
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రిలో జేసీ ఇంటి వద్ద లారీ ఓనర్లు ధర్నా చేపట్టారు. బీఎస్-3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో జేసీ దివాకర్ బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన 10 వాహనాలను జేసీ ఇప్పటికే విక్రయించారు. దీంతో దివాకర్ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన లారీ ఓనర్లకు తీవ్ర నష్టం ఏర్పడటంతో జేసీ మోసం చేశారంటూ లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment