రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయం
అమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
ఎమ్సిస్టెక్
గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్
ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్‌ఎల్‌పీ
ఇన్నోవియో వెంచర్స్
కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్
లోకేష్ మెషీన్స్ లిమిటెడ్
పాయింటర్ ఎలక్ట్రానిక్స్
ఆర్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
షార్ప్‌లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్
శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్
శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment