JC Brothers
-
జేసీ కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్
-
జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్‌కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు. -
తాడిపత్రికి జేసీ బ్రదర్స్ అరాచకాలు
-
వైఎస్సార్సీపీలో చేరిన జేసీ బ్రదర్స్ లీగల్ అడ్వైజర్..!
-
ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా?
అనంతపురం జిల్లాలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ కుటుంబం ఒకటుంది. ఆ కుటుంబ పెద్ద ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనకో తమ్ముడున్నాడు. అన్నదమ్ములు ఇద్దరికీ నోటి తీట, దుడుకుతనం కూడా ఎక్కువే. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదమ్ముల రాజకీయ ప్రభ మసకబారింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నారు. జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పేర్లు అనంతపురం జిల్లాలో అందరికీ పరిచయమైనవే. 1985 నుంచి వరుసగా ఆరుసార్లు తాడిపత్రి అసెంబ్లీ సీటు నుంచి విజయం సాధించిన దివాకరరెడ్డి నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ముందుగానే ఊహించి హస్తానికి హ్యాండిచ్చి కుటుంబం అంతా సైకిల్ సవారీ స్టార్ట్ చేసింది. తాడిపత్రి అసెంబ్లీ సీటు తమ్ముడు ప్రభాకరరెడ్డికి ఇచ్చి.. తాను అనంతపురం ఎంపీగా పోటీ చేశారు దివాకరరెడ్డి. ఇద్దరూ విజయం సాధించారు. ఇక 2019లో తాను తప్పుకుని కొడుకు పవన్‌రెడ్డిని అనంతపురం నుంచీ ఎంపీ సీటుకు పోటీ చేయించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో జేసీ బ్రదర్స్ రాజకీయాలు ముగిసిపోయాయి. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వైఎస్ జగన్ జైత్రయాత్ర ముందు తుడిచిపెట్టుకుపోయింది. ఆ షాక్ నుంచి జేసీ కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత పవన్‌రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు జేసీ దివాకరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ జేసీ ప్రభాకర్‌రెడ్డి లేదా ఆయన కుమారుడికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని జేసీ దివాకర్‌రెడ్డి డైలమాలో పడ్డారు చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి ట్వీట్ అందుకే రాయల తెలంగాణా పేరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కి.. రాజకీయంగా గందరగోళం సృష్టించి..లబ్ది పొందాలని జేసీ దివాకర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ నిరుద్యోగులను జేసీ దివాకర్ రెడ్డి కలుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ను ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి కలిసి చర్చించారు. రాయల తెలంగాణ అంశంతో పాటు శింగనమల అసెంబ్లీ స్థానంపై జేసీతో శైలజానాథ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో రోజు రోజుకూ బలహీన పడుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం.. రెచ్చగొట్టే కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. నోటి దురుసుతో అధికారులు, ప్రత్యర్థులపై తిట్లు లంకించుకోవడం, దాడులకు దిగడం ద్వారానే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులుగా ఉండే జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయంగా ఉనికి నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలకు కూడా దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. -
పరిటాల రవి హత్యకు ఆయుధాలు సరఫరా చేసింది జేసీ బ్రదర్సే
-
లోకేష్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం
సాక్షి, అనంతపురం: నారా లోకేష్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీచేశారు. తనపై లోకేష్ లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే నేరుగా తేల్చుకుంటానని పేర్కొన్నారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయిని, తాడిపత్రి టీడీపీ కార్యకర్తలను చంపింది జేసీ బ్రదర్స్ కాదా అని ప్రశ్నించారు ‘టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీకి లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించింది. ప్రబోధానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేయించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి గుర్తు లేదా’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని పేర్కొన్నారు. చదవండి: టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ! -
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌కు కోర్టు సమన్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 155 బీఎస్–3 వాహనాలకు బీఎస్–4గా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో సహా 18 మందికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయంగా సమన్లు అందజేశారు. -
టీడీపీ కంచుకోటలో జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): టీడీపీ కంచుకోట నరసాపురంలో జేసీ బ్రదర్స్ (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)కు గట్టి షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడైన రామాంజులరెడ్డి, ఆయన వర్గీయులు దాదాపు 160 కుటుంబాల వారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి నేతృత్వంలో వీరంతా మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ మారడం టీడీపీ కంచుకోటకు బీటలు బారినట్లయ్యింది. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తుండటంతో ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లభించకపోవడం, వర్గ కక్షలు పెంచి పోషించే జేసీ సోదరుల వైఖరి నచ్చకపోవడంతో 160 కుటుంబాల వారు పార్టీ వీడారన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు వేమనాథరెడ్డి, ఎంపీపీ రామ్మూర్తిరెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హాజీవలి, మండల యూత్ కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, పార్లమెంటు జనరల్ సెక్రటరీ రవిప్రసాద్‌రెడ్డి, సీనియర్ నాయకులు చిక్కేపల్లి రామేశ్వర్‌రెడ్డి, ముచ్చుకోట అమర్నాథరెడ్డి, నరసాపురం రామచంద్ర (కాశీ), ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
జేసీ బ్రదర్స్‌కు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బీఎస్ 3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ బ్రదర్స్‌కు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన వ్యాపార భాగస్వామి సి.గోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.6.31 కోట్ల నగదు, బ్యాంకులో మరికొంత నగదు, బంగారు ఆభరణాలతోపాటు రూ.15.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలు సుప్రీం కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా దర్జాగా అక్రమ దందాకు పాల్పడ్డాయి. బీఎస్ 3 వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా జేసీ కుటుంబం అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 154 బీఎస్ 3 మోడల్ బస్సులు, లారీలను తుక్కు పేరుతో కొన్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరున 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నిబంధనల ప్రకారం బీఎస్ 3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. దాంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి, వాటిని బీఎస్ 4 వాహనాలుగా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్వోసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాదు ఆ వాహనాల్లో కొన్నింటిని అక్రమంగా ఇతర రాష్ట్రాల్లోని వారికి విక్రయించేశారు. అలా విక్రయించాలంటే పోలీసుల నుంచి ఎన్వోసీ పొందాలి. కానీ స్థానిక పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్వోసీలు సృష్టించి మరీ అమ్మేశారు. వాటిని కొన్న వారు తాము మోసపోయామని గుర్తించి అనంతపురంలోని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారించిన అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడ్డట్టు దర్యాప్తులో వెల్లడైంది. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించగా, బీమా పత్రాలన్నీ నకిలీవని వెల్లడైంది. జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర రవాణా శాఖ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి, సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోన్లను కూడా జప్తు చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్వోసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిలను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఇటీవల విచారించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఈడీ అధికారులు జేసీ బ్రదర్స్ కుటుంబానికి చెందిన రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అశోక్ లేలాండ్లో కొందరి పాత్రపైనా ఈడీ ఆరా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక అశోక్ లేలాండ్ కంపెనీ పాత్ర ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఆ కంపెనీకి చెందిన కొందరి సహకారంతోనే ఈ దందా సాగించినట్టు ప్రాథమికంగా గుర్తించింది. దాంతో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులను కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. -
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
రెచ్చిపోయిన జేసీ వర్గీయులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి జేసీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. కాగా, తాడిపత్రిలోని మూడో వార్డులో జేసీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇక, గాయపడిన కార్యకర్తలను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. -
కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?
ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు కావడం కామనే. తెలుగుదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు ఎంపీగా పనిచేసిన ఆ నేతపై పచ్చ పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారట. అందుకే ఈసారి టిక్కెట్ రాదంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? కాల్వ కేరాఫ్ రామోజీ క్యాంపస్ కాలువ శ్రీనివాస్. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన తరచుగా మీడియాలో కనిపించేవారు. ఈనాడు జర్నలిస్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలువ తొలిసారి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. టీడీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా.. పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాల్వకు జేసీబీతో బ్రేక్ చంద్రబాబు కావాలని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కాలువ శ్రీనివాస్‌కు గతంలో మంచి ప్రాధాన్యతే దక్కింది. అయితే ప్రస్తుతం ఆయనకు జేసీబీ (జేసీ బ్రదర్స్) రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్‌కు రాయదుర్గం టిక్కెట్ దక్కదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ కోసం రాయదుర్గం టిక్కెట్ త్యాగం చేసిన దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు, లోకేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడే దీపక్ రెడ్డి. 2012 రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రాయదుర్గం నియోజకవర్గంపై కన్నేసిన దీపక్ రెడ్డి.. చంద్రబాబు, నారాలోకేష్ లతో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. కార్యకర్తల విరాళాలు కాల్వ పాలు.! కాలువ శ్రీనివాస్ వైఖరిపై గత కొంత కాలంగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పార్టీ పదవులు ఇప్పిస్తానని పలువురు నేతల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కాలువ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ ఫండ్ అభ్యర్థులకు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నారని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి.. దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి బెంగ పెట్టుకున్నట్లు సమాచారం. కిం కర్తవ్యం.? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై కాలువ శ్రీనివాస్ తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్. పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేతల ద్వారా కాలువ శ్రీనివాస్ లాబీయింగ్ ప్రారంభించినట్లు అనంతపురం తెలుగుదేశం పార్టీలో ప్రచారం సాగుతోంది. -
అలజడులు సృష్టించేందుకు జేసీ బ్రదర్స్ యత్నం..
తాడిపత్రి అర్బన్: తాడిపత్రి... ఈ పేరు వింటే ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్యలు.. ముఠా పోరు.. విధ్వంసాలు.. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా దాడులు.. ప్రతీకార జ్వాలల్లో దహనమయ్యే గడ్డి వాములు, గుడిసెలు, గృహాలు కళ్ల ముందు మెదలాడుతాయి. ఆధిపత్య పోరులో ఓ వర్గం సాగించిన దౌర్జన్యానికి మూడు దశాబ్దాలుగా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ అతలాకుతలమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏ ఎన్నికల చరిత్ర చూసినా పచ్చని పల్లెల్లో అల్లకల్లోలమే ఆవిష్కృతమవుతుందనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేశారు. పోలీసు యంత్రాంగానికి పూర్తీ స్వేచ్ఛనిచ్చారు. దీంతో తాడిపత్రిపై ఇప్పటి వరకూ పడిన ఫ్యాక్షన్ ముద్ర కాస్త చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో నెలకొన్న స్వేచ్ఛాయుత వాతావరణాన్ని చెడగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగించేలా జేసీ సోదరులు గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకు తెరలేపారు. ఇందుకు ఇటీవల జేసీ సోదరుల సొంతూరు జూటూరులో జరిగిన దాడులే నిదర్శనం. జేసీ బ్రదర్స్ అడ్డాగా.. తాడిపత్రి పేరు వినగానే స్ఫురణకు వచ్చే పేరు జేసీ బ్రదర్స్ . 1982లో సమితి ప్రెసిడెంట్‌గా జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఫ్యాక్షన్‌కు బీజం వేశారు. తాడిపత్రి మండలం హుసేనాపురంలో గృహ దహనాలు, పెద్దపప్పూరు మండలం తురకపల్లి, తాడిపత్రి మండలం వెలమకూరు గ్రామాల్లో హత్యోదంతాలు, ఇతర గ్రామాల్లో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో జేసీ సోదరుల ప్రమేయం ఉందన్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. 1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పెద్దపప్పూరు మండలంలోని పసులూరు గ్రామంలో మహిళల పోలింగ్ కేంద్రంలోకి జేసీ వర్గీయులు చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై అప్పటి పోలింగ్ విధుల్లో ఉన్న విశ్రాంత సైనికోద్యోగి ఫిర్యాదు మేరకు అప్పటి ఎన్నికల ఇన్చార్జ్ దోతాంగే (ఐపియస్ అధికారి).. జేసీ దివాకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ కలి్పంచక పోవడంతోనే అప్పట్లో జేసీ సోదరుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయన్న విమర్శలు వినిపించాయి. 2004 నుంచి హ్యాట్రిక్ విజయాలతో తాడిపత్రి అడ్డాగా కొనసాగుతున్న జేసీ సోదరుల ఆధిపత్యానికి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయంతో చుక్కెదురైంది. సేవ్ తాడిపత్రి పేరుతో హైడ్రామా.. మూడు దశాబ్దాలుగా జేసీ సోదరుల ఆగడాలతో తాడిపత్రి వాసులు విలవిల్లాడారు. గ్రానైట్, ట్రాన్స్‌పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, సిమెంటు ఫ్యాక్టరీలు... ఒకటేమిటీ తాడిపత్రిలో ప్రతిదీ ఆదాయ వనరుగా మార్చుకుని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ప్రతి ఒక్కరూ వీరికి కప్పం చెల్లించారు. కాదని ఎదురు మాట్లాడిన వారి ఇంటికి కరెంటు, నీటి సరఫరా నిలిపి వేశారు. మున్సిపాలిటీ వాహనంలో చెత్త తీసుకొచ్చి వారి ఇంటి ముందు పోసి కక్షసాధింపులకు దిగేవారు. అద్దె ఇంట నివాసమున్న వారిని తక్షణమే ఖాళీ చేయించేవారు. అధికారం కోల్పోయిన తర్వాత జేసీ సోదరుల నోటి నుంచి వెలువడుతున్న మాటలు, వారు ఉపయోగించిన భాషను చూసి ప్రతి ఒక్కరూ ఛీదరించుకున్నారు. ఈ క్రమంలోనే తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు తాజాగా ‘సేవ్ తాడిపత్రి’ పేరుతో జేసీ ప్రభాకరరెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. పేరుకు సేవ్ తాడిపత్రి అయినా.. దీని వెనుక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జేసీ ప్రభాకరరెడ్డి సాగిస్తున్న ప్రయత్నాలను తాడిపత్రి వాసులు పసిగట్టారు. జేసీ సోదరుల ఆగడాలపై పెద్దారెడ్డి పోరు.. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలపైనే పోరుబాట సాగిస్తూ వచ్చారు. దీంతో పెద్దారెడ్డిని అప్పట్లో ఇబ్బందులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అక్రమంగా కేసులు మోపి, జైలుకు పంపించేందుకు ప్రయత్నించారు. అయినా పెద్దారెడ్డి వెనుకడుగు వేయక అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జేసీ సోదరులకు తగిన గుణపాఠం చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. -
జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. -
కదులుతున్న అక్రమాల పుట్ట.. స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు!
టీడీపీ పాలనలో జేసీ సోదరులు (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ట్రావెల్స్ వ్యాపారంలో అక్రమంగా రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్‌తో నాలుగు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించారు. ఎట్టకేలకు వీరి అక్రమాల పుట్ట కదులుతోంది. నిన్న త్రిశూల్... నేడు దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాడిపత్రి అర్బన్: జేసీ సోదరులు అడ్డగోలు వ్యాపారాలు, అవినీతి అక్రమాలతో రూ.కోట్లు పోగేసుకున్నారు. ఒకేనంబర్పై పలు బస్సులను అనధికారికంగా నడిపారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సును సీజ్ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బస్సులను సీజ్ చేయడం సంచలనం రేపింది. కండీషన్ లేని బస్సులు నడపడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతుండటం, ట్రావెల్స్ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై నిఘా అధికమైంది. అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలున్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి, ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ ‘పెద్దమనిషి’ ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. నిజాయితీ అధికారులకు వేధింపులు మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలోని అక్రమాల గురించి తెలిసి షాక్ అయ్యారు. ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దందా ఏ స్థాయిలో సాగిందో ఈ జరిమానాలు చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి నిజాయితీ అధికారి ఇక్కడ ఉంటే ఆటలు సాగవని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని ఏ1గా, గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుండి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించేది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ట్రాన్స్‌పోర్టు ద్వారా రూ.300 కోట్లు అర్జాస్ స్టీల్‌ప్లాంట్ కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2వేల ఎకరాల వరకు స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇస్తూ వచ్చేవారు. అయతే ఇందుకు సంబందించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లో వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్ళలోట్రాన్స్పోర్టు ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టారు అర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ను టన్ను రూ.10 తో టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అ్రల్టాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100కోట్ల ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. దేవుని మాన్యాన్నీ వదలని సోదరద్వయం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదనే ఆరోపణలు వినిపించాయి. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు ఆ భూములన్నీ జేసీ ఆధీనంలో ఉన్నాయని గుర్తించారు. మూడు నెలల క్రితం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆదర్శ మున్సిపాలిటీని గలీజు చేసి.. తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం. జేసీ సోదరులు, వారి అనుచరులు ఆదర్శ మున్సిపాలిటీ మాటున రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ఎస్.వి.రవీంద్రారెడ్డి తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనికి గుడ్‌విల్ రూపంలో రూ.2.66 కోట్లు మున్సిపాలిటీకి బకాయి చెల్లించాల్సి ఉంది. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73 కోట్లు మున్సిపాలిటీకి బకాయి పడ్డారు. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను దాదాపు 50 మంది వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశారు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల చొప్పున అద్దె వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షలు ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 షాపులు కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి సంబంధించి రూ.3.52 లక్షలు గుడ్‌విల్ రూ.3.33 లక్షలు బాడుగ కలిపి మొత్తం రూ.7.83 లక్షలు బకాయి పడ్డారు. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నాడు. వ్యాపారులకు మాత్రం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సబ్లీజుకు ఇచ్చుకున్నాడు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్‌పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి – ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ..
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం నలుగురు జేసీ వర్గీయుల సస్పెన్షన్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సిఫార్సు చేశారు. దీంతో ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ జేసీ వర్గీయులు తీర్మానం చేశారు. చదవండి: (బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్) -
‘పల్లెకు టికెట్ ఇస్తే పనిచేయం’
అనంతపురం (పుట్టపర్తి టౌన్): వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే పనిచేసేది లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ కార్యవర్గ సభ్యుడు పెద్దరాసు సుబ్రహణ్యం స్పష్టం చేశారు. పట్టణంలోని సాయి ఆరామంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి వ్యవహార శైలితో నియోజవర్గంలో టీడీపీ భూస్థాపితం అవుతోందని చెప్పారు. కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా, సీనియర్ నాయకులకు వెన్నుపోటు పొడిచారన్నారు. కియా వద్ద, అనంతపురం పట్టణాల్లో 1,300 ఎకరాలు, రూ. 4 వేల కోట్ల ఆస్తి కూడబెట్టుకున్నారని ఆరోపించారు. జేసీ బ్రదర్స్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి కానీ పల్లె ఆస్తులపై ఈడీ ఎందుకు దాడులు జరపడం లేదని ప్రశ్నించారు. తమకు ఒక్క కళాశాల ఉంటే సీ గ్రేడ్‌లో ఉందని, పల్లెకు 40 కాలేజీలు ఉంటే అన్నీ ఏ గ్రేడ్‌లో ఉన్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ ఏ లోటు లేకుండా అందుతోందన్నారు. అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అవకాశం కల్పిస్తే అధిష్టానంతో నియోజకవర్గ పరిస్థితులపై చర్చిస్తామని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమో, ప్రత్యామ్నాయం ఎంచుకోవడమో చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వారాదప్ప, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు కోట్ల డైమండ్ నెక్లెస్.. జేసీ అక్రమ ఆస్తులు చూసి ఈడీ షాక్
-
జేసీ బ్రదర్స్‌పై ఈడీ కేసు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. తమను సంప్రదించిన ఈడీ అధికారులకు.. ఏపీ రవాణా శాఖ అధికారులు వివరాలు అందజేశారు. ఫోర్జరీ వ్యవహారంపై ఈడీ అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు ఏపీ రవాణా శాఖ అధికారులు. ‘‘బీఎస్-3 వాహనాలు వాడొద్దని సుప్రీంకోర్టు నిషేధించింది. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన 154 వాహనాలకు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే జేసీ ట్రావెల్స్ పై 27 క్రిమినల్ కేసులు పెట్టాం. పైగా నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్, బోగస్ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. ..ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ కు ప్రత్యేక నివేదిక పంపాం. ఆ వివరాల ఆధారంగానే జేసీ బ్రదర్స్ పై విచారణ జరుగుతోందని భావిస్తున్నాం. ఏఏ అంశాలపై ఈడీ విచారణ చేస్తోందో మాకు తెలియదు’’ అని ఏపీ రవాణాశాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. -
కూకట్‌పల్లిలో కృతిశెట్టి సందడి.. ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వస్త్ర షోరూం జె.సి. బ్రదర్స్‌లో సినినటి కృతిశెట్టి సందడి చేశారు. కూకట్‌పల్లిలో ఈ షోరం ప్రారంభోత్సవానికి వచ్చిన కృతిశెట్టి మాట్లాడుతూ.. జె.సి.బ్రదర్స్ షోరూంను అద్భుతంగా తీర్చిదిద్దారని, వస్త్రాల కలెక్షన్ చాలా ట్రెండీగా ఉందని చెప్పారు. రానున్న పండుగ సీజన్‌కి ఇది ఒక ట్రెండీ షాపింగ్ డెస్టినేషన్ అవుతందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మర్రి జనార్దన్‌రెడ్డి, మర్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా జంటనగర ప్రజలకు మార్కెట్లో అందరి కన్నా తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కస్టమర్లకు మరింత సౌకర్యంగా సేవలందించాలనే ఉద్దేశంతోనే కూకట్‌పల్లిలో ఉన్న తమ బ్రాంచిని అత్యాధునిక వసతులకో ఇంత పెద్ద ప్రాంగణంలోకి మార్చామని వెల్లడించారు. ఇక కృతిశెట్టి విషయానికొస్తే.. . చైల్డ్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది ఈ కన్నడ బ్యూటీ `ఉప్పెన` చిత్రంలో హీరోయిన్గా మారిపోయింది. ఒకే ఒక్క మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా కృతిశెట్టి స్థానం సంపాదించింది. ప్రస్తుతం కృతి నానితో `శ్యామ్ సింగరాయ్`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ పోతినేనితో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది. అలాగే నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’చిత్రంలోనూ ఆమే హీరోయిన్. మరోవైపు ఇటీవల `బంగార్రాజు`లో నాగచైతన్య సరసన హీరోయిన్గా ఎంపికైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: టీడీపీ అధిష్టానం జేసీ వర్గానికి ఝలక్ ఇచ్చింది. బుధవారం రాత్రి ప్రకటించిన పార్టీ అనంతపురం పార్లమెంటు కమిటీలో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ‘రాయలసీమ ప్రాజెక్టులపై సీమ నేతల సదస్సు’లో పురుడుపోసుకున్న విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదని సదస్సులో జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు) మంగళవారం కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇదే విషయాన్ని మరోసారి తేల్చిచెప్పారు. దీంతో అనంత టీడీపీ నేతలు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. రెండు నెలల క్రితమే వేసిన పార్లమెంట్ కమిటీని రద్దు చేసి బుధవారం రాత్రి ఆఘమేఘాలపై కొత్త కమిటీని నియమించింది. ఇందులో జేసీ వర్గానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అధ్యక్షునిగా, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ చౌదరిని ప్రధాన కార్యదర్శిగా 40 మందితో కమిటీని ప్రకటించింది. ఇందులో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. వారు కూడా ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నవారేనని, జేసీ వర్గంతో సంబంధం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: అబద్ధాల్లో అపూర్వ సోదరులు