రాజకీయంగా తమకు ఎదురులేదని మిడిసిపడుతున్న జేసీ బ్రదర్స్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. జేసీ సోదరులు కాంగ్రెస్‌లో కొనసాగినన్ని రోజులూ తాడిపత్రిలో టీడీపీని తమ భుజాలపై మోసిన టీడీపీ నేతలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సోమవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీరంతా సిద్ధమయ్యారు. జేసీ బ్రదర్స్ ఎన్నికల నుంచి తప్పుకుని వారసులను బరిలో నింపిన తరుణంలో ఊహించని ఈ పరిణామం ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలే టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న తరుణంలో బలమైన కేడర్ దూరం కావడంతో ఓటమి భయం వెంటాడుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న జేసీ బ్రదర్స్ అరాచకాలకు తాడిపత్రి అడ్డా. రాజకీయంగా అడ్డొచ్చిన వారిని ఆర్థికంగా దెబ్బతీస్తారనే చర్చ ఉంది. అవసరమైతే హత్యా రాజకీయాలకూ వెనుకాడరనే ముద్ర వీరి సొంతం. చీనీచెట్లు నరికించడం, మూడో కంటికి తెలియకుండా ప్రాణాలు తీస్తూ తమకు ఎదురొస్తే ఎంత ప్రమాదమో చాటి చెప్పిన ఘటనలు అనేకం ఉన్నట్లు సమాచారం. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో తాడిపత్రిలో టీడీపీ తరఫున పేరం నాగిరెడ్డి, గుత్తా వెంకట నాయుడు, కాకర్ల రంగనాథ్, జగదీశ్వరరె డ్డి, జయచంద్రారెడ్డి, ఫయాజ్‌లు టీడీపీని తమ భుజాలపై వేసుకుని జేసీ బ్రదర్స్‌తో పోరాడారు. అందుకే 2014 ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి 4వేల నుంచి 6వేల మెజార్టీతో విజయం సాధించారు. ఈక్రమంలో 2014 ఎన్నికల సమయంలో జేసీ బ్రదర్స్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు.
అయితే కాంగ్రెస్ కేడర్‌లోని భోగాతి నారాయణరెడ్డి కుటుంబం మాత్రమే జేసీ బ్రదర్స్ వెంట నడిచింది. మిగతా వారంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇక టీడీపీలో కీలక నేతగా ఉన్న పేరం నాగిరెడ్డి కూడా 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మిగతా టీడీపీ నేతలంతా కేడర్‌ను ఒప్పించి జేసీకి పనిచేయించారు. ఫలితంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి 21,772 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత తమ విజయానికి అంతలా కష్టపడిన టీడీపీ నేతలైన జగదీశ్వర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను జేసీ సోద రు లు పూర్తిగా దూరం పెట్టారు. అంతటితో ఆగక ఆర్థికంగా ఇతరత్రా వేధింపులకు ది గారు. దీంతో వారంతా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరో 19 మంది కీలక నేతలు కూడా జేసీ బ్రదర్స్‌ను విభేదించి దూరంగా ఉంటున్నారు.
నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడిపత్రికి రానున్నారు. చాలాకాలం తర్వాత తాడిపత్రికి వస్తుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులు కూడా కదనోత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, బ్రహ్మానందరెడ్డిలతో పాటు తాడిప త్రి ఎంపీపీ గురులక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి, కాకర్ల జగన్నాథ్, చిత్తరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రంగనాయకులు, జేసీ స్వగ్రామం జూటూరుకు చెందిన రా మ్మోహన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, మహదేవరెడ్డి, నాగరంగయ్య, ఎంపీటీసీ సభ్యు లు వెంకటనారాయణ, పెద్దయ్య, బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీ పుల్లన్న, రామేశ్వరరెడ్డి, ఉమాపతినాయుడు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ఖా జామైనుద్దీన్, లయన్స్‌క్లబ్ ప్రెసిడెంట్ రోఖియాబేగమ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. దీంతో తాడిపత్రిలో టీడీపీ ఖాళీ అయినట్లే.
తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ పెత్తనానికి చెక్ పడినట్లేనా? : తాడిపత్రిలో పెద్దారెడ్డి రాకతో వైఎస్సార్‌సీపీ బలం పుంజుకుంది. టీ బంకులు, హోటళ్లతో పాటు ఎక్కడ నలుగురు గుమికూడినా ‘ఈ దఫా జేసీ వాళ్లకు ఇబ్బందే’ అనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీలో జోరుగా సాగుతున్న చేరికలు టీడీపీని పూర్తిగా కుంగదీశాయి. ప్రభాకర్‌రెడ్డి వారసుడిగా అస్మిత్‌రెడ్డి అరంగేట్రం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే తాడిపత్రి ఫలితం ఎలా ఉండబోతుందో ఇట్టే తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతోనే వారి రాజకీయ భవిష్యత్తుకు ఫుల్‌స్టాప్ పడినట్లయిందని.. ఇక వారి వారసులకు విజయం దక్కదని పార్టీని వీడుతున్న టీడీపీ నేతలు ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment