lorry owners
-
ఆ గ్రామం ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు..
పిఠాపురం(తూర్పుగోదావరి): సాధారణంగా ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే పిఠాపురం సమీపంలోని చిత్రాడ గ్రామానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటా ఒక లారీ ఉంటుంది. ఏ వీధి చూసినా, రోడ్డు మార్జిన్ చూసినా, ఎవరి ఇంటి వద్ద ఖాళీ స్థలం చూసినా లారీలే కనిపిస్తాయి. సుమారు 2 వేల కుటుంబాలు, 10 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో చిన్న వ్యాన్ నుంచి పెద్ద టాంకర్ల వరకూ సుమారు 500 వరకూ లారీలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గ్రామ జనాభాలో ఎక్కువ మంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లుగానే స్థిరపడ్డారంటే ఆశ్చర్యం కలగక మానదు. గతంలో చిత్రాడకు వ్యవసాయంలో మంచి పేరుండేది. చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో.. ఏడాకుల బీరకు పుట్టినిల్లుగా చెప్పే ఈ గ్రామంలోని రైతులు ప్రతి ఇంటికీ ఒక ఎడ్ల బండి వాడేవారు. రానురానూ ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఉపయోగించడం ప్రారంభించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం అంతగా గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను చూసి వారు ఏమాత్రం భయపడలేదు. సరికొత్త జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. అలా ఇక్కడి వారు రవాణా రంగంలోకి అడుగు పెట్టారు. క్వారీ లారీలు కొనుగోలు చేసి, సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో పాటు సమీపంలోనే కాకినాడ పోర్టు, అక్కడ ఇతర పరిశ్రమలు ఉండటంతో రవాణా రంగం గణనీయంగా అభివృద్ధి సాధించింది. దీంతో చిత్రాడలో ఒకరిని చూసి మరొకరు లారీలు కొని తిప్పడం ప్రారంభించారు. అలా గ్రామంలో ఎక్కువ మంది దానినే జీవనోపాధిగా మార్చుకున్నారు. ఎక్కువ మంది మోటార్ ఫీల్డే గ్రామంలో ఎక్కువ మంది మోటార్ ఫీల్డ్‌లోనే ఉపాధి పొందుతున్నారు. ప్రతి వాహనంపై ఇద్దరి నుంచి నలుగురి వరకూ పని చేస్తుంటారు. సుమారు 2 వేల మంది డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లుగా ఉపాధి పొందుతున్నారు. 300 మంది వరకూ లారీల యజమానులు ఉన్నారు. వీరితో పాటు వాటర్ సర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాల్లో పలువురు ఉపాధి పొందుతున్నారు. పండగొస్తే ఊరంతా లారీలే నిత్యం ఇతర ప్రాంతాలకు లోడ్లు వేసుకుని వెళ్లే వాహనదారులు సంక్రాంతి, దసరా, వినాయక చవితి వంటి పండగలకు ఇళ్లకు చేరుతారు. అలా ఎక్కడెక్కడో ఉన్న ఆ లారీలన్నీ ఆ సమయంలో గ్రామానికి చేరుకుంటాయి. ఆ లారీలను శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు చేసి, అందంగా అలంకరించి, వాటిపై ఊరంతా తిరిగి ఇక్కడి వారు ఆనందిస్తారు. తద్వారా గ్రామంలో పండగ కోలాహలాన్ని ఇనుమడింపజేస్తారు. లారీలే జీవనాధారం మా గ్రామంలో చాలా మందికి లారీలున్నాయి. ఎక్కువ మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మాకు రెండు లారీలున్నాయి. వాటితో మా కుటుంబ పోషణ చూసుకుంటున్నాం. లారీని మా ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. – పులుగుల శ్రీనివాస్, ఓనర్ కం డ్రైవర్, చిత్రాడ లాభనష్టాలతో సంబంధం లేదు రవాణా రంగంలో మా గ్రామానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎక్కువ మంది ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఎడ్ల బళ్ల నుంచి పెద్ద లారీల వరకూ వచ్చిన మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాహనాలను నడపడం మాత్రం మానరు. లారీలు మా జీవనంలో భాగంగా మారిపోయాయి. – పులుగుల అప్పారావు, లారీ ఓనర్, చిత్రాడ నాలుగు టైర్ల లారీలతో ప్రారంభమై.. చిత్రాడలో మూడు దశాబ్దాల కిందట మూడు లారీలతో ఈ సరికొత్త జీవన విధానం ప్రారంభమైంది. ఇప్పుడు గ్రామంలో లారీల సంఖ్య వందల్లోకి చేరింది. క్వారీ లారీలతో ప్రారంభమైన వీరు రానురానూ అవసరాలకు అనుగుణంగా లారీలను కూడా మార్చుకుంటూ వచ్చారు. చిన్న లారీల స్థానంలో ఇప్పుడు పెద్ద లారీలు, ట్యాంకర్లు ఈ గ్రామంలో కనిపిస్తుంటాయి. ఆరు టైర్ల లారీల స్థానంలో ఇప్పుడు 40 టైర్ల లారీలు సైతం నడుపుతున్నారు. -
జేసీ ఇంటి వద్ద లారీ ఓనర్లు ధర్నా
-
జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రిలో జేసీ ఇంటి వద్ద లారీ ఓనర్లు ధర్నా చేపట్టారు. బీఎస్-3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో జేసీ దివాకర్ బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన 10 వాహనాలను జేసీ ఇప్పటికే విక్రయించారు. దీంతో దివాకర్ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన లారీ ఓనర్లకు తీవ్ర నష్టం ఏర్పడటంతో జేసీ మోసం చేశారంటూ లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు. -
దిగిరాకపోతే రాష్ట్రం మొత్తం సేవలు నిలిపేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె బాటలోకి దిగారు. ఆయిల్ సంస్థలు ట్యాంకర్ల ఓనర్స్‌కి రావాల్సిన రవాణా ఛార్టీలో 80 శాతం కోత పెట్టిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సమ్మె చేపట్టారు. దీంతో సూర్యపేటలో పెద్ద సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్స్ రోడ్లపై నిలిచిపోయాయి. దాదాపు 500 ఆయిల్ ట్యాంకర్లు రోడ్లకు పరిమితమయ్యాయి. సింగిరేణికి కూడా ఆయిల్ ట్యాంకర్స్ సరఫరా ఆగిపోయింది. ఆయిల్ సంస్థలు దిగిరకపోతే మధ్యాహ్నం తరువాత తెలంగాణ మొత్తం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తామని తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ హెచ్చరించారు. చదవండి : మంచిర్యాలలో ‘మహా’ కలకలం -
పరిష్కరించుకుందాం రండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లారీల యజమానుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరిపేందుకు కేసీఆర్ సర్కారు ముందుకొచ్చింది. లారీల యజమానులను చర్చలకు ఆహ్వానించింది. యజమానుల సంఘం ప్రతినిధులతో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం చర్చలు జరపనున్నారు. దీంతో దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగిల్ పర్మిట్ విధానానికి ఈ సమావేశంతో మోక్షం కలగనుందని సమాచారం. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న లారీలకు ఒకసారికి రూ. 1,600 చొప్పున పర్మిట్ ఫీజు వసూలు చేస్తండటంతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీని ఒప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొ చ్చిందని తెలియవచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం, రవాణాశాఖ ఉన్నతాధికారులు సైతం సింగిల్ పర్మిట్ ఒప్పందం అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం తెలిపింది. అలాగే ఈ ఏడాది లారీ యజమానులు చెల్లించాల్సిన పన్ను రెండో త్రైమాసికం గడువు ఇప్పటికే ముగిసింది. కానీ సమ్మె కారణంగా లారీలు నడవలేదు కాబట్టి... చెల్లింపు గడువును ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పెంచిందని సంఘం పేర్కొంది. సమ్మె విరమణకు ముందు హైడ్రామా? కేంద్రం హామీతో దేశవ్యాప్తంగా సమ్మె విరమిస్తున్నట్లు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రకటించినా తెలంగాణలో మాత్రం సమ్మె విరమణపై అర్ధరాత్రి దాకా హైడ్రామా నడిచింది. తమ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం ప్రకటించగా తెలంగాణ పరిధిలోని అంశాలపై సరైన హామీ రాలేదన్న కారణంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘం సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రకటనతో రవాణా మంత్రి లారీ యజమానుల సంఘం నేతలతో మాట్లాడారు. రాష్ట్ర పరిధిలోని డిమాండ్లపై చర్చలు జరిపేందుకు సోమవారం వారిని చర్చలకు ఆహ్వనించారు. దీనికి సీఎం కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో లారీల యజమానుల సంఘం సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర పరిధిలో లారీల యజమానుల డిమాండ్లు ♦ రాష్ట్రవ్యాప్తంగా తైబజారు రుసుములను శాశ్వతంగా రద్దు చేయాలి. ♦ లారీ పరిశ్రమలో స్థిరపడేందుకు ముందుకొస్తున్న పేద, మధ్యతరగతి యువతకు ప్రభుత్వమే ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ♦ ఓవర్‌లోడ్ తీసుకెళ్తున్నందుకు లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు న్యాయ విచారణ పూర్తయ్యేదాకా డ్రైవర్ల లైసెన్స్ రద్దు విషయంలో చర్యలు తీసుకోవద్దు. ♦ రాష్ట్రంలో టోల్గేట్ల మధ్య ప్రయాణించే దూరం ఆధారంగానే రుసుములు వసూలు చేయాలి. ♦ ఇద్దరు డ్రైవర్ల విధానం నుంచి మినహాయింపు కల్పించాలి. -
లారీ ఓనర్ల ఆందోళన మరింత ఉధృతం
-
నో ఎంట్రీ పేరుతో దోచుకుంటున్నారు
పోలీసుల చర్యలపై డీజీపీకి లారీ యజమానుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సివిల్, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, అనుమతులున్నా తనిఖీల పేరుతో ఇష్టారా జ్యంగా వారు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆరోపించింది. ఈమేరకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఆ సంఘ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సీజ్ చేసిన లారీలను కోర్టుకు కాకుండా స్టేషన్ నుంచి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని అసోసియేషన్ కోరింది. ప్రమాదాల కేసుల్లో లారీల తప్పున్నా.. లేకున్నా.. పెద్ద వాహనం కాబట్టి కేసులు నమోదు చేస్తున్నారని, తప్పెవరిదో విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సెక్షన్ 337, 338, 304ఏలో లారీ డ్రైవర్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. తనిఖీల సమయంలో అన్ని ధ్రువీకరణ పత్రాలు చూపించినా ట్రాఫిక్ పోలీసులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే డ్రైవర్లను ఇబ్బందులకు గురిచే స్తున్నారని ఆరోపించారు. జంటనగరాల్లో పగటి సమయాల్లో నో ఎంట్రీ ఉందని, అయితే ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర సర్వీస్ రోడ్డులో నో ఎంట్రీ పేరుతో ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. -
8వరోజుకు చేరుకున్న లారీల సమ్మె
-
సమ్మెను ఉద్ధృతం చేస్తున్న లారీ యజమానులు
-
నేటి నుంచి దేశవ్యాప్తంగా లారీల సమ్మె
-
టోల్గేట్ వద్ద లారీ యజమానుల ఆందోళన
తణుకు (పశ్చిమగోదావరి) : గడువు దాటిపోయినా టోల్గేట్ కొనసాగిస్తున్నారంటూ లారీ యజమానులు ఆందోళనకు దిగారు. అధిక టోల్ ఫీజు వసూలు చేస్తూ తమను నష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ యజమానులు లారీలను గేట్ వద్ద నిలిపివేసి బైఠాయించారు. వెంటనే టోల్‌గేట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు వచ్చి, ఆందోళనకారులను శాంతింపజేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
లారీలు రోడ్డెక్కాయ్
-
నేటి అర్ధరాత్రి నుంచి లారీలు బంద్
-
23 అర్ధరాత్రి నుంచి లారీ రవాణా బంద్
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక లారీ రవాణా బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాసింది. గతేడాది జూన్‌లో తమ సమస్యలపై ముఖ్యమంత్రికి విన్నవించినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. త్రైమాసిక పన్ను తగ్గించాలని, కౌంటర్ సిగ్నేచర్ ద్వారా తెలంగాణ, ఏపీలో వాహనాలు తిరిగేలా అనుమతించాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించింది. తాము ప్రభుత్వానికి సమర్పించిన 11 డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్ విజ్ఞప్తి చేశారు. -
రహదారుల దిగ్భందానికి లారీ ఓనర్ల మద్దతు
-
రెండో రోజుకు చేరిన లారీ యజమానుల ధర్నా
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి అయ్యే బీ గ్రేడ్ బొగ్గును తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని లారీ యజమానులు కేటీకే 5వ గని ప్రధాన రహదారి వద్ద చేపట్టిన మహా ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లారీ యజమానులు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈ, ఎఫ్ గ్రేడ్ బొగ్గుతోపాటు గణపురం మండలంలోని కేటీపీపీ, బీ గ్రేడ్ బొగ్గును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు తమకే అందించాలని కోరా రు. ఇదిలా ఉండగా, భూపాలపల్లి ఏరియా జీఎం నాగభూషణరెడ్డి ధర్నా శిబిరానికి చేరుకుని లారీ యజమానులతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ప్రస్తుతం ధర్నాను విరమించాలని ఆయన లారీ యజమానులను కోరారు. అయితే ఏరియాలో ఉత్పత్తి అయ్యే బీ గ్రేడ్ బొగ్గు మొత్తాన్ని తమకే అప్పగిస్తామని హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని యజమానులు చెప్పారు. దీంతో చేసేది ఏమిలేక జీఎం అక్కడి నుంచి వెనుదిరిగారు. ధర్నాలో లారీ, టిప్పర్, కోల్ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు నూకల నర్సింహరెడ్డి, పులి వేణుగోపాల్‌గౌడ్, కంకణాల రవీందర్‌రెడ్డి, రాములు, శ్రీరాములు, సేనాపతి, దశరథం, అశోక్ పాల్గొన్నారు. కాగా, లారీ యజమానుల ధర్నాకు టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణరావు, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీ యజమానుల న్యాయమైన కోర్కెలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ధర్నాకు కాకతీయఖని ఓపెన్‌కాస్ట్ హమాలీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు జోగుల రాజు, ప్రభాకర్, శంకర్, రాజయ్య మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో... ఏరియాలో ఉత్పత్తి అయ్యే బీ గ్రేడ్ బొగ్గును తమకే అప్పగించాలని కోరుతూ లారీ యజమానులు చేపట్టిన ధర్నాకు మద్దతు పలుకుతూ స్థానిక టీఆర్ఎస్ నాయకులు మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వ ద్ద రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో నాయకు లు పైడిపెల్లి రమేష్, థమ్సప్ రాంగోపాల్‌రావు, తా టి వెంకన్న, బోయిని వెంకటస్వామి, బాబర్‌పాషా, గూళ్ల కనకయ్య పాల్గొన్నారు.