
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 155 బీఎస్–3 వాహనాలకు బీఎస్–4గా నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో సహా 18 మందికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయంగా సమన్లు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment