చైనాకు దూరం జరు గుతూ, తన సరఫరా గొలుసులను అమెరికా వైవిధ్యపరిచినందు వలన, మన వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంతో ఆర్థిక సంబంధాలపై ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానం భారత్‌కు సవాళ్లను కలిగిస్తుంది. వాటిని తక్కువ అంచనా వేయకూడదు.బ్రిక్స్ దేశాలకు బెదిరింపుఅమెరికాతో మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవడానికి జాగ్రత్తగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రతీకార సుంకాల విధానం భారత్ తన సొంత సుంకాలను హేతుబద్ధీకరించుకోవడా నికి తోడ్పడుతుంది. ఈ సంవత్సరం చివరిలోపు రెండు దేశాలు కుదుర్చుకోవాలనుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. అటువంటి ఒప్పందాన్ని చేరుకోవడం మన చర్చల నైపుణ్యాలకు నిజమైన పరీక్ష అవుతుంది. వలసల విషయానికి వస్తే, సంకెళ్లలో బంధించి మరీ, భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరిస్తున్న విధానం చాలా మందికి రుచించలేదు. ఇంతవరకూ అనుసరించిన బహిష్కరణ విధా నాలు తీవ్రమైన వివాదానికి దారితీశాయి. మన జాతీయులతో అమా నుషంగా ప్రవర్తించారనే భావన దేశీయుల్లో ఉంది. విదేశాలలోని మన పౌరులను రక్షించడంలో వైఫల్యంగా దీన్ని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా తన పౌరులను రక్షించుకోగల సామర్థ్యం స్మార్ట్ పవర్లో ఒక భాగం. చట్టపరమైన వలసలను, హెచ్–1బీ వీసా సమస్యలను రెండు దేశాలు నిస్సందేహంగా దీటుగా ఎదుర్కోగలవు. కానీ మానవ అక్రమ రవాణా పరిశ్రమను మన ఏజెన్సీలు ఎలా సమర్థంగా అణచివేయగలవనేదే మన సమస్య.బ్రిక్స్ దేశాలకు ట్రంప్ చేసిన హెచ్చరిక మరొక ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికన్ డాలర్ శక్తి ఆధారంగా ట్రంప్ ప్రపంచ ఆధిప త్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని నిరోధించే ప్రత్యా మ్నాయ ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ దేశాలు అనుసరిస్తే బ్రిక్స్‌కు మరణ శాసనం లిఖిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. బ్రిక్స్ సభ్యదేశమైన దక్షిణాఫ్రికా, శ్వేత ఆఫ్రికనర్ మైనారిటీని ప్రభావితం చేసే భూ విధా నాల కారణంగా చిక్కుల్లో పడింది. దీనిని ఎలాన్ మస్క్ ‘జాత్యహంకార యాజమాన్య చట్టాలు’గా ఎత్తి చూపారు. మస్క్ దక్షిణాఫ్రికాలో తన స్టార్‌లింక్ ప్రాజెక్ట్ కోసం సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఫలి తంగా దక్షిణాఫ్రికాకు తాను అందించే అన్ని ఆర్థిక సహాయాలనూ అమెరికా నిలిపివేసింది. పైగా జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విధాన ‘సూత్రాల’కు నష్టం కలుగుతున్నట్లు కనిపిస్తే దౌత్య సంబంధాలను త్యాగం చేయడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఇది చెబుతోంది.బహుళ ధ్రువ ప్రపంచంబహుళ ధ్రువ ప్రపంచం గురించి నేడు చాలా చర్చ జరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ఇంట ర్వ్యూలో ‘ప్రపంచానికి ఏక ధ్రువ శక్తి ఉండటం సాధారణం కాదు’ అని అంగీకరించారు. ఇది ఓదార్పునిచ్చే మాటగా అనిపించవచ్చు. కానీ ‘అమెరికా ఫస్ట్’ అనే ప్రాపంచిక దృక్పథం అమెరికా ప్రాధాన్యం గురించిన అంతర్లీన అంచనాలను కలిగి ఉంది. పైగా బ్రిక్స్‌కు హెచ్చ రిక బహుళ పక్ష సమూహాలకు కూడా మేల్కొలుపు కానుంది: గట్టిగా కోరుకుంటే ఉనికిలో ఉండండి, కానీ అమెరికన్ నియమాల ప్రకారం ఆడండి. అందుకే కొందరు ట్రంప్ కొత్త అధ్యక్ష పదవిని తనదైన ’సామ్రాజ్యవాదం’ అని పిలుస్తున్నారు.అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ ఇటీవల మాట్లాడిన ‘స్పష్ట మైన వ్యూహాత్మక వాస్తవాలు’ యూరప్ రక్షణ నుండి అమెరికా వైదొలగుతుందనీ, ఈ బాధ్యతను యూరోపియన్లకు వదిలివేస్తుందనీ సూచిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ వివాదంలో శాంతి అంటే రష్యా బలమైన పక్షం అని, ఉక్రెయిన్ ‘నాటో’లో భాగం కాలేదని లేదా రష్యా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పొందాలని అది కోరు కోలేదని ఆయన మాటలు సూచిస్తున్నాయి. విజేత అన్నింటినీ ఆక్ర మించగలదని భావించే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఛాంపియన్ కాబట్టి పాలస్తీనియన్లు సర్వం కోల్పోయారని పీట్ మాటలు చెబుతున్నాయి. చైనా విషయానికొస్తే, వాణిజ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఇతర రంగాలలో సహకారాన్ని విస్తరించ డానికి లేదా కనీసం ఆయనతో ఒక నిలకడైన పద్ధతిలో వ్యవహరించ డానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుత సంద ర్భంలో స్నేహితులు, శత్రువులు ఎవరూ లేరు. కేవలం లావాదేవీలు జరపాలి, ఒప్పందాలు కుదుర్చుకోవాలి. భారతదేశం తదనుగుణంగా తన దౌత్య దిక్సూచిని నిర్దేశించుకోవాలి.నిరుపమా రావు వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి -
యూఎస్-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. భారత్‌కు లాభం
అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు(US-China trade tensions) భారత్‌కు కొత్త అవకాశాలను చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు విధించడంతో భారతీయ ఎగుమతిదారుల ఆర్డర్లలో పెరుగుదల నమోదవుతుందని తెలియజేస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంఘర్షణతో భారతదేశం లబ్ధిదారుగా మారుతుందని చెబుతున్నారు.గతంలో ఇలా..గతంలో యూఎస్-చైనాల మధ్య సుంకాల పరంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాల సమయంలో భారతదేశం భారీగానే లాభపడింది. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కాలంలో భారత్ అమెరికాకు భారీగానే వస్తువులను ఎగుమతి చేసింది. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నాలుగో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించింది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సుంకాలు విధించడంతో యూఎస్ ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేషిస్తోంది. అందులో ప్రధానంగా భారత్‌వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది.ఏయే వస్తువులకు గిరాకీఎలక్ట్రానిక్స్, మెషినరీ, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్, ఫార్మాస్యూటికల్స్, బొమ్మలు వంటి కీలక రంగాల్లో యూఎస్-చైనా టారిఫ్‌ల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దిగుమతులతో ముడిపడి ఉన్న అధిక ఖర్చులను నివారించడానికి యూఎస్ కొనుగోలుదారులు భారతీయ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా భారత్, చైనా రెండింటిలోనూ తయారీ కార్యకలాపాలు కలిగి ఉన్న సంస్థలకు యూఎస్ నుంచి ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: త్వరలో జీఎస్టీ శ్లాబ్‌ల సరళీకరణఆర్డర్ల పెరుగుదలఈ పరిణామంపై ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఎగుమతిదారుల్లో సానుకూల సెంటిమెంట్ ఉందని తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఆర్డర్లు పెరిగినట్లు పేర్కొంది. ఈ వ్యవహారం భారత ఎగుమతులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే భారత మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం మెరుగుపడాలని తెలియజేస్తున్నారు. ఈ అంశంపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుత విధానాలు భారతదేశానికి ప్రపంచ వాణిజ్య ఉనికిని పెంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. -
వలసదారుల పాలిట సింహస్వప్నం లేకెన్ రిలే చట్టం
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి.. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి.. అంటూ 1976లో సి. నారాయణరెడ్డి రాసిన పాటను ఎవరైనా ట్రంప్ కు వినిపిస్తే బాగుణ్ణు. పోనీ పాట పాడడం రాకపోతే అప్పట్లో సోక్రటీస్ చెప్పిన మాటను అయినా అమెరికా అధ్యక్షుడికి ఆయనకు వినిపించండి. సోక్రటీస్ ఏమన్నారా... ఆనాటి సమాజంలో పెద్ద నేరంగా పరిగణించబడిన తప్పిదానికి పాల్పడిన ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపాలని ఆనాటి గ్రీకు రాజు తీర్పు ఇచ్చారు.ఆమె ప్రాణభయంతో పరుగుపరుగున సోక్రటీస్ వద్దకు వచ్చిందట.. ఆమెను వదిలిపెట్టి తమకు అప్పగిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తామని గ్రామస్తులు సోక్రటీసును కోరారట. అయితే అప్పుడు సోక్రటీస్.. అలాగే .. మీరన్నట్లుగానే ఆమెను మీకు అప్పగిస్తాను.. అయితే 'మీలో ఏనాడూ.. చిన్న పొరపాటు.. తప్పిదం.. ఏ పాపం చేయని వాళ్ళు మొదటి రాయి విసరండి. దీనికి మీ అంతరాత్మే రుజువు' అని కండిషన్ పెట్టారట. దీంతో వచ్చినవాళ్లలో ఎవరూ ఒక్క రాయి కూడా విసరాలేకపోయారట.. వచ్చినవాళ్లంతా ఏదోనాడు చిన్నదో పెద్దదో తప్పు చేశారట.. అందుకే అందరూ రాళ్లు అక్కడ పడేసి వెళ్లిపోయారట ఈ ఎపిసోడ్ కూడా ట్రంప్ కు చెప్పాలి .. ఎందుకంటేఅమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పూటపూటకూ కొత్త చట్టాలు.. నిబంధనలు తీసుకొస్తూ.. అమెరికాలో నివసిస్తున్న వలసజీవులకు నిద్రలేకుండా చేస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నంతమాత్రాన అమెరికా పౌరులు అయిపోలేరు అంటూ టీజర్ రిలీజ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఇంకో టీజర్ సిద్ధం చేసారు. వలసదారులపాలిట సింహస్వప్నంలాంటి లేకెన్ రిలే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని.. ఇక అమెరికాలో చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి అమెరికా నుంచి స్వదేశానికి పంపేస్తారన్నమాట.చిన్న నేరానికి కూడా వెలివేస్తారా?అమెరికాలో 2022లో లేకెన్ రిలే అనే అమెరికా అమ్మాయిని వెనిజులా నుంచి వచ్చిన ఒక వలసదారుడు హత్య చేసాడు. వాస్తవానికి ఆ హత్య చేసిన అంటొనియా ఇబర్రా అనేవ్యక్తి మీద గతంలో కూడా కేసు నమోదైంది. కానీ అరెస్ట్ చేయలేదు. అప్పుడే వాణ్ని జైల్లో పడేసి ఉంటె ఈ లేకెన్ రిలే హత్యకు గురయ్యేది కాదు కదా.. వలసదారులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం వాళ్ళ స్థానిక అమెరికన్లకు భద్రతా లేకుండా పోతోంది. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని లొసుగులు.. కొన్నికొన్ని మినహాయింపులు ఇలా వలసదారులకు వరంగా మారుతున్నాయి అనే వాదన మొదలైంది.ఇదీ చదవండి: చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం.. లేకెన్ రిలే చట్టం గురించి తెలుసా?దీంతో ఆమె పేరిట ఒక చట్టాన్ని తీసుకురాగా దానికి ట్రంప్ మద్దతుపలుకుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా విచ్చలవిడిగా ఉంటె వెంటనే అరెస్ట్ చేస్తారు.. అంతేకాకుండా వాళ్ళను వెనువెంటనే వారి స్వదేశానికి తరిమేస్తారన్నమాట. ఇది అమెరికా వెళ్లి చదువుకుంటున్న.. ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులతోబాటు పలు విదేశీయులకూ ప్రమాదంగా మారుతోంది.చిన్న చిన్న తప్పులు చేసి అరెస్ట్ అయినంతమాత్రాన అమెరికాలో చదువుకుంటున్న.. జాబ్ చేస్తున్నవాళ్లను వెనువెంటనే వారి స్వదేశానికి పంపేయడం ఏమిటన్న వాదన మొదలైంది. యువత.. విద్యార్థులు తెలిసో.. తెలియకో.. ఏదో చిన్న చిన్న నేరాలు చేసినంతమాత్రాన మొత్తం దేశబహిష్కరణ చేసేసి వారి ఆశలను చిదిమేస్తారా.. అవసరం ఐతే కేసు పెట్టి.. విచారించి శిక్ష వేయాలి కానీ ఇలా ఏకంగా వారి భవిష్యత్తును నాశనం చేస్తారా అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.-సిమ్మాదిరప్పన్న -
ఇండో–పసిఫిక్ స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యం
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు, విస్తరణవాదానికి కళ్లెం వేస్తూ ఈ ప్రాంత స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యంగా ఉమ్మడిగా ముందడుగువేస్తున్నామని క్వాడ్ కూటమి దేశాలు పునరు ద్ఘాటించాయి. క్వాడ్ కూటమిగా ఆవిర్భవించి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలెట్టి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా క్వాడ్ సభ్యదేశాలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశాయి. 2004లో హిందూ మహాసముద్రంలో ఇండోనేసియా సమీపంలో సముద్రగర్భంలో భూకంపం కారణంగా ఉద్భవించిన సునామీ సృష్టించిన విలయం నుంచి కోలుకునేందుకు భార త్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు 20 ఏళ్ల క్రితం ‘క్వాడ్’కూటమిగా ఏర్పడిన విషయం విదితమే.మంగళవారం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ఇటీవలికాలంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తరచూ సముద్రతీర భద్రత, మౌలిక వసతుల కల్పన, దేశాల మధ్య అనుసంధానత పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంయుక్త ప్రక టన వెలువడటం గమనార్హం. ‘‘ఇండో–పసిఫిక్ స్వేచ్ఛాయుతంగా ఉంటే ఇక్కడ సుస్థిరత, పారదర్శకత నెలకొనడంతోపాటు దేశాల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం ఇనుమడిస్తుంది. పది దేశాలతో ఏర్పడిన ఆసియాన్ గురించి క్వాడ్ ఆలో చిస్తోంది. తూర్పు ఆసియా దేశాలకు పూర్తి సహాయసహకారాలు అందించడంతోపాటు దేశాల మధ్య ఐక్యతకు క్వాడ్ కృషిచేస్తోంది. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లకూ క్వాడ్ తన మద్దతు పలుకుతోంది.సునామీ వంటి ప్రకృతి విపత్తులు మా నాలుగు దేశాలను దగ్గర చేశాయి. సునామీ వినాశనం వేళ దాదాపు 2.5 లక్షల మంది సజీవ సమాధి అయ్యారు. రాకాసి అలల ధాటికి తీరప్రాంతమున్న 14 దేశాల్లో 17 లక్షల మంది సర్వస్వం కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. లక్షలాది బాధితులను ఆదుకునేందుకు 40,000కు పైగా అత్యయక బృందాలు అవిశ్రాంతంగా సేవలందించాయి. వినాశనాల వేళ మానవీయ సా యం, విపత్తు స్పందన సహకారం అందించడమే క్వాడ్ ముఖ్యోద్దేశం. ఇండో–పసిఫిక్‌లో తలెత్తే ఎలాంటి ఉపద్రవాన్నైనా తక్షణం ఎదుర్కొనేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం.2021 నుంచి ప్రతి ఏటా క్వాడ్ దేశాధినేతలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారు’’అని సంయుక్త ప్రకటన పేర్కొంది. 2025 ద్వితీయార్థంలో క్వాడ్ సదస్సు భారత్‌లో జరగనుంది. క్రితంసారి అమెరికాలోని విలి్మంగ్టన్‌లో క్వాడ్ సదస్సు జరిగింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం వాటిల్లకుండా క్వాడ్ దేశాలు పనిచేస్తున్నాయని ప్రకటన స్పష్టంచేసింది. -
అమెరికాలో శివరాజ్‌కుమార్.. క్యాన్సర్‌కు శస్త్రచికిత్స పూర్తి
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల భైరతి రంగల్ చిత్రంలో కనిపించిన ఆయన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆయన కూతురు నివేదిత శివరాజ్‌కుమార్ వెల్లడించారు. దేవుని దయతో మా నాన్నకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ట్విటర్ ద్వారా లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయన భార్య గీతా మాట్లాడిన వీడియోను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. మరికొద్ది రోజుల్లో శివ రాజ్‌కుమార్ తన అభిమానులతో మాట్లాడతారని తెలిపింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 24న యూఎస్‌లోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మూత్రాశయ క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.ప్రస్తుతం శివరాజ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు లేఖలో ఆయన కుమార్తె ప్రస్తావించారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సర్జరీకి ముందు శివ రాజ్‌కుమార్‌కు ఆరోగ్యం చేకూరాలని కోరుతూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. Thank You #Geethakka ❤🙏🏼 You Stood with Anna ❤❤❤ Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar #ShivaSainya @NimmaShivanna ❤❤❤ @ShivaSainya pic.twitter.com/isgcCcC520— ShivaSainya (@ShivaSainya) December 25, 2024 It is the prayers and love of all the fans and our loved ones that have kept us going through tough times. Thank you for your support!✨ pic.twitter.com/eaCF7lqybc— Niveditha Shivarajkumar (@NivedithaSrk) December 25, 2024 -
ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ బిజినెస్‌తో ఏకంగా రూ. 1500 కోట్లు..!
కొందరు అత్యంత విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టే.. బిజినెస్ ఊహించని రీతీలో ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తుంది. తాము ఫేస్ చేసిన సమస్య నుంచి బయటపడి..వ్యాపారానికి దారితీయడం అనేది అత్యంత అరుదు. అచ్చం ఇలానే ఓ జంట వ్యాపారం చేసి కోట్లు గడించింది. పైగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేసేలా చేసే వ్యాపారంతో దూసుకుపోయింది. ఆరోగ్యం తోపాటు ఆదాయాన్ని అందించే గొప్ప వ్యాపారంగా తీర్చిదిద్దింది. ఇంతకీ ఏంటా వ్యాపారం అంటే.అమెరికాకు చెందిన జ్యూడి ఎడ్వర్ట్ అనే మహిళ క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్తో బాధపడేది. దీంతో ఆమెకు డాక్టర్లు వాష్‌రూమ్‌లో ఇండియన్ స్టైల్ పొజిషన్లో కూర్చొమని సలహా ఇచ్చారు. జూడి తన భర్త, కొడుకు సాయంతో వెస్టర్న్ కమోడ్‌పై స్క్వాటీ పొజిషన్(భారత టాయిలెట్ స్టైల్)లో కూర్చొనేలా స్క్వాటీ పాటీని క్రియేట్ చేసుకుంది. దీని సాయంతో కూర్చోవడం వల్ల ఆమెకు కొద్ది రోజుల్లో ఆ సమస్య తగ్గిపోయింది. అయితే ఈ క్రమంలో జూడీ తనలాంటి సమస్యనే చాలామంది ఎదుర్కొంటున్నారని తెలుసుకుని దీన్ని బిజినెస్‌గా ఎందుకు చేయకూడదు అనుకుంది. ఆ నేపథ్యంలోనే జూడీ దంపతులు స్క్వాటీ పాటీ వుడ్ టూల్ బిజినెస్‌ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించారో లేదో జస్ట్ ఫస్ట్ ఇయర్లోనే వన్ మిలియన్ డాలర్ల సేల్స్‌ని కంప్లీట్ చేశారు. చెప్పేందుకు కూడా ఇబ్బందికరమైన ఈ వ్యాపారాన్ని తనలాంటి సమస్యతో ఎవ్వరూ విలవిల లాడకూడదనుకుంది. ఆ ఆలోచనతోనే దీన్ని ప్రారంభించి మంచి లాభాలను గడించింది. అదీగాక ప్రస్తుతం ఏకంగా రూ. 1400 కోట్ల టర్నోవర్‌తో లాభదాయకంగా సాగిపోతోంది. నిజానికి మన పూర్వకులు ముందుచూపుతో ఎనిమిదివేల సంవత్సరాల క్రితమే మలబద్ధ సమస్యలు దరిచేరకుండా హ్యమన్ బాడీ పోస్చర్కి అనుగుణంగా ఈ ట్రెడిషనల్ టాయిలెట్స్‌ని డిజైన్ చేశారు. అయితే మనం పూర్వీకులు చెప్పే ప్రతిదాని వెనుక ఏదో మర్మం ఉంటుందనేది గ్రహించం.పైగా వాళ్లు ఆరోగ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి..ఎలాంటి ఆరోగ్య సమస్యల బారినపడకుండా జీవించేలా చేస్తున్నారని అస్సలు గుర్తించం. అదీగాక నేటి యువతరం టెక్నాలజీ పేరుతో వాటిని పక్కన పెట్టేసి కోరి కష్టాలు కొని తెచ్చుకుని, అనారోగ్యం పాలవ్వుతుండటం బాధకరం.(చదవండి: మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!) -
అమెరికాలో యూనివర్సిటీ విద్యార్థులకు ట్రంప్ ఎఫెక్ట్
-
అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా
ఉన్నత చదువులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం అమెరికా. అగ్రరాజ్యంలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవడం ప్రపంచవ్యాప్తంగా యువత కల. అమెరికాకు విద్యార్థులను పంపించడంలో చైనా ముందంజలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ దక్కించుకుంది. అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపిస్తున్న దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో నిలవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ‘ఓపెన్ డోర్స్’సోమవారం తమ నివేదికలో వెల్లడించింది. 2022–23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చైనా విద్యార్థులే అధికంగా ఉండేవారు. ఆ తర్వాతి స్థానం భారతీయ విద్యార్థులది. సంవత్సరం తిరిగేకల్లా పరిస్థితి మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి స్థానంలో భారతీయ విద్యార్థులు, రెండో స్థానంలో చైనా విద్యార్థులు ఉన్నారు. ⇒ 2023–24లో అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022–23లో 2,68,923 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఈసారి ఏకంగా 23 శాతం పెరిగింది. ⇒అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 29 శాతం కావడం గమనార్హం. ⇒ఇండియా తర్వాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలున్నాయి. ⇒చైనా విద్యార్థులు 2.77 లక్షలు, దక్షిణ కొరియా విద్యార్థులు 43,149, కెనడా విద్యార్థులు 28,998, తైవాన్ విద్యార్థులు 23,157 మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ⇒2008/2009లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉండేవారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమైంది. ⇒ ఒక విద్యా సంవత్సరంలో 3,31,602 మంది అమెరికాలో చదువుకుంటుండడం ఇదే మొదటిసారి. ⇒అంతర్జాతీయ గ్రాడ్యుయేట్(మాస్టర్స్, పీహెచ్డీ) విద్యార్థులను అమెరికాకు పంపుతున్న దేశాల జాబితాలో ఇండియా వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలుస్తోంది. ఇండియన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 19 శాతం పెరిగి 1,96,567కు చేరుకుంది. ⇒ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరింది. ఇండియన్ నాన్–డిగ్రీ విద్యార్థుల సంఖ్య 28 శాతం తగ్గిపోయి 1,426కు పరిమితమైంది. ఓపెన్ డోర్స్ రిపోర్టును ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ప్రచురించింది. ఈ సంస్థను 1919లో స్థాపించారు. అమెరికాలోని విదేశీ విద్యార్థులపై ప్రతిఏటా సర్వే నిర్వహిస్తోంది. వారి వాస్త వ సంఖ్యను బహిర్గతం చేస్తోంది. 1972 నుంచి యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చరల్ అఫైర్స్ కూడా సహకారం అందిస్తోంది. -
మహిళల హక్కులను కించపరిచిన ట్రంప్
-
అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చిన... 1,400 పై చిలుకు కళాకృతులు
భారత్ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 1,400కు పైగా పురాతన కళాకృతులను అమెరికా తాజాగా తిరిగి అప్పగించింది. వీటి విలువ కోటి డాలర్ల పై చిలుకే. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన కళాకృతులను మాతృదేశాలకు స్వాదీనం చేసే చర్యల్లో ఇది భాగమని మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలోని యాంటిక్విటీ స్మగ్లింగ్ విభాగం తెలిపింది. భారత్ నుంచి లండన్‌కు తరలించిన దేవ నర్తకి శిల్పం వంటి అపురూప కళాకృతులు వీటిలో ఉన్నాయి. దీన్ని శాండ్‌స్టోన్‌లో అత్యంత సుందరంగా మలిచారు. వీటిని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ తదితర చోట్ల భద్రపరిచి ఉంచారు. నాన్సీ వెయినర్ వంటి అమెరికా స్మగ్లర్లతో పాటు భారత్‌కు చెందిన పలువురు గ్యాంగ్ లీడర్లను ఇప్పటికే అరెస్టు చేశారు. యాంటిక్విటీ విభాగం ఇప్పటిదాకా 46 కోట్ల డాలర్ల విలువైన 5,800కు పైగా కళాకృతులను స్మగ్లర్ల నుంచి స్వా«దీనం చేసుకుంది. 16 మందికి పైగా స్మగ్లర్లకు శిక్షలు పడేలా చూసింది. -
భారతీయులకు భారీ షాక్..?
-
ఆర్మీచేతికి స్వదేశీ అస్మీ మెషీన్ పిస్టల్స్
జమ్మూ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘అస్మీ’మెషీన్ పిస్టళ్లు భారత సైన్యం చేతికొచ్చాయి. ‘‘దేశ ఆత్మనిర్భరత కార్యక్రమానికి మరింత ఊతమిస్తూ 100 శాతం భారత్ తయారీ ఆయుధాన్ని ఇండియన్ ఆర్మీ తమ అమ్ములపొదిలోకి తీసుకుంది’’అని డిఫెన్స్ జమ్మూ విభాగం ప్రజావ్యవహారాల శాఖ మంగళవారం ‘ఎక్స్’లో ట్వీట్‌చేసింది. ఇండియన్ ఆర్మీ కల్నల్ ప్రసాద్ బన్సూద్తో కలిసి సంయుక్తంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఈ పిస్టల్‌ను అభివృద్ధిచేసింది. ఈ పిస్టళ్లను హైదరాబాద్‌లోని లోకేశ్ మెషీన్స్ కర్మాగారంలో తయారుచేశారు. దీంతో కీలకమైన రక్షణ సాంకేతికలో భారత్ మరింత స్వావలంభన సాధించింది. అత్యంత చిన్నగా, తేలిగ్గా ఉండటం అస్మీ పిస్టల్ ప్రత్యేకత. శత్రువుతో అత్యంత సమీపం నుంచి పోరాడాల్సి వచ్చినపుడు వేగంగా స్పందించేందుకు ఈ పిస్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ పిస్టల్గా, సబ్ మెషీన్గన్గా రెండు రకాలుగా వాడుకోవచ్చు. స్వల్ప, మధ్య శ్రేణి దూరాల్లోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో షూట్ చేయొచ్చు. అత్యంత వేడి, చలి వాతావరణంలోనూ ఏమాత్రం మొరాయించకుండా పనిచేస్తాయి. 8 అంగుళాల బ్యారెల్‌కు 33 తూటాల మేగజైన్‌ను అమర్చవచ్చు. 9ఎంఎం బుల్లెట్‌ను దీనిలో వాడతారు. తొలి దఫా 550 పిస్టళ్లను నార్తర్న్ కమాండ్ పరిధిలోని జమ్మూకశీ్మర్, లద్దాఖ్ సరిహద్దులవెంట పహారా కాసే భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు అందజేశారు. వీటి తయారీ ఆర్డర్‌ను లోకేశ్ మెషీన్స్ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చారు. -
15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయంఅమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ఎమ్సిస్టెక్గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్ఎల్పీఇన్నోవియో వెంచర్స్కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకేష్ మెషీన్స్ లిమిటెడ్పాయింటర్ ఎలక్ట్రానిక్స్ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్షార్ప్లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ -
Video: బాలీవుడ్ పాటకు యూఎస్ దౌత్యవేత్త హుషారైన స్టెప్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు బధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గార్సెట్టి ఇలా తన డ్యాన్స్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో తన నృత్య ప్రదర్శనతో అందరిని మంత్రముగ్దులను చేశారు. #WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song 'Tauba, Tauba' during Diwali celebrations at the embassy in Delhi(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH— ANI (@ANI) October 30, 2024 -
ఫెడ్ వడ్డీ కోత పసిడికి బూస్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. నాలుగేళ్ల తదుపరి బుధవారం 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలసిరాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ నిధులు బంగారం ధరలకు దన్నునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. మిశ్రమ అంచనాలు సుమారు 14 నెలలపాటు రెండు దశాబ్దాల గరిష్టం వద్ద కొనసాగిన ఫెడ్ ఫండ్స్ రేట్లు దిగివస్తున్నాయి. తాజాగా రేట్ల తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి(డిసెంబర్)కల్లా మరో 0.5 శాతం కోత పెట్టనున్నట్లు అంచనా. అయితే ఫెడ్ రేట్ల తగ్గింపుతో ఈక్విటీలపై రాబడి క్షీణించనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు. కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సమీపకాలంలో పసిడి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు. యూఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారిచూపుతుందని అభిప్రాయపడ్డారు. రేట్ల కోతకు దారి... ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు బిజ్2క్రెడిట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా పేర్కొన్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేశారు. వెరసి ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న విషయం విదితమే.అయితే ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల ప్రభావం భారత్‌పై ఉండదని ఇండియాబాండ్స్.కామ్ సహవ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా పేర్కొన్నారు. రిస్క్ ఆస్తులలో భారీ ర్యాలీ, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాల కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపునకు చాన్స్ తక్కువేనని తెలియజేశారు. అంచనాలకు మించి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎడిల్వీజ్ ఎంఎఫ్ ఈక్విటీస్ సీఐవో త్రిదీప్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.భారత్‌పై ప్రభావం అంతంతే..మార్కెట్‌వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను పరిగణనలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్‌పై పెద్దగా ఉందు. దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మొత్తం మీద రేట్ల తగ్గింపనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
దేవర మూవీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఓవర్సీస్లో టికెట్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.రిలీజ్‌కు ఇంకా 13 రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్‌లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్ ప్రీసేల్స్‌లో దేవర మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 40 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ అయినట్లు దేవర టీమ్ ట్వీట్ చేసింది. రెండువారాల ముందే ఈ స్థాయిలో టికెట్స్ ప్రీసేల్స్‌తో దేవర దూసుకెళ్తోంది. యూఎస్‌లో సెప్టెంబర్ 26 తేదీనే దేవర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.(ఇది చదవండి: నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్)ఇప్పటికే అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్‌లోనూ దేవర మానియా కొనసాగుతోంది. ఈ దేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. What do we call his mayhem? #Devara 🔥 pic.twitter.com/0rxdYD1JPJ— Devara (@DevaraMovie) September 14, 2024 -
అమెరికాలో భారతీయ అంధుల క్రికెట్ జట్టు.. డాలస్‌లో మహాత్ముడికి నివాళి
డాలస్, టెక్సాస్: జూలై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు అమెరికా పర్యటనలో ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్ట్ఙు మంగళవారం డాలస్ లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి మొదలైన వారు వీరికి ఘనస్వాగతం పలికారు.బోస్టన్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డి.సి, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్ మరియు బే ఏరియా లలో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా ఆటగాళ్ళు దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.వీరిలో కొంతమంది పూర్తిగా అంధులు, మరికొంతమంది కొద్దిగా మాత్రమే చూడగల్గుతారు. వీరి క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు లాంటివి ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా ఎటువైపు ఎంత వేగంతో బంతి వస్తుందో అంచనావేసి బాట్స్ మాన్ బంతిని కొడతాడు. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని చాంపియన్స్ గా నిలిచిన ఈ భారతజట్టులో విజయవాడకు చెందిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటన మొత్తాన్ని ‘సుబ్బు కోట ఫౌండేషన్’ వారు స్పాన్సర్ చేసి తగు ఆర్ధిక సహకారం అందించడం ముదావహం. పర్యటిస్తున్న అన్ని నగరాలలో అంధులు క్రికెట్ ఎలా ఆడతారో తెలియజేస్తూ ఎగ్జిబిషన్ మ్యాచ్స్ ఆడుతూ తమ క్రికెట్ ఆటలు సుదీర్ఘ కాలం విజయవంతంగా కొనసాగడానికి కావలసిన ఆర్ధిక పరిపుష్టికోసం విరాళాలు సేకరిస్తున్నారు. -
భారత్, యూఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం
సాక్షి, విశాఖపట్నం: భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్–యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పష్టం చేశారు. పసిఫిక్ సముద్రజలాల్లో అన్ని దేశాలూ స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో భారత్, యూఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఐఎన్ఎస్ జలాశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డుపై ఇరుదేశాల ప్రతినిధులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎరిక్ మాట్లాడుతూ సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యూఎస్ సెవెన్త్ ఫ్లీట్ రిజర్వ్ వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ జె మార్టినైజ్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ నిర్వహణతో భారత్, యూఎస్ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ విన్యాసాల్లో భాగంగా హార్బర్ ఫేజ్‌లో విపత్తు, యుద్ధ సమయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనే అంశాలతో పాటు ప్రీసెయిల్ చర్చలు, వృత్తిపరమైన విషయాలపై ఎక్స్పర్ట్స్ ఎక్స్చేంజిలు జరగనున్నాయని తెలిపారు. విన్యాసాల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, జాయింట్ రిలీఫ్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని వివరించారు. 29న కాకినాడలో మెడికల్ రిలీఫ్ క్యాంపుతో పాటు.. జాయింట్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్ఎస్ సోమర్సెట్ యుద్ధ నౌక కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మిచైల్ బ్రాండ్, ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్, ఐఎన్ఎస్ జలశ్వా కమాండింగ్ అధికారి కెప్టెన్ సందీప్ బిశ్వాల్‌తో పాటు ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
US : ఆస్టిన్ తెలుగు సంఘానికి కొత్త కార్యవర్గం
అమెరికా టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో 2024కి గాను తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రౌండ్ రాక్ విన్గేట్ బై విందామ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఆస్టిన్ తెలుగు కమ్యూనిటీ ప్రకటించింది. తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) కార్యవర్గం వివరాలు అధ్యక్షుడు : పరమేశ్వర రెడ్డి నంగి ఉపాధ్యక్షుడు : శ్రీని బైరపనేని సెక్రెటరీ : భరత్ పిస్సాయ్ ట్రెజరర్ : చిన్నపరెడ్డి కుందూరు సంయుక్త కార్యదర్శులు : కల్చరల్ : ప్రతిభ నల్ల ఫైనాన్స్ & స్పాన్సర్షిప్ : లక్ష్మీకాంత్ ఫుడ్ & లాజిస్టిక్స్ : వెంకటేష్ దూబాల మెంబర్షిప్ & టెక్నాలజీ : శ్రీలత అంబటి స్పోర్ట్స్ : సర్వేశ్వరా రెడ్డి పాశం బోర్డు అఫ్ డైరెక్టర్లు : అర్జున్ అనంతుల గిరి మేకల బ్రహ్మేంద్ర రెడ్డి లాక్కుని గత కార్యవర్గంలో సేవలందించిన రామ్ హనుమంతు మల్లిరెడ్డి,మురళీధర్ రెడ్డి వేలూరు, శ్రీనివాస్ బత్తుల మరియు ఇతర TCA సభ్యులకు కొత్త కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. అమెరికాలోని తెలుగు సమాజానికి, ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపింది. -
అమెరికాలో విషాదం.. శవాలై కనిపించిన భారత సంతతి కుటుంబం
అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్ కమల్ కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేష్ కమల్ (57)తో పాటు ఆయన భార్య టీనా కమల్ (54), కుమార్తె ఆరియానా (18) మృతి చెందడం కలకలం రేపుతోంది. స్థానిక కాల మానం ప్రకారం.. గురువారం సాయంత్రం 7.30గంటల సమయంలో రాకేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉండే ఖరీదైన డోవర్ భవనంలో చనిపోయినట్లు గుర్తించామని నార్‌ఫోర్క్ డిస్ట్రిక్ అటార్నీ (డీఏ) మైఖేల్ మొరిస్సే తెలిపారు. ఈ ఘటనపై మైఖేల్ మొరిస్సే మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటన గృహ హింస అయ్యిండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు భర్త రిక్కీ మృతదేహం వద్ద తుపాకీ ఉండడమేనని అన్నారు. చంపారా? చంపించారా? ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపారా? లేదంటే ఎవరిచేతనైనా చంపబడ్డారా? అనేక అనుమానాలపై స్పష్టత ఇచ్చేందుకు న్యాయ వాది మైఖేల్ మొరిస్సే నిరాకరించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ సంఘటనను హత్య లేదంటే ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకోవాలా? వద్దా? అని నిర్ణయించే ముందు వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉందని చెప్పారు. ఆర్ధిక సమస్యలే కారణమా? రాకేష్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మరణానికి ఆర్ధిక సమస్యలే కారణమని తెలుస్తోంది. సంబంధిత ఆన్లైన్లోని ఆధారాల్ని స్థానిక పోలీసులు సేకరించారు. అదే సమయంలో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు, ఇతర సమస్యలు ఉన్నాయన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించ లేదని మోరిస్సే చెప్పారు. ప్రస్తుతం ఈ హత్యలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆస్తుల అమ్మకం ది పోస్ట్ నివేదిక ప్రకారం.. రాకేష్ కమల్ కుటుంబం 5.45 మిలియన్ డాలర్ల విశాలమైన భవనంలో నివసిస్తుంది. అయితే ఈ భవనాన్ని ఏడాది క్రితం మసాచుసెట్స్‌కు చెందిన విల్సోండేల్ అసోసియేట్స్ ఎల్ఎల్సీకి 3 మిలియన్లకు విక్రయించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, 2019లో కమల్‌లు 19,000 చదరపు అడుగుల ఎస్టేట్‌లో 11 బెడ్రూమ్లు ఉన్న భవనాన్ని రిక్కీ 4 మిలియన్లకు కొనుగోలు చేశారు. సంస్థ కార్యకలాపాల రద్దు రాష్ట్రంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన డోవర్లో నివసించే రాకేశ్ కమల్ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. విద్యా వంతులు ఎడ్యునోవా వెబ్సైట్ ప్రకారం..రాకేష్ కమల్ భార్య టీనా కమల్ భారత్‌లోని ఢిల్లీ యూనివర్సీటీ, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్సైట్లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించేవారు. ఇక కమల్ బోస్టన్ యూనివర్సిటీ, ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి కూడా. ఎడ్యునోవాలో పని చేయడానికి ముందు రాకేష్ కమల్ ఎడ్యుకేషన్ విభాగంలో అపారమైన అనుభవం ఉంది. ఇక ఎడునోవా మిడిల్ స్కూల్, హైస్కూల్, కాలేజ్‌లలోని విద్యార్థుల గ్రేడ్లను మెరుగుపరిచేలా సేవలందిస్తోంది. ఇక, రాకేష్ కమల్, టీనా కమల్ దంపతుల కుమార్తె ఆరియానా వెర్మోంట్లోని మిడిల్బరీ కాలేజీ న్యూరోసైన్స్ చదువుతుండేవారు. అప్పుల ఊబిలో ఉక్కిరి బిక్కిరి టీనా కమల్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. తనకు 1 మిలియన్ నుంచి 10 మిలియన్ల అప్పు ఉందని ఫైలింగ్‌లో తెలిపారు. తగిన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో రెండు నెలల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చివరికి ఆర్ధిక ఇబ్బందులు తాళలేకే రాకేష్ కమల్ తన భార్య టీనా కమల్, ఆరియాను హత్యా చేశారా? ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దృష్టిసారించారు. -
భారత్‌పై అభియోగాల పత్రం
విలియం షేక్స్పియర్ నాటకం ‘ద మర్చెంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ కనికరం లేని వడ్డీ వ్యాపారి. స్నేహితుడి కోసం ‘నాదీ పూచీ’ అంటూ డబ్బు తీసుకుని చివరికి తీర్చలేకపోతాడు ఆంటోనియో. పరిహారంగా ఒక పౌండు ఆంటోనియో మాంసాన్ని అడుగుతాడు షైలాక్. భారత్‌పై యూఎస్ తాజా అభియోగ పత్రంలోని నేరారోపణలు కొంతవరకు ఆంటోనియోను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. అమెరికన్ పౌరుడు గురుపథ్‌వంత్ సింగ్ పన్నూపై కొద్దిరోజుల క్రితం జరిగిన హత్యాయత్నం వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందన్నది అమెరికా ఆరోపణ. సంబంధాలు ఇరు దేశాలకూ ముఖ్యమే కనుక యూఎస్ ఈ విషయంలో మౌనంగా ఉండి, షైలాక్లాగా భారత్ నుంచి పరిహారంగా ‘ఒక పౌండు మాంసాన్ని’ కోరుతుందా? చేర్పులు, జోడింపులతో మరింతగా బలప రిచి అమెరికా ప్రభుత్వం తాజాగా బహిర్గత పరచిన పూర్వపు అభియోగ పత్రాన్ని ఒక కల్పిత కథనంగా మీరు విశ్వసిస్తే తప్ప, అందులోని వెల్లడింపుల పట్ల అందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ, విచారణకు వెళ్లనున్న కేసు అది. తేలిగ్గా కొట్టి పడేసి పక్కకు తోసేయవలసినది కాదు. కాబట్టి, సహాయకారిగా ఉంటుందనుకుంటే కనుక మనం దృష్టి సారించవలసిన అంశాలను కొన్ని ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా ఒక జాబితాగా పొందుపరుస్తాను. మొదటిది – అమెరికా గడ్డ మీద ఒక అమెరికన్ పౌరుడిని (నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ నేత గురుపథ్ వంత్ సింగ్ పన్నూ) హత్య చేయించేందుకు సిసి–1 అనే సంకేత నామధారి పథక రచన చేయడం! యు.ఎస్. తిరగ రాసిన అభియోగ పత్రంలోని అరోపణ లను బట్టి– ‘భద్రతా నిర్వహణ’, ‘ఇంటెలిజెన్స్’ విభాగాలలో బాధ్య తలు నిర్వర్తిస్తూ తనను తాను ‘సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్’నని చెప్పుకుంటున్న ఆ సంకేత నామధారి భారత ప్రభుత్వ సంస్థలో గుర్తింపు పొందిన ఉద్యోగిగా ఉన్నాడు. గతంలో అతడు సెంట్రల్ రిజర్వ్›్డ పోలీస్ ఫోర్స్‌లో కూడా పని చేశాడు. మరీ ముఖ్యంగా ఈ సిసి–1 అనే వ్యక్తి ఆ అభియోగ పత్రంలో పేర్కొన్న అన్ని సమయాలలోనూ భారత ప్రభుత్వం నియమించిన విధుల నిర్వహణలో ఉన్నాడు. ఇండి యాలోనే ఉన్నాడు. ఇండియా నుంచే హత్యకు కుట్ర పన్నాడు. ఇదేం సూచిస్తోంది? సిసి–1 వెనుక భారత ప్రభుత్వం ఉందనా? లేక సిసి–1 అనే అతడు ఒక మోసగాడు అయి ఉండవచ్చుననా? రెండవది – ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మోసగాడు ఎలా ఉండి ఉంటాడు? ఒంటరి తోడేలు మాదిరిగానా? లేక, దేశ అత్యుత్తమ ప్రయో జనాల కోసం పనిచేస్తున్న ఒక చిన్న సమూహంలో భాగంగానా? లేదా అన్ని అధికారిక అనుమతులతో వ్యూహాత్మక టక్కరిగా నటిస్తున్న అత్యున్నతస్థాయి ప్రభుత్వ అధికారి అయివుంటాడా?మూడవది – ఆ సిసి–1 ఎవరైనా గానీ అసమర్థంగా ఈ పనిని నిర్వహించాడా? ‘నిఖిల్ గుప్తా అనే ఒకానొక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా వ్యాపారిని సిసి–1 పనిలోకి దింపాడు.’ తనకు తెలియకుండానే అలా చేశాడా? తెలియకపోతే తెలుసుకోవలసిన పని లేదా? ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే నిఖిల్ గుప్తాను ఎంచుకుని ఉంటే అది తెలివైన ఎంపికేనా? నాల్గవది – ఇక నిఖిల్ గుప్తా ఏం చేశాడంటే ‘డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ (డి.ఇ.ఎ.)కు రహస్య సమాచారం అందించే వ్యక్తిగా మారిన ఒక భాగస్వామ్య నేరస్థుడిని సంప్రదించాడు. ఆ వ్యక్తి కిరాయి హంతకుడిగా నటిస్తున్న ఒక రహస్య ప్రభుత్వ అధికారి (అండర్ కవర్ ఏజెంట్) దగ్గరికి గుప్తాను తీసుకెళ్లాడు. దీన్నిబట్టి డి.ఇ.ఎ. గుప్తాను నీడలా వెంటాడుతోందనీ, కాబట్టి గుప్తా గురించి మన వరకు రాని అనేక విషయాలు డి.ఇ.ఎ.కు తెలిసి ఉంటాయనీ అనుకోవచ్చా? మరీ ముఖ్యంగా, ఇదొక దారుణమైన గందరగోళంగా అనిపించడం లేదా? బహుశా దీనికంటే ‘డాడ్స్ ఆర్మీ’ (హోంగార్డులు) నయం కదా? ఐదవది – కెనడాలో జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ‘రక్తంతో తడిసిన నిజ్జర్ మృతదేహం ఆయన వాహనంపై పడివున్నట్లు చూపించే వీడియో క్లిప్పును గుప్తాకు సిసి–1 పంపించాడు.’ ఈ ఆరోపణ... సిసి–1కి నిజ్జర్ హత్యతో నేరుగా సంబంధం ఉందని చెప్పడానికి యు.ఎస్. అధి కారులు సాక్ష్యాధారాలను సృష్టించడాన్ని సూచిస్తోందా? అదే నిజమైతే భారత్‌పై జస్టిన్ ట్రూడో ఆరోపణలకు ఆ సాక్ష్యాధారాలే బలం చేకూరుస్తున్నాయా? కలవరపరిచే సమాచార వ్యవస్థ ఆరవది – ‘హత్య తర్వాత కొన్ని వారాల పాటు గుప్తా... భాగ స్వామ్య నేరస్థునితో, ఆ తర్వాత కిరాయి హంతకుడితో – ఫోన్, వీడియో, టెక్స్›్ట మెసేజేస్ వంటి వాటి ద్వారా వరుసగా ఎలక్ట్రానిక్, రికార్డెడ్ సంభాషణలను జరిపాడు’ అని యు.ఎస్. అభియోగ పత్రం చెబుతోంది. ఆ సంభాషణలు సంకేత నిక్షిప్త సందేశాల రూపంలో ఉన్నప్పటికీ వాటిని అడ్డగించి ఉంటారు. అంటే యు.ఎస్. అధికారుల వద్ద ఇప్పటికీ బయట పెట్టని సమాచారం గుట్టలు గుట్టలుగా మిగిలి ఉందనేనా? అది కూడా మన సమాచార వ్యవస్థ తాలూకు పటిష్ఠత, భద్రతల గురించి కలవరపరిచే ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఏడవది – కనీసం నాలుగు వేర్వేరు చోట్ల హత్యకు వ్యూహం పన్నినట్లు యు.ఎస్. అభియోగ పత్రం చెబుతోంది. వాటిల్లో ఒకటి న్యూయార్క్‌లో... బహుశా గురుపథ్‌వంత్ సింగ్ పన్నూని హత్య చేయడం కోసం... మరొకటి క్యాలిఫోర్నియాలో, మరో రెండు కెనడాలో! నిజానికి ఒక దశలో గుప్తా... ‘‘మేము ప్రతి నెలా 2–3 జాబ్ వర్క్‌లు ఇస్తాం’’ అని అన్నట్లు యు.ఎస్. ఆరోపణలలో ఉంది. ఇదెలా వినిపిస్తోంది? ఒకే ఒకసారి హత్యలన్నిటికీ లేదా వరుస హత్యల ప్రారంభానికి పథక రచన జరిగిందనే అర్థం ధ్వనించడం లేదా? చివరిగా – యు.ఎస్. ప్రభుత్వ స్పందన. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ఆగస్టు నెలలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎదుట అమెరికా స్పందనను ప్రస్తావనకు తెచ్చారు. ఒక వారం తర్వాత సి.ఐ.ఎ. అధినేత విలియమ్ బర్న్స్ భారత్‌లోని ఆర్.అండ్ ఎ.డబ్లు్య.(రా) అధినేతతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చారు. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబరులో జి–20 సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ నెలాఖరున వాషింగ్టన్లో మళ్లీ సల్లివాన్, యు.ఎస్. విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్... విషయాన్ని జైశంకర్ దృష్టికి తెచ్చారు. చివరిగా అక్టోబర్‌లో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్ మరిన్ని అభియోగ వివరాలతో భారతదేశానికి వచ్చారు. దీనర్థం... వైట్ హౌస్ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందనే కదా! వాస్తవానికి దోవల్‌తో సల్లివాన్ ‘‘ఇలాంటిది మరోసారి జరగదన్న హామీని అమెరికా ప్రభుత్వం కోరుతోంది’’ అని అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. కఠినమైన భాష కాదా ఇది? యు.ఎస్. అభియోగ పత్రం మొత్తం అంతా కల్పితం అని విశ్వసించినప్పుడు మాత్రమే మనం ఈ ప్రశ్నలన్నిటినీ విస్మరించగలం. కానీ మీరు ఈ ప్రశ్నలను పూర్తి పరిగణనలోకి తీసుకుంటే కనుక మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒకవేళ, చివరికి వాషింగ్టన్ ఈ వ్యవహారాన్నంతా చూసీ చూడనట్లు ఉండిపోయేందుకు నిర్ణయించుకుంటే – భాగస్వామ్య వ్యూహాత్మక ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి – భారత్ నుంచి ఒక ‘మాంస ఖండాన్ని’(పౌండ్ ఆఫ్ ఫ్లెష్) ప్రతి ఫలంగా కోరుతోందా? అమెరికన్ షైలాక్ దయతో నేనొక భారతీయ ఆంటోనియోగా ఉండటాన్ని ద్వేషిస్తాను. లేదా మనల్ని కాపాడేందుకు పోర్షియా వంటి కారుణ్యమూర్తి ఎవరైనా రెక్కలు కట్టుకుని ముందుకొస్తుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
US-India Relations: బలమైన రక్షణ బంధం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీటిలో పాలుపంచుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్‌కోట్ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరాల్సిందేనని ప్రకటన స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్ సహా ఉగ్ర సంస్థలన్నింటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచి్చనట్టు వివరించింది. ఫలప్రదం: జై శంకర్ అమెరికా మంత్రులతో చర్చ లు ఫలప్రదంగా సాగాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చించుకున్నామని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతకముందు చర్చల ప్రారంభ కార్యక్రమంలో ఎస్.జైశంకర్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ చర్చలు ఒక అద్భుత అవకాశమని అభివరి్ణంచారు. భారత్–అమెరికా మరింత సన్నిహితం కావడంతోపాటు ఉమ్మడి నిర్మాణాత్మక గ్లోబల్ అజెండాను రూపొందించుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యమని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత, వృద్ధిశీల, భద్రతాయుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు బ్లింకెన్ తెలిపారు. అంతేగాక అంతర్జాతీయ శాంతి, భద్రత తదితరాల సాధనకు కూడా ఇరు దేశాలూ కలసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. భారత్–అమెరికా సంబంధాలకు రక్షణ ఒప్పందాలు మూలస్తంభంగా నిలుస్తున్నాయని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. చైనా దూకుడుకు సంయుక్తంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సంయుక్తంగా సాయుధ సైనిక వాహనాల తయారీ: ఆస్టిన్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలకమైన సాయుధ సైనిక వాహనాల సంయుక్త తయారీ విషయంలో తక్షణం ముందుకు వెళ్లాలని భారత్–అమెరికా నిర్ణయించినట్టు లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరు దేశాల సైనిక దళాల మధ్య సమాచార వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక వ్యవస్థల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ (ఎస్ఓఎస్ఏ) ఒప్పందం ఖరారు తుది దశకు చేరిందని మంత్రి చెప్పారు. జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లో తయారు చేసేలా జనరల్ ఎలక్ట్రిక్ ఏరో స్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్నాయన్నారు. అలాగే భారత్‌కు వీలైనంత త్వరగా అత్యాధునిక ఎంక్యూ–9బి డ్రోన్లను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. ఇది 300 కోట్ల డాలర్ల ఒప్పందం. ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే: భారత్ కెనడాలో ఖలిస్తానీ శక్తుల ఆగడాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. మంత్రుల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా మీడియాకు వెల్లడించారు. వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని బ్లింకెన్, లాయిడ్లకు రాజ్‌నాథ్ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో భారత ఆందోళనను అర్థం చేసుకోగలమని వారు చెప్పారన్నారు. ప్రధానితో మంత్రుల భేటీ భారత్–అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రపంచ శాంతికి, ప్రగతికి అతి పెద్ద చోదక శక్తిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మంత్రుల స్థాయి భేటీ అనంతరం అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్ ఇరువురు శుక్రవారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. విదేశంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. సదస్సు జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను వారు మోదీకి వివరించారు. ‘‘ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువలపై భారత్, అమెరికాలకున్న ఉమ్మడి విశ్వాసం తిరుగులేనివి. ఇరు దేశాల మధ్య జరిగిన మంత్రుల స్థాయి చర్చలు ఆశించిన ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ భేటీ అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా శుక్రవారం మోదీకి ఫోన్ చేశారు. పశి్చమాసియా ఉద్రిక్తత తదితరాలపై నేతలు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు తీవ్ర రూపు దాలుస్తుండటం, ఉగ్రవాదం, మతి లేని హింస భారీ జన నష్టానికి దారి తీస్తుండటం దారుణమన్నారు. బ్రెజిల్ జీ20 సారథ్యం సఫలం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. -
Dallas Bathukamma : డాలస్‌లో సందడి చేసిన టీపాడ్ చిన్నబతుకమ్మ
తెలంగాణ సంస్కృతిని అమెరికా గడ్డపై వికసింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్‌లోని ఆండ్రివ్ బ్రోన్ పార్క్ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది. పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్ పూర్వ అధ్యక్షులు రమణ లష్కర్, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్‌గా గాయత్రి గిరి, కో-చైర్‌గా అనుషా వనం, అడ్వయిజర్‌గా ఇంద్రాణి పంచెర్పుల తమ సేవలందించారు. హరిశంకర్‌రెడ్డి రేసు, ప్రశాంత్ నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధురజ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేయడమే కాకుండా అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్ సిస్టమ్ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్‌లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం కల్పించడం వంటి పనులు చూసుకున్నారు. రవాణా వ్యవహారాలను సంతోష్ రేగొండ, భోజన సదుపాయాలను సంతోష్, సోషల్ మీడియా వ్యవహారాలను మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె చూసుకున్నారు. రిసెప్షన్ బాధ్యతలు మాధవి మెంట, దీపికారెడ్డి చూసుకోగా, శశిరెడ్డి, మాధవి ఓంకార్ డెకరేషన్ దగ్గరుండి చేయించారు. అక్టోబర్ 21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు అక్టోబర్ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసిన టీపాడ్.. అక్టోబర్ 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేస్తున్నది. ఈ వేడుకలకు డాలస్‌లోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. విశేష అతిథిగా సంయుక్తామీనన్, రాఫెల్ ప్రైజ్‌గా బీఎండబ్ల్యూ బైక్ సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్ ప్రైజ్‌లను అందజేయనున్నారు. వీటిలో బీఎండబ్ల్యు బైక్, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ జువెల్లరీతో పాటు గిఫ్ట్ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యు బైక్ మరియు రాఫెల్ ప్రైజ్‌లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి అనౌన్స్ చేశారు. వేడుకల వివరాల కోసం టీపాడ్ వెబ్సైట్ టీపాడ్యూఎస్.ఓఆర్జీను బ్రౌజ్ చేయొచ్చు. -
భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై అమెరికా నెమ్మదిగా ఒత్తిడి పెంచుతోంది. ఈ కేసులో కెనడాకు సహకరించాలని ప్రైవేట్‌గా, బహిరంగంగా అభ్యర్థించామని స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయబద్ధంగా నిందితులను కోర్టులో హాజరుపరచాలని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కోరారు. కెనడా ఆరోపణలపై కలత చెందామని పేర్కొన్న ఆయన.. ఆ దేశంతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న US హౌస్ సభ్యుడు జిమ్ కోస్టా కూడా నిజ్జర్ హత్య కేసుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. బాధ్యులైనవారికి కఠిన శిక్షలు పడాలని అన్నారు. ఇందుకు భారత్ సహకరించాలని కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో -
భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం'
న్యూయార్క్: భారత్-కెనడా వివాదంలో అమెరికా తలదూర్చకపోవచ్చని రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ చార్లెస్ మైయర్స్ చెప్పారు. కెనడా వివాదం కారణంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న సంబంధాలకు అమెరికా ఇబ్బంది కలిగించబోదని ఆయన అన్నారు. ఈ వ్వవహారంలో అంటీ అంటనట్లు ఉండవచ్చని అంచనా వేశారు. భారత్- కెనడా వివాదంలో ఇరుదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి ఇరుదేశాలు సహకరించుకోవాలని కోరింది. ఈ అంశంలో భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. కానీ అమెరికా దాని మిత్రపక్షాలు ఈ అంశంలో భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోకుండా ఆగిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న భారతీయ అభ్యర్థి వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ తర్వాత రెండో స్థానానికి చేరారు. మూడో స్థానంలో మరో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్‌ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ ఆ తర్వాత క్రమ క్రమంగా పాయింట్లను పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాధమిక ఓట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతుండగా అప్పటి వరకు రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థాననానికి పడిపోయారు. డోనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ ప్రాధమిక పోలింగ్‌లో ఆధిక్యత లభించినప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం అతని పనితీరు కాస్త వెనకబడి ఉంది. ఇదిలా ఉండగా ఆగస్టులో జరిగిన డిబేట్ తర్వాత రోన్ డిశాంటిస్ ఒక్కో మెట్టు దిగజారుతూ వచ్చారు. మరోపక్క పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి మాజీ కాలిఫోర్నియా గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు మూడు స్థానాలకు చేరుకున్నారు. 13 శతం జీవోపీ మద్దతుదారులతో రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉండగా 12 శాతంతో నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రోన్ డిశాంటిస్ విషయానికి వస్తే జులైలో 26 శాతం మద్దతుతో ట్రంప్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు 6 శాతానికి పడిపోయారు. In a just released CNN-University of New Hampshire poll, DeSantis has dropped 13 points since July's survey. He's now at 10% among likely GOP primary voters, while Vivek Ramaswamy is at 13%, Nikki Haley at 12% and Chris Christie is at 11%. Trump is the first choice at 39%. — Kaitlan Collins (@kaitlancollins) September 20, 2023 ఇది కూడా చదవండి: తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం -
భారత్‌తో బంధాలు బలపడితే చైనాపై ఆధారపడనక్కర్లేదు
లోవా: భారత్‌తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్‌తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్‌తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్‌తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి. పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. -
హద్దులు మీరిన చర్చ.. వేళ్లు చూపుతూ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ కోసం జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ డిబేట్లో ఇద్దరు భారతీయ మూలాలున్న అభ్యర్థుల మధ్య చర్చ స్థాయిని మించి వాడీవేడిగా సాగింది. సంయమనం కోల్పోయి ఒకరిపై మరొకరు మాటల శస్త్రాలతో దాడికి దిగారు. ఆక్రోశంతో అరుస్తూ.. వేళ్లు చూపారు. అధ్యక్ష ఎన్నికలో ప్రాథమిక చర్చ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా రావడం ఇదే ప్రథమం. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరు భారతీయ-అమెరికన్ ఆశావహులు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష స్థానం కోసం పోటీ పడ్డారు. విదేశాంగ విధాన సమస్యలపై జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ డిబేట్లో మాటల శస్త్రాలతో హద్దులు మీరారు. ఉక్రెయన్, రష్యా యుద్ధం అంశంపై చర్చ తారాస్థాయికి చేరింది. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇద్దరు అభ్యర్థులు విభేదించుకున్నారు. ఉక్రెయిన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై రామస్వామికి సరైన అవగాహన లేదని నిక్కి హేలీ ఆరోపించారు. అమెరికా భద్రతకు ఇలాంటి అభ్యర్థులతో ముప్పు అని దుయ్యబట్టారు. అమెరికా శత్రువులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఉక్రెయిన్ను రష్యాకు అప్పగించాలనేదే వారి అభిప్రాయమా..? అంటూ ప్రశ్నించారు. రష్యా , పుతిన్ పట్ల సానుకూల వైఖరి పనికిరాదని అన్నారు. నిక్కీ హేలి మాట్లాడుతుండగా.. తరుచూ కలుగజేసుకున్న రామస్వామి.. చెప్పేదంతా అబద్ధం అని అన్నారు. నిక్కీ హేలికి విదేశీ విధానాలపై సరైన అవగాహన లేదని అన్నారు. అమెరికా విదేశాలకు కేటాయిస్తున్న మిలిటరీ ఫోర్స్‌ను ఏమాత్రం వినియోగించినా.. దక్షిణ ప్రాంతం నుంచి ఎదురైతున్న తిరుగుబాటును అంతం చేయొచ్చని అన్నారు. ఈ క్రమంలో చర్చ వాడీవేడీగా సాగింది. అరుస్తూ వేళ్లు చూపించుకునే స్థాయికి చేరింది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
భారత విద్యార్థులకు అమెరికా ప్రత్యేక కోర్సులు..
న్యూయార్క్: మన దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమెరికా కూడా భారతీయ విద్యార్థులకు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. 2024 సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారిక విభాగం వెల్లడించింది. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. పనిలో అనుభవం తెచ్చుకోవడంతో పాటు స్టుడెంట్ లోన్స్ పూర్తి చేయడానికి వీలవుతుంది. అమెరికాకు చెందిన 20 యూనివర్సిటీలు 15 ఇండియన్ యూనివర్సిటీలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. భారతదేశం 2020లో కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చింది. అందరికీ అందుబాటులో విద్య, భారత సంస్కృతి రక్షణ, గ్లోబర్ ఛాలెంజ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యా విధానాలను రూపొందించారు. ఇదీ చదవండి: Viral: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
NATA : డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్
అటు తమన్ నుండి తమన్నా వరకు, ఇటు దేవిశ్రీ నుండి దిల్ రాజు వరకు, మరెందరో పెద్దలు మరియు ప్రముఖులతో డాలస్ మహానగరం దద్దరిల్లిన వేళావిశేషాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో నాటా ట్రాన్స్పోర్ట్ పాత్ర కీలకమని అసొసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ బృందాన్ని ప్రశంసించింది. ఘనంగా నాటా వేడుకలు భారీ జన పరివారం, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సంగీతం.. ఇలా చెప్పుకుంటూ పోతో నాటా వేడుకల్లో ఎన్నో విశేషాలు. ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగడానికి తెర వెనక ఎందరో అసామాన్యుల కష్టం ఉంది. వారిలో ఒకటి ట్రాన్స్పోర్ట్ బృందం. డాక్టర్ రాజేంద్ర కుమార్ రెడ్డి పోలు చైర్ పర్సన్‌గా ఏర్పాటయిన నాటా రవాణా బృందం తక్కువ వ్యవధిలో అద్బుతమైన సేవలందించింది. నాటా రవాణా బృందంలో కీలకం ప్రణాళికా బృందం. దీన్ని కార్తిక్ రెడ్డి మేడపాటి, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, మరియు ప్రసాద్ రెడ్డి నాగారపు పక్కగా నిర్వహించారు. అందరికి అనుసంధానం వీరే నాలుగు వేల మందికి విమాన టిక్కెట్లు, ఐటినరీలు, ఎయిర్‌పోర్టులకు వచ్చిన అతిధులకు ఆహ్వానం, ఇలా ఎన్నో పనులను ఒక ప్లాన్‌తో ట్రాన్స్పోర్ట్ బృందం నిర్వహించింది. అతిధులను దగ్గరుండి వ్యాన్లలో, కార్లలో తీసుకొని హోటళ్ళకి, కన్వెన్షన్ హాలుకి తరలించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్క బస్సు రోడ్డుపై వెళ్తే మామూలే కానీ 16 పెద్ద పెద్ద బస్సులు, మెర్సిడీస్ స్ప్రింటర్ వ్యాన్లు, సబ్-అర్బన్ కార్లు, లగ్జరీ లిమోసిన్లు ఇలా డాలస్ హైవే రోడ్లపై సందడి చేశాయి. "డాలస్ ఫోర్ట్వర్థ్ ఎయిర్పోర్ట్" వద్ద ఐదు టెర్మినళ్లకి మరియు లవ్-ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక్క టెర్మినల్ కి వెళ్లి అందరిని నాటా కన్వెన్షన్ హాలుకి తీసుకొచ్చారు. పేరుపేరునా ధన్యవాదాలు ఈ మొత్తం యజ్ఞంలో సహకరించిన ప్రతీ సభ్యులకు నాటా ధన్యవాదాలు తెలిపింది. కార్తిక్ రెడ్డి మేడపాటి, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ రెడ్డి మోపూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, వరదరాజులు రెడ్డి కంచం, అనిల్ కుమార్ రెడ్డి కుండా, హరినాథ్ రెడ్డి పొగాకు, ప్రసాద్ రెడ్డి నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ రెడ్డి మిట్ట, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల, పురుషోత్తం రెడ్డి బోరెడ్డి, శ్రీనివాస రెడ్డి ముక్క, శ్రీనివాసుల రెడ్డి కొత్త, ఎల్లారెడ్డి చలమల, మరియు గౌతమ్ రెడ్డి కత్తెరగండ్ల ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బృందానికి ప్రత్యేక సౌకర్యాలతో ఎల్లారెడ్డి చలమల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాటా అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, కన్వీనర్ ఎన్.యమ్.ఎస్ రెడ్డి , మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి , సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్గా నాగి రెడ్డిలకు ట్రాన్స్పోర్ట్ టీం ప్రత్యేక ధన్యవాదములు తెలిపింది. -
G20 ఇంధన పరివర్తనలో కలసి పనిచేస్తాం: కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్
G20 గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్లో మూడవ జీ20 ఆర్థికమంత్రులు,కేంద్రబ్యాంకుల సమావేశం సోమవారం మొదలైంది. గుజరాత్ రాజధానిలో జూలై 14 నుండి 15 వరకు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ (FCBDs) సమావేశం జరుగుతుంది. పీఎం మోదీ అమెరికా పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్యంలో బలాన్ని, చైతన్యాన్ని పెంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక అధిపతులు చేసిన ప్రకటనల ప్రకారం ఇండియా-అమెరికా దేశాలు కొత్త ఇన్వెస్ట్మెంట్ వేదిక ద్వారా ఇంధన పరివర్తన వ్యయాన్ని తగ్గించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించాయి. అభివృద్ధి సహకారం , పునరుత్పాదక ఇంధనం కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికల ద్వారా కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఇదరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తన సొంత ప్రకటనలో, ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన మూలధనాన్ని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి పెట్టుబడి వేదికపై భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. VIDEO | "The state visit of PM Modi to the United States last month and his meeting with the US President have enhanced the strength and dynamism of the partnership (between India and US). The historic visit paved the way for new avenues of collaboration, propelling our… pic.twitter.com/YZLXBLdZrj — Press Trust of India (@PTI_News) July 17, 2023 ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్త అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి, 66 మంది ప్రతినిధులు పాల్గొంటున్నఈ మీట్లో గ్లోబల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మొదటి జీ20 ఎఫ్‌ఎంసీబీజీ కాన్క్లేవ్ ఆధారంగా అనేక కీలక బట్వాడాలకు సంబంధించిన పనికి పరాకాష్టగా నిలుస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సేథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు..
వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై ఖలిస్థాన్ వేర్పాటువాదుల దాడిని అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గత నెల ఖలిస్థాన్ వేర్పాటువాది భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు ఈ హింసాకాండకు తెరతీశారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ పేరిట వేర్పాటువాద సంస్థకు నాయకుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ పై 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. కెనడాలో గురుద్వారా గుమ్మం వద్దే అతడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీంతో అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు అక్కడి భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఖలిస్తానీలు హింసకు ప్రతిగా హింస అంటూ నినదించారు. గడిచిన ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని దౌత్య కార్యాలయంపై దాడులు జరగడం ఇది రెండో సారి. దీంతో అమెరికా ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న దౌత్యాధికారుల భద్రత మాకు చాలా ముఖ్యమని, శాంతికి భంగం కలిగిస్తే ఎవ్వరినీ సహించేది లేదని వైట్ హౌస్ జాతీయ భద్రతా విభాగానికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా మాట్లాడుతూ.. నాకు భారత దౌత్యాధికారి సంధు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడన్నా మానవ హక్కుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆలోచనతోనూ, పరిపక్వతతోనూ నిజాయతీగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారికి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం దారుణం, అప్రజాస్వామికం. అమెరికాలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేఛ్చ ఉంటుంది. అలాగని దాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి, హింసను ప్రేరేపించమని కాదు దానర్ధం. ప్రభుత్వం ఈ హింసాకాండపై విచారణ జరిపించి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’ Khalistan supporters’ try to set on fire Indian consulate in San Francisco; US 'strongly condemns’@siddhantvm and @live_pathikrit share their views@Sriya_Kundu | #Khalistan #SanFrancisco pic.twitter.com/wEtGKyfn35 — News18 (@CNNnews18) July 4, 2023 -
అమెరికాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి..
శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగులు దౌత్య కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత ఐదు నెలల్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. గత మార్చి నెలలోనే ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడి చేశారు. దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగగా అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తమైంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడినవారి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. అమెరికా అధికార ప్రతినిధి ఈ దాడిని ఖండించారు. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm — Diya TV - 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023 మార్చి లోనే.. మార్చి నెలలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపు చేపట్టింది ప్రభుత్వం. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అమృత్‌పాల్ సింగ్‌ను వదిలేయండి అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు నిర్వహించారు. The U.S. strongly condemns the reported vandalism and attempted arson against the Indian Consulate in San Francisco on Saturday. Vandalism or violence against diplomatic facilities or foreign diplomats in the U.S. is a criminal offense. — Matthew Miller (@StateDeptSpox) July 3, 2023 ఇదీ చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్.. -
ఈజిప్టులో మోదీ తొలి అడుగు
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రయాత్మక మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని అటునుంచి అటే ఈజిప్టు పర్యటనకు పయనమయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని అమెరికా బయలుదేరే ముందే ఈజిప్ట్ పర్యటననుద్దేశించి మాకు అత్యంత సన్నిహితమైన దేశం ఈజిప్టు సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. ఈజిప్టులో మొదటిసారి.. భారత్ నుంచి బయలుదేరే ముందే ప్రధాని మాట్లాడుతూ.. మాకు అత్యంత సన్నిహితమైన మిత్ర దేశం ఈజిప్టులో మొట్టమొదటిసారి పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనవరిలో ఈజిప్టు అధ్యక్షుడు సిసికి మా దేశంలో ఆతిధ్యమివ్వడం మా భాగ్యం. భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసిన నెలల వ్యవధిలోనే నేను ఈజిప్టులో పర్యటింస్తుండడం బలపడుతున్న ఈ రెండు దేశాల స్నేహబంధానికి ప్రతీకని ఆయన వర్ణించారు. ఈజిప్టు ప్రెసిడెంట్ భారత దేశానికి వచ్చినప్పుడే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజం పడిందన్నారు. పర్యటనలో.. జూన్ 24 నుంచి ప్రారంభమవనున్న ప్రధాని ఈజిప్టు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు సిసితో రెండు దేశాల మధ్య బహుళ భాగస్వామ్యాల గురించి, ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించనున్నారు. తర్వాత ఆ దేశ ప్రభుత్వ పెద్దలతోనూ, అక్కడి ప్రముఖులతోనూ, ప్రవాస భారత సంఘాలతోనూ సమావేశం కానున్నారు. అనంతరం కైరోలోని హీలియోపోలీస్ కామన్వెల్త్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు-పాలస్తీనా తరపున వీరోచితంగా పోరాడి అసువులుబాసిన సుమారు 4000 మంది భారతీయ సైనికులకు నివాళులర్పిస్తారు. పర్యటనలో భాగంగా చారిత్రాత్మక అల్-హకీమ్ మసీదును కూడా సందర్శించనున్నారు భారత ప్రధాని. #WATCH | After concluding his maiden State Visit to the United States, Prime Minister Narendra Modi departs for Cairo, Egypt. pic.twitter.com/7JoFaoELke — ANI (@ANI) June 24, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడి అపురూప కానుక -
భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడి అపురూప కానుక
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అపురూపమైన బహుమతినిచ్చారు. వైట్ హౌస్ లో జరిగిన ఇరుదేశాల పారిశ్రామికవేత్తల సమావేశంలో ఒక టీషర్టును మోదీకి కానుకగా ఇచ్చారు. దాని మీద AI అంటే అమెరికా ఇండియా భవిష్యత్తు అని మోదీ సరికొత్తగా నిర్వచించిన మాటలను ముద్రించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. AI అంటే అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కానివ్వండి అమెరికా ఇండియా కానివ్వండి. భవిష్యత్తు అంతా AI నే.. అని అన్నారు. అనంతరం ఇరుదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒక టీషర్ట్ మీద మోదీ చెప్పిన ఆ మాటలనే ముద్రించి కానుకగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు కానుక ఇచ్చిన ఆ ఫోటోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఐక్యంగా పని చేస్తే ఈ భూమి కంటే గొప్ప ప్రదేశం మరొకటి ఉండదని, అమెరికా భారత్ రెండు AI మాదిరిగానే శక్తివంతంగా తయారవుతున్నాయని రాశారు. ఈ సమావేశంలో అమెరికా పారిశ్రామికవేత్తలు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచ్చై, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒపెన్ AI సీఈవో సామ్ ఆల్ట్ మాన్,ఏఎండి సీఈవో లిసా సు, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ లతో పటు భారత పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, వృందా కపూర్ లు కూడా పాల్గొన్నారు. AI is the future, be it Artificial Intelligence or America-India! Our nations are stronger together, our planet is better when we work in collaboration. pic.twitter.com/wTEPJ5mcbo — Narendra Modi (@narendramodi) June 23, 2023 ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర -
దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం !
వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. భారత్‌లోనే ఫైటర్‌జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. ‘భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. ఒప్పందాలు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్‌లోని షిప్‌యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు. 2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది. 3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ ‘మైక్రాన్’ గుజరాత్లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంజన్ అసమానం ‘ఎఫ్414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్దం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది’ అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది. ఎఫ్414–ఐఎన్ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన యుద్దవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే. -
H1B వీసా పునరుద్ధరణపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా పొరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ H -1B వీసాల విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతోంది అమెరికా విదేశాంగ శాఖ. ఇకపై అమెరికా రావాల్సిన అవసరం లేకుండానే వీసా పునరుద్ధరణ చేసుకోవచ్చని ప్రస్తుతం సన్నాహకంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అతి త్వరలోనే పూర్తిస్థాయిలో కూడా అమలవుతుందని తెలిపింది. భారత ప్రధాని అమెరికా పర్యటన మొదలైన ఒక్క రోజులోనే అమెరికా ప్రభుత్వం H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ఇమిగ్రేషన్ శాఖ. భారత దేశంలోని నైపుణ్యమున్న యువత అమెరికాలో ఉపాధి పొందడానికి మరిన్ని అవకాశాలు కల్పించమన్న భారత ప్రధాని అభ్యర్ధన మేరకు అమెరికా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. అందులో భాగంగా మొదట వీసాల పునరుద్ధరణ విషయంలో యువతకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశ్యంతో అమెరికా రావాల్సిన అవసరం లేకుండా ఇంటినుంచే H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. US | The Biden administration will make it easier for Indians to live and work in the US, using this week's state visit by Prime Minister Narendra Modi to help some skilled workers enter or remain in the country, according to three people familiar with the matter: Reuters— ANI (@ANI) June 22, 2023 2022 ఆర్ధిక సంవత్సరంలో విదేశాల నుండి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న 4,42,000 మందిలో భారతీయులే 73% ఉన్నందున అమెరికా ఇమిగ్రేషన్ శాఖ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు, మొదట స్వల్ప సంఖ్యలో లబ్దిదారులకు సన్నాహకంగా మొదలుపెట్టి తర్వాత విస్తృతం చేసే ప్రయత్నం చేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తామని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని -
ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లో మాట్లాడుతూ ఈ దశాబ్దాన్ని సాంకేతిక దశాబ్దంగా మార్చాలన్న లక్ష్యంతోనే భారత దేశంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి "స్టార్టప్ ఇండియా" మిషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మూడురోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న భారత నరేంద్ర మోదీ రెండో రోజు న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ తో కలిసి వర్జీనియాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ను సందర్శించారు. ఇక్కడ అవకాశాలున్నాయి.. అక్కడ యువత ఉన్నారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క అమెరికాలో అధునాతన సాంకేతికతతో కూడిన ప్రపంచస్థాయి విద్యా సంస్థలున్నాయి. మరోపక్క భారతదేశంలో భారీసంఖ్యలో నైపుణ్యమున్న యువత ఉంది. స్కిల్ ఇండియా కాంపెయిన్ పేరిట సుమారు ఐదు కోట్ల మందికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డ్రోన్ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించినట్టు తెలిపారు. భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచ వృద్ధికి ఇంజిన్ లా వ్యవహరిస్తుందని, అమెరికాకు భారత దేశానికి ఒక పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. యువత పైన పెట్టుబడి పెట్టాలి అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడుతూ.. భారత్ అమెరికా కలయిక ప్రపంచంలోనే అతి పాతవైన, పెద్దవైన ప్రజాస్వామ్యాల కలయికగా అభివర్ణించారు. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రమే కాదు కుటుంబాలు కూడా స్నేహతత్వంతో మెలుగుతున్నాయని, మా ఐక్యత ప్రాపంచిక సవాళ్ళను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రెండు దేశాలు ఆర్ధికంగా వృద్ధి చెందాలంటే యువత పైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరముందని, వారికి తగినన్ని అవకాశాలు కల్పించాలని అన్నారు. ఇది కూడా చదవండి: భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు -
అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
మోదీ అమెరికా పర్యటన వేళ.. రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై సర్వత్రా చర్చ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ పెదవి విప్పారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. 'ఇండియాను తటస్థం అంటారు.. కానీ మా స్థితి అది కాదు.. మేము శాంతి పక్షాన నిలబడతామని' ప్రధాని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి సరిగాలేదనే వాదనలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ప్రతీ దేశం గౌరవించాలని సూచించారు. ప్రతీ దేశ సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత్ తగిన ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. అయితే.. ఇటీవలి కాలంలో అమెరికాతో భారత్ బంధం మరింత బలోపేతమైంది. 2022 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డ్ స్థాయిలో 191 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియాకు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. అటు.. రష్యాతోనూ భారత్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. ఇండియా రక్షణ దిగుమతుల్లో 50 శాతం రష్యా నుంచి వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు బయల్దేరారు. మూడురోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. సతీసమేతంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతం ప్రధానాంశంగా అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇదీ చదవండి: PM Modi US Visit: అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. బిజీ బిజీ షెడ్యూల్ ఇలా -
'రాహుల్ బాబా ఇది తెలుసుకో..' రాహుల్‌పై అమిత్ షా ఫైర్..
గుజరాత్: స్వదేశాన్ని విదేశాల్లో విమర్శించడం ఏ పార్టీ నాయకుడికైనా తగనిపని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్‌ను కించపరచడానికే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 'దేశంపై భక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా దేశ రాజకీయాలను దేశంలోపలే మాట్లాడుతారు. విదేశాలకు వెళ్లి దేశ రాజకీయాల గురించి ఏ పార్టీ నాయకుడు మాట్లాడరు.దేశాన్ని విదేశాల్లో విమర్శించడం సరైన పని కాదు.ప్రజలు దీన్ని గమనిస్తున్నారు' అని ప్రధాని మోదీ పాలన 9 ఏళ్లు గడిచిన సందర్భంగా గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. దేశ వ్యతిరేక చర్యల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా ఉండలేదు. ఎండాకాలం వేడి నుంచి తప్పించుకోవడానికి రాహుల్ విదేశాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి:దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత.. రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు -
మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మోదీ పర్యటన భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒరవడిని నిర్దేశిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా రక్షణ సహకారం, భారత్‌లో స్వదేశీ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతి విషయంలో భారీ, చరిత్రాత్మక, ఉత్తేజభరిత ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటన ప్రారంభిస్తారు. నాలుగు రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఈ నెల 22న ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. మోదీ రాకవల్ల భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి (ఇండో–పసిఫిక్ భద్రతా వ్యవహారాలు) ఎలీ రట్నార్ చెప్పారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక సందర్భం అవుతుందన్నారు. -
యూఎస్ వీసా: అన్నంత పని చేసిన అమెరికా, ఈ వీడియోతో దిల్ ఖుష్!
న్యూఢిల్లీ: భారతీయులకు వీసాను మరింత దగ్గరిచేసే క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా జారీ కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించే చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముంబైలో వీసా కార్యకలాపాల సహాయం నిమిత్తం అమెరికా తాత్కాలిక వీసా అధికారులను నియమించింది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాన్సులర్ అధికారులు పనిచేస్తున్నారని, దీన్ని ఉపయోగించుకోవాలని యుఎస్ కాన్సులేట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక అధికారులు తమ సాధారణ విధులను విడిచి పెట్టి మరీ ఈ విధుల్లో చేరారని ముంబైలోని యూఎస్ కాన్సులేట్ ఒక ట్వీట్లో తెలిపింది.(StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్!) వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు వీరంతా ఒక్కటయ్యారు అని ట్వీట్ చేసిది. దీనికి సంబంధించి ముంబైలో వీసా కాన్సులర్ ఆఫీసులో ఉన్న టాప్ అధికారుల బృందంతో ఒక వీడియోను షేర్ చేసింది. వాషింగ్టన్ డీసీ, జపాన్‌లోని ఒకినావా , హాంకాంగ్ నుంచి ఎంపిక చేసిన నలుగురు అధికారులను ఈ వీడియోలో చూడొచ్చు. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గించి, అమెరికా ప్రయాణాన్ని సులభం చేయడం, భారతదేశం-యుఎస్ వ్యాపార అవకాశాలను పెంపు, కుటుంబ పునరేకీకరణ లాంటి సమస్యల పరిష్కారానికి మద్దతు వంటి బాధ్యతలను ఈ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని గతంలో యూఎస్ సర్కార్ ప్రకటించింది. అలాగే అమెరికాలో చదువు కోవాలనుకునే విద్యార్థులకు ఏడాది ముందుగానే వీసాకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలిపింది. All hands on deck to reduce visa wait times! Our incredible team of consular officers have temporarily left their regular duties around the world, from @StateDept in D.C. to the @USConsulateNaha, to help out with visa operations in Mumbai. Together, we are #HereToServe. pic.twitter.com/T2MpNp8Mb5 — U.S. Consulate Mumbai (@USAndMumbai) February 28, 2023 -
మరింత తొందరగా అమెరికన్ వీసా.. భారతీయులకు అధిక ప్రాధాన్యత!
వీసాల జారీలో భారతీయులకు అమెరికా ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. కోవిడ్‌కు ముందు కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 36 శాతం అధికంగా భారతీయులకు వీసాలు జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. కోవిడ్ తర్వాత భారతీయులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో వారికి వీసాల కోసం వేచిచూసే సమయం చాలా తగ్గిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా మొదటిసారి వచ్చే వారికి వీసా కోసం వేచిచూసే సమయం 1000 రోజుల నుంచి 580 రోజులకు తగ్గిపోయింది. తరచూ వచ్చే వారికి ఇంటర్వ్యూ ప్రక్రియను మినిహాయించడం, కాన్సులర్ విధుల్లో అదనపు సిబ్బందిని నియమించడం, సూపర్ సాటర్డే వంటి చర్యలు ఇందుకు మేలు చేశాయి. అంతేకాకుండా వచ్చే వేసవి నుంచి కొన్ని కేటగిరీల్లో స్టేట్‌సైడ్ వీసాల రెన్యూవల్‌ను పైలట్ విధానంలో అమలు చేయనున్నట్లు అమెరికా పేర్కొంది. వీసాల జారీలో భారత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమెరికా కాన్సులర్ ఆపరేషన్స్ విభాగం సీనియర్ అధికారి జూలీ స్టఫ్ తెలిపారు. వీసాల జారీలో జాప్యంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిస్థితిని మార్చడానికి తాము పట్టుదలతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన పలు చర్యలతో కోవిడ్‌కు ముందు కంటే ఇప్పుడు 36 శాతం ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు చెప్పారు. ఇది ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ కాలంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా తమ కాన్సులర్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడంతో వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో భారత్‌లో అధిక సంఖ్యలో వీసా దరఖాస్తులు పేరుకుపోయాయి. టూరిస్టులకు ఇచ్చే బీ1, బీ2 వీసాలతో పాటు హెచ్1బీ, ఎల్ వర్క్ వీసాలు నిలిచిపోయాయి. గత సెప్టెంబర్‌లో జరిగిన ద్వైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. వీసాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. (ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్, మెసేజ్‌లు!) -
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
Green Card: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు మేలు చేకూర్చే ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈగిల్) యాక్ట్–2022ను అమెరికా అధ్యక్ష భవనం ఓకే చెప్పింది. బిల్లుపై ఈ వారంలోనే అక్కడి పార్లమెంట్ దిగువ సభలో ఓటింగ్ చేపట్టనున్నారు. ఇన్నాళ్లూ ప్రతి సంవత్సరంలో జారీచేసే గ్రీన్‌కార్డుల్లో ఒక్కో దేశానికి సంబంధించిన నిర్దిష్ట సంఖ్యలోనే కార్డులు ఇస్తారు. ఎవరికైనా అధిక వృత్తి నైపుణ్యాలు ఉన్నాసరే.. అప్పటికే ఆ దేశ కోటా పూర్తయితే వారికి గ్రీన్ కార్డు అమెరికా ఇవ్వలేకపోతోంది. ఈ పరిమితిని ఎత్తేస్తోంది. అంటే ఏ దేశంలో పుట్టాడనే అంశంతో సంబంధంలేకుండా అత్యున్నత వృత్తి నైపుణ్యం గల వ్యక్తులను ఒకే దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో తీసుకునేందుకు ఈగల్ చట్టం అవకాశం కల్పిస్తుంది. చదవండి: (ఎలన్ మస్క్‌కు చుక్కలు చూపిస్తున్నారు!) -
ఇకపై నెలకు లక్ష వీసాలు జారీ
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు ఇక బాగా తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. 2023 ఏడాది వేసవి నాటికి వీసా దరఖాస్తులు 12 లక్షలకు చేరుకుంటాయన్న అంచనాలున్నాయని తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, వీసాల జారీ తాత్కాలికంగా నిలిపివేత వంటి కారణాలతో భారతీయులు వీసాల కోసం ఏడాదికి పైగా ఎదుచు చూడాల్సిన పరిస్థితి ఉంది. ‘వీసాల మంజూరులో భారత్‌కు మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఏడాది నాటికి కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయి. నెలకి లక్ష వీసాలు మంజూరు చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. వీసాల త్వరితగతి మంజూరు కోసం సిబ్బందిని పెంచడం, డ్రాప్ బాక్స్ సదుపాయం కల్పన వంటి చర్యల్ని తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు గతంలో కొన్ని కేటగిరీల వీసా కోసం 450 రోజులు ఎదరుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడది తొమ్మిది నెలలకి తగ్గిందని వివరించారు. -
భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలను సరికొత్త పదంతో నిర్వచించారు అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్చే దోస్త్'(అన్నింటికంటే మంచి మిత్రదేశాలు) అని అన్నారు. ఈ ఇంటర్వ్యూ ఇంకా ప్రసారం కాకపోయినా ఇందుకు సంబంధించిన క్లిప్ లీక్ అయి వైరల్ అవుతోంది. అయితే ట్రంప్ భారత్‌తో సంబంధాలపై ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ బరిలోకి దిగుతారని, అందుకే భారతీయుల పట్ల అత్యంత సానుకూలంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, ట్రంప్‌కు మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. 2019లో మోదీ రెండోసారి భారత ప్రధానిగా ఎన్నికైన అనంతరం ఇద్దరూ కలిసి అమెరికా హ్యూస్టన్‌లో 'హౌదీ మోదీ' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భారత సంతతి వ్యక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ 'ఆప్కీ బార్ ట్రంప్ సర్కార్' అని ట్రంప్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 2020లో కరోనా సంక్షోభానికి ముందు ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు. గజరాత్‌లో ఇద్దరు నిర్వహించిన రోడ్ షోకు దాదాపు లక్ష మంది జనం తరలివచ్చారు. అనంతరం ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా? -
చైనాకు చెక్ పెట్టడంలో ‘భారత్’ కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్ మైక్ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్‌పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ సెమినార్లో ఈ మేరకు అమెరికా-భారత్ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్ అడ్మిరల్ మైక్ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్‌లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు.. భారత్-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్నాయి. ఇదీ చదవండి: తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు -
భారత్‌కు నమ్మదగ్గ.. నేస్తం మేమే: అమెరికా
వాషింగ్టన్: చైనా విసురుతున్న ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్, ఆస్ట్రేలియాలతో అమెరికా బంధం మరింత బలపడాలని ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు, హౌస్ ఆరమ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఆడమ్ స్మిత్ అన్నారు. ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, భారత్‌కు అత్యంత విశ్వసనీయమైన నేస్తం రష్యా కాదని, అమెరికానే అని ఆ దేశ విదేశాంగ శాఖ కౌన్సెలర్ డెరెక్ చాలెట్ అభిప్రా యపడ్డారు. భారత్ రక్షణ అవసరాలన్నింటినీ అమెరికా తీరుస్తుందని చెప్పారు. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేయడానికి అమెరికా ఎంతో ఉత్సాహంగా ఉందని వెల్లడించారు. చదవండి: (Russia-Ukraine war: మారియుపోల్‌లో మారణహోమం?) -
టాటా పవర్ రీన్యూలో బ్లాక్‌రాక్ రూ.4,000 కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలో యూఎస్ కంపెనీ బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం టాటా పవర్ తాజాగా వెల్లడించింది. తద్వారా టాటా పవర్ రెనవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో 10.53% వాటాను బ్లాక్‌రాక్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. అబుదాబి కేంద్రంగా గల ముబడాలా ఇన్వెస్ట్మెంట్ కంపె నీ సైతం కన్సార్షియంలో భాగం కానున్నట్లు పేర్కొంది. ఇందుకు మూడు సంస్థల మధ్య తప్పనిసరి ఒప్పందం కుదిరినట్లు టాటా పవర్ వివరించింది. ముబడాలాతో కలసి బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్.. ఈక్విటీ, తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే సెక్యూరిటీల ద్వారా 52.5 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో టాటా పవర్ రెనెవబుల్స్లో 10.53% వాటాను పొందనున్నట్లు వెల్లడించింది. దేశీ పునరుత్పాదక ఇంధన అగ్రగణ్య కం పెనీలలో టాటా పవర్ రెనవబుల్ ఎనర్జీ ఒకటికాగా.. 4.9 గిగావాట్ల ఇంధన ఆస్తులను కలిగి ఉంది. -
Sakshi Cartoon: ఇప్పుడు ఉక్రెయిన్ను మీరు ఆదుకున్నారా?
ఇప్పుడు ఉక్రెయిన్ను మీరు ఆదుకున్నారా అని ఎదురు ప్రశ్న వేస్తున్నార్సార్! -
భారత్, అమెరికా భాగస్వామ్యం ఉజ్వలం
సాక్షి, విశాఖపట్నం: నెట్వర్క్, సాంకేతిక భాగస్వామ్యం బలోపేతం అవుతుండటంతో భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు భవిష్యత్‌లో మరింత ఉజ్వలంగా మారతాయని యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జె పపారో వ్యాఖ్యానించారు. మిలాన్–2022 విన్యాసాల్లో భాగంగా విశాఖలో నిర్వహించిన మారిటైమ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్, అమెరికా దళాలు నెట్వర్క్, సాంకేతికతలను ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర సహకారాలు మెరుగు పర్చుకుంటున్నాయన్నారు. ఎంహెచ్–60 రోమియో చాపర్స్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతిక హెలికాప్టర్ల విషయంలోనూ బంధం బలోపేతమైందని తెలిపారు. మిలాన్‌లో పాల్గొనడం వల్ల అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ మొదలైన క్వాడ్ దేశాల మధ్య మారిటైమ్ సహకారం మరింత దృఢంగా మారనుందన్నారు. ఈ కూటమిలో పొత్తులు ఒకదానికొకటి బాధ్యతలను కలిగి ఉంటాయనీ, క్వాడ్ దేశాలు పరస్పరం సహాయం చేసుకునేందుకు దేశాల భాగస్వామ్య విలువలు, కట్టుబాట్లను గమనిస్తున్నట్లు తెలిపారు. మిలాన్‌లో వియత్నాం పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. సముద్ర జలాల విషయంలో వియత్నాం తరచూ దురాక్రమణలకు గురవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మిలన్లో పాల్గొనడం ద్వారా ఒక కూటమిని ఏర్పరుచుకోవడంతో పాటు కొన్ని పెద్ద దేశాల నుంచి ఎదుర్కొంటున్న బెదిరింపులను చిన్న దేశాలు సమర్థంగా తిప్పికొట్టేందుకు సహకారాలు పొందుతాయన్నారు. -
అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
-
మళ్లీ వీదేశాల టూర్ లో ప్రధాని
-
వాణిజ్య ఒప్పందాలపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అమెరికాతో కలసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతానికి నూతన వాణిజ్య ఒప్పందాల కోసం తాము చూడడం లేదని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో.. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎగుమతిదారుల సమావేశంలో భాగంగా మంత్రి స్పందించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునేందుకు గాను మరిన్ని మార్కెట్ అవకాశాల కల్పన కోసం కలసి పనిచేయాలనుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘నూతన వాణిజ్య ఒప్పందాల కోసం చూడడం లేదని అమెరికా చెప్పింది. కానీ మరిన్ని మార్కెట్ అవకాశాల కల్పనకు (ఒకరి మార్కెట్లోకి మరొకరికి అవకాశాలు కల్పించడం) వారితో కలసి పనిచేయాలని కోరుకుంటున్నాం. అది పెద్ద ఉపశమనమే కాదు.. భారత ఎగుమతి రంగానికి పెద్ద అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది’’ అని గోయల్ చెప్పారు. భారత్‌తో సానుకూల ఒప్పందాన్ని ముందుగానే కుదుర్చుకునేందుకు ఆస్ట్రేలియా ఎంతో ఆసక్తి వ్యక్తీకరించినట్టు మంత్రి తెలిపారు. ఏ విభాగాల పట్ల ఆసక్తిగా ఉన్నదీ ఎగుమతిదారులు వాణిజ్య శాఖతో పంచుకోవాలని సూచించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలతో ముందస్తు సామరస్య ఒప్పందాల మద్దతుతో ఇతర దేశాలతోనూ భారత్ ఇదే మాదిరి కలసి పనిచేసే సానుకూలత ఏర్పడుతుందన్నారు. ఇతర దేశాలతోనూ ఒప్పందాలు.. బ్రిటన్‌తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల బృందాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు మంత్రి వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌తో సమగ్ర వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలయ్యాయని.. ఒప్పందానికి చాలా సమయమే పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కానీయబోమని ఎగుమతిదారులకు అభయమిచ్చారు. అందరి సంప్రదింపుల మీదట మెరుగైన ఒప్పందాలను చేసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్‌తోనూ ఒప్పందానికి చర్చలు మొదలుపెట్టినట్టు తెలిపారు. భారీ అవకాశాలున్న దేశాల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. దేశం నుంచి ఎగుమతులు వేగాన్ని అందుకున్నాయని.. ఆగస్ట్‌లో మొదటి రెండు వారాల్లో 55 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. -
రహమాన్ పాటను పాడిన యూఎస్ నేవీ...!
వాషింగ్టన్: ఇటీవల భారత్ అమెరికా మధ్య జరిగిన ఇండో-పసిఫిక్ చర్చల్లో భాగంగా జరిగిన విందులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికా నేవీ బృందం శనివారం జరిగిన విందులో భారత రాయబారిని ఆశ్యర్యానికి గురిచేశారు. ఎఆర్ రహమాన్ బాణీలను అందించిన ‘స్వదేశ్’ హిందీ చిత్రంలోని ‘యే జో దేశ్ హే తెరా’ పాటను అమెరికా నేవీ బృందం పాడారు. ఇరు దేశాల మైత్రి బంధం ఎప్పటికి విడిపోదని ఈ పాటతో తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (సిఎన్ఓ) మైఖేల్ ఎం గిల్డేతో పాటు , భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు పాల్గొన్నారు. నేవీ బృందం పాడిన వీడియోను భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ట్వీటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. యూఎస్ నేవీ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ అధికారి మైఖేల్ గిల్డ్ ట్వీటర్లో.. భారత రాయబారిని కలిసినందుకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమెరికా-భారత్ నేవీల మైత్రి, సహాయ సహకారాలు ఎల్లప్పుడు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ఆపరేషన్స్‌లో ఇరుదేశాలు బహిరంగ , సమగ్రనియమాలకు కట్టుబడి ఉన్నాయని గిల్డ్ ట్వీ టర్లో తెలిపారు .హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో అమెరికా, భారతదేశం మధ్య సహకారం మరింత మెరుగుపడింది. ఇటీవలే భారత్, అమెరికా, జపాన్ ,ఆస్ట్రేలియాతో నాలుగు దేశాల మధ్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే . హిందూ మహాసముద్రంలో చైనా మితిమీరిన పనులకు సమాధానమే ఈ సమావేశం. అంతేకాకుండా చైనా నుంచి ముప్పును ఎదుర్కొంటున్న తైవాన్‌కు , అమెరికా విస్తృతమైన మద్దతును తెలిపింది. నిరంతరం చైనా విమానాలు తైవాన్ ప్రాదేశిక సరిహద్దులను ఉల్లంఘిస్తోంది. Great to meet with India’s Ambassador to the United States @SandhuTaranjitS today! Together, we will promote a free, open & inclusive rules-based order in the Indo-Pacific and beyond. I look forward to our two navies’ continued cooperation. @IndianEmbassyUS 🇮🇳🇺🇸 pic.twitter.com/UJ8aopHjl0 — USNavyCNO (@USNavyCNO) March 27, 2021 'ये वो बंधन है जो कभी टूट नहीं सकता! This is a friendship bond that cannot be broken ever.' 🇮🇳🇺🇸 US Navy singing a popular Hindi tune @USNavyCNO 's dinner last night! pic.twitter.com/hfzXsg0cAr — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) March 27, 2021 చదవండి: First City on Mars: అంగారక నగరం.. నువా! -
హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్
వాషింగ్టన్: దేశీ టెక్ నిపుణులు, ఐటీ కంపెనీలకు షాక్‌నిస్తూ హెచ్1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీసాల జారీకి మార్చి నెలాఖరువరకూ వీలుకాదని సంబంధితవర్గాలు తెలియజేశాయి. సుమారు 8 నెలలుగా హెచ్1 బీ, తదితర వర్క్ వీసాలపై ఆంక్షలను విధించిన ట్రంప్ తాజాగా మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగల కారణాలపై ట్రంప్ యథాప్రకారం పాత పల్లవినే ఎత్తుకున్నారు. కోవిడ్-19 వల్ల ఉపాధి మార్కెట్‌తోపాటు.. అమెరికా ప్రజల ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. కరోనా వైరస్ అమెరికన్ల జీవితాలకు విఘాతం కలిగిస్తున్నట్లు చెప్పారు. నవంబర్‌లో నిరుద్యోగిత 6.7 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్‌లో నమోదైన గరిష్టంతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఇప్పటికీ పలువురు ఉపాధి కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఉపాధి మార్కెట్, ప్రజా ఆరోగ్యాల విషయంలో పరిస్థితులు మెరుగుపడలేదని వివరించారు. చదవండి: (10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు) ఏప్రిల్ నుంచీ హెచ్1 బీ, తదితర వీసాల జారీపై ట్రంప్ 2019 ఏప్రిల్ 22న తొలిసారి నిలుపుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై జూన్ 22న 6 నెలలపాటు నిషేధాన్ని పొడిగించారు. దీంతో డిసెంబర్ 31కల్లా గడువు ముగియనుండటంతో తాజాగా మరో మూడు నెలలు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మార్చి 31వరకూ నిషేధం అమలుకానుంది. ఫలితంగా భారీ సంఖ్యలో భారత ఐటీ నిపుణులు, పలు అమెరికన్, దేశీ సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. 2021 ఏడాదికిగాను జారీ అయిన హెచ్1బీ వీసాలకు స్టాంపింగ్‌కు మార్చి నెలాఖరు వరకూ వేచిచూడవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్‌లో పనిచేసేందుకు వీలుగా సాఫ్ట్వేర్ సేవల కంపెనీలు హెచ్1బీ వీసాల ద్వారా ఐటీ నిపుణులను ఎంపిక చేసుకునే సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జారీ అయ్యే హెచ్1బీ వీసాలను భారతీయులే అత్యధికంగా పొందుతుంటారు. కాగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇప్పటికే గడువు తీరిన హెచ్1బీ వీసాల రెన్యువల్ సైతం పెండింగ్‌లో పడనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు) -
3 నిముషాలకు టిక్‌టాక్ వీడియోలు!
న్యూఢిల్లీ: నిముషంలోపు వీడియోలతో ప్రపంచ ప్రసిద్ధమైన టిక్‌టాక్ ప్రస్తుతం 3 నిముషాల నిడివిగల వీడియోలపై పరిశీలనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 10 నిముషాలలోపు వీడియోలకు వీలు కల్పిస్తున్న యూట్యూబ్ బాటలో నడవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. షార్ట్ వీడియో మేకింగ్ ప్లాట్‌ఫామ్.. టిక్‌టాక్ తాజా పరిశీలనలపై సోషల్ మీడియా కన్సల్టెంట్ మ్యాట్ నవరా వెల్లడించింది. 3 నిముషాల వీడియోల ఫీచర్ ప్రాథమిక దశలో ఉన్నట్లు స్క్రీన్ షాట్‌తో ట్విటర్ ద్వారా మ్యాట్ తొలిసారి తెలియజేసింది. ప్రస్తుతం టిక్‌టాక్ నిముషం వ్యవధిగల వీడియోలను అప్లోడ్ చేసేందుకే వీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మినియేచర్ 10 నిముషాల నిడివి వరకూ వీడియోలకు వీలున్న యూట్యూబ్‌కు మినియేచర్ ఫీచర్‌గా టిక్‌టాక్ తాజా ప్రణాళికలు ఉన్నట్లు టెక్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రత్యర్ధి సంస్థ ఇన్స్టాగ్రామ్ రీల్స్ సైతం వీడియోల అప్లోడ్ సమయాన్ని 15 సెకన్ల నుంచి 30 సెకన్లకు పెంచింది. ఇక యూట్యూబ్ షార్ట్స్ ద్వారా యూజర్లు 15 సెకన్లలోపు వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేందుకు వీలుంటుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (టిక్‌టాక్ విక్రయానికి గడువు పెంపు) నిషేధం భద్రతా ప్రమాణాల రీత్యా టిక్‌టాక్ యాప్ వినియోగాన్ని ఇటీవల భారత్, యూఎస్ ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే టిక్‌టాక్ యూఎస్ యూనిట్‌ను విక్రయించేందుకు చైనీస్ ప్రమోటర్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 4 వరకూ గడువిచ్చిన విషయం విదితమే. కాగా.. యూఎస్ యూనిట్ నిర్వహణకు యూఎస్ దిగ్గజాలతో బైట్‌డ్యాన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా టిక్‌టాక్ యూఎస్ బిజినెస్ విక్రయంపై ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను పంపింది. దీనిలో భాగంగా యూఎస్ దిగ్గజాలు ఒరాకిల్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో టిక్‌టాక్‌ను కొత్త సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. అంతేకాకుండా టిక్‌టాక్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు కొనసాగుతారని తెలియజేసింది. అయితే టిక్‌టాక్ యూఎస్ వినియోగదారుల డేటా, కంటెంట్ ఆధునీకరించడం తదితర కార్యకలాపాలను యూఎస్ కంపెనీలు చేపడతాయని పేర్కొంది. -
యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను
ముంబై, సాక్షి: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా.. యూఎస్‌కు నాన్‌స్టాప్ సర్వీసులను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రసిద్ధ టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ) త్వరలో యూఎస్‌కు డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ నేపథ్యంలో నాన్‌స్టాప్ సర్వీసులకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎప్పటిలోగా సర్వీసులను ప్రారంభించాలన్న అంశాన్ని నిర్ణయించుకోలేదని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినోద్ కన్నన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 20-30 శాతం వరకూ నాన్‌స్టాప్ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వినోద్ తెలియజేశారు. ఇందుకు విమానాలకున్న ఆవశ్యకత, తదితరాలపై కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2023కల్లా కంపెనీకున్న మొత్తం సీట్ల సామర్థ్యంలో 20-30 శాతం వరకూ అంతర్జాతీయ రూట్లకు కేటాయించాలని విస్తారా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇందుకు 10 శాతాన్నే వినియోగించింది. ఇదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) చివరికల్లా విమానాల సంఖ్యను 70కు పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం విస్తారా 48 విమానాలతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేశాయి. -
ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికవడాన్ని భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడగలదని ఆకాంక్షించాయి. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల బంధాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటి ఉమ్మడి ఎజెండా అమలుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ తెలిపారు. ‘బైడెన్–కమలా సారథ్యంలో భారత్–అమెరికా ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడగలవు. అధునాతన శాస్త్రీయ పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, వ్యూహాత్మక రంగాల్లో వ్యాపార వర్గాల మధ్య సహకారం పెరగగలదు‘ అని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య పటిష్టమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని .. ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ చెప్పారు. నాయకత్వం అంటే విధానాలతో పాటు వ్యక్తిత్వం కూడా అన్న పాఠాన్ని అమెరికా ఎన్నికలు తెలియజేశాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2019లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 150 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పరస్పర ఆర్థిక సహకారంతో దీన్ని 500 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. స్వాగతించిన ఐటీ పరిశ్రమ..: జో బైడెన్ ఎన్నికపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హర్షం వ్యక్తం చేసింది. ‘స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి చర్యల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భార త టెక్నాలజీ రంగం కీలక తోడ్పాటు అందిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాల్లో అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై నాస్కామ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది‘ అని పేర్కొంది. ‘ఇది చారిత్రకమైన రోజు. అవరోధాలన్నీ తొలగిపోవడం హర్షించతగ్గ పరిణామం. ఏకత్వానికి, సమిష్టి తత్వానికి ఇది గెలుపు‘ అని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది‘ అని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్ణానీ ట్వీట్ చేశారు. -
భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు
సాధారణంగా రెండు ప్లస్ రెండు నాలుగవుతుంది. కానీ ఇండో అమెరికా మాత్రం రెండు ప్లస్ రెండు ఈక్వల్టూ ఒకటి అంటున్నాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య జరిగే ఈ చర్చలు..ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్నాయి. పలు దేశాల పర్యటనలను వర్చువల్ పర్యటనలుగా మార్చుకున్న అమెరికా రక్షణ మంత్రి.. భారత్ పర్యటనకు స్వయంగా రావడం గమనిస్తే ప్రాధాన్యం అర్థమవుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం భారత్, అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత్ వచ్చారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నా అమెరికా కీలక మంత్రులు ఈ పర్యటనకు స్వయంగా రావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌తో సైతం అమెరికా మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోంది. భారత్ నిర్ణయాత్మకం దక్షిణాసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే భారత్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోందని అమెరికా ప్రశంసించింది. భారత్ ఎదుగుదలను స్వాగతిస్తున్నట్లు యూఎస్ రక్షణ, విదేశాంగ శాఖలు తెలిపాయి. 2021 జనవరి నుంచి ఆరంభమయ్యే ఐరాస భద్రతా మండలి టర్మ్‌లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపాయి. 2017లో ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్ జలాలను స్వేచ్ఛగా ఉంచేందుకు ఉమ్మడిగా వ్యూహరచన చేయాలని భావించాయి. ఇందుకోసం నాలుగు దేశాలు కలిసి క్వాడ్ పేరిట ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ 4 దేశాల మంత్రులు జపాన్‌లో సమావేశమయ్యారు. చైనా దుందుడుకు చేష్టలను ఆపేందుకు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఎకానమీ పరంగానూ భారత్ అత్యంత కీలకమని అమెరికా భావిస్తోంది. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ 20 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2+2 చర్చలు, బెకా అంటే.. ఒక దేశ రక్షణ, విదేశీ మంత్రులు మరో దేశ రక్షణ, విదేశీ మంత్రులతో జరిపే చర్చలను టు ప్లస్ టు చర్చలంటారు. ఒక దేశం తనకు అత్యంత కీలకమని భావించే మరో దేశంతో ఇలాంటి సమావేశాలు జరుపుతుంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్ బెకా(బేసిక్ ఎక్సే్చంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్) కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్ జియో శాటిలైట్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్ జిఎస్‌ఓఎంఐఏ(జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లాజిస్టికల్ ఎక్సే్చంజ్ మెమొరాండమ్ అగ్రిమెంట్(లెమొవా)ను 2016లో, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్(కామ్కాసా)ను 2018లో పూర్తి చేసుకుంది. బెకా పూర్తయితే 2002 అగ్రిమెంట్ దశలన్నీ పూర్తయినట్లవుతుంది. -
అమెరికా ‘వ్యూహాత్మక’ చెలిమి
చైనాతో ఆసియా ప్రాంత దేశాలకూ, ప్రత్యేకించి భారత్‌కూ రాగల ముప్పు గురించి ఇటీవలకాలంలో అమెరికా ఒకటికి రెండుసార్లు హెచ్చరించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా 60,000మంది సైనికులను మోహరించిందని, అందువల్ల తక్షణం భారత్‌కూ, ఆ తర్వాత ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకూ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో ఈమధ్యే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా హెచ్చరించారు. ఆయన మాత్రమే కాదు... అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ సైతం ఇలాగే ధ్వనించారు. మన దేశంలో మూడురోజుల పర్యటన కోసం సోమవారం వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి స్టీఫెన్ బీగన్ ఉద్దేశం కూడా ఇదే. అయిదు నెలలనుంచి చైనా ఎల్ఏసీ వద్ద పేచీ పెడుతోంది. మే 5న ఇరు దేశాల సైనికుల మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. చైనా సైనికులు మన జవాన్లు 20మందిని కొట్టిచంపారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్యా కోర్ కమాండర్ స్థాయి చర్చలు మొదలుకొని రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల వరకూ సాగుతున్నా ప్రతిష్టంభన మాత్రం ముగియలేదు. శతఘ్నులు, క్షిపణులు, తుపాకులతో ఇరు దేశాల సేనలూ అక్కడ సర్వసన్నద్ధంగా వున్న వైనం చూస్తుంటే అది ఏ క్షణమైనా ఘర్షణలకు దారితీయొచ్చునన్న సందేహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా చేస్తున్న హెచ్చరికలు కొట్టిపడేయనవసరం లేదు. అయితే మన దేశం మొదటినుంచీ సరిహద్దు తగాదాల విషయంలో వ్యూహాత్మకమైన స్వయంప్రతిపత్తిని పాటిస్తోంది. అటు పాకిస్తాన్‌తో వున్న వివాదాన్నయినా, ఇటు చైనాతో వున్న వివాదాన్నయినా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవడంపైనే ఆసక్తి చూపుతోంది. మూడో దేశం మధ్యవర్తిత్వం ప్రతిపాదనను మన దేశం పలుమార్లు ఖండించింది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి– చారిత్రకంగా ఆసియా ఖండ దేశాల మధ్య వున్న సంబంధాలు, రెండు–ఆ వివాదం మాటున వేరే రాజ్యాల పెత్తనం నచ్చక పోవడం. కనుకనే అటు పాకిస్తాన్ నుంచి, ఇటు చైనా నుంచి ఎన్ని సమస్యలున్నా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృక్పథాన్నే ప్రకటిస్తోంది. మన దేశంతో యుద్ధం వచ్చినప్పుడు గతంలో ఎదురైన చేదు అనుభవాలరీత్యా పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయడంపైనే దృష్టి పెడుతోంది. సరిహద్దుల్లో చొరబాట్లను ప్రోత్సహించి, భారత్‌లో... ముఖ్యంగా కశ్మీర్లో కల్లోలం సృష్టించాలని పన్నాగాలు పన్నుతోంది. చైనా ఆ దేశానికి మద్దతుగా నిలవడమే కాక, ఇటీవలకాలంలో ఎల్ఏసీ పొడవునా కుంపటి రాజేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో స్టీఫెన్ బీగన్ మన దేశానికి రావడం, భారత్–అమెరికాల మధ్య ఈ నెలాఖరున జరిగే 2+2 వ్యూహాత్మక సమావేశానికి సంబంధించిన అంశాలు ఖరారు చేసుకోవడం చైనాకు కంటగింపుగానే వుంటుంది. ఈ నెల మొదట్లో మైక్ పాంపియో సైతం ఈ సమావేశం గురించే చర్చించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోనూ, ఇతరచోట్లా సమష్టిగా పనిచేయడానికి, శాంతి సాధ నకు, పటిష్టమైన భద్రత కల్పించడానికి రెండు దేశాల భాగస్వామ్యం అవసరమవుతుందని అమెరికా ఎప్పటినుంచో పట్టుబడుతోంది. చైనాతో అమెరికాకున్న విభేదాలు తక్కువేం కాదు. వాణిజ్య రంగం మొదలుకొని సాంకేతికత, కరెన్సీ, హాంకాంగ్ తదితర అంశాల్లో అవి పరస్పరం సంఘర్షిస్తున్నాయి. అదే సమయంలో చైనా విషయంలో అమెరికా ఊగిసలాట ధోరణినే ప్రదర్శిస్తోంది. చైనాను బెది రించి, ఏదోమేరకు తనకు సానుకూలమైన నిర్ణయం తీసుకునేలా చేయడానికి అది శాయశక్తులా ప్రయత్నించి కొన్నిసార్లు సఫలమవుతోంది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఈ ఊగిసలాట మరింత పెరిగింది. ఆయన ఎప్పుడు చైనాను ప్రశంసిస్తారో, ఎప్పుడు దూషించి విరుచుకుపడతారో అనూహ్యం. చైనాతో భారత్‌కు ముప్పు వుందని, తమ సాయం లేనిదే భారత్ నెగ్గుకురాలేదని ఇప్పుడంటే మైక్ పాంపియో చెబుతున్నారుగానీ... ఇటీవలకాలంలో ఒకటికి రెండుసార్లు భారత్–చైనాలు సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి వీలుగా మధ్యవర్తిత్వం నెరపుతానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరపడానికి మన దేశానికి గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా అభ్యంతరాలు లేవు. ఈ అంశంలో ఇప్పటికే పలు దఫాలు ఇరు దేశాలూ చర్చించు కున్నాయి. కానీ ప్రతిసారీ అమెరికాలో కనబడే ఊగిసలాట ధోరణే మన దేశాన్ని అయోమయంలో పడేస్తోంది. వ్యూహాత్మక ఒప్పందం తర్వాత రక్షణ కొనుగోళ్లు, సమష్టి ఉత్పత్తి తదితర అంశాలతో సహా అన్నింటిలోనూ భారత్ తమతో కలిసి నడవాల్సివుంటుందని పాంపియో నిరుడు నేరుగానే చెప్పారు. అమెరికా–చైనా సంబంధాలు మాత్రమే కాదు... అమెరికా–రష్యా సంబంధాలు కూడా ఇటీ వలకాలంలో క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు నెరపడం మన ప్రయోజనాలకు ఎంతవరకూ ఉపయోగమో మనం తేల్చుకోవాల్సి వుంటుంది. నాటో సభ్యదేశంగా వున్న టర్కీ నిరుడు రష్యాతో కుదుర్చుకున్న ఎస్–400 క్షిపణి ఒప్పందం, జర్మన్ సంస్థలకు రష్యాతో నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుపై కుదిరిన ఒప్పందంవంటి అంశాల్లో అమెరికా స్పందన ఎంత తీవ్రంగా వుందో అందరికీ తెలుసు. టర్కీపై అది ఆంక్షలు కూడా విధించింది. చైనాతో మనకు సమస్యలున్నమాట వాస్తవం. అందుకు అమెరికా సహాయసహకారాలు కూడా మనకు అవసరం. కానీ ఇతరులతో మనం స్వతంత్రంగా, మన అవసరాలకు తగ్గట్టు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆటంకమయ్యేలా ఆ సహాయసహకారాలు ఉండకూడదు. పైగా అమెరికా తన అవసరాలరీత్యా ఎప్పటికప్పుడు భిన్నమైన వైఖరులు ప్రదర్శిస్తూపోతుంటే అందుకు అనుగుణంగా మనం మారలేం. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న స్టీఫెన్ బీగన్కు ఈ సంగతే స్పష్టం చేయాలి. -
టిక్‌టాక్ యూఎస్‌పై ఒరాకిల్ కన్ను!
చైనీస్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ రేసులోకి వచ్చింది. ఇటీవల టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు వాల్‌మార్ట్‌తో జత కట్టిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు నిర్వహించింది. అయితే ఈ చర్చలు విఫలమైనట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీంతో టిక్‌టాక్ యూఎస్ విభాగాన్ని దక్కించుకునేందుకు ఐటీ కంపెనీ ఒరాకిల్ పావులు కదుపుతున్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. ప్రతిపాదిత డీల్ ప్రకారం టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్ సాఫ్ట్వేర్ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్ యూఎస్ విభాగంలో వాటాను కొనుగోలు చేయనుంది. కాగా.. మరోపక్క టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో నిర్వహించిన చర్చలు ఫలప్రదంకాలేదని మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. అయితే టిక్‌టాక్ వినియోగదారులకు సంబంధించి జాతీయ భద్రతను కాపాడుతూనే ప్రైవసీ, ఆన్లైన్ సెక్యూరిటీ తదితర అంశాలలో పటిష్ట చర్యలు తీసుకోగలమని వెల్లడించింది. దీంతో ఇప్పటికే తమ ప్రతిపాదనలపట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలియజేసింది. దేశీ విభాగం ? చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్ యూఎస్ విభాగం కొనుగోలుకి యూఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలయితే మేలని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో టిక్‌టాక్ టేకోవరకు సాఫ్ట్వేర్ కంపెనీలయితే ప్రభుత్వ అనుమతి లభించగలదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. యూఎస్ విభాగాన్ని కొనుగోలు చేయడంతోపాటు టిక్‌టాక్ ఇండియా కార్యకలాపాలను సైతం చేజిక్కించుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డేటా భద్రత విషయానికి సంబంధించి ఇప్పటికే దేశీయంగా టిక్‌టాక్ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే. -
డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు
వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞచేశారు. అమెరికాలో నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జో బైడెన్ తలపడుతున్నారు. ‘పదిహేనేళ్ల క్రితం భారత దేశంతో చారిత్రాత్మక అణ్వాయుధ ఒప్పందం కొరకు ప్రయత్నం చేశాను. భారత్, అమెరికాల మధ్య మైత్రీ సంబంధాలు బలపడితే, యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని ఆనాడే నేను చెప్పాను’’అని భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి, ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచం ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్య రక్షణపై దృష్టిసారిస్తామని బైడెన్ చెప్పారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, దేశ చరిత్రలోనే అత్యధికంగా భారతీయులను వివిధ పదవుల్లో నియమించినట్లు, ఇప్పుడు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షురాలిగా పోటీలో నిలిపామని ఆయన అన్నారు. భారత దేశానికి చెందిన హిందూ, సిక్కు, ముస్లిం, జైన్, ఇతరులపై జరుగుతోన్న దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. హెచ్–1బీ వీసా... హెచ్–1బీ వీసాల విధానాన్ని సంస్కరించి, గ్రీన్ కార్డుల కోసం దేశాల వారీగా ఇచ్చే కోటా విధానాన్ని రద్దు చేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో జాతి విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇతర దేశాల వారిపై ఆంక్షలు విధిస్తూ, హెచ్–1బీ వీసాలపై హానికరమైన, కఠిన చర్యలకు పూనుకుంటున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు. గ్రీన్ కార్డుల సంఖ్యను పెంచుతామని, కుటుంబ సభ్యుల రాకపై ఆంక్షలు తొలగిస్తామని, అమెరికాలో చదివిన విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేస్తామని, ఉపాధి కోసం వచ్చేవారికి ఉద్యోగ వీసాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. అమెరికాలో భారతీయుల రక్షణ కోసం, తొలిసారిగా డెమొక్రాటిక్ పార్టీ ఒక విధానపత్రంతో ముందుకు వచ్చింది. -
నిషేధంతో మరింత బిజినెస్: నాస్కామ్
ఐటీ నిపుణులు అత్యధికంగా పొందే H1-Bసహా పలు వీసాలపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం ద్వారా దేశీ ఐటీ కంపెనీలకు మేలే జరగనున్నట్లు నాస్కామ్ తాజాగా అంచనా వేసింది. దీంతో ఆఫ్‌షోర్ సర్వీసులకు డిమాండ్ పెరగనున్నట్లు సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసుల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. కోవిడ్-19 కారణంగా అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగానికి బ్రేక్ వేసే బాటలో ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ డిసెంబర్ వరకూ పలు వీసాలపై నిషేధం విధించిన విషయం విదితమే. అయితే యూఎస్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత కారణంగా పలు గ్లోబల్ దిగ్గజాలు దేశీ కంపెనీల ద్వారా సర్వీసులను పొందేందుకు ఆసక్తి చూపుతాయని నాస్కామ్ పేర్కొంది. ఇది ఐటీ రంగంలో మరిన్ని ఆఫ్‌షోర్ కాంట్రాక్టులకు దారిచూపుతుందని నాస్కామ్ ఆశిస్తోంది. దిగ్గజాలు రెడీ కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పలు విదేశీ కంపెనీలు ఆఫ్‌షోర్ సేవలపట్ల ఆసక్తి చూపుతున్నాయని.. దీంతో ఇటీవల దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు బిజినెస్ పెరిగినట్లు నాస్కామ్ పేర్కొంది. ఐటీ రంగంలో కీలక(క్రిటికల్) సర్వీసులకు ఆఫ్‌షోర్ విధానంపై ఆధారపడటం పెరిగిందని తెలియజేసింది. కోవిడ్ సంక్షోభం నుంచి రికవరీ సాధించే బాటలో ప్రతీ దేశం టెక్నాలజీపై మరింత ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని నాస్కామ్ చైర్మన్, ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఇది దేశీ ఐటీ పరిశ్రమకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ట్రంప్ H1-B వీసాలపై నిషేధం విధించడంతో ఆఫ్‌షోర్ కాంట్రాక్టులు పెరగనున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఐటీ విశ్లేషకులు అమిత్ చంద్ర తెలియజేశారు. క్యాప్టివ్ సెంటర్స్ సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు దేశీయంగా ఏర్పాటు చేసే క్యాప్టివ్ సెంటర్స్‌పై విదేశీ దిగ్గజాలు దృష్టి సారించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు సైతం పెరగనున్నట్లు అంచనా వేస్తున్నాయి. పలు గ్లోబల్ దిగ్గజాలకు దేశీయంగా 1300 క్యాప్టివ్ సెంటర్లున్నట్లు తెలియజేశాయి. వీటి ద్వారా దాదాపు పది లక్షల మంది ఐటీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. ఈ కేంద్రాల నుంచి సర్వీసులను పెంచుకునేందుకు మరింతమంది ఉద్యోగులను తీసుకునే వీలున్నట్లు ఏఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ సీఈవో లలిత్ ఆహుజా చెబుతున్నారు. కోవిడ్ కారణంగా 10-15 శాతం స్థాయిలో ఉద్యోగ కల్పనకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. అంటే 2021కల్లా మొత్తం లక్షమంది వరకూ నైపుణ్యమున్న సిబ్బందిని పెంచుకోవలసి ఉంటుందని వివరించారు. నిజానికి గత కొంతకాలంగా వీసాలను పొందడంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా కొన్ని కంపెనీలు ఆఫ్‌షోర్ సేవలకే ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సాధిస్తున్న ఆదాయంలో ఆన్‌షోర్ వాటాను ఆఫ్‌షోర్ అధిగమిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. -
స్టీల్ ఉత్పత్తులపై యాంటీడంపింగ్ డ్యూటీ..?
విదేశాల నుంచి భారత్‌లోకి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై యాంటీడంపింగ్ డ్యూటీ విధించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులను ఆదుకునే చర్యల్లో భాగంగా యూరప్, జపాన్, అమెరికా, కొరియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులపై 5ఏళ్ల పాటు ఈ డ్యూటీని విధించనుంది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ దేశాల నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 222డాలర్ల నుంచి 334 డాలర్ల పరిధిలో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అలాగే నాణ్యత ఆధారంగా ఉత్పత్తులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ను తిరస్కరించింది. యూరప్, జపాన్, అమెరికా, కొరియా దేశాల నుంచి భారత్‌లోకి సగటు ధర కంటే తక్కువ విలువలో స్టీల్ ఉత్పత్తులు దిగుమతి అవుతుండటంతో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించేందుకు వాణిజ్య శాఖ సిపార్సు చేసింది. తక్కువ ధరల్లో స్టీల్ ఉత్పత్తుల దిగుమతుల కారణంగా దేశీయ స్టీల్ పరిశ్రమ నష్టాలను ఎదుర్కోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నివేదికలో తెలిపింది. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే..? ఇతర దేశాల నుంచి ఏదైనా సరుకు లేదా వస్తువులను మన మార్కెట్ లో లభించే ధర కంటే తక్కువ ధరకు దిగుమతి చేస్తే వాటిపై విధించే టారిఫ్‌ను యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. సాధారణంగా స్వదేశీ వ్యాపారాన్ని రక్షించేందుకు చాలా దేశాలు ఈ రకమైన టారీఫ్ విధిస్తుంటాయి. -
భారతీయులు భళా: ట్రంప్
వాషింగ్టన్: భారత్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలా గొప్పవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి మందులు, వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వైట్‌హౌస్ రోజ్ గార్డెన్లో శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ‘కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, మందులు కనుక్కోవడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు చేస్తున్న కృషి మరువలేనిది’అని అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పరిశోధనకారులు, శాస్త్రవేత్తల్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఇదే తొలిసారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వర్సిటీలు, రీసెర్చ్ వర్సిటీలు, బయో ఫార్మా స్టార్టప్‌లలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు కోవిడ్‌పై మందులు, వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత్, అమెరికా సంయుక్త కృషితో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కనుక్కుంటామని ట్రంప్ చెప్పారు. భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తామన్న ట్రంప్..స్నేహం బలపడిందన్న మోదీ కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎక్కువగా ఉపయోగపడే వెంటిలేటర్లను భారత్‌కు ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని మరోసారి స్పష్టం చేశారు. ‘‘మా మిత్రదేశమైన భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తాం. భారత్‌కు అండగా ఉంటాం’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపారు. భారత్, అమెరికా మధ్య మైత్రికి మరింత బలోపేతంగా మారిందని అన్నారు. వైరస్ సోకిన తొలి రోజుల్లో అమెరికాకి క్లోరోక్విన్ మాత్రల్ని భారత్ భారీగా పంపడం తెల్సిందే. కరోనాను ఎదుర్కోవడానికి కలసికట్టుగా కృషి చేయాలని, ఈ సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ సమష్టిగా పోరుబాట పడితే ఆరోగ్యకరమైన ప్రపంచం ఆవిష్కృతమవుతుందని మోదీ పేర్కొన్నారు. శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో గర్ల్ స్కౌట్ ట్రూప్ 744 సభ్యురాలు శ్రావ్యా అన్నపరెడ్డిని సత్కరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
కోవిడ్–19పై సహకరించుకుందాం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌పై యుద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని అమెరికా, భారత్ నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య శనివారం జరిగిన ఫోన్ సంభాషణలో పలు అంశాలపై చర్చించుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతపైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్–19 రోగులకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల్ని పంపించాలని ట్రంప్ కోరారు. మలేరియా వ్యాధిని అరికట్టే క్లోరోక్విన్ టాబ్లెట్లు కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తూ ఉండడంతో అమెరికా కొన్నాళ్ల క్రితమే భారత్‌కి ఆర్డర్ పెట్టుకుంది. భారత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్లోరోక్విన్ ఎగుమతుల్ని ఈ నెల 4న భారత్ నిషేధించింది. దీంతో ట్రంప్ ఫోన్ చేసి మోదీతో మాట్లాడారు. తమ కంపెనీలు ఆర్డర్ చేసిన క్లోరోక్విన్ మాత్రల్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్రంప్ విలేకరులతో.. ‘భారత ప్రధానితో మాట్లాడాను. భారత్ క్లోరోక్విన్ మాత్రలను భారీ స్థాయిలో తయారు చేస్తోంది. నా విజ్ఞప్తిపై భారత్ సీరియస్‌గానే ఆలోచిస్తోంది’అని అన్నారు. -
ఈ–స్కూటర్‌తో డేటా హ్యాక్!
హూస్టన్: ఎలక్ట్రానిక్–స్కూటర్లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశోధన ద్వారా వెల్లడించారు. ఇందులో భారతీయ నిపుణులు పాల్గొన్నారు. వాహనదారుల గోప్యతకు సంబంధించిన వివరాలను ఈ–స్కూటర్ల ద్వారా హ్యాక్ చేయొచ్చని వీరు చెబుతున్నారు. ఈ–స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసినపుడు.. రెండింటి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీంతో ఆ వాహనం ప్రయాణించే ప్రాంతం, ఎంత దూరం తిరిగింది వంటి వివరాలు ఫోను, వాహనాల్లో నిక్షిప్తం అవుతాయి. ఇదే హ్యాకర్లకు అవకాశం కల్పిస్తోందని వారు తెలిపారు. ఈ వివరాల ద్వారా వాహనదారులు తరచుగా తిరిగే మార్గాలను, వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఉండే లొకేషన్ వంటి వివరాలను హ్యాకర్లు తెలుసుకుంటారని చెప్పారు. సైబర్ సెక్యూరిటీని పటిష్టంగా ఉండేలా మోటారు వాహనాల కంపెనీలు తమ వాహనాలను తయారు చేయాలని వారు సూచించారు. -
టి–హబ్‌లో రక్షణ రంగ స్టార్టప్‌ల వర్క్‌షాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగ స్టార్టప్ సంస్థలకు సంబంధించిన వర్క్‌షాప్‌కు హైదరాబాద్‌లోని టి–హబ్ వేదిక కానుంది. డిసెంబర్ 16, 17 తారీఖుల్లో (సోమ, మంగళ) రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ (న్యూఢిల్లీ) కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత్, అమెరికా రక్షణ రంగ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడనుంది. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్టార్టప్ సంస్థలు వినూత్న ఆవిష్కరణలు ఇందులో ప్రదర్శించనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు ఈ వర్క్‌షాపులో పాల్గోనున్నారు. -
18న భారత్–అమెరికా 2+2 చర్చలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికాల మధ్య రెండో విడత 2+2 మంత్రుల స్థాయి చర్చలు 18వ తేదీన జరగనున్నాయి. రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించే ఈ భేటీ వాషింగ్టన్లో జరుగనుందని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. మన దేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇందులో పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ వెల్లడించారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లుపై వ్యక్తమైన అభ్యంతరాలపై అమెరికా ప్రజాప్రతినిధులతో మాట్లాడామన్నారు. భారత్ వైఖరిని వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఈ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గువాహటిలో 15వ తేదీ నుంచి 17 వరకు జరగాల్సిన భారత్–జపాన్ భేటీ వేదికపై ప్రస్తుతానికి ఎలాంటి మార్పూ లేదన్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ భారత్ పర్యటన వాయిదా వేసుకోవడంపై ఆయన స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మత పరమైన హింస జరుగుతున్నట్లు భారత్ ఎన్నడూ విమర్శించలేదన్నారు. పౌరసత్వ బిల్లుపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకునే ముందు సొంత దేశంలో మైనారిటీలపై ఎలాంటి వివక్ష కొనసాగుతోందో తెలుసుకోవాలన్నారు. -
భారత్‌పై బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ : రానున్న దశాబ్ధంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ అన్నారు. దేశం అనుసరిస్తున్న ఆధార్ వ్యవస్థ, ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో కనబరుస్తున్న సామర్ధ్యం ప్రశంసనీయమైనవని కొనియాడారు. దేశంలో ఆర్థిక మందగమనంపై ఆందోళన నెలకొనడంతో పాటు స్లోడౌన్ ప్రభావం మరికొన్నేళ్లు సాగుతుందనే భయాల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి బిల్ గేట్స్ భారత ఎకానమీపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్వల్ప కాలంలో ఏం జరుగుతుందనేది తనకు తెలియకపోయినా, రానున్న దశాబ్ధంలో భారత్‌లో అనూహ్య వృద్ధి రేటు నమోదవుతుందని వ్యాఖ్యానించారు. 110 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌ను వెనక్కునెట్టి 64 ఏళ్ల బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా తిరిగి తన స్ధానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గేట్స్ మూడు రోజులు భారత్‌లో పర్యటిస్తారు. భారత్‌లో ఆధార్ వ్యవస్థ పనితీరును గేట్స్ ప్రశంసించారు. ఇతర దేశాల్లోనూ ఈ తరహా వ్యవస్ధను ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు భారత్‌లో అద్భుత వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారని అన్నారు. -
హెచ్1 బీ వీసాదారులకు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ హెచ్1 బీ వీసాదారులకు యూఎస్ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్.. ఈ కేసును తిరిగి కింది కోర్టుకు పునఃపరిశీలనకు పంపించింది. దిగువ న్యాయస్థానం ఈ ఆదేశాల్ని క్షుణ్నంగా పరిశీలించి ఓ నిర్ణ యానికి రావాలని సూచించింది. 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్1 బీ వీసా దారుల జీవిత భాగస్వాములకు పని అను మతులు కల్పించాలని నిర్ణయిస్తూ హెచ్–4 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. హెచ్–4 వీసా విధానం వల్ల అధిక ప్రయోజనం పొందుతున్నది భారతీయులు.. అందు లోనూ ప్రత్యేకంగా మహిళలే ఎక్కువగా ఉన్నారు. అయితే దీనివల్ల అమెరికన్లు ఎక్కువ సంఖ్యలో నష్టపోతున్నారని భావించిన ట్రంప్ ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. -
జీఎస్పీ హోదా రద్దుపై మరో ఆలోచన లేదు
వాషింగ్టన్: ఇండియాకు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ)ని తొలగించే విషయంలో మరో ఆలోచన లేదనీ, ఇది ఇప్పటికే ముగిసిన అంశమని అమెరికా సీనియర్ అధికారి ఒకరు గురువారం చెప్పారు. అలాగే డేటాను భారత్ లోనే భద్రపరచాలన్న నిబంధన, ఇండియాలోని మార్కెట్‌కు అమెరికా కంపెనీలకు యాక్సెస్ కల్పించడం తదితర అంశాల్లో తమ అభ్యంతరాలకు భారత్ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. జీఎస్పీ హోదా ఉన్న దేశాల నుంచి వచ్చే దాదాపు 2 వేల వేర్వేరు వస్తువులపై పన్ను విధించకుండానే అమెరికాలోకి దిగుమతి చేసుకుని, ఎగుమతి చేస్తున్న దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం కోసం ఈ జీఎస్పీ విధానాన్ని అమెరికా గతంలో తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది మార్చి 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ, భారత్‌కు జీఎస్పీ హోదాను రద్దు చేసేందుకు తాము మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. 60 రోజుల నోటీస్ కాలం మే 3న ముగిసింది. దీంతో భారత్‌కు జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నట్లుగా ఇక ఏ క్షణమైనా అధికారిక నోటిఫికేషన్‌ను అమెరికా విడుదల చేయొచ్చు. -
విజేందర్ బౌట్ వాయిదా
న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ అరంగేట్రం ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 12వ తేదీన విజేందర్ బౌట్ జరగాల్సింది. అయితే ఈ బౌట్ కోసం సిద్ధమవుతున్న సందర్భంగా ప్రాక్టీస్ సెషన్లో విజేందర్ ఎడమ కంటికి గాయమైంది. గాయం తీవ్రతదృష్ట్యా అతని కంటికి ఆరు కుట్లు వేశారు. ‘స్పారింగ్ సెషన్లో నా సహచరుని మోచేయి నా కంటికి బలంగా తాకింది. వైద్యుల సూచనతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాను. గాయం నుంచి కోలుకున్నాకే బౌట్ తదుపరి తేదీని నిర్ణయిస్తాం. దేవుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడని నేను విశ్వసిస్తాను. ఈ గాయం కూడా నా మంచి కోసమే జరిగిందని భావిస్తున్నాను’ అని 33 ఏళ్ల విజేందర్ వ్యాఖ్యానించాడు. 2015లో ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఇప్పటివరకు 10 బౌట్లలో పోటీపడి అన్నింట్లోనూ విజయం సాధించాడు. -
స్కెచర్స్ చేతికి 49% ఫ్యూచర్స్ వాటా
న్యూఢిల్లీ: స్కెచర్స్ ఇండియా జాయింట్ వెంచర్లో ఫ్యూచర్స్ గ్రూప్‌నకు ఉన్న 49% వాటాను మాతృ కంపెనీ స్కెచర్స్ యూఎస్ఏ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించలేదు. అయితే ఈ వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన స్కెచర్స్ కంపెనీ రూ.600 కోట్లు వెచ్చించిందని సమాచారం. దీంతో స్కెచర్స్ ఇండియా ఇక పూర్తిగా స్కెచర్స్ యూఎస్ఏ అనుబంధ సంస్థగా మారిపోయింది. మరింతగా వృద్ధి జోరు... ఇతర దేశాల్లో లాగానే ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాలతో భారత్‌లోకి ప్రవేశించామని స్కెచర్స్ సీఎఫ్ఓ డేవిడ్ వీన్‌బర్గ్ చెప్పారు. జాయింట్ వెంచర్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేశామన్నారు. ఈ కొనుగోలు స్కెచర్స్ ఇండియా వృద్ధి జోరును మరింతగా పెంచుతుందని స్కెచర్స్ సౌత్ ఏషియా సీఈఓ రాహుల్ విరా పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణను మరింత వేగవంతం చేస్తుందని, భారత్‌లో మరింత మార్కెట్ వాటా కొనుగోలు కోసం పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుందని వివరించారు. ఈ ఏడాది 80 నుంచి వంద కొత్త స్టోర్స్.... స్కెచర్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు ద్వారా భారత్‌లో 2012లో ప్రవేశించింది. ప్రస్తుతం భారత్‌లో స్కెచర్స్ కంపెనీ 223 రిటైల్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. వీటిల్లో 61 స్వంత స్టోర్స్ కాగా, మిగిలినవి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలోనివి. ఈ ఏడాది కొత్తగా 80 నుంచి వంద స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. -
అమెరికాలో బయటపడ్డ ఫేక్ యూనివర్సిటీ
-
ఇప్కా ల్యాబ్స్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: ఇప్కా ల్యాబొరేటరీస్ అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ బేషోర్ ఫార్మాస్యూటికల్స్ ఎల్ఎల్సీలో 80 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను అమెరికాలోని తమ అనుబంధ కంపెనీ ఇప్కా ఫార్మాస్యూటికల్స్ ఇన్‌కార్పొ రూ.74.40 కోట్లకు (10.286 మిలియన్ డాలర్లకు) కొనుగోలు చేసిందని ఇప్కా ల్యాబొరేటరీస్ వెల్లడించింది. తమ జనరిక్స్ ఔషధాలను అమెరికాలో బేషోర్ ఫార్మా ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. కాగా, 2017 డిసెంబర్ 31తో ముగిసిన ఏడాది కాలానికి బేషోర్ ఫార్మా కంపెనీ 7.05 మిలియన్ డాలర్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. -
విద్యావిధానంలో అమెరికాకు, ఇండియాకు తేడా ఉంది
ఎంజీయు (నల్లగొండరూరల్) : విద్యా విధానంలో అమెరికా–ఇండియాకు తేడా ఉందని అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిజిస్ట్రార్ వంగపర్తి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్ నాలెజ్డ్ కోసం ప్రతి ఒక్కరూ ఇంటర్నషిప్ చేయాల్సి ఉంటుందని అన్నారు. మన దేశంలో ప్రాజెక్టు నిర్వహిస్తామని, థియరీ ఎక్కువగా బోధిస్తామని, ఇవి అధ్యయనం చేసిన విద్యార్థులు అమెరికాలో కొంత ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మంచిభాషాపటిమ, సబ్జెక్టు నాలెడ్జితో పాటు ఇతర అంశాలలో కూడా విద్యార్థులు ప్రతిభ చాటాలని అన్నారు. అమెరికాకు వచ్చి విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ఇక్కడి ఏజెంట్లు చెప్పినట్లు కాకుండా మంచి కళాశాలను ఎంచుకోవడానికి అన్ని వివరాలను తెలుసుకోవాలని సూచించారు. వీసాలు పొందడం, చదువుకుంటూ సంపాదించే అవకాశాలను తెలుసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలుగు విద్యార్థులకు పలు సూచనలు ఇస్తుందని తెలిపారు. వీసీ ఆల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అమలు చేస్తున్న విద్యాబోధన, నైపుణ్యంపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్, రవి, వసంత, సరిత, సబాన హెరాల్డ్, పరమేష్, భీంరెడ్డి పాల్గొన్నారు.