sanctions
-
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్‌లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్‌లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
నా జోలికొస్తే.. ఇరాన్ సర్వ నాశనమవుతుంది: ట్రంప్
వాషింగ్టన్: అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చే విధానాన్ని తిరిగి అమలు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారాయన. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఆయన సంతకం కూడా చేశారు. అదే సమయంలో.. ఇరాన్ గనుక తనను చంపాలని చూస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆయన హెచ్చరించారు.గతంలో.. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గరిష్టంగా ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీకి ముందు ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తన తొలి హయాంలో టెహ్రాన్‌పై వాషింగ్టన్ అమలుచేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాండమ్‌పై ఆయన సంతకం చేశారు.టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి.. ‘‘ఇరాన్(Iran) అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే మా లక్ష్యం. ఇరాన్‌తో డీల్‌కు నేను సానుకూలంగానే ఉన్నా. కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదు. ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమే. అయితే, అణ్వాయుధాన్ని అందుకోవడంలో టెహ్రాన్ చాలా దగ్గరగా ఉంది. దాన్ని అడ్డుకోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు.... ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ, నాకు అంతగా ఇష్టం లేదు. అధ్యక్షుడిగా నేను సంతకం చేసే సమయంలోనే అన్ని విభాగాల నుంచి ఆ విజ్ఞప్తులు వచ్చాయి. ప్రత్యేకించి.. అణ్వాయుధాల విషయంలో. తప్పనిసరిగా ఆ ఆదేశాలపై నేను సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్‌కు విషయంలో అది మరింత కఠినంగా ఉండబోతోంది’’ అని అన్నారాయన. ఇక ఇరాన్ తనను హత్య చేయడానికి కుట్ర పన్నితే.. అ దేశం పూర్తిగా నాశనమవుతుంది. ఏమీ మిగలదు అని ట్రంప్ హెచ్చరించారు. ‘‘నన్ను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే..! నన్ను హత్య చేస్తే ఇరాన్‌ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే నా అడ్వైజర్లకు ఆదేశాలిచ్చా’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఇరాన్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని నిఘా వ్యవస్థలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో 2020లో అప్పటి ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టేందుకు ఆదేశాలిచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతోనే అమెరికా దళాలు వైమానిక దాడులు చేయగా.. అందులోనే సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు ప్రతీకారంగా టెహ్రాన్.. ట్రంప్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. కిందటి ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం వెనక ఇరాన్ పాత్ర ఉన్నట్లు అమెరికా న్యాయవిభాగం అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. -
కొలంబియాపై ట్రంప్ కొరడా.. ఆ విమానాలు తిప్పి పంపినందుకే..
వాషింగ్టన్:తన మాట వినని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు మొదలు పెట్టారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై కొరడా ఝలిపించారు. త్వరలో ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ఆదివారం(జనవరి26) ఒక పోస్టు చేశారు. ‘కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాడు.ఇందుకే కొలంబియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా. కొలంబియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికిప్పుడు 25 శాతం టారిఫ్ విధిస్తాం. ఇది వారంలో 50 శాతానికి పెరుగుతుంది.కొలంబియా నుంచి అమెరికాకు రావడంపై ట్రావెల్ బ్యాన్. వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయి’అని ట్రంప్ వెల్లడించారు. కాగా, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలిటరీ విమానాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఎక్స్(ట్విటర్)లో తెలిపారు. తమ దేశానికి చెందిన వారికి గౌరవమిస్తూ పౌర విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. గత వారం కూడా మెక్సికో కూడా కొలంబియా తరహాలోనే ట్రంప్ వలసదారులతో పంపిన మిలిటరీ విమానాలను తిప్పి పంపడం గమనార్హం. ఇదీ చదవండి: పద్ధతిగా వస్తేనే ప్రయాణం -
ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావం
అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.అమెరికా ఆంక్షల పరిధిఅమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్‌లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్‌లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరంభారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావంసమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్‌ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది. -
రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావం
అమెరికా కొత్తగా ఆంక్షలు విధించినప్పటికీ మరో రెండు నెలల పాటు రష్యా నుంచి చమురు(Crude Oil) సరఫరాకి సమస్యేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 12 వరకు అమలయ్యే కాంట్రాక్టులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపాయి. ఆ తర్వాత నుండి వర్తించే కాంట్రాక్టులపైన కూడా ప్రభావం పడకుండా రష్యా ఈలోగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని వివరించాయి. భారత్ తదితర దేశాలకు చమురును చేరవేస్తున్న రెండు రష్యా సంస్థలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండు సంస్థల్లో ఒకటి మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో సరఫరా చేస్తుండగా రెండో దాన్నుంచి నామమాత్రంగానే ఉంటోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. భారత్‌కు సరఫరా చేసే ఇతర రష్యన్ సంస్థలు, ట్రేడర్లపై ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు చమురు సరఫరాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో భారత్ తదితర దేశాలకు రష్యా చమురు సరఫరా చేస్తోంది.ఇదీ చదవండి: డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం అప్గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్తో సహా రష్యా చమురు ఉత్పత్తిదారులపై, రష్యన్ చమురును రవాణా చేసే సుమారు 180 ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భవిష్యత్తులో రష్యా ముడిచమురు దిగుమతుల్లో 15 శాతం భారత్‌పై ప్రభావం పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా క్రూడ్ సరఫరాకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ఆంక్షలు సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే చమురును మరింత ఖరీదవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూఎస్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. -
15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయంఅమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ఎమ్సిస్టెక్గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్ఎల్పీఇన్నోవియో వెంచర్స్కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకేష్ మెషీన్స్ లిమిటెడ్పాయింటర్ ఎలక్ట్రానిక్స్ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్షార్ప్లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ -
ఇరాన్‌పై అమెరికా కన్నెర్ర.. ఆంక్షల విస్తరణ
అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై ఆంక్షల విస్తరించింది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో పెట్రోలియం, పెట్రో కెమికల్స్ సెక్టార్లో ఆంక్షలను విస్తరించినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన 16 చమురు కంపెనీలను, 17 చమురు నౌకలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ చర్యలతో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రం చేస్తామని తెలిపింది.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు ఇరాన్ అక్రమ చమురును చేరవేస్తే చర్యలు ఉంటాయి. ఈ ఆంక్షలు.. ఇరాన్ చేపట్టే క్షిపణి కార్యక్రమాలు, అమెరికా దాని మిత్రదేశాలపై ఉగ్రవాద దాడులకు చేయడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను దెబ్బతీయటంలో సహాయపడతాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోని పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలలో పనిచేయాలని నిర్ణయించుకున్న ఏ వ్యక్తిపైనైనా ఆంక్షలు విధించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు.ఇక.. లెబనాన్, గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న దాడులు, ఇరాన్లో హమాస్ నేతను అంతం చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1న క్షిపణి దాడులు చేసింది. అయితే ఆ దాడులకు తాము ప్రతిదాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో తాజాగా అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను మరింతగా విస్తరించింది.చదవండి: ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక -
మా గొంతు ఎవ్వరూ నొక్కలేరు
శ్రీనగర్: ‘జమ్మూకశ్మీర్ ప్రజలు శాంతిని ఆకాంక్షిస్తున్నారు. అదీ వారి అభీష్టం ప్రకారమే. కేంద్రం ఆంక్షలకు లోబడి మాత్రం కాదు’ అని ఆవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. ఉగ్ర నిధుల కేసులో తిహార్ జైల్లో ఉన్న ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. గురువారం ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీనగర్ చేరుకున్న ఎంపీ రషీద్.. విమానాశ్రయంలో కాలు మోపిన వెంటనే మోకాళ్లపై వంగి నుదుటితో నేలను తాకి, బయటకు వచ్చారు. తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘మా కంటే వేరెవరికీ కశ్మీర్లో శాంతితో అవసరం లేదని ప్రధాని మోదీకి చెప్పదల్చుకున్నా. అయితే, మేం పెట్టే షరతులకు లోబడే శాంతి నెలకొనాలి తప్ప కేంద్రం విధించే ఆంక్షలకు లోబడి కాదు. మాక్కావాల్సింది గౌరవంతో కూడిన శాంతి ఒక్కటే. శ్మశాన నిశ్శబ్దంతో కూడిన శాంతి కాదు’ అని అన్నారు. ‘సత్యం మాతోనే ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఎవరైనా కానీ మా గొంతు నొక్కలేరు. మేం యాచించడం లేదు. మనుషుల్లా చూడండని కోరుతున్నాం. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడుతూ మోదీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న తీసుకున్న నిర్ణయాన్ని మేం ఒప్పుకోం. ఇంజనీర్ రషీద్‌ను తిహార్ జైలుకు పంపినా, మరెక్కడికి పంపినా విజయం మాదే’ అని చెప్పారు.ఇండియా కూటమికి మద్దతిస్తాం..అయితేజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి తాము మద్దతిస్తామని రషీద్ చెప్పారు. అయితే, ఇండియా కూటమికేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని ముందుగా హామీ ఇవ్వాలన్నారు. అలాంటి హామీ ఇస్తే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆ కూటమి అభ్యర్థులకే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తారన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలన్న కల నెరవేరాలంటే ముందుగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని సూచించారు.‘మేం భారత్ శత్రువులం కాదు, అదే సమయంలో పాకిస్తాన్‌కు మిత్రులమూ కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఆర్టికల్ 370ని సాధించుకోవాలనే వారు ఇళ్లలో కూర్చుని ప్రకటనలిస్తే చాలదు. లాల్‌చౌక్‌లో నిరసనలు చేపట్టి, లాఠీచార్జీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఆ పని చేయలేదు’ అని వ్యాఖ్యానించారు. -
భారత్‌కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
ఇరాన్‌తో ఏ దేశం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆంక్షలు తప్పవని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో భారత్, ఇరాన్‌తో సోమవారం ఒప్పదం కుదర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.‘చాబహార్ పోర్టుకు సంబంధించి.. భారత్-ఇరాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు మాకు రిపోర్టుల ద్వారా తెలుసు. భారత్ తన విదేశీ విధానంలో భాగంగా చాబహార్ పోర్టు విషయంలో ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే విషయంపై ఆలోచించుకోవాలి. కానీ, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని, ఇప్పటికే విధించిన ఆంక్షలు సైతం తీవ్రంగా కొనసాగిస్తాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత పటేల్ అన్నారు.‘ఇప్పటికే చాలా సార్లు మేము ఆంక్షాల విషయాన్ని ప్రస్తావించాం. ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం. అలా కాదని ఇరత దేశాలు ముందకు వెళ్లితే.. వారికి వారుగా ఆంక్షలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది’అని ఇరాన్‌తో ఒప్పదం చేసుకున్న భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ఇక.. సోమవారం ఇరాన్‌లోని చాబహార్ పోర్టును పదేళ్ల పాటు భారత్ నిర్వహించేదుకు ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాంతీయ అనుసంధానంతో పాటు వాణిజ్య భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం చూపనుంది. -
ఇజ్రాయెల్‌పై దాడుల ఎఫెక్ట్.. ఇరాన్ భారీ షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్: తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా.. ఇరాన్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌కు సంబంధించిన మిస్సైల్, డ్రోన్ ప్రోగ్రామ్‌పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇరాన్ మిసైల్, డ్రోన్ ప్రోగ్రామ్‌పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు, భాగస్వామ గ్రూపులు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇరాన్, దాని క్షిపణి, డ్రోన్ ప్రోగ్రామ్‌తో పాటు ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నూతన ఆంక్షలు విధించబోతున్నామన్నారు. మరోవైపు.. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. తమ మిత్రదేశాలు, భాగస్వాములు కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై దాడుల అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. -
Russia: ఆంక్షల మధ్య నవాల్నీ అంత్యక్రియలు
మాస్కో: రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్నీ అంత్యక్రియలు శుక్రవారం ఆంక్షల నడుమ ముగిశాయి. జైల్లో అనుమానాస్పద రీతిలో మరణించిన ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు పుతిన్ సర్కారు ఒక పట్టాన అంగీకరించని విషయం తెలిసిందే. అనంతరం సర్కారు భయంతో అంత్యక్రియ నిర్వహణకు చర్చిలు కూడా వెనకడుగు వేశాయి. ఎట్టకేలకు మాస్కోలోని ఓ చర్చి ఒప్పుకున్నా శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తరలించేందుకు వాహనం దొరకడమూ గగనమే అయింది. మృతదేహాన్ని తరలించేందుకు ముందుకొచ్చిన వారికి బెదిరింపులు వచ్చినట్టు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్ చెప్పారు. చివరకు మాస్కో పరిధిలోని మేరినో జిల్లా బోరిసోవస్కోయీ శ్మశానవాటికలో నవాల్నీ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. జనం గుమికూడొద్దన్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరుచేస్తూ వేలాదిగా వేలాదిగా మద్దతుదారులు, ఉద్యమకారులు, అభిమానులు హాజరయ్యారు. మృతదేహాన్ని ఉంచిన మదర్ ఆఫ్ గాడ్ సూథీ మై సారోస్ చర్చిలో వేలాదిగా నివాళులర్పించారు. నవాల్నీ నవాల్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అమెరికా, ఫ్రాన్స్ రాయబారులు తదితరులు పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో ఆంక్షలు అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. -
USA: రష్యాపై భారీ ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు! మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది. నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి. ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్‌తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
పాశ్చాత్య బాణీలకు నృత్యం చేయాలా?
యూఎన్ ఛార్టర్ ప్రకారం సార్వభౌమత్వం అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధంగా లేవు. అందుకే ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి పరిధి లోనిది. జీ20 అజెండాలో లేదు. కానీ పశ్చిమ దేశాలు దీన్ని చాలా దురుసుగా అజెండాలోకి చేర్చాయి. యూరప్ సమస్యలను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ సమస్యలుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రతిపాదించిన అజెండా అమలు చేయడం ద్వారా మాత్రమే భిన్నధ్రువ దౌత్యం విషయంలో నమ్మకం పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముక్కలు కాకుండా ఉంటుంది. అంతర్జాతీయ అధికార పీఠాలిప్పుడు కదు లుతున్నాయి. నిన్నమొన్నటివరకూ కొందరికి అనుకూలంగా ఉన్న ప్రపంచం కాస్తా భిన్న ధ్రువమవుతోంది. అధికార మిప్పుడు అన్ని దిక్కులా విస్తరిస్తోంది. మునుపటితో పోలిస్తే ప్రపంచ వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల మాటలిప్పుడు ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నాయి. అయితే ఈ మార్పులను జీర్ణించుకునే పరి స్థితుల్లో పశ్చిమ దేశాల్లేవు. దేశాల సర్వసమానత్వం ఆధారంగా ప్రస్తు తమున్న అధికార వ్యవస్థ వీరికిప్పుడు అకస్మాత్తుగా చేదవుతోంది. యూఎన్ ఛార్టర్ ప్రకారం సార్వభౌమత్వం అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు అవి సిద్ధంగా లేవు. అందుకే ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర దేశాల వ్యవహారల్లో ప్రత్యక్షంగా కలుగచేసుకోవడం, పరోక్ష పద్ధతుల్లో యుద్ధం చేయడం... తమను ధిక్కరించే వారిపై పశ్చిమ దేశాలు చేసే ప్రయత్నాలన్నది తెలిసిన విషయమే. నిర్మాణాత్మక సహకారం కంటే పోటీతత్వానికి ఎక్కువ ఆదరణ ఉన్న సమయమిది. ఇంధన, ఆహార రంగాలు అస్థిరంగా ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. వాతావరణ మార్పులు, అధిక ద్రవ్యోల్బణం లాంటి మానవీయ సంక్షోభాలిప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలన్నీ అందరికీ ప్రయోజనకరమైన అంశాలపై, ఒప్పందాల అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఎనభై శాతం జీడీపీ జీ20 దేశాల్లోనే.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాల్లో సహకారం కోసం జీ20 ఏర్పాటైంది. ఈ ఇరవై దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపుగా 80 శాతం వరకూ ఉండటం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్యం, కర్బన ఉద్గారాలూ ఎక్కువే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనాభా ఈ జీ20 దేశాల్లోనే ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాల పరిష్కారానికి తగిన సామర్థ్యమూ కలిగి ఉందీ వేదిక. ప్రపంచం మాంద్యం ముంగిట్లో నిలిచిన ఈ తరుణంలో జీ20 మరింత ఆలస్యం చేయడం ఏమాత్రం తగదు. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రతిపాదించిన అజెండా అమలు చేయడం ద్వారా మాత్రమే భిన్నధ్రువ దౌత్యం విషయంలో నమ్మకం పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముక్కలు కాకుండా ఉంటుంది. పారిశ్రామిక వృద్ధి మళ్లీ పట్టాలు ఎక్కుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఎదుగుతున్న మార్కెట్లతోనూ భారత్‌కు సత్సంబంధాలున్నాయి. కాబట్టి భారత్ ప్రతిపాదించిన అజెండాతో లక్ష్యాల సాధన కష్టమేమీ కాబోదు. భారత్ ప్రాథమ్యాలతో రష్యా పూర్తిగా ఏకీభవిస్తోంది. ఎంచుకున్న లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల అనూహ్యమైన సాంఘిక, ఆర్థిక సమస్యలు, ప్రపంచస్థాయి సవాళ్లను సమర్థంగా ఎదుర్కో వచ్చునని రష్యా కూడా భావిస్తోంది. మార్చి 1, 2 తేదీల్లో జరిగిన జీ20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సమావేశాలు ఐక్యరాజ్యసమితి పాత్రతోపాటు బహుముఖ ప్రపంచ ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేశాయి. అజెండాలో కీలకమైన అంశాలను జొప్పించేందుకు భారత్ అనుసరించిన నిర్మాణాత్మక విధానం, సమతౌల్యతలను ప్రశంసించి తీరాలి. ఐక్యరాజ్యసమితి అంశం జీ20లోనా? నిజానికి ఉక్రెయిన్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి పరిధి లోనిది. జీ20 అజెండాలో లేదు. కానీ పశ్చిమ దేశాలు దీన్ని చాలా దురుసుగా అజెండాలోకి చేర్చాయి. రష్యాని తెగనాడటంపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడిందేమో అన్నంత హడావుడి చేశాయి. వ్యూహాత్మకంగా రష్యా ఓటమిని చూడాలని పాశ్చాత్య దేశాలు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యూరప్ సమస్యలను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ సమస్యలుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రష్యాతో సహా యూరప్ దేశాలు ఇప్పటికే విదేశీ బాణీలకు నృత్యం చేస్తూ వస్తున్నాయి. అయితే ఇది భద్రతకు సంబంధించిన అంశం. ‘నాటు నాటు’ డ్యాన్స్ కాదు. ఈ విషయంలో ప్రధాన ముద్దాయి కచ్చితంగా అమెరికా. దీని లక్ష్యం ఒక్కటే. తనను ఎవరూ ప్రశ్నించరాదు! రష్యాను అణచివేసేందుకు ఉక్రెయిన్ను ఒక పనిముట్టుగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ప్రపంచం మొత్తం పరోక్షంగా తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్నది అమెరికా లక్ష్యం. 2009 సెప్టెంబరులో జీ20 వేదిక లక్ష్యాల్లో అంతర్జాతీయ ఆర్థిక సహకారం ఒకటని తీర్మానించారు. ఇందుకు తగ్గట్టుగా జీ20 తన దృష్టిని ప్రపంచ ఆర్థిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించాలి. ఉక్రెయి¯Œ వంటి అంశాలను చేర్చడం వల్ల జీ20 లక్ష్యం విఫలమ వుతుంది. రష్యా దీన్ని కోరుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో ఈ అంశాలన్నింటిపై చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగానే ఉంది. జీ20 అజెండా మాత్రం హైజాక్ కారాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత్ లేవనెత్తిన ఉగ్రవాదం, మత్తుమందులు, ప్రకృతి వైపరీత్యాల విషయం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఉగ్రవాదం పెరుగుదలకు సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కారణమని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యధికులు అంగీకరిస్తారు. ఇందుకు ఒకప్పటి యుగోస్లేవియాతోపాటు లిబియా, ఇరాక్, సిరియా, అఫ్గాని స్తాన్లే ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దేశాల్లో ‘నాటో’ వ్యవహారాలు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అది అటు పసఫిక్లో, ఇటు ఆసియాలో తూర్పుదిక్కుగా మరింతగా విస్తరించాలని అనుకుంటోంది. ఈ పరిణామం మరిన్ని ఘర్షణలకు దారితీస్తుంది. యూరప్ దేశాల్లో మాదిరిగా విభజనకు దారితీస్తుంది. నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్‌ను అనూహ్యంగా ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి అసలు దోషులెవరన్నది ఎప్పటికైనా కచ్చితంగా తేలుతుంది. ఇరాక్‌లో నాటో చేసిన ఇతర ‘మంచి పనుల’ విషయం కూడా! అన్యాయమైన ఆంక్షలు, దేశాల మధ్య సరుకుల రవాణాను కృత్రిమంగా పాడు చేయడం వంటివి ఉక్రెయి¯Œ సమస్యకు మూల కారణాలు... తనను తాను రక్షించుకోవాలనుకుంటున్న రష్యా కాదు. ఈ విషయంపై ప్రజల్లో అపోహలు ఉన్న నేపథ్యంలో ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి. ఉక్రెయి¯Œ పై సైనిక దాడి చేయాలన్నది రష్యా ముందున్న అవకాశాల్లో ఒకటి కానేకాదు. రష్యా సార్వభౌమత్వానికి నేరుగా ముప్పు ఏర్పడటం, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి చర్యలకు ప్రతిగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఆర్థిక సంబంధాలు ఆయుధాలుగా మారిపోయాయి. ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ ఆహార రంగం గతి తప్పి ధరలు పెరిగాయి. రష్యాతోపాటు ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. నెపం మొత్తం రష్యాపై నెట్టాలన్నది నిలబడేది కాదు. జీ20 అజెండా అమలు కావాలనుకుంటే దాన్ని తిరస్కరించాలి కూడా. జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు రష్యా కట్టుబడి ఉంది. మంత్రుల స్థాయి సమావేశాలన్నింటిలో చురుకుగా పాల్గొంటోంది. లక్ష్యాల సాధనలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు, తగిన ఫలితాలు రాబట్టేందుకు తగినంత వెసులుబాటుతో వ్యహరించేందుకు సిద్ధంగా ఉన్నాం. దక్షిణాది దేశాలు ఎదుర్కోగల సమస్యల పరిష్కారం కంటే తమ వ్యూహాత్మక అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వారు నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం కూడా ఇదే! డెన్నిస్ అలిపోవ్ వ్యాసకర్త భారత్‌లో రష్యా రాయబారి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
Ukraine War: రష్యాకి చైనా మద్దతు బంద్ చేసేలా..అమెరికా రంగం సిద్ధం!
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు సాయాన్ని అందిస్తే చైనాపై ఆంక్షలు విధించడానికి అమెరికా రెడీ అవుతోంది. ఈ విషయమై ముఖ్యంగా జీ7 సముహంలోని దేశాల మద్దతు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా ఏవిధమైన ఆంక్షలు విధించాలనుకుంటదనేది స్పష్టం కాలేదు. వాస్తవానికి ఇటీవలే వాషింగ్టన్ దాని మిత్ర దేశాలు రష్యాకు ఆయుధాలు అందించడానికి చైనా యత్నిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అలాగే ఈవిషయమై అమెరికా ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశం తోపాటు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్, చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ ఈ మధ్య జరిగిన వ్యక్తిగత సమావేశంలో కూడా వారు చైనాను నేరుగానే హెచ్చరించారు. రష్యాకు చైనా మద్దతును కట్టడి చేసేలా బైడెన్ పరిపాలన యంత్రాంగం ట్రెజరీ డిపార్ట్మెంట్ తోసహా, దౌత్య స్థాయిలో చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసింది. దీన్ని ఏడాది క్రితమై అమలు చేసిందని, రష్యాపై ఆంక్షలకు మద్దతు ఇచ్చిన దేశాల సముహంతో బీజింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ప్రకారం.. రష్యాకు సాధ్యమైన సైనిక సహాయాన్ని అందించడం గురించి పరిగణలోకి తీసుకుంటే చైనా గురించి వస్తున్న వాదనలను తక్కువ దేశాలే సమర్థిస్తున్నాయి. యూఎస్ మిత్ర దేశాలకు సంబంధించినంత వరుకు చైనా కచ్చితంగా సాయం చేసే అవకాశం ఉందంటూ పలు కారణాలను చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి కొద్ది క్షణాల ముందు రష్యాతో పరిమితులు లేని భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనే చైనాపై పలు అనుమానాలు వ్యక్తమయ్యేందుకు దారితీసింది. అదీగాక జీ7 ఫ్రంట్‌లో ఈ విషయమే చర్చించి చైనాపై వివరణాత్మక చర్యలు తీసుకునేలా దృష్టి సారించాలని చూస్తోంది యూఎస్. ఇదిలా ఉండగా, గత వారం చైనా సమగ్ర కాల్పుల విరమణ కోసం 12 పాయింట్ల పత్రాన్న సైతం విడుదల చేయడం గమనార్హం. చైనాని కట్టడి చేయడం సాధ్యమేనా! రష్యాకి యుద్ధ సామాగ్రి తక్కువగా ఉండటంతో చైనా నుంచి ఆయుధ సరఫరా రష్యాకి అనుకూలంగా మారతుందని ఉక్రెయిన్ మద్ధతుదారులు భయాపడుతున్నారు. ఐతే ఫిబ్రవరి 24 జీ7 ప్రకటనలో ఉక్రెయిన్‌పై దాడి జరిగి ఏడారి పూర్తి అయిన సందర్భంగా.. రష్యా యుద్ధానికి అవసరమైన వస్తుపరమైన సాయాన్ని అందించకూడదు లేదంటే దీనికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది వాషింగ్టన్. అంతేగాదు చైనా పేరుని ప్రస్తావించకుండానే రష్యా ఆంక్షల నుంచి తప్పించుకునేలా సహాయపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కంపెనీలపై యూఎస్ జరిమానాలు విధించింది. చైనాపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన ఐరోపా, ఆసియాలనే ఏకతాటిపై తీసుకురావడం పెను సవాలుగా ఉంది. ఎందుకంటే.. జర్మనీ నుంచి దక్షిణ కొరియా వరుకు ఉన్న అమెరికా మిత్ర దేశాలు చైనాను దూరం పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాయి. (చదవండి: అందుకేనా! రష్యా భారత్ చమురు మార్కెట్ వైపే మొగ్గు చూపుతోంది) -
భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు
ఢిల్లీ: భారత్‌కు చెందిన ఓ కంపెనీపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ నుంచి పెట్రోలియం ప్రొడక్టులు కొనుగోలు చేయడమే అందుకు కారణం. అంతేకాదు.. సదరు కంపెనీ ఆ ఉత్పత్తులను చైనాకు రవాణా చేస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఆఫీస్ అడ్రస్‌తో ఉన్న టిబాలాజీ పెట్రోకెమ్ కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ కంపెనీతో పాటు యూఏఈ, హాంగ్ కాంగ్‌కు చెందిన మొత్తం ఏడు కంపెనీలు సైతం అమెరికా ఆంక్షలను ఎదుర్కొనున్నాయి. ఈ మేరకు ఓఎఫ్ఏసీ(Office of Foreign Assets Control) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌తో న్యూక్లియర్ డీల్ చెదిరిన తర్వాత 2018-19 నడుమ ట్రంప్ హయాంలోని ప్రభుత్వం ఏకపక్ష ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం 2019 నుంచి ఇరాన్‌తో ఆయిల్ ఉత్పత్తుల దిగుమతి ఒప్పందాల్ని నిలిపివేసింది. అయితే.. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం పెరిగింది. ఇక తాజా ఆంక్షల విధింపు పరిణామం.. విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే చోటు చేసుకోవడం గమనార్హం. టిబాలాజీ కంపెనీ మిలియన్ల డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను ఇరాన్ కంపెనీ ట్రిలయన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
చైనా కక్ష పూరిత చర్య.. ఆంక్షల మోత!
చైనా: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన చైనాకి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఆఖరికి అమెరికా దిగొచ్చి కేవలం తమ డెమెక్రెటిక్ కాంగ్రెస్ సభ్యుల పర్యటన అని చైనాని బుజ్జగింపు ప్రయత్నం చేసింది. అయినా ససేమిరా అంటూ తైవాన్‌పై పదే పదే ద్వేషపూరిత చర్యలకు దిగుతోంది చైనా. అదీగాక ఆది నుంచి ప్రజాస్వామ్యయుతంగా స్వయంపాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారాన్ని తిరస్కరిస్తూ వస్తోంది చైనా. ప్రస్తుతం ఈ యూఎస్ అత్యన్నతాధికారి నాన్సీ పర్యటనతో తీవ్ర ఆగ్రహోజ్వాలతో రగలిపోతుంది చైనా. అందులో భాగంగా చైనా తాజగా ఏడుగురు తైవాన్ అధికారులపై ఆంక్షలు విధించింది. వారంతా తైవాన్ స్వాతంత్య్రానికి మద్ధతిచ్చినందుకే చైనా ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు చైనా అంక్షలు విధించిన తైవాన్ వ్యవహారాల కార్యాలయం అధికారుల్లో వాషింగ్టన్‌లోని తైవాన్ రాయబారి హ్సియావో బిఖిమ్ , తైవాన్ జాతీయ భద్రతా మండలి సెక్రటరీ జనరల్ వెల్లింగ్టన్ కూ ఉన్నారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. అంతేగాక తైవాన్ అధికార రాజకీయ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఆయా అధికారులంతా హాంకాంగ్, మకావులను పర్యటించలేరని తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు ఆయా సంస్థల పెట్టుబడు దారులు కూడా చైనాలో లాభం పొందేందుకు కూడా అనుమతించదని స్పష్టం చేశారు. ఈ ఏడుగురు అధికారుల తోపాటు అదనంగా మరో ముగ్గురు అధికారులు తైవాన్ ప్రీమియర్ సుత్సెంగ్ చాంగ్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వు, పార్లమెంట్ స్పీకర్ సికున్ల పై కూడా ఆంక్షలు విధించినట్లు తైవాన్ పేర్కొంది. (చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం) -
తైవాన్ టూర్ ఎఫెక్ట్: నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనపై ముందు నుంచే మండిపడుతోంది చైనా. అయినప్పటికీ.. తైపీలో పర్యటించారు పెలోసీ. దీంతో అటు తైవాన్‌తో పాటు అమెరికాపైనా కన్నెర్ర చేస్తోంది డ్రాగన్ దేశం. తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ‘చైనా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా పెలోసీ తైవాన్‌లో పర్యటించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకోవటం తీవ్రమైన అంశం. చైనా సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, ఒకే చైనా పాలసీని అణచివేయటమే. అలాగే.. తైవాన్‌లో శాంతి, సామరస్యాన్ని ఆందోళనలో పడేశారు. దాంతో పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై బీజింగ్ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. చైనాలోని షింజియాంగ్, హాంగ్‌కాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, డ్రాగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇటీవల పలువురు అమెరికా అధికారులపై ఆంక్షలు విధించింది. అమెరికా అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈఏడాది మార్చిలో ప్రకటించింది చైనా. ఈ జాబితాలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరోవ్‌లు ఉన్నారు. చైనాలోకి ప్రవేశించకుండా, చైనాతో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఈ ఆంక్షలు ఉన్నాయి. ఇదీ చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్ -
బైడెన్ అలా చేస్తాడా? చైనాకు దాసోహం అంటాడా?
ప్రపంచంలో ఏ మూల సమస్య వచ్చినా రాకున్నా నేనున్నానంటూ తలదూర్చే అమెరికాకు ద్రవ్యోల్బణం మింగుడుపడటం లేదు. ఆయధ శక్తిలో ఆర్థిక సంపత్తితో ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోంది. దీంతో వివిధ దేశాలపై విధించిన కఠిన ఆంక్షల విషయంలో పట్టువిడుపు ధోరణితో ఉంటే ఎలా ఉంటుందనే అంశాన్ని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. నలభై ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ట స్థాయిలో అమెరికాలో ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ధరలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి అవసరమైతే చైనాపై విధించిన ఆంక్షల్లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అంశాన్ని ఆ దేశం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆ యూఎస్ కామర్స్ సెక్రటరీ జినా రైమాండో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులుగా అమెరికా, చైనాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో వివిధ కారణాలతో 2018,19లో చైనా దిగుమతులపై తీవ్ర ఆంక్షలు విధించారు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికీ ఆ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే అమెరికాలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరడంతో చీప్‌గా వచ్చే చైనా వస్తువులు దిగుమతి చేసుకోవడం ద్వారా ధరల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే అవకాశం ఏమైనా ఉందేమో పరిశీలించాలంటూ జోబైడెన్ తమను ఆదేశించినట్టు రైమాండో తెలిపారు. అమెరికా అధ్యక్షుడి సూచనల మేరకు కొన్ని తాము ప్రతిపాదనలు తయారు చేశామని రైమాండో వివరించారు. దేశీ పరిశ్రమలను కాపాడే లక్ష్యంతో స్టీలు, అల్యూమినియం వంటి వాటిపై ఆంక్షలు కొనసాగించాలని సూచించినట్టు తెలిపారు. అయితే పుడ్, సైకిళ్లు వంటి విభాగాల్లో ఆంక్షలు సడిలించే అంశాన్ని పరిశీలించాలని కోరినట్టు వెల్లడించారు. అయితే తాము కేవలం చూనలు చేశామని, తుది నిర్ణయం అధ్యక్షుడు జో బైడెన్ తీసుకుంటారని రైమాండో వెల్లడించారు. చదవండి: ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్ టూ రిపేర్’ యాక్ట్ -
సెక్యూరిటీ చీఫ్‌ని తొలగించిన జెలెన్ స్కీ!
ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో రెచ్చిపోతున్న రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని తూర్పు నగరాలపై విధ్వంసం సృష్టించాయి. దీంతో దెబ్బతిన్న ఖార్కివ్ ప్రాంతాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. ఆ ప్రాంతంలో నగరాన్ని పూర్తి స్థాయిలో రక్షించేందుకు ప్రయత్నించని ఒక సెక్యూరిటీ చీఫ్‌ని కూడా తొలగించారు. ఖార్కివ్‌లోని పరిసరా ప్రాంతాలన్ని చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని జెలెన్ స్కీ అన్నారు. అదీగాక రష్య కైవ్‌ని స్వాధీనం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ఖార్కివ్ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గి తూర్పు డోన్బాస్ ప్రాంతం నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని తూర్పువైపు దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. ఐతే జెలెన్ స్కీ మాత్రం చివరి వరకు మా దేశాన్ని రక్షించుకుంటామని పునరుద్ఘాటించటం విశేషం. అంతేకాదు ఖార్కివ్ ప్రాంతంలోని మూడో వంతు రష్యా అధినంలో ఉంది. పైగా రష్యా దళాల బాంబుల వర్షంతో విరుచుకుపడటంతో అక్కడ పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. వేలాదిమంది పౌరులు చనిపోవడమే కాకుండా ఆ ప్రాంతాలకు వెళ్లడం కూడా కష్టతరంగా ఉందని స్థానిక గవర్నర్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ ఆయుధ డిపోలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని క్రెయిన్వాసులు తాగు నీరు లేక, ఆహారం కొనగోలు చేసేందుకు డబ్బులు లేక అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు. దీంతో జెలెన్స్కీ ధ్వంసమైన ప్రాంతాలను పునర్మించే దిశగా స్థానిక అధికారులతో ప్రణాళికా చర్చలు జరిపారు. మరోవైపు రష్యా ఎగుమతులపై ఆంక్షలు పెంచేలా ఒత్తిడి చేసేందుకు ఈయూ నాయకులతో శిఖరాగ్ర సమావేశమయ్యారు. అంతేకాదు హంగేరి, క్రోయోషియా వంటి దేశాలు రష్యా నుంచి దిగుమతి చేసుకునే భూగర్భ ఆధారిత పైప్ లైన్ చమురు పైనే ఆధారపడి ఉంది. దీంతో ఈయూ శిఖారాగ్ర సమావేశంలో పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే చమురు పై కాకుండా ట్యాంకర్ల ద్వారా చమురు సరఫరా చేసే ప్రతిపాదనను తీసుకొచ్చారు. (చదవండి: పుతిన్ బతికేది మరో మూడేళ్లే!.. తొలిసారి స్పందించిన రష్యా) -
Kim Jong-un: ఉత్తరకొరియాకు భారీ ఊరట
న్యూయార్క్: ఉత్తర కొరియాకు భారీ ఊరట దక్కింది. అణుసామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగాలు సాగిస్తున్న ఉత్తరకొరియాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితిలో వీగిపోయింది. ఐరాసలోని 15 దేశాల భద్రతా మండలిలో అమెరికా చేసిన ఈ తీర్మానం 13–2 ఓట్ల తేడాతో వీగిపోయింది. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయడంతో ప్రపంచ దేశాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రష్యా సంగతి ఏమోగానీ.. చైనా బహిరంగంగా ఆంక్షలను(అమెరికా) వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదటి నుంచి వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ వస్తున్నాడు కిమ్. ఈ పరీక్షలపై పొరుగు దేశం దక్షిణ కొరియా సహా జపాన్, అమెరికాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయ శాంతి స్థాపనకు నార్త్ కొరియాను, నియంతాధ్యక్షుడిని కట్టడి చేయాలని మిగతా దేశాలను కోరుతున్నాయి. కానీ, కిమ్ మాత్రం తాజా పరిణామంతో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. చదవండి: అపర కుబేరుడి కొంప ముంచే పనిలో చైనా -
పుతిన్‌పై బ్యాన్ విధించిన కెనడా
ఒట్టావా: ఉత్తర అమెరికా దేశం కెనడా ఊహించని నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై నిషేధం విధించింది. పుతిన్‌తో పాటు మరో వెయ్యి మంది రష్యన్ జాతీయలు మీద(రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు ఉన్నారు) కూడా బ్యాన్ విధిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది కెనడా. రష్యా ఉక్రెయిన్ గడ్డపై పాల్పడుతున్న యుద్ధనేరాలకు ప్రతిగానే పుతిన్, ఆయన అనుచర గణం ఎంట్రీపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా.. పాశ్చాత్య దేశాల తరపున ఉక్రెయిన్‌కు మద్ధతు చెప్పిన నేతల జాబితాలో ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా చేరిపోయారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత.. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల్లో కెనడా సైతం భాగమైంది. ఈ తరుణంలో రష్యా, ట్రూడోతో పాటు సుమారు 600 మంది కెనడా ప్రముఖులపై నిషేధం విధించింది. దీనికి ప్రతిగానే ఇప్పుడు ప్రత్యేక చట్టం ద్వారా పుతిన్ అండ్ కోపై నిషేధం విధించింది కెనడా. ఇదిలా ఉండగా.. ఈ నెల మొదట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్‌పై హఠాత్తుగా పర్యటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో.. ముందుగా ఇర్విన్ పట్టణాన్ని రష్యా బలగాలు నాశనం చేశాయి. అందుకే కెనడా ప్రధాని ట్రూడో ఇర్విన్‌లోనే పర్యటించారు. అక్కడి పౌరుల ఇళ్లు దెబ్బతినడంపై ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యి.. యుద్ధంలో ఉక్రెయిన్‌కు కెనడా మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించాడు కూడా. చదవండి: నియంతలు అంతం కాక తప్పదు: జెలెన్స్కీ -
Russia War: యుద్ధంలో ఊహించని ట్విస్టులు.. టెన్షన్లో జెలెన్ స్కీ!
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు జరుగుతున్న వేళ భయనక వాతావరణం చోటుచేసుకుంది. ఎటు చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడిపోయి ఉండటం ప్రపంచ దేశాలను కలచివేస్తోంది. కాగా, మారియుపోల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్‌లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. దీంతో మారియుపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ, తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. యుద్దం కారణంగా రష్యాపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పుతిన్, రష్యాకు చెందిన పలువురు ప్రముఖులపై అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి జపాన్, స్విట్జర్లాండ్ అంగీకరించాయి. ఉక్రెయిన్ పౌరులపై దాడులకు రష్యాను జవాబుదారీగా చేయాలని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద సోమవారం టోక్యోలో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కిషిద తెలిపారు. అలాగే, రష్యాకు చెందిన ప్రముఖుల ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రష్యా సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే వస్తువుల ఎగుమతులను కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. Cemetery in Irpin#Ukrainian investigators have examined 269 dead bodies in #Irpin, near #Kyiv, since the town was taken back from #Russian forces in late March, a police official said on Monday, as workers dug fresh graves on its outskirts. Video: Reuters pic.twitter.com/Dadl4aPXQz — NEXTA (@nexta_tv) April 18, 2022 మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్ ఆల్ హసన్ డివిజన్‌కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. జనరల్ అలెగ్జాండర్‌ను ఉక్రెయిన్‌పై యుద్ధ దళపతిగా పుతిన్ నియమించిన సంగతి తెలిసిందే. గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. ఇది చదవండి: ‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్ -
పుతిన్ కూతుళ్లే లక్ష్యంగా..
ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యల పేరిట నరమేధానికి పాల్పడుతున్నాడంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చాలా దేశాలు నిందిస్తున్నాయి. బుచా నరమేధం వెలుగులోకి వచ్చాక ఆ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు మొదటి నుంచి అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రధాని పుతిన్ కూతుళ్లను లక్ష్యంగా చేసుకుని కఠిన ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ అనుకుంటోంది. పుతిన్ కూతుళ్లు కాటెరీనా, మరియాలపై విధించబోయే ఆంక్షల జాబితాను సిద్ధం చేసింది యూరోపియన్ యూనియన్. ప్రత్యేకంగా పుతిన్ దృష్టికి వెళ్లేలా ఈ ఆంక్షలు ఉండబోతున్నాయని ఈయూ అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈయూ దేశాల ప్రభుత్వాలు వీటికి అధికారిక ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. పుతిన్ ఇద్దరు కూతుళ్లతోపాటు రష్యా రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పుతిన్ కుటుంబ సభ్యులకూ ఈ ఆంక్షలు వర్తింపజేయాలని అనుకుంటున్నాయి. రక్షణ రంగంలో పాటు నాలుగు బ్యాంకులపైనా, బొగ్గు ఉత్పత్తులపైనా కొత్త ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే క్రెమ్లిన్ మాత్రం అలాంటి ఆంక్షల ప్రతిపాదనేది తమ దృష్టికి రాలేదని అంటోంది. ఇప్పటికే పుతిన్ దగ్గరి వాళ్లపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పుతిన్ కూతుళ్లు ప్రస్తుతం రహస్య జీవనంలో ఉన్నారు. రకరకాల పేర్లు మార్చుకుని.. ప్రాంతాలు మారుతూ జీవిస్తున్నారు. అయితే అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మాత్రం ఏనాడూ వాళ్ల పేర్లను, ఐడెంటిటీని రివీల్ చేయలేదు. అలాగే యుక్త వయసులో వాళ్లు ఎలా ఉన్నారనే ఫొటోలు ఎక్కడా లేవు. ఈ తరుణంలో ఆంక్షల విధింపు, అన్వయింపజేయడంపై ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2015లో పుతిన్ తన కూతుళ్ల గురించి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కూతుళ్లు గ్రాడ్యుయేట్లు అని, బోలెడు భాషలు మాట్లాడగలరని మాత్రమే చెప్పాడు. పుతిన్ పెద్ద కూతురు మరియా వోరోన్త్సోవా.. హెల్త్ కేర్‌కు సంబంధించిన పెట్టుబడుల కంపెనీ నోమోన్కోకి సహ భాగస్వామిగా ఉంది. అలాగే చిన్న కూతురు కాటెరీనా టిఖోనోవా.. మాస్కోలోని అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ఇనిస్టిట్యూట్‌ను నడిపిస్తోందన్నది మాస్కో మీడియా వర్గాలు ఆ మధ్య ఫొటోలతో సహా కథనాలు ప్రచురించాయి. చదవండి: పుతిన్ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది? -
మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన
Zelenskyy receives a standing ovation from the US lawmakers: ఉక్రెయిన్ పై రష్యా గత 21 రోజులుగా నిరవధిక దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ ఆక్రమణే ద్యేయంగా రష్యా మరింత దుశ్చర్యలకు ఒడిగడుతోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యూఎస్ కాంగ్రెస్‌తో వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడారు. వ్లోదిమిర్ జెలెన్ స్కీ స్క్రీన్ పై కనబడగానే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల నిలబడి ప్రశంసించారు. జెలెన్స్కీ అమెరికా కాంగ్రెస్‌ని మరింత సైనిక సాయం చేయమని కోరారు. రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా రష్యాతో సాగిస్తున్న వ్యాపారాలను ఉపసంహరించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆదాయం కంటే శాంతికి పెద్ద పీట వేస్తూ అమెరికా తప్పనిసరిగా దిగుమతులను నిరోధించేలా కట్టుదిట్టం చేయమని కోరారు. రష్యా ఉక్రెయిన్ ఆకాశాన్ని వేలాది మంది మరణాలకు వేదికగా చేసింది." రష్యా మా దేశంలోని విలువలకు, స్వేచ్ఛయుత జీవనానికి భంగం కలిగించేలా దాడి చేసింది. మా కలలను కల్లోల పరిచేలా క్రూరంగా దాడి చేసిందని జెలెన్స్కీ ఆవేదనగా పేర్కొన్నారు". మరోసారి జెలెన్ స్కీ నో ఫ్లై జోన్ అంశం గురించి ప్రస్తావించారు. ఈ మేరకు రష్యా తమ దేశం పై క్రూరంగా చేస్తున్న దాడుల తాలుకా వీడియోని ప్లే చేశారు. యూఎస్ ఇస్తున మద్దతుకు కృతజ్ఞతలు తెలపడమే కాక తమ దేశం కోసం మరింత చేయమని కోరారు. అమెరికా మద్దతు తమ దేశానికి ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. (చదవండి: రష్యా టీవీ లైవ్‌షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!) -
యుద్ధానికి రష్యా గుడ్ బై చెప్పనుందా?.. అదే కారణమా?
Russia Forced To Stop War Due To Lck of Resource: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధాల కొరత ఏర్పడనుందా?, రష్యాకు యుద్ధం చేసే సామర్ధ్యం తగ్గిపోయిందా? అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. ఎలాగైనా ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న రష్యా.. అంత త్వరగా యుద్ధాన్ని ముగిస్తుందని ప్రస్తుతం ఎవరూ అనుకోకపోయినా, ఏమైనా బలమైన కారణాలు ఉంటే మాత్రం యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి రష్యాకు తప్పదనే విశ్లేషణలు కూడా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఐరోపా మాజీ యూఎస్ కమాండిగ్ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ స్పష్టం చేశాడు. ఈ మేరకు రష్యాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడు. రష్యన్లు త్వరలోనే వనరుల కొరత కారణంగా ఉక్రెయిన్ పై దాడిని ఆపే స్థితికి చేరుకోనుందని వెల్లడించారు. అంతేగాదు రష్యా బలగాలకు వనరుల కొరత తీవ్రంగా ఏర్పడునుందని నిపుణులు కూడా చెబుతున్నారని అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ మాట్లాడుతూ.. రష్యన్లు యావోరివ్లోని కర్ట్ వోల్కర్ శిక్షణా కేంద్రమైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాజీ రాయబారిని వెంబడించడమే కాక ఉక్రెయిన్‌కి పోలాండ్ నుంచి యుద్ధ సామాగ్రిని తరలించే సరిహద్దుల వద్ద రష్యన్లు గస్తీ కాసారని అన్నారు. అయితే నాటో భూభాగాలకు సమీపంలో జరిగిన దాడిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు. పైగా రష్యన్లు వనరుల కొరత కారణంగా దాడిని ఆపాల్సిన పరాకాష్టకు చేరుకున్నారని స్పష్టం చేశారు. రష్యాలో సుమారు 10 రోజుల్లో మానవ శక్తి, మందుగుండు సామాగ్రి కొరత ఏర్పడనుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు గానూ మాస్కోను శిక్షించేందుకు 27 దేశాల కూటమి కొత్త ఆంక్షలను ఆమోదించినట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. అంతేగాక ఈయూ ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఫ్రాన్స్, కూటమి "మా అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించి, ఉక్రెయిన్‌పై దురాక్రమణలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని, అలాగే రష్యన్ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలకు సంబంధించిన ప్యాకేజీని ఆమోదించింది" అని తెలిపింది". మొత్తంగా ఈయూ నియంత్రణ చర్యలు ఇప్పుడు సుమారు 862 మంది వ్యక్తలకు, 53 సంస్థలకు వర్తించనున్నాయి. (చదవండి: యుద్ధం వేళ ఆ మాత్రలకు ఎందుకంత డిమాండ్?) -
Russia Ukraine War: రష్యా జనజీవనం ఆగమాగం!
‘‘ఇది పూర్తిగా కొత్త తరహా సంక్షోభం. బహుశా మాకిది కొత్తేమో!. కంపెనీలు మూతపడి ఉద్యోగాలు ఊడాయి. ఉపాధి లేక ఆదాయం కోల్పోయాం. నిత్యావసరాలు ప్రియంగా మారాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం అయిన వాళ్లను కూడా ఆప్యాయంగా పలకరించుకోలేకపోతున్నాం..’’ అంటూ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా యాప్స్ ద్వారా తమ ఆవేదనను పంచుకుంటున్నారు రష్యన్ ప్రజలు. ఉక్రెయిన్ సంక్షోభ Ukraine Crisis పరిణామాలను ఖండిస్తూ.. ఆంక్షలతో రష్యాను, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను ఇరకాటంలోకి నెట్టేసినట్లు సంబురపడిపోతున్నాయి పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకించి అమెరికా. కానీ, ఆ ప్రభావం రష్యన్ సాధారణ ప్రజానీకాన్ని ఆగమాగం చేస్తోంది. ఆంక్షల్ని ఎదుర్కొంటూనే.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకెళ్లాలని భావించిన పుతిన్‌కు విరుద్ధ ఫలితాలే దర్శనమిస్తున్నాయి. ‘సెల్ఫ్ రష్యా’ ప్రణాళిక బెడిసి కొట్టడంతో పాటు ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థను నానాటికీ దిగజారుస్తోంది. ధరలు విపరీతంగా పెరిగిపోయి.. వ్యాపారాలు పడిపోయి.. అయినవాళ్లతో సంబంధాలకు అన్నిమార్గాలు తెగిపోయి నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. ఉద్యోగాల నుంచి.. ► రష్యా దండయాత్రపై ఆగ్రహిస్తూ.. ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున, రికార్డు స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించాయి. విదేశీ కంపెనీలు తమ తమ కార్యాలయాలు, వ్యాపారాలు మూసేసి వెళ్లిపోతున్నాయి. దీంతో ఉపాధి పోయి లక్షల మంది రోడ్డున పడ్డారు. రష్యాలో మూతపడ్డ కంపెనీలు తెరిపించి ఉపాధి కల్పించాలనుకున్న పుతిన్ ప్రభుత్వ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఎదురవుతోంది. ముఖ్యంగా ధనికులు తమకు అనుకూల నిర్ణయాలు పుతిన్ నుంచి రాకపోవడంతో సహకారం అందించడం లేదు. ► నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు కొండెక్కాయి. పాల ధరలు రెట్టింపు కాగా, నిత్యావసరాల ధరలు 50-100 శాతం వరకు పెరిగాయి. వాటిని కొనే స్థోమత సామాన్యులకు లేదు. ఔషధాలకూ కొరత ఏర్పడింది. కొన్ని అయితే దొరకట్లేదు కూడా. స్టాక్‌లు లేకపోవడంతో కొన్నింటిపై పరిమితులు విధిస్తున్నారు. ► రష్యాపై ఆంక్షలతో అయినా దారికి తీసుకురావాలన్నది పాశ్చాత్య దేశాల వ్యూహం. అయినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఇది రష్యన్ల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ► ఏటీఎంల నుంచి రోజువారీ ఉపసంహరణలపై రష్యా సర్కారు ఆంక్షలు అమలు చేసింది. విత్‌డ్రా క్యూలు పెరిగిపోతున్నాయి. దళారులు కమీషన్ బేస్డ్తో కరెన్సీ అందిస్తూ.. అందినంతా జనాల నుంచి లాగేస్తున్నారు. ► పాశ్చాత్య దేశాల ఆంక్షలతో.. రష్యన్ వ్యాపారాలు మనుగడ ఇబ్బందికరంగా మారింది. కరోనా టైం కంటే.. ఈ యుద్ధ సమయంలోనే రష్యా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కస్టమర్లు తగ్గిపోతుండడంతో.. ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఆంక్షలతో రష్యాలోని వ్యాపార సంస్థలకు ఆదాయం పడిపోయింది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను నిలిపివేశాయి. కనెక్షన్ కట్.. కట్.. అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమాల సేవలు కూడా రష్యాలో కొన్ని నిలిచిపోగా, మిగిలినవీ పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రష్యన్లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తున్నారు. గ్లోబల్ సోషల్ మీడియాపై ఎఫెక్ట్ పడడంతో.. రష్యా ఇప్పుడు సొంత మీడియా సంస్థల మీదే ఆధారపడి ఉంది. యుద్ధంతో ఉక్రెయిన్‌పై తమ అధ్యక్షుడు పుతిన్ ఏం సాధిస్తుందో తెలియదుగానీ.. తాము మాత్రం చెప్పుకోలేని కష్టాలు అనుభవిస్తున్నామని వాపోతున్నారు రష్యా ప్రజలు. ఉక్రెయిన్ ప్రజలు ఒకవైపు తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటే.. భారీగా పెరిగిపోయిన ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేయలేని ఇబ్బందికర పరిస్థితులు రష్యా ప్రజలకు ఎదురవుతున్నాయి. నాలుగో దశ చర్చలతోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలని రష్యాతో పాటు చాలా దేశాలు కోరుకుంటున్నాయి ఇప్పుడు. -
ఉక్రెయిన్ ఆక్రమణ.. రష్యా ఖాతాలో కొ(చె)త్త రికార్డు!
Russia Faced Most Sanctions In The World: ఉక్రెయిన్‌పై యుద్ధం(మిలిటరీ చర్యల) నేపథ్యంలో.. రష్యా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా ఘనత సొంతం చేసుకుంది(ఇప్పటివరకు). గతంలో ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా వాటిని ఇప్పుడు దాటేసింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన పదిరోజుల్లోనే.. ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది రష్యా. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలను లెక్కించే కాస్టెలమ్.ఏఐ (Castellum.ai) గణాంకాల ప్రకారం.. రష్యా.. ప్రస్తుతానికి 5,530 (కొనసాగింపు) ఇరాన్.. అణు కార్యక్రమం, తీవ్రవాదానికి మద్దతు ఇస్తుందన్న ఆరోపణలతో ఇరాన్ గత దశాబ్ద కాలంగా 3,616 ఆంక్షలను ఎదుర్కొంటోంది. సిరియా ఉత్తరకొరియా వెనిజులా మయన్మార్ క్యూబా.. ఇలా ఉంది లిస్ట్. ► ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బేఖాతరు చేస్తూ వస్తున్నాడు. అందుకే.. తమ పొదిలో ఉన్న ఆంక్షలనే ఆయుధాలతో విరుచుకుపడుతున్నాయి పాశ్చాత్య దేశాలు. అయినప్పటికీ రష్యా మాత్రం తగ్గేదేలే అంటోంది. ► ఫిబ్రవరి 22 నుంచి అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు రష్యాపై 2,778 కొత్త ఆంక్షలను విధించాయి. దీంతో మొత్తంగా రష్యాపై ఆంక్షల సంఖ్య 5,530ని దాటేసింది. ► రష్యా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిపై ‘ఇది ఆర్థిక అణుయుద్ధం, చరిత్రలో అతిపెద్ద ఆంక్షల ఘటన’.. అంటూ ఒబామా, ట్రంప్ హయాంలో మాజీ ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికారి పీటర్ పియాట్స్కీ అభివర్ణిస్తున్నారు. ► ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రెండు వారాల్లోనే రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలకు లక్ష్యంగా మారడం గమనార్హం. రష్యా, ఇరాన్ తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో సిరియా, ఉత్తరకొరియా, వెనిజులా, మయన్మార్, క్యూబా ఉన్నాయి. ఓవైపు శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. చదవండి: అయ్యా పుతిన్..మనదగ్గర బేరాల్లేవమ్మా! -
Russia-Ukraine War.. బెలారస్‌కు బిగ్ షాక్
EU Sanctions On Belarus: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. కాగా, రష్యా దాడులకు ప్రత్యక్షంగా బెలారస్ సపోర్టు అందించిన విషయం తెలిసిందే. బెలారస్ నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి చోరబడ్డాయి. ఈ నేపథ్యంలో బెలారస్ ఊహించని షాక్ తలిగింది. (ఇది చదవండి: భారత్ అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రష్యా..) ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్‌పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధేంచేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్ ప్రెసెడెన్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, బెలారస్‌పై కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలతో పాటుగా కలప, ఉక్కు, పోటాషియంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సైతం బెలారస్లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. (ఇది చదవండి: ఆగని మారణహోమం: ‘రష్యాను చావుదెబ్బకొట్టాం.. ఏకంగా 6వేల మందిని..’) మరోవైపు ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మొదటిసారిగా బెలరాస్ వేదికగా శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో రెండు దేశాలు వారి డిమాండ్స్పైనే దృష్టి సారించడంతో చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ క్రమంలో రెండు దేశాలు ప్రతినిధులు బుధవారం మరోసారి చర్చలు జరుపనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదోనని ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. -
డ్యామిట్! కథ అడ్డం తిరుగుతోంది.. ఆర్థిక ఆంక్షలు.. విలవిల్లాడుతున్న రష్యా
నాటోలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఉక్రెయిన్‌పై దాడి మొదలెట్టిన రష్యాకు వారం రోజుల్లోనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ భీరాలు పలుకుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయి. ఆంక్షల ఒత్తిడి యుద్ధం మొదలైన వెంటనే అమెరికా మొదలు కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీలతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ బ్యాంకులు తమ సేవలు నిలిపేస్తున్నట్టు ప్రకటించాయి. ఆఖరికి అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి కూడా రష్యాను పక్కకు తప్పించారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న రష్యన్ డాలర్లను జప్తు చేశారు. స్టాక్ మార్కెట్ క్లోజ్ ఒక్కసారిగా వచ్చిపడ్డ ఆంక్షలతో రష్యన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు కంగారు పడిపోతున్నారు. మార్కెట్ నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు తొందరపడుతున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికే రష్యా మార్కెట్ ప్రధాన సూచీలు 30 శాతంత మేర క్షీణించాయి. ఇదే ఒరవడి కొనసాగితే మార్కెట్ సంపద మొత్తం గుల్లగా మారి ఆర్థిత వ్యవస్థ మరింతగా ఒత్తిడిలోనవుతుందనే భయాలతో సోమ, మంగళ, బుధవారాల్లో తమ స్టాక్ మార్కెట్లను మూసేంది రష్యా. రూబల్ పతనం రష్యా తన స్టాక్‌మార్కెట్లను మూసేసినప్పటికీ నష్టాల పరంపరకు అడ్డుకట్ట పడలేదు. వివిధ దేశాల్లో ఉన్న రష్యన్ స్టాక్స్ వాల్యూ కూడా ఢమాల్ అంటోంది. వివిధ మార్కెట్లలో ఉన్న ఎక్సేంజ్ ట్రేడ్ ఫండ్ (ఏటీఎఫ్) వాల్యూలకు కోత పడుతోంది. డాలర్‌తో 101 రూబుల్స్, యూరో కరెన్సీతో 112 దగ్గర ట్రేడ్ అవుతోంది. యుద్ధానికి ముందు రూబల్ మారక విలువ డాలర్‌తో పోల్చితే 75 రూబల్స్గా ఉంది. దీంతో రూబుల్ విలువ పతనం అడ్డుకునేందుకు విదేశీ కరెన్సీ ఎక్సేంజీపై ఆంక్షలు విధించింది రష్యా ప్రభుత్వం. మరోవైపు ఆంక్షల ఎఫెక్ట్‌తో రష్యా దగ్గర నిల్వ ఉన్న 600 బిలియన్ డాలర్లు మారక కరెన్సీ కూడా కొరగాకుండా పోతుంది. ఇండియా వైపు ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేకపోవడం, అక్కడ పెట్టుబడులకు గ్యారెంటీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ముఖ్యంగా రష్య మార్కెట్‌పై ఫోకస్ చేసిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు తక్షణ ప్రత్యామ్నయంగా ఇండియా కనిపిస్తోందని మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) అంచనా వేస్తోంది. చైనా వద్దు ఎంఎస్సీఐ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌మార్కెట్ సూచీలను అనుసరించి ఇండెక్స్ రూపొందిస్తుంది. ఎంఎస్సీఐ ఇండెక్స్ సూచీలో చైనా, తైవాన్‌ల తర్వాత ఇండియాకే వెయిటేజీ ఎక్కువగా ఉంది. తైవాన్, చైనాల మధ్య కూడా ఘర్షణ పూరిత వాతవరణం ఉండటంతో ఇండియానే బెస్ట్ ఆప్షన్‌గా ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు ఎంఎస్సీఐ అభిప్రాయపడింది. కోలుకోలేదు యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతుండటం రష్యా పాలకులకు ఇబ్బందిగా మారింది. సాధ్యమైనంత త్వరగా చర్చల ప్రకియ ద్వారా సానుకూల ఫలితాలు రాబట్టాలనే ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ఆగితేనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. ఇదే తీరుగా యుద్ధం మరింత కాలం కొనసాగితే ఆయుధాల వల్ల జరగని నష్టం ఆర్థిక వ్యవస్థ వల్ల రష్యాకు జరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితి నిప్పుల మీద నడకలా మారింది రష్యాకి. యుద్ధం త్వరగా ఆగిపోవాలని రష్యానే బలంగా కోరుకునే పరిస్థితి దాపురించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అందువల్లే యుద్ధం ప్రారంభంలో ఎక్కువగా మౌనానికే పరిమితమై యూఎస్ ఇటీవల గొంతు పెంచిందనే విషయం గుర్తు చేస్తున్నారు. చదవండి: Russia: ఆర్థిక ఆంక్షలు.. ప్రభావితమయ్యే రష్యన్ కుబేరులు -
చైనా చుట్టు ఉచ్చు.. ఆ అరాచకాల్ని ఒప్పుకోక తప్పదా!
పశ్చిమ చైనాలో ఏళ్ల తరబడి ఉయిగుర్, ఇతర మైనార్టీలపై కొనసాగుతున్న ఆరాచకపర్వానికి ఎట్టకేలకు చైనా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనను కారణంగా చూపిస్తూ వచ్చే ఏడాది బీజింగ్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ను కొన్ని దేశాలు దౌత్యపరమైన బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆంక్షలతో చైనాను మరో దెబ్బ కొట్టింది అమెరికా. ఇక వరుసగా జరుగుతున్న పరిణామాలు.. అంతర్జాతీయ సమాజం ముందు చైనా తన నేరాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. సుమారు పది లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడగలిగే ఇతర తెగల వాళ్లు పశ్చిమ చైనాలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. చైనా ప్రభుత్వం వీళ్లను మైనార్టీలుగా గుర్తించింది. అంతేకాదు ఏళ్ల తరబడి వాళ్లపై ఆర్మీ సాయంతో అరాచకాలకు పాల్పడుతోంది. ఉయిగర్ల ఊచకోతను పలు దేశాలు(భారత్‌తో సహా) ఏనాటి నుంచో ఖండిస్తూ వస్తున్నాయి. ఉయిగర్లపై చైనా సైన్యం వేధింపులను తెలియజేసేలా.. లండన్ ఉయిగర్ ట్రిబ్యునల్‌లో సంకెళ్ల ద్వారా నిరసన తెలిపిన ఉయిగర్ నేత చైనాను ఇరకాట పెట్టినవి.. ► షిన్జియాంగ్లో ఉయిగర్లపై హింసాకాండ, రంజాన్ సమయంలో మసీదుల విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావడం. ►ఈ తరుణంలో ఇదంతా కేవలం పాశ్చాత్య దేశాల మీడియా స్పృష్టే అని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. ►మరోవైపు ఫారినర్లను, జర్నలిస్టులను గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా చైనా ఆంక్షలు విధించింది. ► అయినప్పటికీ పక్కా ఆధారాలు అక్కడ జరిగే దమనకాండను వెలుగులోకి తీసుకొచ్చాయి. ► అమెరికా సహా చాలా దేశాల ఫోకస్ ఇప్పుడు గ్జిన్జియాంగ్ మీదే. ►డిసెంబర్ 10న లండన్‌లో ట్రిబ్యూనల్(ఇండిపెండెంట్) ఒకటి.. ఉయిగుర్లకు, ఇతర మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దమనకాండలో చైనా ప్రభుత్వాన్నే దోషిగా ఎత్తి చూపుతూ తీర్పు వెలువరించింది. ►డిసెంబర్ 14న అమెరికా చైనాకు ఓ ఝలక్ ఇచ్చింది. ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. గ్జిన్జియాంగ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులన్నీ.. ఉయిగుర్లను బలవంతపెట్టి తయారు చేయించిన ఉత్పత్తులు కావని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ►డిసెంబర్ 16న జో బైడెన్ ప్రభుత్వం.. గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని మిలిటరీ మెడికల్ సైన్సెన్స్, దాని 11 రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ మీద ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ►హైటెక్ సర్వయిలెన్స్ వ్యవస్థ-ఫేషియల్ రికగ్నిషన్ సాయంతో గ్జిన్జియాంగ్ ప్రజల డీఎన్ఏ శాంపిల్స్‌ను చైనా అక్రమంగా సేకరిస్తోందన్నది అమెరికా వాదన. ►భవిష్యత్తులో ఉయిగర్ల హక్కుల్ని పరిరక్షించేందుకు, స్వేచ్ఛను ప్రసాదించేందుకు.. అవసరమైతే చైనాను కడిగిపడేయాలంటూ అమెరికా, ఇతర అగ్రదేశాల సాయం కోరుతోంది ఉయిగర్ల హక్కుల పరిరక్షణ కమిటీ. ఈ తరుణంలో సానుకూల స్పందన ద్వారా చైనాను ఇరుకున పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ► వచ్చే ఏడాది మొదట్లో అంతర్జాతీయ న్యాయస్థానానికి గ్జిన్‌జియాంగ్‌లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనను తీసుకెళ్లాలని(పిటిషన్ ద్వారా) అమెరికా భావిస్తోంది. చదవండి: ఆపరేషన్ ‘అన్నోన్’.. చైనా ఫోన్ల ద్వారా భారీ కుట్ర -
‘ఇకనైనా అమెరికా కళ్లుతెరవాలి’
దుబాయ్ : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తమపై ఆంక్షలు ఎత్తివేసే చారిత్రక అవకాశాన్ని అమెరికా చేజార్చుకుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రహాని అన్నారు. మహమ్మారిపై తమ పోరాటానికి అమెరికా చర్యలు అవరోధం కాదని స్పష్టం చేశారు. ఇరాన్ సహా ఇతర దేశాలు కరోనా వైరస్‌పై పోరాడే క్రమంలో వాటిపై ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉందని, దీనిపై ఇంకా నిర్ధిష్టంగా నిర్ణయం తీసుకోలేదని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆంక్షలను ఎత్తివేసే మంచి అవకాశాన్ని అమెరికా కోల్పోయిందని ఇరాన్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. అమెరికా తన పొరపాటుకు క్షమాపణలు చెబుతూ ఇరాన్‌పై అన్యాయంగా, అక్రమంగా విధించిన ఆంక్షలను తొలగించేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని అమెరికా వినియోగించుకుని ఇరాన్‌కు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాలని అన్నారు. కరోనా వైరస్‌ను నిరోధించేందుకు తాము సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నామని, ఈ మహమ్మారిపై పోరులో ఇతర దేశాల కంటే విజయవంతంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాగా, కరోనా మహమ్మారి ఇరాన్లో 2898 మందిని పొట్టనపెట్టుకోగా, 44,606 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రాచ్యంలో అత్యధిక కేసులు నమోదైన ఇరాన్‌పై ఆంక్షలను తొలగించాలని చైనా, ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అమెరికాను కోరాయి. 2015లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చి ఆ దేశంపై తిరిగి ఆంక్షలను విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. చదవండి : కరోనా: 300 మందిని బలిగొన్న విష ప్రచారం -
ట్రంప్ టార్గెట్ రష్యా..
న్యూయార్క్ : రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. యూరల్లోని నిర్థిష్ట దేశాలకు అమెరికా బాసటగా నిలిచినా ఆ దేశాలు రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రష్యా నుంచి యూరప్ దేశాలను తాము కాపాడుతుంటే..ఆ దేశాలు మాత్రం ఇంధన వనరుల కోసం రష్యాకు బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నాయి..ఇది ఎంత మాత్రం క్షేమకరం కాద’ని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటలీ ప్రధాని గిసిప్పీ కాంటేతో వైట్‌హౌస్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటోకు సభ్య దేశాల ఆర్థిక సహకారం నిలిచిపోయిందని, నాటో నిర్వహణ సంక్లిష్టమవుతోందని అన్నారు. నాటో తిరిగి బలోపేతమవుతుందని అంటూ నాటో సభ్య దేశాలు అమెరికా పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు. నాటో వ్యయం అంతటినీ తమపై మోపడం తగదని అన్నారు. -
ఉత్తర కొరియాకు ఊహించని షాక్
వాషింగ్టన్ : ఉత్తర కొరియాకు ఊహించని దెబ్బ తగిలింది. కొంత కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన నిపుణుల సంఘం భేటీలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘ఈ రోజు నేను కీలక ప్రకటన చేస్తున్నా. ఉత్తర కొరియాపై ఎవరూ ఊహించని రీతిలో అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తోంది’ అని ప్రకటించారు. ఖజానా శాఖ ఈ మేరకు చర్యలు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. నౌకాయానానికి సంబంధించిన వాటితో పాటు మొత్తం 50 కంపెనీలపై ఆంక్షలు అమలు కానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ కూతురు, వ్యక్తిగత సలహాదారు ఇవాంక ట్రంప్ కొరియా ప్రతినిధులతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం. క్షిపణి పరీక్షలతో కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. తాజా ఆంక్షలు ఉత్తర కొరియా మిలిటరీ, అణు పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
దిగ్బంధనంలో ఉ.కొరియా!
వాషింగ్టన్: వరస అణ్వాయుధ పరీక్షలు చేస్తోన్న ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి కొరడా ఝుళిపించింది. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ అమెరికా రూపొందించిన తీర్మానానికి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఇంధనం, ఎగుమతులు, దిగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న తమ కార్మికులకు సంబంధించి ఉ.కొరియా మరిన్ని పరిమితులు ఎదుర్కోనుంది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు సంతకం చేసిన ఈ తీర్మానంలో ఉ.కొరియా అక్రమ రవాణా కార్యకలాపాలు నిలువరించేలా సహకరించాలని అన్ని దేశాల అధికారులను కోరారు. తాజా ఆంక్షలతో శుద్ధిచేసిన పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను ఆ దేశం 90% కోల్పోనుంది. ఆ దేశం నుంచి జరిగే ఆహా ర ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, ఎలక్ట్రికల్ పరికరాలపై కూడా నిషేధం విధించారు. ‘ఇంధన ఉత్పత్తులను ఉ.కొరియా అణు కార్యకలాపాలకే వినియోగించుకుంటోంది. ఆంక్షలు విధించడం ద్వారా ఆయుధాల తయారీని అడ్డుకోవచ్చు’అని బ్రిటన్ రాయబారి మాథ్యూ రిక్రాఫ్ట్ అన్నారు. -
పవన్ బన్సాల్‌పై ఆంక్షలు కొనసాగుతాయ్: సెబీ
ముంబై: సిండికేట్ బ్యాంక్ రుణానికి-లంచమిచ్చిన వ్యవహారంలో నిందితుడైన పవన్ బన్సాల్‌పై మార్కెట్ సంబంధ ఆంక్షలన్నీ కొనసాగుతున్నట్లు సెబీ గురువారం స్పష్టం చేసింది. మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఆంక్షలను సడలించాలని ఆయన చేసుకున్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఎటువంటి మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని, మర్చెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఆయన ‘తగిన వ్యక్తి కాదని’ మార్చిలో జారీచేసిన ఉత్తర్వ్యుల్లో సెబీ స్పష్టం చేసింది. -
ఆంధ్రప్రదేశ్ ట్యానరీస్, షయోనాపై కొనసాగనున్న ఆంక్షలు
న్యూఢిల్లీ: పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘనకు గాను ఆంధ్రప్రదేశ్ ట్యానరీస్, షయోనా పెట్రోకెమ్‌పై విధించిన ఆంక్షలు కొనసాగుతాయని, వీటిని ఎత్తివేసే ప్రసక్తి లేదని స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. ఇప్పటికి కూడా ఈ కంపెనీలు నిర్దేశిత నిబంధనలు పూర్తి చేయకపోవడం వాటి తీరును ప్రతిబింబిస్తోందని, గతంలో ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని నిర్ధారిస్తోందని గురువారం జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 జూన్ 3లోగా పబ్లిక్ హోల్డింగ్ వాటాలు కనీసం 25 శాతం ఉండేలా చూసుకోవాలన్న నిబంధనలను పాటించలేదన్న కారణంతో అదే ఏడాది ఈ రెండు సంస్థలు సహా 100 కంపెనీలపై సెబీ ఆంక్షలు విధించింది. -
న్యూఇయర్ వేళ పోలీసు ఆంక్షలు
-
విద్యుత్ సౌధలో ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు నిలువెత్తు ప్రతిరూపం విద్యుత్ సౌధ.. ఉద్యమ రోజుల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా విద్యుత్ సౌధ నుంచి తక్షణమే ప్రతిస్పందన వినిపించేది. సమైక్య రాష్ట్ర పాలకులు సైతం విద్యుత్ ఉద్యోగులను నియంత్రించే సాహసం చేయలేకపోయారు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి రెండేళ్లయినా కాకముందే విద్యుత్ సౌధలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మీడియాతో ఉద్యోగులెవరూ మాట్లాడొద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సర్క్యులర్ జారీ చేశారు. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే ‘దుష్ర్పవర్తన’ కింద పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి చట్టంలోని 43వ నిబంధనను అడాప్ట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జారీ చేసినట్లు పేర్కొంటున్న ఈ సర్క్యులర్‌ను గురువారం ట్రాన్స్‌కో అధికారిక వెబ్సైట్లో ఉంచడంతో వెలుగు చూసింది. అనధికారికంగా పత్రికలకు ఏదైనా ప్రకటన చేసినా, పత్రికలు, మేగజైన్లలో ఏదైనా వార్త కథనానికి సహకరించినా, ముందస్తు అనుమతి లేకుండా రేడియోలో మాట్లాడినా, మీడియా లేక కరపత్రాల ద్వారా విన్నపాలు వినిపించినా... సదరు ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. ఇక విద్యుత్ సౌధలో ఇటీవల అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలపై నిఘా ఉంచుతున్నారు. దీంతో విలేకరులను కలిసేందుకు కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు. ఈఆర్సీకి వెళ్లొద్దు.. విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)లో వ్యాజ్యాలు వేయవద్దని విద్యుత్ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, చార్జీల పెంపు వంటి వాటికి ఈఆర్సీ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించే ముందు ఈఆర్సీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానిస్తుంది. సాంకేతికంగా క్లిష్టంగా ఉండే విద్యుత్ చట్టాలు, అంశాలపై పట్టున్న విద్యుత్ రంగ నిపుణులు మాత్రమే వీటిపై స్పందించగలుగుతారు. విద్యుత్ రంగ నిపుణులు కె.రఘు, తిమ్మారెడ్డి వంటి కొందరు మాత్రమే ప్రజల తరఫున ఈఆర్సీకి వెళుతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలతో కె.రఘు వేసిన వ్యాజ్యం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు ఎవరూ ఈఆర్సీకి వెళ్లవద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అలాంటి హక్కు ఎవరికీ లేదు ‘పత్రికలకు సమాచారం ఇవ్వవద్దని సర్క్యులర్ జారీ చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. అలాంటి హక్కు ఎవరికీ లేదు. దీనిని ఖండిస్తున్నాం..’ - దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ -
నాపై ఆంక్షలు లేవు
ప్రధాని క్రియాశీలంగా ఉండడం సమస్య కాదు: సుష్మ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆయన క్రియాశీలక వైఖరి తనకు ఏమాత్రం సమస్య కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంచేశారు. తమ బృందంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల కోసం పోటీ లేదని, అందరం కలసికట్టుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఆదివారమిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం విదేశాంగ విధానంలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధాని క్రియాశీలకంగా ఉండడం సమస్యగా భావిస్తున్నారా అని కొందరు విలేకరులు అడగ్గా.. సుష్మ పైవిధంగా సమాధానమిచ్చారు. బయటకు పెద్దగా కనిపించడం లేదని ప్రశ్నించగా.. ‘‘నా వైఖరికి తగ్గట్టుగానే ఉంటా. నా ప్రస్తుత ప్రొఫైల్.. లో ప్రొఫైల్‌కే సరిపోతుంది. నేను లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతీరోజూ మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు విదేశాంగ మంత్రిగా ఆ అవసరం పెద్దగా ఉండదు. విదేశాంగ మంత్రి మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయమో, పార్టీ అభిప్రాయంగానో చూడరు. ఒక దేశ వైఖరిగా చూస్తారు’’ అని బదులిచ్చారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేసి, హింసాయుత కార్యక్రమాలకు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని సుష్మా స్వరాజ్ తేల్చిచెప్పారు. ముంబై దాడుల సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రియల్టర్ల బేజారు
రెండు మాసాలుగా జారీ కాని ఎల్పీసీలు నిబంధనలు కఠినతరం చేసిన వుడా వీసీ అయోమయంలో పడ్డ రియల్టర్లు ఆగిన రూ. కోట్ల లావాదే వీలు విశాఖపట్నం సిటీ: వుడా వీసీ లేఅవుట్ల విషయంలో ఆంక్షలు కఠినతరం చేస్తుండటంతో రియల్టర్లకు చెమటలు పడుతున్నాయి. తమ ఎత్తుగడలు ఫలించకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. లేండ్ పొజిషనింగ్ సర్టిఫికెట్లు(ఎల్పీసీ) నిలిచిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రెండు మాసాలుగా ఒక్క ఎల్పీసీ జారీ కాలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. రూ. కోట్లు పెట్టుబడి పట్టి కొన్న భూములకు వుడా నుంచి ఎల్పీసీ రాకపోవడంతో జనానికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక తలపట్టుక్కూర్చున్నారు. ఎల్పీసీ త్వరలో వచ్చేస్తుందంటూ భూములు కొనుగోలు చేసిన వారి నుంచి రియల్లర్లు రూ. లక్షల్లో అడ్వాన్సులు స్వీకరించారు. నిన్న మొన్నటి వరకూ రేపు మాపు అంటూ కాలం గడిపారు. ఇప్పుడు వుడాలో తమ మాట చెల్లకపోవడంతో మొహం చాటేస్తున్నారు. లే అవుట్ల విషయంలో వుడా వైస్‌ఛైర్మన్ బాబూరావు నాయుడు తీసుకొచ్చిన ఆంక్షలతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోవడంతో తాజా పరిస్థితి తలెత్తింది. గతంలోనోట్ల మాయాజాలంతో ఫైళ్లను నడిపిన రియల్టర్ల వ్యూహాలు ఇప్పుడు ఫలించడం లేదు. రియల్టర్లు రైతుల నుంచి భూమి కొంటారు. ఆ భూమి త మ అధీనంలో ఉందని వుడా ఎల్పీసీ ఇస్తుంది. ఇలా ఎల్పీసీ ఇచ్చిన తర్వాతే దాన్ని ప్లాట్లుగా వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ప్లాటును వెంటనే అమ్ముకునేందుకు అవకాశం కలుగుతుంది. ఎల్పీసీ జారీకి గతంలో ఎలాంటి సమస్యా ఉండేది కాదు. పేరొందిన రియల్టర్లు దరఖాస్తు చేస్తే ముందు వెనకా చూడకుండా క్షణాల్లో ఎల్పీసీ జారీ అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లే దు. గత రెండు మాసాలుగా 100కు పైగా కొత్త లే అవుట్ స్థలాలన్నింటికీ ఎల్‌పీసీలను నిలిపివేశారు. ఎక్కడి ఫైళ్లను అక్కడే తొక్కి పెట్టేశారు. తమ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది కాస్త చూడండి అంటూ ఎవరినైనా కదిపితే చాలు...వారికి మరింత అదనపు సమాచారం కావాలంటూ ఉడా అధికారులు నోటీసులిస్తున్నారు. రియల్టర్ల పై భారం..!:ఎల్పీసీ కోసం దరఖాస్తు చేసుకునేవారిని వుడా అధికారులు స్థలానికి సంబంధించిన పాస్‌బుక్ తెమ్మంటున్నారు. తహశీల్దార్లు ఆ బుక్‌లను గత కొద్ది మాసాలుగా జారీ చేయడం లే దు. మరి ఆ బుక్‌ను ఎలా తీసుకురమ్మంటున్నారో అధికారులకే తెలియాలని రియల్టర్లు అంటున్నారు. వాస్తవానికి మీ సేవలోని అడంగల్ తీస్తే అది ఎవరు కొన్నారో తెలిపే జిరాయితీ సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్‌ను పరిశీలించైనా స్థల నిర్ధారణ చేసుకుని అనుమతి ఇవ్వవచ్చు. కానీ వుడా అధికారులు అలా కాకుండా అన్ని అనుమతులు ఒకే పేరున కావాలని అడగడంతో రియల్టర్లు భారీగా నష్టపోతున్నారని చెబుతున్నారు. లిటిగేషన్ లేకుండా ఉండేందుకే..! ఎల్‌పీసీలను త్వరితగతిన క్లియర్ చేద్దామనుకుంటున్నాం. చాలా చోట్ల భూములు లిటిగేషన్లలో వున్నాయి. అవన్నీ పరిశీలించాక అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకూ అటెస్టడ్ డాక్యుమెంట్లను పరిశీలించి అన్నీ జారీచేసేవాళ్లం. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు చూస్తేనే గానీ ఇవ్వలేం. భవిష్యత్తులో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. భూమి ఎవరిదో స్పష్టంగా తేలకుండానే ఎల్పీసీలు జారీ చేయలేం. నిబంధనల మేరకు అన్నీ ఉంటే ఓకే చేస్తా..! -డాక్టర్ టి. బాబూరావు నాయుడు వైస్ ఛైర్మన్-వుడా -
హోలీపై ఆంక్షలు
సాక్షి, ముంబై: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకొనేలా నగరంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించనున్నారు. నీటితో నింపిన బెలూన్లు, ప్లాస్టిక్ సంచులు ఎక్కడ పడితే అక్కడ విసిరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర, రైల్వే పోలీసు శాఖ నిర్ణయించాయి. ఆకతాయిలపై నిఘా వేసేందుకు కూడా పత్యేక పోలీసు బలగాలను నియమించారు. గతంలో ఆకతాయిలు రాళ్లు విసరడంతో అనేక మంది గాయాలపాలవడం, ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. హోలీ వచ్చిందంటే చాలు రైలు పట్టాల దగ్గర్లోని మురికివాడల నుంచి పిల్లలు, ఆకతాయిలు రంగు నీటి సంచులను రైళ్లలోకి విసురుతుంటారు. దీంతో లోకల్ రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్కారు. పండుగ కాబట్టి సరదాగా విసిరినప్పటికీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల కంటి చూపు దెబ్బతినడం, ఫుట్‌బోర్డుపై ఉన్న వారు అదుపు తప్పి కిందపడుతున్నారు. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రైలు పట్టాలకు ఆనుకుని ఉన్న సైన్, ఘాట్కోపర్, ములుండ్, కల్యాణ్, ముంబ్రా, వడాల, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్, ఖార్, బాంద్రా, మలాడ్, బోరివలి తదితర మురికివాడల్లో పండుగకు రెండు రోజుల ముందు నుంచి రైల్వే పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు. లోకల్ రైళ్లపై బెలూన్లు, ప్లాస్టిక్ సంచులు విసరొద్దని, వాటివల్ల జరిగే అనర్థాలపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైల్వే పోలీసు కమిషనర్ డాక్టర్ సింఘల్ చెప్పారు. అదేవిధంగా రోడ్లపై వెళ్లే మహిళలపై రంగునీళ్ల బెలూన్లు విసిరే ఆకతాయిలపై ముంబై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కొన్ని సమస్యత్మాక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులను మోహరించనున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి వెల్లడించారు. రోడ్లపై తాగిన మత్తులో అశ్లీల నృత్యాలు చేయడం, మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హోలీ సంబరాలు ముగిసిన తర్వాత యువకులు సముద్ర తీరాలకు వెళ్తుంటారు. అక్కడ ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను, లైఫ్ గార్డులను అందుబాటులో ఉంచాలని బీఎంసీకి సూచించారు. -
గీత దాటారో.. జాగ్రత్త!!
రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దు దాటితే రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హెచ్చరించారు. ఆస్ట్రేలియా సహా పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతులపై రష్యా నిషేధం విధించిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. తమ సేనలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి వెళ్లేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుమతి మంజూరుచేస్తే, ఆస్ట్రేలియా నుంచి మరిన్ని కఠినమైన ఆంక్షలు ఎదుర్కోక తప్పదని అబాట్ అన్నారు. ఈ ఆంక్షలు ఎదురుకాకుండా ఉండాలంటే మాత్రం, సేనలను ముందుకు నడిపించడాన్ని రష్యా మానుకోవాలని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా, ఈయూ, అమెరికా, కెనడాల నుంచి వచ్చే వ్యవసాయోత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల దిగుమతులపై రష్యా ఏడాది పాటు నిషేధం విధించడంతో ఈ దేశాల్లో రైతులు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడాన్ని మానుకోకపోతే మాత్రం రష్యాపై ఆంక్షలు ఎక్కువయ్యే తీరతాయని అబాట్ చెప్పారు. -
‘నూతన’ సంబరాలపై ఆంక్షలు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నామంటే అందరికీ ఆనందమే. ఈ ఆనందం విషాదంగా మారకుండా పోలీసుశాఖ అనేక ఆంక్షలు విధించింది. చెన్నై నగర పోలీస్ కమిషనర్ జార్జ్ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమై ఆంక్షలకు రూపకల్పన చేశారు.పాత ఏడాదిని దాటి తెల్లారితే కొత్త ఏడాదిలో ప్రవేశిస్తున్న సమయంలో బాణాసంచా కాల్చడం, కేక్‌లు కట్‌చేయడం, గుంపులుగా చేరి కేరింతలు కొట్టడం సహజమే. మరో కేటగిరికి చెందిన వ్యక్తులు హోటళ్లలో విందులు, మద్యం తాగి చిందులేయడం కూడా సాధారణమే. చెన్నై నగరంలోనూ, శివార్లలోనూ అనేక హోటళ్లు, రిసార్టులు, అతిథి గృహాలు అత్యధికంగా ఉన్నాయి. వాటిల్లో కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేందుకు గత ఏడాది పోలీసులు అనుమతులు ఇచ్చారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్ జార్జ్ చర్చించారు. ఈనెల 31వ తేదీ రాత్రి నాటి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలను పర్యవేక్షించేందుకు నగరంలో 20 వేల పోలీసులను బందోబస్తుకు నియమించాలని నిర్ణయించారు. గత ఏడాది మెరీనా బీచ్‌కు లక్షమంది ప్రజలు హాజరు కాగా ఈ ఏడాది అదే సంఖ్యలో హాజరవుతారని అంచనావేశారు. నగర అదనపు పోలీస్ కమిషనర్ రాజేష్దాస్ నేతృత్వంలో బీచ్‌రోడ్డులో 2 వేల మంది పోలీసులను మొహరింపజేయనున్నారు. జనవరి 1 వ తేదీన మెరీనాబీచ్ రోడ్డులో వన్‌వే అమలుచేయనున్నారు. స్టార్ హోటళ్లు, బంగ్లాలతో పార్టీలు నిర్వహించేవారు మందుగా అనుమతి తీసుకోవాలి. శుభాకాంక్షలు చెప్పేనెపంతో స్త్రీలపట్ల చొరవచూపితే శిక్ష. కొత్త ఏడాది వేడుకల సంబరాలను అవకాశంగా తీసుకుని తీవ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో ఆ కోణంలో కూడా దృష్టిసారించాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఇవీ నిబంధనలు స్విమ్మింగ్‌పూల్ సమీపంలో మద్యం తాగడం నిషేధం. కేవలం గదుల్లోనే మద్యం తాగాలి. పార్టీల సమయంలో భారీ స్పీకర్లు వినియోగించరాదు. అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే మద్యం తాగేందుకు తనుమతి. తరువాత గంటపాటూ విందుకు అనుమతి. సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే అనుమతి. అసభ్య నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తే కఠిన చర్యలు. వేడుకల సమయంలో ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే యాజమాన్యాలదే బాధ్యత. హాలు, గదుల్లోకి ముందుగా అనుమతి పొందినవారిని మాత్రమే అనుమతించాలి. మద్యం తాగి వేగంగా వాహనాలు నడుపరాదు. ఇటువంటి వాహనాలను అదుపు చేసేందుకు నగరంలో ఇనుప స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటు. పార్టీల నిర్వహణపై పోలీసు శాఖ విధించిన నిబంధనలను అంగీకరించినవారికి మాత్రమే అనుమతులు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. -
ఆంక్షలు తొలగించాలని ప్రధానిని కలుస్తాం
గోదావరిఖని, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రకటించే క్రమంలో శాంతిభద్రతలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, జీహెచ్ఎంసీని గవర్నర్ పరిధిలోకి తీసుకువస్తారనే విషయమై త్వరలో టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ప్రధానమంత్రిని కలవనున్నదని, కేసీఆర్ కూడా లేఖ రాయనున్నారని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు నా యిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం గోదావరిఖని లో జరిగిన హెచ్ఎంఎస్ 13వ మహాసభలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా దేశంలో 28 రాష్ట్రాలతో కేం ద్రం ఎలా వ్యవహరిస్తుందో తెలంగాణ విషయంలో నూ అలాగే వ్యవహరించాలని ప్రధాని ని కోరనున్నట్లు చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయ డం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగఢ్ను రాజధానిగా ఏర్పాటు చేశారని, కానీ ఆ పోలిక హైదరాబాద్‌కు సరికాదన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాలంటే కనీసంగా 200 కి.మీ. దూరం ఉంటుందని, అందుకే హైదరాబాద్‌ను యూటీ చేయాలని సీమాంధ్రులు ఒత్తి డి తీసుకువస్తున్నారని అన్నారు. ఒకవేళ ఈ ఆంక్షలు సడలించకపోతే మిగతా రాజకీయ పార్టీల మద్దతుతో పార్లమెంట్లో బిల్లును సవరించేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన ఖర్చులు చేస్తామంటే ఒప్పుకునేది లేదని, ఎక్కడి ప్రాజెక్టులకయ్యే ఖర్చును అక్కడే సమకూర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.