అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.
అమెరికా ఆంక్షల పరిధి
అమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్‌లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్‌లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.
ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరం
భారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావం
సమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్‌ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment