BS-3 vehicles
-
‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్ చేయాలి’
సాక్షి, విజయవాడ: జేసీ ట్రావెల్స్ 154 బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిందని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. జటాధర ఇండస్ట్రీస్ పేరు మీద 50 వాహనాలు, సి.గోపాల్‌రెడ్డి పేరుతో 104 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. కర్ణాటకలో 33, తెలంగాణలో 15 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ తెలిపారు. అనంతపురంలో 27, కర్నూలులో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. డేటా బేస్‌లో ఈ వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. దేశంలో ఈ వాహనాలు ఎక్కడ తిరుగుతున్నా.. సీజ్ చేసేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. (కరోనా: కేంద్రం కొత్త మార్గదర్శకాలు) ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నేషనల్ డేటాబేస్‌లో అప్డేట్ చేయాలని కోరినట్లు ప్రసాదరావు తెలిపారు. అనంతపురంలో 80, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3 వాహనాలు రిజిస్ట్రేషన్లు రద్దు చేశామన్నారు. నెల్లూరులో ఉన్న 6 వాహనాలపై కోర్టు కేసులు ఉన్నందున.. రిజిస్ట్రేషన్ల రద్దు వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశామని, మరో 39 వాహనాలు సీజ్ చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో 12 వాహనాలు గుర్తించి ఆ రాష్ట్రానికి సమాచారం ఇచ్చామన్నారు. జేసీ ట్రావెల్స్ వాహనాలను కొనుగోలు చేసిన వారిని ముందే హెచ్చరించామని, 71 నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా గుర్తించామని పేర్కొన్నారు. జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్మిత్‌రెడ్డి జటాధర ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్నారని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. (యజమాని ఆత్మహత్య చేసుకున్న చోటే శునకం..) (జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్) -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. మిగతా 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇకపై ఇన్సూరెన్స్ వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేసింది జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేస్తూ, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ అన్నారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బస్సులు, లారీలను రోడ్లపై నడపడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దమని పేర్కొన్నారు. ఈ విషయంపై జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందిస్తామని చెప్పారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు శివరాంప్రసాద్ పేర్కొన్నారు. -
జేసీ ట్రావెల్స్‌కు షాక్
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు
సాక్షి, అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజాగా మరో కేసు నమోదైంది. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని.. నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బీఎస్-3 వాహనాలను జేసీ బ్రదర్స్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి ప్రైవేట్ ఆపరేటర్లకు విక్రయించిన విషయం తెలిసిందే. (చదవండి : వెలుగులోకి జేసీ అవినీతి బాగోతాలు) -
జేసీ ఇంటి వద్ద లారీ ఓనర్లు ధర్నా
-
జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రిలో జేసీ ఇంటి వద్ద లారీ ఓనర్లు ధర్నా చేపట్టారు. బీఎస్-3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో జేసీ దివాకర్ బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన 10 వాహనాలను జేసీ ఇప్పటికే విక్రయించారు. దీంతో దివాకర్ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన లారీ ఓనర్లకు తీవ్ర నష్టం ఏర్పడటంతో జేసీ మోసం చేశారంటూ లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు. -
బండి ఆన్.. లైట్ కూడా ఆన్!
మార్కెట్లోకి ‘ఏహెచ్ఏ’ ద్విచక్ర వాహనాలు - హెడ్‌ల్యాంప్ ఆన్–ఆఫ్ స్విచ్ లేకుండా ఏర్పాటు - పగటిపూట కూడా హెడ్‌ల్యాంప్ వెలుగు తప్పనిసరి - కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో డిజైన్ మార్చిన కంపెనీలు - రోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యంగా అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: పగటివేళ కూడా లైట్లు వెలిగి ఉండే భారత్ స్టేజ్–4 వాహనాలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని షోరూమ్లలోనూ ఈ వాహనాల అమ్మకాలు మొదలయ్యాయి. భారత్ స్టేజ్–3 వరకు ఉన్న వాహనాల్లో ఇలా కచ్చితంగా లైట్ ఆన్‌లో ఉంచాలనే నిబంధన లేదు. మార్చి 31తో ఆ నమూనా వాహనాల అమ్మకం గడువు పూర్తికావడంతో బీఎస్–4 వాహనాల విక్రయం ప్రారంభమైంది. ఎందుకీ నిబంధన? సాధారణంగా ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనం హెడ్‌ల్యాంప్ వెలుగుతుండటంతో మిగతా వాహన చోదకులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. దాంతో ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో మన దేశంలో తయారయ్యే బీఎస్–4 ద్విచక్ర వాహనాల్లో హెడ్‌ల్యాంప్ ఆన్–ఆఫ్ స్విచ్ ఉండదు. బండిని ఆన్ చేయగానే హెడ్‌ల్యాంప్ కూడా వెలుగుతుంది. పగలైనా, రాత్రయినా అలాగే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ద్విచక్రవాహనాలతో ప్రమా దాలు ఎక్కువగా జరుగుతుండటం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండటంతో.. పలు దేశాలు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చాయి. యూరప్‌లోని చాలా దేశాల్లో 2003 నుంచే ఈ పద్ధతి అమలులో ఉంది. కమిటీ సిఫార్సు మేరకు యూరప్‌లో ‘ఆటో హెడ్‌ల్యాంప్ ఆన్ (ఏహెచ్ఏ)’ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వ డంతో మన దేశంలోనూ అమల్లోకి తేవాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సిఫార్సులు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా దాన్ని ధ్రువీకరించింది. భారత్ స్టేజ్–4ను అమల్లోకి తెచ్చేప్పుడు ఈ నిబంధనను కూడా జత చేయాలని ఆదేశించింది. దీంతో బీఎస్–4 వాహనాల్లో ఏహెచ్‌సీ విధానం మేరకు ఏర్పాట్లు చేయాలని తయారీదారులను కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీఎస్–4 కార్ల విక్రయం ఎనిమిదేళ్ల కిందే ప్రారంభమైనా, ద్విచక్ర వాహనాలకు మాత్రం వర్తింపచేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ద్విచక్రవాహనాల్లోనూ బీఎస్–4 తప్పనిసరిగా మారింది. ఇక షోరూమ్‌లలో ఆ వాహనాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. రవాణా శాఖకు సమాచారమే లేదా? ఎంతో కీలక నిబంధనను కేంద్రం అమల్లోకి తెచ్చినా.. దీనిపై తెలంగాణ రవాణా శాఖకు సమాచారం లేకపోవడం గమనార్హం. సాధారణంగా మోటారు వాహనాలకు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం చేసే మార్పుల సమాచారాన్ని రాష్ట్రాలకు అందజేయాలి. కానీ బీఎస్–4 వాహనాల్లో ఏహెచ్ఏ నిబంధనపై ఇప్పటికీ రాష్ట్ర రవాణా శాఖకు నోటిఫికేషన్ అందలేదని తెలిసింది. ఇంకా పాత వాహనాలు! కంపెనీల వద్ద పాత (బీఎస్–3) వాహనాలు గుట్టలుగా పేరుకుపోవటంతో మార్చి చివరివారంలో గణనీయంగా ధరలు తగ్గించి అమ్మిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికీ వాటి మొత్తం అమ్మకాలు పూర్తి కాలేదు. చాలా మంది డీలర్లు బినామీల పేరిట వాటిని తాత్కాలికంగా రిజిస్టర్ చేసి ఉంచుకు న్నారు. వాటిని ఇప్పుడు కొనుగోలు దారులకు రెండో రిజిస్ట్రేషన్ రూపంలో విక్రయిస్తున్నారు. ఇలా చాలా షోరూమ్ లలో ఇప్పటికీ బీఎస్–3 వాహనాలే ఉండటంతో కొత్త తరహా వాహనాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడిప్పుడే బీఎస్–4 వాహనాల స్టాక్ వస్తోంది.