oil tankers
-
ఇరాన్‌పై అమెరికా కన్నెర్ర.. ఆంక్షల విస్తరణ
అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై ఆంక్షల విస్తరించింది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో పెట్రోలియం, పెట్రో కెమికల్స్ సెక్టార్లో ఆంక్షలను విస్తరించినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన 16 చమురు కంపెనీలను, 17 చమురు నౌకలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ చర్యలతో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రం చేస్తామని తెలిపింది.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు ఇరాన్ అక్రమ చమురును చేరవేస్తే చర్యలు ఉంటాయి. ఈ ఆంక్షలు.. ఇరాన్ చేపట్టే క్షిపణి కార్యక్రమాలు, అమెరికా దాని మిత్రదేశాలపై ఉగ్రవాద దాడులకు చేయడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను దెబ్బతీయటంలో సహాయపడతాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోని పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలలో పనిచేయాలని నిర్ణయించుకున్న ఏ వ్యక్తిపైనైనా ఆంక్షలు విధించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు.ఇక.. లెబనాన్, గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న దాడులు, ఇరాన్లో హమాస్ నేతను అంతం చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1న క్షిపణి దాడులు చేసింది. అయితే ఆ దాడులకు తాము ప్రతిదాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో తాజాగా అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను మరింతగా విస్తరించింది.చదవండి: ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక -
భారీ అగ్ని ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్లు పేలి..
న్యూయార్క్: అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడు ఆయిల్ ట్యాంకర్లు, ఓ ట్రాక్టర్ ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది Our firefighters have responded with mutual aid to this scene at 76 Depot Road in Epping involving multiple oil tankers reported on fire. pic.twitter.com/qCVVvZd7So — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 . ఆయిల్ ట్యాంకర్లు మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. Exeter firefighters along with crews from several communities continue to work the scene of a massive fire involving three oil tankers and a tractor-trailer at North Atlantic Fuels in Epping. pic.twitter.com/mrvIBLGRDc — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 ఇదీ చదవండి: అమెరికా, బ్రిటన్ దాడులు.. హౌతీల కీలక వ్యాఖ్యలు -
‘తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదు’
భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ‘హిట్ అండ్ రన్’ నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇంధన ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు కూడా ఇంధన సరఫరా నిలిచిపోయింది. బంకుల ముందు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెపై తెలంగాణ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ స్పందించారు. తెలంగాణలో ఆయిల్ ల్యాంకర్ల సమ్మెలేదని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుతో డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేశారని తెలిపారు. ట్యాంకర్ డ్రైవర్స్ ఆకస్మిక సమ్మెలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. డ్రైవర్లు వాహనాలు నిలిపివేయడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు విధి విధానాలు ఏంటనేది స్పష్టతగా తెలియాల్సి ఉందని చ ఎప్పారు. అందువల్ల వాహనదారులను డ్రైవర్ అసోసియేషన్ ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. చట్ట సవరణ బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుందామన్నారు. కాగా ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను తీసుకొచ్చింది. త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు పెట్టింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అదే విధంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది దీనిపై ట్రక్కు డ్రైవర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు రోజులపాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు, పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లు, హింసాత్మక ఘటనలు, లాఠీఛార్జీలకు దారితీశాయి. పెద్దసంఖ్యలో ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఆయిల్ కంపెనీల టెండర్ల కోసమే అక్రమ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్ కంపెనీలను బురిడీ కొట్టించి టెండర్లు దక్కించుకునేందుకే రాష్ట్రంలో కొందరు సిండికేట్ సభ్యులు ట్యాంకర్ల ఫేక్ రిజిస్ట్రేషన్ల దందా సాగించినట్టు రవాణాశాఖ నిర్ధారించింది. ట్యాంకర్లు లేకపోయినా ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక మతలబు ఇదేనని ప్రాథమికంగా తేల్చింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం పోలీసుశాఖ సమాయత్తమవుతోంది. ఆయిల్ కార్పొరేషన్లు ఏటా ట్యాంకర్ల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తాయి. టెండర్లలో పాల్గొనేందుకు నిర్ణీత సంఖ్యలో ట్యాంకర్లు ఉండాలనే నిబంధన విధిస్తాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్లు లేనప్పటికీ ఉన్నట్టుగా చూపించి అర్హత సాధించేందుకు ఓ ముఠా ఈ ఎత్తుగడ వేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిన ట్యాంకర్ల అక్రమ రిజిస్ట్రేషన్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్టు రవాణాశాఖ గుర్తించింది. ఇప్పటికే కృష్ణాజిల్లాలో కూడా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రవాణాశాఖ అధికారుల పూర్తి సహకారంతోనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సాగించారు. నిబంధనల ప్రకారం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వాహనాలను పరిశీలించి సంబంధిత పత్రాలను ఆమోదించాలి. అనంతరం ఆర్టీవో స్థాయి అధికారి రిజిస్ట్రేషన్లు చేయాలి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఏకంగా 110 ట్యాంకర్లు లేకుండానే ఎంవీఐ బి.గోపీనాయక్ ఉన్నట్టుగా పత్రాల్లో పేర్కొన్నారు. గూడూరు వంటి చిన్న పట్టణంలో అంత భారీసంఖ్యలో ఆయిల్ ట్యాంకర్లు ఒకేసారి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారో అని ఆర్టీవో సి.మల్లికార్జునరెడ్డి సందేహించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక కృష్ణాజిల్లాలో అయితే మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కాకుండా కేవలం విఠల్ అనే సీనియర్ అసిస్టెంటే అక్రమ రిజిస్ట్రేషన్ల తతంగాన్ని నడిపించడం విస్మయపరుస్తోంది. కృష్ణాజిల్లాలో 11 ట్యాంకర్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. రికార్డుల పరిశీలన కొనసాగుతుండటంతో మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రవాణాశాఖ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆయిల్ ట్యాంకర్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తోంది. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సమాయత్తమవుతోంది. రవాణాశాఖ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు కోసం బృందాన్ని ఈశాన్య రాష్ట్రాలకు పంపించనున్నారు. కేవలం ఆయిల్ కంపెనీల టెండర్లు దక్కించుకునేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారా.. ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసు అధికారులు దృష్టిసారించనున్నారు. -
రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ
అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్ట్ ప్రగతి పథంలో పయనిస్తోంది. వచ్చే మూడేళ్లలో నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు సొబగులద్దుకుంటోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. రూ.4,095 కోట్లతో పోర్టు ఆధునికీకరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖను నంబర్‌వన్‌గా నిలబెట్టాలని వీపీటీ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. – సాక్షి, విశాఖపట్నం వచ్చే మూడేళ్లలో విశాఖ పోర్టును విస్తరించేందుకు విశాఖ పోర్టు ట్రస్ట్ (వీపీటీ) అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నారు. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతోపాటు సరికొత్త పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా విశాఖ పోర్టు విస్తరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు చానల్స్, బెర్తులను మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల నుంచి సైతం ఆదాయం ఆర్జించేలా పోర్ట్ ట్రస్టు మార్గాలను అన్వేషిస్తోంది. మొత్తంగా రూ.4,095 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 12 పనులకు రూ.3,086 కోట్లు కేటాయించారు. ఈ పనులు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిలో రూపుదిద్దుకోనున్నాయి. ఫ్లై ఓవర్ల నిర్మాణం మొదలైన రవాణా, అనుసంధానం తదితర తొమ్మిది పనులకు రూ.1,009 కోట్లు కేటాయించారు. ఆధునికీకరణ.. యాంత్రీకరణ పోర్టు జెట్టీల సామర్థ్యం పెరిగేలా ఆధునికీకరించడంతో పాటు యాంత్రీకరించేందుకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నారు. వెస్ట్‌క్యూ (డబ్ల్యూక్యూ)–7, డబ్ల్యూక్యూ–8 జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తుల రవాణా జరుగుతుంటుంది. భవిష్యత్తులో వీటి రవాణా పెరిగే అవకాశం ఉన్నందున.. ఈ రెండు జెట్టీలను రూ.350 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఎరువుల రవాణా ఎక్కువగా జరిగే ఈక్యూ–7 జెట్టీని యాంత్రీకరించే ప్రణాళికను సిద్ధం చేశారు. కార్గోల ద్వారా వచ్చే ఎరువులను ఇక్కడే ప్యాకింగ్ చేసేలా వసతుల కల్పనకు రూపొందించిన ఈ పనులు త్వరలో చేపట్టనున్నారు. 13 లక్షల కంటైనర్లకు అనుగుణంగా.. చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్–1, ఓఆర్–2 బెర్తులను రూ.168 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. తద్వారా 80 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఆయిల్ ట్యాంకర్లు నిర్వహించేందుకు వీలవుతుంది. 2022 మార్చి నాటికి ఈ పనులు పూర్తవనున్నాయి. కాలుష్య రహిత ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు రూ.633.11 కోట్లతో చేపట్టిన కంటైనర్ టెరి్మనల్ విస్తరణ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తికావాల్సి ఉండగా.. కోవిడ్–19 కారణంగా ఆలస్యమవుతున్నాయి. ఇది పూర్తయితే ప్రస్తుతం ఉన్న ఎనిమిది లక్షల కంటైనర్ల హ్యాండిల్ సామర్థ్యం 13.4 లక్షల కంటైనర్లకు చేరుతుంది. కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి దిశగా అవుటర్ హార్బర్ అత్యవసర సమయంలో ఎక్కువగా ఉపయోగపడే అవుటర్ హార్బర్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.581 కోట్లు కేటాయించారు. దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఐరన్ ఓర్ రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అవుటర్ హార్బర్లో ఉన్న సాధారణ కార్గో బెర్త్ (జీసీబీ)ను రూ.444.10 కోట్లతో భారీ నౌకల రవాణాకు వీలుగా ఆధునికీకరించనున్నారు. వివిధ దేశాలకు సరకు రవాణా నిర్వహించేందుకు అనుగుణంగా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) రూ.372.10 కోట్లతో చేపడుతున్న రెండోదశ పనులు చేపట్టనుంది. 141.64 మిలియన్ టన్నుల సామర్థ్యం లక్ష్యంగా... సరకు రవాణాలో ఏటికేడు వృద్ధి నమోదు చేస్తున్న విశాఖ పోర్టు.. దేశంలోని మేజర్ పోర్టులతో పోటీ పడుతోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయితే మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి విశాఖ పోర్టు 72.72 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసింది. ఇనుప ఖనిజం, పెల్లెట్స్, కుకింగ్ కోల్, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ కార్గో వంటి వాటి ఎగుమతి దిగుమతులు ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాల్ని అనుసరిస్తూ.. విశాఖ పోర్టు ట్రస్టు దూసుకెళ్తోంది. ఇన్నర్ హార్బర్లో పనామాక్స్ సామర్థ్యం కలిగిన మూడు బెర్తుల నిర్మాణంతో పాటు ఆయిల్ రిఫైనరీ–3లో అదనపు ఆయిల్ హ్యాండ్లింగ్ సామర్థ్యం పెంచింది. ఆయిల్ రిఫైనరీ 1, ఆయిల్ రిఫైనరీ 2 బెర్తులు అభివృద్ధి చేసింది. దీనికి తోడు వంద టన్నుల సామర్థ్యంగల హార్బర్ మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసింది. 2020–21లో అక్టోబర్ వరకు కోవిడ్ కాలంలోనూ 38.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. ప్రస్తుతం నౌకాశ్రయ సామర్థ్యం 126.89 మిలియన్ టన్నులు. ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తయితే ఈ సామర్థ్యం 141.64 మిలియన్ టన్నులకు చేరుతుంది. భవిష్యత్తు విశాఖ పోర్టు ట్రస్ట్దే.. విశాఖ పోర్టు ట్రస్ట్ చేపట్టిన పలు పనులు 2021 నుంచి 2023 మార్చి నాటికి పూర్తికానున్నాయి. ఇవన్నీ పూర్తయితే విశాఖ పోర్టు ట్రస్ట్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్ర బిందువుగా మారుతుంది. వీటికితోడు రూ.103 కోట్లతో క్రూయిజ్ టెరి్మనల్ నిర్మాణపనులు మొదలయ్యాయి. ఇవి కూడా వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. క్రూయిజ్ టెరి్మనల్ పూర్తయితే సముద్ర విహారం విశాఖవాసులకు చేరువవుతుంది. అంతర్జాతీయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. సరకు రవాణా, సామర్థ్య నిర్వహణ పరంగా విశాఖ పోర్టు ప్రస్తుతం దేశంలోని మేజర్ పోర్టుల్లో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం చేపట్టిన వేలకోట్ల రూపాయల పనులు పూర్తయితే.. నంబర్‌వన్‌గా మారుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, చైర్మన్, విశాఖ పోర్టు ట్రస్ట్ -
దిగిరాకపోతే రాష్ట్రం మొత్తం సేవలు నిలిపేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె బాటలోకి దిగారు. ఆయిల్ సంస్థలు ట్యాంకర్ల ఓనర్స్‌కి రావాల్సిన రవాణా ఛార్టీలో 80 శాతం కోత పెట్టిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సమ్మె చేపట్టారు. దీంతో సూర్యపేటలో పెద్ద సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్స్ రోడ్లపై నిలిచిపోయాయి. దాదాపు 500 ఆయిల్ ట్యాంకర్లు రోడ్లకు పరిమితమయ్యాయి. సింగిరేణికి కూడా ఆయిల్ ట్యాంకర్స్ సరఫరా ఆగిపోయింది. ఆయిల్ సంస్థలు దిగిరకపోతే మధ్యాహ్నం తరువాత తెలంగాణ మొత్తం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తామని తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ హెచ్చరించారు. చదవండి : మంచిర్యాలలో ‘మహా’ కలకలం -
చమురు ఓడల రక్షణ మీ బాధ్యతే
వాషింగ్టన్: గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే చమురు ఓడల రక్షణ బాధ్యత ఆయా దేశాలే చూసుకోవాలని, ప్రమాదకరమైన ఆ ప్రాంతంపై తమకు అంతగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ట్రంప్ సోమవారం ట్వీట్‌చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటం, ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహించకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటున్న ఇరాన్ బెదిరింపులపై ఆయన.. ‘మా వద్ద చాలినన్ని చమురు నిల్వలున్నాయి. ఆ ప్రాంతంతో మాకు అవసరం లేదు. అక్కడ మేం రక్షణ బాధ్యతలు చేపట్టడం లేదు. గల్ఫ్‌లో ప్రయాణించే చమురు నౌకల భద్రత బాధ్యత సంబంధిత దేశాలదే’ అని పేర్కొన్నారు. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే ఉత్తర్వుపై ట్రంప్ సోమవారం సంతకం చేశారు. దీని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారుల ఆర్థిక లావాదేవీలను అమెరికా నిరోధించనుంది. మోదీ, పుతిన్‌లతో భేటీ కానున్న జిన్‌పింగ్ బీజింగ్: జి–20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో చైనా అధినేత జిన్‌పింగ్ భేటీ కానున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జి–20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దిగుమతులపై భారీగా పన్నులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష, రక్షణాత్మక విధానాలపై ఈ సందర్భంగా వీరు ప్రముఖంగా చర్చించనున్నారని చైనా అధికారులు తెలిపారు. భారత్, రష్యాలతోపాటు బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాలు బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతోనూ జిన్‌పింగ్ చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. -
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
యూఏఈలో చమురు నౌకలపై దాడి
ఫుజైరా(యూఏఈ): యూఏఈలో భాగమైన ఫుజైరా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో జరిగిన విద్రోహక దాడుల్లో తమ రెండు చమురు నౌకలు ధ్వంసం అయ్యాయని సౌదీ అరేబియా సోమవారం తెలిపింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రతిష్టంభన ఫలితంగా ఇప్పటికే కాస్త ఆందోళనగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో తాజా దాడులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ దాడిపై యూఏఈ ఆదివారమే ఓ ప్రకటన చేస్తూ తమ ఫుజైరా తీరం దగ్గర్లో వివిధ దేశాలకు చెందిన 4 వాణిజ్య చమురు నౌకలపై విద్రోహక దాడులు జరిగినట్లు తెలిపింది. తమ 2 ట్యాంకర్లు ధ్వంసం అయ్యాయనీ, ప్రాణనష్టం సంభవించలేదని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ చెప్పారు. సౌదీ నౌకలపై దాడిని ఇరాన్ ఖండించింది. ఈ ప్రాంతంలో సముద్ర తీర భద్రతకు భంగం కలిగించేలా విదేశాలు దుందుడుకు చర్యలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ చమురును ఎవరూ కొనకుండా అమెరికా ఆంక్షలు విధించగా, ఈ ఆంక్షలు ఈ నెల 1 నుంచి అన్ని దేశాలకూ వర్తిస్తూ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడం తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక బీ–52 బాంబర్లను మోహరించడం ద్వారా తన సైనిక శక్తిని పెంచుకుంది. ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా చూడాలంటూ అమెరికాను సోమవారం యూరప్ హెచ్చరించింది. -
చెంగిచర్ల ఘటనలో ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: చెంగిచర్ల వద్ద ఆయిల్ ట్యాంకర్ల పేలుడు, అగ్నిప్రమాదం సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్ల యజమానులు రాజు, జగదీష్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 3 బైక్‌లు, 2 కార్లు, 12 పెట్రోల్ ట్యాంకర్లు, రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దక్షిణ భారతంలోనే మొదటిదని రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ల నుంచి పెట్రోల్ తీస్తుండగా ప్రమాదం సంభవించిందని, ఇలా తీసిన పెట్రోల్‌లో కిరోసిన్ కలిపి విక్రయిస్తుంటారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో వీరు అక్రమంగా కార్ఖానా నిర్వహిస్తున్నారన్నారు. చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల నుంచి వెల్డింగ్ ద్వారా పెట్రోల్ తొలగించే క్రమంలో ట్యాంకర్లకు మంటలు అంటుకుని పేలుడు జరిగిందని జోషి తెలిపారు. -
మదీనాగూడ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని మదీనాగూడ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ ట్యాంకర్, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... డ్రైవర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్, ఆయిల్ ట్యాంకర్లను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. -
రెండు పెట్రోల్ ట్యాంకర్లలో అగ్నిప్రమాదం
విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండలం లింగాలవలస వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు పెట్రోల్ ట్యాంకర్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలు అంటుకుని ఆయిల్ ట్యాంకర్లు తగులబడుతున్నాయి. అయితే ఘటన జరిగిన ప్రాంతానికి ప్రక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి స్థానికులు భయాందోళన పరుగులు తీస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఎర్రచందనం స్మగ్లింగ్ లో కోత్త దారులు.
-
అనంతపురం జిల్లాలో పెట్రోల్ కొరత