
కీవ్: ఓవైపు కాల్పుల విరమణ చర్చలకు సిద్ధమవుతూనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున జరిపిన డ్రోన్ల దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఖార్కివ్, సుమి, చెర్నిహివ్, ఒడెసా, డొనెట్‌స్క్ ప్రాంతాలతోపాటు రాజధాని కీవ్‌పైనా ఐదు గంటలకు పైగా రష్యా దాడులు కొనసాగాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
గగనతల రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు తక్కువ ఎత్తులో ఎగిరిన రష్యా డ్రోన్లు నివాస భవనాలపై పడ్డాయి. కీవ్‌పై జరిపిన డ్రోన్ దాడిలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. డ్రోన్ శిథిలాలు పడటంతో డ్నిప్రో జిల్లాలోని రెండు నివాస భవనాలకు మంటలు అంటుకున్నాయి.
9 అంతస్తుల భవనంపై అంతస్తులో మంటలు చెలరేగడంతో ఒక మహిళ మృతి చెందింది. పొదిల్ జిల్లాలో 25 అంతస్తుల భవనంలోని 20వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. హోలోసివ్‌స్కీలో గోదాము, కార్యాలయ భవనంలో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందారు. డొనెట్‌స్క్ ప్రాంతంపై జరిపిన దాడుల్లో నలుగురు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment