సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె బాటలోకి దిగారు. ఆయిల్ సంస్థలు ట్యాంకర్ల ఓనర్స్‌కి రావాల్సిన రవాణా ఛార్టీలో 80 శాతం కోత పెట్టిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సమ్మె చేపట్టారు. దీంతో సూర్యపేటలో పెద్ద సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్స్ రోడ్లపై నిలిచిపోయాయి. దాదాపు 500 ఆయిల్ ట్యాంకర్లు రోడ్లకు పరిమితమయ్యాయి. సింగిరేణికి కూడా ఆయిల్ ట్యాంకర్స్ సరఫరా ఆగిపోయింది. ఆయిల్ సంస్థలు దిగిరకపోతే మధ్యాహ్నం తరువాత తెలంగాణ మొత్తం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తామని తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment