ఇరాన్‌పై అమెరికా కన్నె‍ర్ర.. ఆంక్షల విస్తరణ | US expands sanctions to Iran oil tankers | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా కన్నె‍ర్ర.. ఆంక్షల విస్తరణ

Published Sat, Oct 12 2024 3:00 PM | Last Updated on Sat, Oct 12 2024 9:52 PM

US expands sanctions to Iran oil tankers

అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై ఆంక్షల విస్తరించింది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో ఇరాన్‌ దాడి చేసిన నేపథ్యంలో పెట్రోలియం, పెట్రో కెమికల్స్‌ సెక్టార్‌లో ఆంక్షలను విస్తరించినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన 16 చమురు కంపెనీలను, 17 చమురు నౌకలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ చర్యలతో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రం చేస్తామని తెలిపింది.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు ఇరాన్ అక్రమ చమురును చేరవేస్తే చర్యలు ఉంటాయి. ఈ ఆంక్షలు.. ఇరాన్ చేపట్టే క్షిపణి కార్యక్రమాలు, అమెరికా దాని మిత్రదేశాలపై ఉగ్రవాద దాడులకు చేయడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను దెబ్బతీయటంలో సహాయపడతాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోని పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలలో పనిచేయాలని నిర్ణయించుకున్న ఏ వ్యక్తిపైనైనా ఆంక్షలు విధించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు.

ఇక.. లెబనాన్, గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న దాడులు, ఇరాన్‌లో హమాస్ నేతను అంతం చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్‌ అక్టోబర్‌ 1న క్షిపణి దాడులు చేసింది. అయితే ఆ దాడులకు తాము ప్రతిదాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ  చేస్తోంది.  ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడుల నేపథ్యంలో తాజాగా అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను మరింతగా విస్తరించింది.

చదవండి: ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement