
‘రెచ్చిపోతున్న జేసీ సోదరులు’
విజయవాడ: ఎంతమంది చచ్చిపోయినా ఫర్వాలేదు.. తమకేంటి అనేధోరణిలో జేసీ బ్రదర్స్ ఉన్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. డబ్బు, అధికారం ఉందని జేసీ సోదరులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘సాక్షి’ కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేయడాన్ని తప్పుబట్టారు. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేనా లేక రౌడీనా అని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జేసీ బ్రదర్స్ ను అదుపులో పెట్టాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.