‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్‌ చేయాలి’ | RTA: Siege All Illegally Registered BS3 Vehicles Of JC Travels | Sakshi
Sakshi News home page

‘ఆ వాహనాలు ఎక్కడున్నా.. సీజ్‌ చేయాలి’

Published Tue, Jun 9 2020 1:09 PM | Last Updated on Tue, Jun 9 2020 5:53 PM

RTA: Siege All Illegally Registered BS3 Vehicles Of JC Travels - Sakshi

సాక్షి, విజయవాడ: జేసీ ట్రావెల్స్ 154 బీఎస్‌-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిందని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. జటాధర ఇండస్ట్రీస్‌ పేరు మీద 50 వాహనాలు, సి.గోపాల్‌రెడ్డి పేరుతో 104 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. కర్ణాటకలో 33, తెలంగాణలో 15 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ తెలిపారు. అనంతపురంలో 27, కర్నూలులో 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. డేటా బేస్‌లో ఈ వాహనాలను బ్లాక్‌ లిస్ట్‌ చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. దేశంలో ఈ వాహనాలు ఎక్కడ తిరుగుతున్నా.. సీజ్ చేసేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. (కరోనా: కేంద్రం కొత్త మార్గదర్శకాలు)

ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నేషనల్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేయాలని కోరినట్లు ప్రసాదరావు తెలిపారు. అనంతపురంలో 80, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3 వాహనాలు రిజిస్ట్రేషన్లు రద్దు చేశామన్నారు. నెల్లూరులో ఉన్న 6 వాహనాలపై కోర్టు కేసులు ఉన్నందున.. రిజిస్ట్రేషన్ల రద్దు వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశామని, మరో 39 వాహనాలు సీజ్ చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో 12 వాహనాలు గుర్తించి ఆ రాష్ట్రానికి సమాచారం ఇచ్చామన్నారు. జేసీ ట్రావెల్స్ వాహనాలను కొనుగోలు చేసిన వారిని ముందే హెచ్చరించామని, 71 నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా గుర్తించామని పేర్కొన్నారు. జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్మిత్‌రెడ్డి జటాధర ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్నారని ఆర్టీఏ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు. (యజమాని ఆత్మహత్య చేసుకున్న చోటే శునకం..)

(జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement