JC Diwakar Reddy
-
అరాచకం బట్టబయలు.. వైరల్‌గా మారిన జేసీ వర్గీయుల దాష్టికం
సాక్షి,అనంతపురం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.తాజాగా, తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గూండాగిరికి దిగారు. పెద్దవడగూరు మండల కేంద్రంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త మధుసూదన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదురుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుండగా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండిపోయారు. తమకేం పట్టనట్టుగా వారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్లై యాష్ కాంట్రాక్టు కోసం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తన నియోజకవర్గంలో జేసీ ప్రమేయంపై ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రి సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే ఫ్లై యాష్ టిప్పర్లను ఆది వర్గీయులు అడ్డుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫ్లై యాష్ తీసుకెళ్తామంటూ జేసీ వర్గీయులు భారీ వాహనాలతో బయలు దేరారు. దీంతో ఆర్టీపీపీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. భారీగా మోహరించారు. -
చట్టం.. జేసీ చుట్టం!
తాడిపత్రిటౌన్: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే తాడిపత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చట్టం.. జేసీకి చుట్టం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. కళ్లెదుటే నిందితులు కనిపిస్తున్నా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే... సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు ఇరువర్గాల గొడవలు, అల్లర్ల ఘటనలకు సంబంధించి పోలీసులు ఏడు కేసుల్లో దాదాపు 520 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 163 మందిని (టీడీపీకి చెందిన వారు 81 మంది, వైఎస్సార్సీపీకి చెందిన వారు 82 మంది) అరెస్టు చేశారు. ఆ సమయంలో మిగిలిన నిందితుల కోసం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలి బయటప్రాంతాల్లో తలదాచుకున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయి బిక్కుబిక్కు మంటూ గడిపాయి. పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పట్టణ వాసులు సైతం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేకుండా రహదారులనే దిగ్బంధించిన సంఘటనను ఎవ్వరూ మరచిపోలేరు.పోలీసుల తీరు వివాదాస్పదంఅల్లర్లు, గొడవల కేసుల్లో నిందితులగా ఉండి కనిపించకుండా పోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఎన్నికల ఫలితాల అనంతరం కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమ మాట వినని పోలీసులను బదిలీలు చేయిస్తారని, వీఆర్‌కు పంపుతారేమోనని పోలీసులే టీడీపీ నాయకులను చూసి జంకుతున్నారు. నిందితులను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సాక్షిగా చెబుతున్నా పోలీసులు ఏమాత్రమూ స్పందించడం లేదు. గత బుధవారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట తలపెట్టిన ధర్నాకు అల్లర్ల కేసుల్లో ఉన్న నిందితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్న విషయం తాడిపత్రిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన ఇంటిని ఖాళీ చేయకుండా వేధించడంతో పాటు తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డికి ఇల్లు ఉంది. దానిని సాహితీ లక్ష్మీనారాయణకు అద్దెకు ఇచ్చారు. అయితే ఒప్పందం గడువును మూడేళ్లుగా నిర్ణయించుకున్నారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో అఫిడవిట్ వేసినట్లు జేసీ దివాకర్‌రెడ్డి గుర్తించారు. బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ.. ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. అంతేకాదు తన సంతకం ఫోర్జరీ జరిగిందని, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్ షాజుద్దీన్‌లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆయన ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జేసీ కుటుంబంపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
వేడెక్కిన రాజకీయం
-
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు
వృత్తి: ట్రాన్స్‌పోర్టు బిజినెస్ప్రవృత్తి: హత్యా రాజకీయాలు.. నేరాలు.. ఘోరాలుపదవి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక దేశం నేతఅరాచకాలు,కేసులు: చెప్పలేనన్నిఅతనో నియంత.. అతనికెదురెళ్తే టిప్పర్ లారీకి ఎదురెళ్లినట్లే.. తన దురన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రోజుతో వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే.. ఊళ్లలో ఫ్యాక్షన్ మంటలను ఎగదోసి, వాటితో చలికాచుకునే దుర్మార్గ రాజకీయం తన సొంతం.. అదే తన హాబీ కూడా.. రౌడీషీట్ తెరిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడూ తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం ఇతను ‘దేశం’ తరఫున పోటీ చేస్తున్నారు. సాక్షి, టాస్‌్కఫోర్స్ : ట్రావెల్స్ ద్వారా కండిషన్ లేని బస్సులను నడిపి ఆ ‘దేశం’ నేత ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడారు. 2013 అక్టోబరు 30వ తేదీన మహబూబ్‌నగర్ సమీపంలో పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 45 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సీనియర్ నేత భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించారని ఆ నేతపై సీఐడీ అభియోగాలను మోపింది.2017లో విజయవాడ వద్ద ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కాంట్రాక్ట్ క్యారేజ్ పేరుతో పర్మిట్లు తీసుకుని స్టేట్ క్యారేజ్‌గా బస్సులు నడపడంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తప్పు చేసింది కాకుండా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నేత హైదరాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్రమాలకు పరాకాష్టగా బీఎస్ 3 వాహనాలు ఆ నేత అక్రమాలకు పరాకాష్టగా బీఎస్–3 వాహనాల కుంభకోణం నిలిచింది. ఓ ప్రముఖ సంస్థ వద్ద స్క్రాప్ ద్వారా కొనుగోలు చేసిన 154 బీఎస్–3 లారీలను బీఎస్–4 వాహనాలుగా నకిలీ ఎన్ఓసీ, ఇన్సూరెన్స్‌తో నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ,ఈడీ దాడులు చేశాయి. 2020లో ఆ నేతతో పాటు ఆయన కుమారుడు, అనుచరుడు, మరికొందరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాయి. బస్సులను సీజ్ చేయడంతోపాటు ఈ నేత, బినామీల పేరుపై ఉన్న రూ.22 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసి, పలు రికార్డులు స్వా«దీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ప్రభుత్వ నిధులూ స్వాహా...?తాడిపత్రి ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. 2015æలో యాడికి మండలంలో గ్రామీణ సడక్ యోజన కింద రూ.2.40 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా పూర్తి చేయించారు. రాయలచెరువులో నీరు–చెట్టు కింద పూడికతీత పనుల్లో రూ.2.5 కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.పెద్దవడుగూరు మండలంలో 2015లో రూ.6.45 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో ఎక్కువ శాతం చేయకుండానే పూర్తయినట్లు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేశారు. పెద్దవడుగూరు మండలంలోని పెద్ద వంక వద్ద జంగిల్ క్లియరెన్స్ పేరుతో దాదాపు రూ.8 లక్షలు కాజేశారు. చిన్నవడుగూరులో కుంట, కాలువల్లో ముళ్ల పొదల తొలగింపునకు దాదాపు రూ.18 లక్షలు, పెద్దవంకలో రూ.7 లక్షలను పనులు చేయకుండానే పక్కదారి పట్టించారు. కేసుల వివరాల► ఇప్పటికే రౌడీ షీట్ నమోదై ఉంది. ► 1996లో జరిగిన టౌన్‌బ్యాంకు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో టీడీపీకి చెందిన లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ► మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 70కి పైగా కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో 57 కేసులు, తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లో 5, పెద్దపప్పూరు పోలీసు స్టేషన్లో 6, యాడికిలో ఒక కేసు నమోదయ్యాయి. ► 2020లో నకిలీ ఇన్సూరెన్స్ కుంభకోణంలో తాడిపత్రి పట్ట ణ, అప్‌గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లలో 28 చీటింగ్ కేసుల నమోదు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంతో ఆయనపై పోలీసులు ఒకేసారి 28 కేసులు నమోదు చేశారు. (1). ఎఫ్ఐఆర్ నెం. 28/2020. ఐపీసీ 420, 467, 468, 471, 472, 120(బి), 201 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లు. (2) ఎఫ్ఐఆర్ : 85/2020. ఐపీసీ 420, 467, 468, 471, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ, 179, 182, 190 ఎం.వి.యాక్టు) మరో 27 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ► 2023లో పెద్దపప్పూరులోని ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అనుచరులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడున్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుని కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ► 1996 నుంచి 1999 వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన నిందితునిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో 2014లో ఎఫ్ఐఆర్ నెం. 142/14, సెక్షన్ 151 సీఆర్పీసీ కింద పీడీ యాక్టు నమోదైంది. అసెంబ్లీ పోటీలో ఉన్న తనయుడిపై కేసులు : ► ఆయన తనయుడిపై 30 కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాలను సృష్టించి వాహనాలను విక్రయాలు జరిపిన నేరంపై 2022లో ఐపీసీ 420, 467,468,471,120బి రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రీకొడుకులు కడప సెంట్రల్ జైలులో 50 రోజులు జ్యూడిíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. ► బీఎస్–3 వాహనాల కుంభకోణంలో బైయిల్‌పై వస్తూ తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించినందుకు తండ్రితోపాటు తనయుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదైంది. మనీ ల్యాండరింగ్‌పై తాడిపత్రిలోని నివాసంలో ఈడీ అధికారులు దాడులు జరిపి ఆయన తనయుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసిన పలు కేసుల్లో తనయుడిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులూ నమోదయ్యాయి. డబ్బు కోసం దేనికైనా సై ► తాడిపత్రి మండలం హుస్సేన్‌పురం వద్ద రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన గెర్దావ్ స్టీల్ ప్లాంట్‌పై కన్నేసిన ఆ నేత కంపెనీ యజమానులను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్‌పోర్టును ఏర్పాటు చేసి, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు తన లారీలనే వినియోగించుకునేలా వారిపై ఒత్తిడి చేశారు. సరుకు రవాణాకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు వే బిల్లులు కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ ద్వారా చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. బినామీ లెక్కలతో రూ.300 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. ► స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్ ద్వారా నెలకు దాదాపు రూ.15 కోట్ల చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రూ.900 కోట్లు ఆర్జించారని సమాచారం. ► గుత్తి నుంచి తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ఉన్న వైఎస్సార్ జిల్లా సరిహద్దు వరకూ 63 కి.మీ. హైవే పనులకు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ హైవే అధికారులు ఆహా్వనించిన టెండర్లను నాటి టీడీపీ ఎంపీకి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు మరో విదేశీ కంపెనీ 13 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకున్నాయి. విదేశీ కంపెనీకి మన దేశంలో అనుమతుల్లేవంటూ అధికారులను బెదిరించి ఆ టెండర్‌ను రద్దు చేయించారు. అనంతరం ఎంపీకి చెందిన కంపెనీతోపాటు మరో కంపెనీతో కలసి 4.9 శాతం ఎక్కువకు టెండర్ కోట్ చేయించి దక్కించుకున్నారు. ఈ అక్రమాలతో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ► మున్సిపాలిటీ ఆ«దీనంలోని కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తును తన ముఖ్య అనుచరుడు ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఆ నేత లీజుకు ఇచ్చి, గుడ్‌విల్ రూపంలోనే దాదాపు రూ.2.66 కోట్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ► ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కాంప్లెక్స్‌లో 6, 67, 68, 72 రూములను తక్కువ మొత్తంతో అద్దెకు తీసుకుని సబ్ లీజులకు ఇచ్చి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు సమాచారం. ► పెద్దపప్పూరు మండలం జూటూరు భూముల్లో ఆయన అనుచరులు రూ. కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలోనే వారి అనుచరులు రూ.40 కోట్లకు పైగా కూడబెట్టారు. ► తమ కుటుంబ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని గనుల్లో లైమ్‌స్టోన్ వెలికి తీసే క్రమంలో చారిత్రక గుహలు వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ►మట్కా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తికి ఈ నేత పూర్తి అండదండలు ఉండేవి. అప్పట్లో కడప విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సీఐ, తన సిబ్బందితో కలసి మట్కా డాన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పుడు తన అనుచరులను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు. -
లగాన్ పేరున గ్రానైట్ మాఫియా.. ఆర్జాస్ మాటున అక్రమార్జన
కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు ఆ సోదరులు రెచ్చిపోయారు. అధికారమే అండగా చెలరేగారు. అడ్డగోలుగా వ్యాపారాలు సాగించారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ చెరబట్టేశారు. పేదల కడుపు గొట్టారు. చివరికి అసాంఘిక కార్యకలాపాలకూ తెరలేపారు. తమకు అడ్డు చెప్పిన అధికారులపై దాడులకూ వెనుకాడలేదు. అలాంటి వారు నేడు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజల ముందుకు వెళ్తూ నీతి మాటలు మాట్లాడుతుండడంపై జనం నవ్వుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు దశాబ్దాల పాటు అక్రమంగా ట్రావెల్స్ వ్యాపారం సాగించి రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన వారి ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్‌తో ఏకంగా నాలులైదు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించేవారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో అప్పటి రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి దాడులు చేశారు. కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించి మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. బస్సు సీజ్ చేశారు. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఘటన జరిగిన కొన్నాళ్ల పాటు నిబంధనలు పాటించిన జేసీ సోదరులు... ఆ తర్వాత మంగళం పాడారు. అంతేనా.. కండీషన్ లేని బస్సులను నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమయ్యారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. అయితే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వీరి అక్రమాలను బట్టబయలు చేయడంతో ట్రావెల్స్ మూసేశారు. లగాన్ పేరున గ్రానైట్ మాఫియా.. తాడిపత్రి ప్రాంతంలో 800కు పైగా గ్రానైట్ పరిశ్రమలున్నాయి. మామూలుగా వీటికి గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. క్వారీ నుంచి ఒక లోడు గ్రానైట్ తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే టీడీపీ హయాంలో రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యాలు, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య అక్రమ ఒప్పందం కుదిరింది. దీనికితోడు లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేసేవారు. అలా కొల్లగొట్టిన డబ్బు లగాన్ పేరుతో మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరేది. ఈ క్రమంలోనే 2015 ఆగస్టు 21న మైనింగ్ విజిలెన్స్ ఏడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్‌రెడ్డి ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అందేది కాదు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారంటే లగాన్ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవని గుర్తించిన జేసీ సోదరులు ఎలాగైనా బదిలీ చేయించాలని చూశారు.చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీనిపై అప్పట్లో ఆయన మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి (పొట్టి రవి), అప్పట్లోగ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కొన్నాళ్లకే ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించిన ఈ ముఠా..మళ్లీ అక్రమాలు యథేచ్ఛగా సాగించింది. ఈ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా జేసీ సోదరులు వెనకేశారన్న ఆరోపణలున్నాయి. ఆర్జాస్ మాటున అక్రమార్జన.. తాడిపత్రి సమీపంలో ఆర్జాస్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2 వేల ఎకరాల తమ భూములను అప్పగించారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ప్లాంటుపై ఆధారపడి జీవించేవారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీల యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇచ్చేవారు. అయితే, ఇందుకు సంబంధించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి పన్ను కూడా ఎగ్గొట్టేవారు. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం అక్రమ లెక్కలే. వీరి లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్లలో రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. యథేచ్ఛగా డ్రై స్లాగ్ దందా.. అప్పట్లో ఆర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ను టన్ను రూ.1తో తమ బినామీల ద్వారా జేసీ సోదరులు కొనుగోలు చేయించేవారు. అల్ట్రాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చులు కింద రూ. 250 పోగా రూ.600 మేర మిగిలేది. ఇలా ప్రతి నెలా 25 వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్ తరలించేవారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100 కోట్లు కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ వదల్లేదు.. పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. తాడిపత్రి–పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేశారు. ఫారం ఫాండ్లు ఏర్పాటు చేయించి బోరు బావుల నీటితో నింపి ఆ భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదు. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. -
నిన్నే నమ్ముకున్నాం సారూ.. మరొక్కమారు నాకు చాన్స్ ఇవ్వరూ ప్లీజ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్‌చౌదరికి పార్టీ అధిష్టానం చుక్కలు చూపిస్తోంది. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన ఆయన 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీచేయాలని తీవ్రంగా యత్నిస్తున్న చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభాకర్ చౌదరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీకి కష్టపడిన తనకు ఈ దుస్థితి ఏమిటని కార్యకర్తల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు గనుక టికెట్ ఇవ్వకపోతే ప్రభాకర్ చౌదరి రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని అనుచరులు వాపోతున్నారు. పరిగణనలోకి కూడా తీసుకోలేదు గత రెండు మాసాలుగా టికెట్ కోసం యత్నిస్తున్న ప్రభాకర్ చౌదరికి ఏ దశలోనూ హామీ లభించలేదు. పైగా ఈయన్ను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అర్బన్ నియోజకవర్గంలో పాతిక వేలకు పైగా బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్టు అంచనా. దీంతో జనసేనకు ఇస్తే బావుంటుందనేది చంద్రబాబు ఆలోచన. 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో టీడీపీ కోసం కృషి చేస్తే ఉన్నట్టుండి జనసేనకు టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏమిటని చౌదరి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గనుక టికెట్ తెచ్చుకోలేకపోతే రాజకీయ సన్యాసం తప్పదేమోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందని తెలుస్తోంది. తేల్చుకునేందుకు విజయవాడకెళ్లిన చౌదరి వాడుకుని వదిలేయడమంటే చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే. ఈ కోవలోనే బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్ లాంటి వాళ్లందరూ బలయ్యారు. తాజాగా ప్రభాకర్ చౌదరి వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు సొంత పార్టీలోనే ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకించే వాళ్లు తానా అంటుంటే.. వీరికి వంతపాడుతూ అధిష్టానం తందానా అంటోంది. జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు ప్రభాకర్ చౌదరిపై ఏదో ఒక రకంగా రోజూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు దీన్ని ఎదుర్కోలేక తంటాలు పడుతుంటే మరోవైపు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేదు. ఇప్పుడాయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ పరిస్థితి గందరగోళంగా ఉంది. పొత్తులో ఏ పార్టీకి సీటిస్తారో, ఎవరు అభ్యర్థో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రభాకర్ చౌదరి విజయవాడకు బయలుదేరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
అసహనంతో అరాచకం.. పేట్రేగిపోతున్న జేసీ సోదరులు
రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువైన జేసీ బ్రదర్స్ (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) టీడీపీ అధికారం లేకపోయే సరికి సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్షంలో హుందాతనం కనబరచాల్సిన వీరు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి దొరతనాన్ని వెలగబెట్టిన జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చాక ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. వీరు నిత్యం ఏదో ఒక వివాదంతో నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి చేష్టలకు సామాన్యులకే కాదు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింతగా పేట్రేగిపోతున్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటినెలాగైనా అడ్డుకోవాలనేది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగా ఆస్పత్రి నిర్మాణాలను అడ్డుకోవాలని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వివాదం రాజుకుంది. జేసీ బెదిరింపులకు భయపడి కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇది తొలిసారి కాదు... జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రి పనులను అడ్డుకోవడం మొదటి సారేమీ కాదు. మొన్నటికి మొన్న డ్రెయినేజీ పనులను అడ్డుకున్నారు. ఏకంగా మురికి కాలువలో కుర్చీ వేసుకుని కూర్చుని వివాదం రేపారు. అంతకుముందు ‘నాడు–నేడు’ పనుల కింద జూనియర్ కాలేజీకి ప్రహరీ నిర్మిస్తుంటే అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి గొడవకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ప్రహరీ పనులు చేపట్టాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినా అడ్డుకుని రాద్ధాంతం చేశారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై... వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మున్సిపాలిటీలో అన్ని పనులకూ అడ్డు తగులుతున్నారు. అనుచరులను ఉసిగొలుపుతూ... గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అక్కసుతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ తాడిపత్రిలో రోజువారీ తీరు. గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పల్లెలకు వెళ్లి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ చేష్టలతో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఈయనకు అండగా నిలవని పరిస్థితి. జేసీ సోదరులు టీడీపీకి గుదిబండగా మారారని అనంతపురానికి చెందిన ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప తాడిపత్రిలో టీడీపీకి మనుగడ లేదంటున్నారు. జేసీ తీరుపై పోలీసుల మౌనం జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరురాలు కమలమ్మ ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జేసీ అనుచరుల ఆగడాలపై మాత్రం కనీస స్పందన లేదు. ఇన్ని వివాదాలు సృష్టిస్తున్నా సుమోటోగా కేసు నమోదు చేయలేదు. జేసీ బెదిరింపులను, వివాదాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు ఎందుకు భయపడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదుకు ఆదేశం కాంట్రాక్టర్లను బెదిరించిన తీరుపై బాధితులనుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించాం. ఎవరినైనా బెదిరించినా, ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలినా తీవ్రంగా పరిగణిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. – అన్బురాజన్, ఎస్పీ -
చోటా డాన్ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !
తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్‌తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్‌గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. తెరపైకి చోటా డాన్ రజాక్ మట్కా డాన్ రషీద్ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్) వారసత్వాన్ని అబ్దుల్ రజాక్ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్‌ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్ రజాక్‌ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే రిజ్వాన్, వినాయక్ మేత్రాని అనే వీరిరువురు సౌత్ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్ వన్ షేర్‌హోల్డర్స్. వీరిలో రిజ్వాన్‌కు తాడిపత్రికి చెందిన అబ్దుల్ రజాక్ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మట్కా డాన్ మకందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్ ఖాజా తండ్రి మునీర్బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్ నూరీని అరెస్టు చేశారు. పోలీసులనే టార్గెట్ చేసి.. తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్ సోదరుడు అబ్దుల్ రజాక్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసింది. సీఐ హమీద్‌ఖాన్ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది. తెరవెనుక ‘పచ్చ’ కుట్ర మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్ అబ్దుల్ రజాక్ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. మట్కారాయుళ్లపై కొరడా ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్ సీఐగా పి.హమీద్‌ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్‌బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య, తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఆన్లైన్లో మట్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్ డెవలపర్స్.. మిలాన్డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి యాప్‌ల ద్వారా అండ్రాయిడ్ ఫోన్లకు లింక్‌లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్ యూజర్ రూ.10 వేలు నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారుకు ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు. ఉపేక్షించేది లేదు మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ మట్కాను కూడా నిర్మూలిస్తాం. – సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి -
ప్రశ్నార్థకంగా జేసీ సోదరుల రాజకీయ భవిష్యత్తు
తాడిపత్రి: ఒకప్పుడు ఇంట్లో కూర్చొనే కనుసైగలతో జిల్లా రాజకీయాలను శాసించిన జేసీ సోదరుల రాజకీయ భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. అహంకారం, నోటి దురుసు వారిని ఈ స్థాయికి తెచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి తీరుతో వారసుల రాజకీయ భవిష్యత్తూ ప్రమాదంలో పడింది. జేసీ సోదరులు సుమారు 35 ఏళ్ల పాటు తాడిపత్రి నియోజకవర్గాన్ని కబంధ హస్తాల్లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వారి వైఖరితో విసిగి వేజారిన ప్రజలు 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. వైఎస్సార్సీపీని ఆదరించి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి. ఫలితంగా వైఎస్సార్సీపీకి మరింత ఆదరణ పెరిగింది. ఇటీవల కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్రకు విశేష జనాదరణ లభించడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు జేసీ బ్రదర్స్‌ను, వారి అనుచరులను అంతర్మథనంలో, ఆందోళనలో పడేశాయి. సర్వేలోనూ వెనుకంజ? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై ఆ పార్టీ అధిష్టానం ఇటీవల సర్వే చేయించినట్లు తెలుస్తోంది. అందులోనూ జేసీ సోదరులు వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. మునిసిపల్ చైర్మగా పట్టం కట్టినా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, అధికారులను టార్గెట్ చేస్తూ, నోటిదురుసుగా మాట్లాడుతూ పాలన కుంటుపడేలా చేశారన్న అంశం సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి వల్ల టీడీపీకి నష్టమే కానీ, చేకూరే లాభం ఏమీలేదన్న విషయం వెల్లడి కావడంతో ఆ పార్టీ అధిష్టానం ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో జేసీ సోదరులపై వరుసగా పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడి వైపు చూస్తున్నట్లు సమాచారం. అతనికి టికెట్ కేటాయిస్తే కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందని, లేదంటే అదీ గల్లంతేనన్న భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. దూరమవుతున్న కేడర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీ కేడర్లోనే అసంతృప్తి ఉంది. తన ఉనికి కోసం మాత్రమే పాకులాడే ఆయన్ను నమ్ముకుంటే తమకు నష్టమేనని కొందరు కౌన్సిలర్లు భావిస్తున్నారు. టీడీపీ సొంత సామాజిక వర్గం కూడా జేసీ వ్యవహారశైలిని తప్పుబడుతోంది. చివరకు అనుచరుల్లోనూ తీవ్ర నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జేసీ అనుచరుడు, పెద్దపప్పూరు మండల నాయకుడు రఘునాథ్‌రెడ్డి ఇటీవల వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అలాగే కౌన్సిలర్ రాబర్ట్, అయూబ్ బాషా పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు ఇదేబాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉలిక్కిపడిన జేసీ సోదరులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు తమ నివాసంలో విందు ఏర్పాటు చేసి బుజ్జగించినట్లు తెలిసింది. అయినప్పటికీ కేడర్ వారిని విశ్వసించడం లేదు. వారసులకు నష్టం జేసీ కుటుంబాన్ని నియోజకవర్గ ప్రజలు సుదీర్ఘ కాలం పాటు ఆదరించినప్పటికీ వారి ఇబ్బందులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. సరికదా ఏవైనా సమస్యలు చెప్పుకునేందుకు తమ వద్దకు వచ్చిన ప్రజలను నోటికి ఎంతొస్తే అంత మాట అనేవారు. చులకనగా, హేళనగా మాట్లాడేవారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గంలో పర్యటించి హడావుడి చేసేవారు. ఎన్నికల అనంతరం వ్యాపారాలకు పరిమితమయ్యేవారు. జేసీ బ్రదర్స్ అహంకారపూరితంగా, పెత్తందారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా 2019 ఎన్నికల్లో వారి వారసులుగా బరిలోకి దిగిన జేసీ పవన్, జేసీ అస్మిత్‌రెడ్డిలను ఓడించి గట్టిగానే గుణపాఠం నేర్పారు. ఇప్పుడు కూడా వారసుల రాజకీయ ఎదుగుదలకు జేసీ సోదరులే ప్రతిబంధకంగా మారారన్న భావన తాడిపత్రి ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
జేసీ బ్రదర్స్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
-
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌కు కోర్టు సమన్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 155 బీఎస్–3 వాహనాలకు బీఎస్–4గా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో సహా 18 మందికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయంగా సమన్లు అందజేశారు. -
లోకేశ్ పాదయాత్రతో లాభం లేదు: జేసీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రతో లాభం లేదని, ఆయనతో సహా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసినా, ఎవరు చేసినా లాభం లేదని ఏపీకి చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాదయాత్రలకు కాలం చెల్లిందని, జనాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏపీకి చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ ఉన్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించిన జేసీ.. ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గతంలో పాదయాత్రలు వేరని, ఇప్పుడు వేరని, ఇప్పుడు అన్నీ డబ్బుతో కూడుకున్న యాత్రలేనని ఈ సందర్భంగా దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
పొలిటికల్ కారిడార్: సీటు కాపాడుకునేందుకు ప్రభాకర్ చౌదరి ప్లాన్
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో సీబీఐ ఎంట్రీ.. స్క్రాప్ కింద కొన్న వాహనాలను..
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోరర్జీ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి బీఎస్-4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
జేసీ బ్రదర్స్‌కు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బీఎస్ 3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ బ్రదర్స్‌కు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన వ్యాపార భాగస్వామి సి.గోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.6.31 కోట్ల నగదు, బ్యాంకులో మరికొంత నగదు, బంగారు ఆభరణాలతోపాటు రూ.15.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలు సుప్రీం కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా దర్జాగా అక్రమ దందాకు పాల్పడ్డాయి. బీఎస్ 3 వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా జేసీ కుటుంబం అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 154 బీఎస్ 3 మోడల్ బస్సులు, లారీలను తుక్కు పేరుతో కొన్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరున 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నిబంధనల ప్రకారం బీఎస్ 3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. దాంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి, వాటిని బీఎస్ 4 వాహనాలుగా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్వోసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాదు ఆ వాహనాల్లో కొన్నింటిని అక్రమంగా ఇతర రాష్ట్రాల్లోని వారికి విక్రయించేశారు. అలా విక్రయించాలంటే పోలీసుల నుంచి ఎన్వోసీ పొందాలి. కానీ స్థానిక పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్వోసీలు సృష్టించి మరీ అమ్మేశారు. వాటిని కొన్న వారు తాము మోసపోయామని గుర్తించి అనంతపురంలోని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారించిన అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడ్డట్టు దర్యాప్తులో వెల్లడైంది. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించగా, బీమా పత్రాలన్నీ నకిలీవని వెల్లడైంది. జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర రవాణా శాఖ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి, సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోన్లను కూడా జప్తు చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్వోసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిలను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఇటీవల విచారించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఈడీ అధికారులు జేసీ బ్రదర్స్ కుటుంబానికి చెందిన రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అశోక్ లేలాండ్లో కొందరి పాత్రపైనా ఈడీ ఆరా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక అశోక్ లేలాండ్ కంపెనీ పాత్ర ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఆ కంపెనీకి చెందిన కొందరి సహకారంతోనే ఈ దందా సాగించినట్టు ప్రాథమికంగా గుర్తించింది. దాంతో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులను కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. -
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
జేసీ దివాకర్ రెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు
-
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!
ఆయనో సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక నియోజకవర్గంలో దశాబ్దాలుగా చక్రం తిప్పినా.. గత ఎన్నికల్లో పరాజయం చెందారు. తనకు రాజకీయంగా సమాధి తప్పదని కుమిలిపోతున్న ఆ నేత.. ఇప్పుడు కనిపించిన వారందరిపైనా తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. కావాలనే వివాదాలు సృష్టించుకుంటూ అభాసుపాలవుతున్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ పేరు తెలియనివారుండరు. సోదరులిద్దరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం తర్వాత పచ్చపార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా జిల్లా రాజకీయాలను శాసిస్తే.. తమ్ముడు ప్రభాకరరెడ్డి మాత్రం లోకల్‌గానే తన ప్రతాపం చూపించేవారు. నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి బరిలో లేకపోవడంతో.. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకు అస్మిత్ రెడ్డి తో పోటీ చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొడుకు ఓటమి..తనకు వయోభారంతో పాటు గతంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మెడకు చుట్టుకుని గిలగిల్లాడుతున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసుల్లో 33 ఛార్జిషీట్లను, ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో సమర్పిస్తున్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి... తన ఫ్రస్ట్రేషన్ అంతా చుట్టూ ఉన్నవారిపైన చూపుతున్నారు. అలా ఊగిపోతారంతే..! ఇటీవలే తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకించి అభాసుపాలైన జేసీ ప్రభాకర్ రెడ్డి... ఇప్పుడు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దురుసుగా ప్రవర్తించి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. అనంతపురం కలెక్టరేట్లో ఓ వినతి పత్రాన్ని అందజేసేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సమస్యను చెప్పకుండానే.. కలెక్టర్ నాగలక్ష్మి పై అనుచితంగా ప్రవర్తించారు. ఆవేశం ఊగిపోతూ.... బీకేర్ ఫుల్ అంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వార్నింగ్ ఇచ్చాడు జేసీ. అంతటితో ఆగక.. గన్ మెన్ ను తోసేసి దాడికి యత్నించారు. అత్యంత సహనంతో వ్యవహరించిన కలెక్టర్ నాగలక్ష్మి పెద్దమనసుతో జేసీని క్షమించారు. ఆయన దురుసు ప్రవర్తనపై ఇప్పటిదాకా కలెక్టర్ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జేసీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే జేసీకి తెగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలోనూ ఓ రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఉన్నతాధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు. పప్పులు ఉడకలేదు మరీ.! రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులు చేయించటం.. తనకు అనుకూలంగా వ్యవహరించని పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టించటం.. బెదిరించి పనులు చేయించుకోవటం జేసీ ప్రభాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ, ఎస్సై లను బెదిరించి తన మనుషులను విడిపించుకెళ్లిన చరిత్ర కూడా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ముక్కుసూటిగా విధులు నిర్వహిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ చైతన్యను టార్గెట్ చేశారు. డీఎస్పీపై ఇరవైకి పైగా ప్రైవేటు కేసులను జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టించారు. ఈయన వ్యవహార శైలిపై సొంత పార్టీ లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు కనుసన్నల్లోనే బ్లాక్ మెయిల్ జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని పలువురు టీడీపీ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యమయ్యాక గత్యంతరం లేక టీడీపీలో చేరిన ప్రభాకర్ రెడ్డి అవినీతి.. అక్రమాలు.. దౌర్జన్యాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చంద్రబాబుకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిన్నారని అనంతపురం టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడి
-
జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. -
కదులుతున్న అక్రమాల పుట్ట.. స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు!
టీడీపీ పాలనలో జేసీ సోదరులు (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ట్రావెల్స్ వ్యాపారంలో అక్రమంగా రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్‌తో నాలుగు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించారు. ఎట్టకేలకు వీరి అక్రమాల పుట్ట కదులుతోంది. నిన్న త్రిశూల్... నేడు దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాడిపత్రి అర్బన్: జేసీ సోదరులు అడ్డగోలు వ్యాపారాలు, అవినీతి అక్రమాలతో రూ.కోట్లు పోగేసుకున్నారు. ఒకేనంబర్పై పలు బస్సులను అనధికారికంగా నడిపారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సును సీజ్ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బస్సులను సీజ్ చేయడం సంచలనం రేపింది. కండీషన్ లేని బస్సులు నడపడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతుండటం, ట్రావెల్స్ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై నిఘా అధికమైంది. అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలున్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి, ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ ‘పెద్దమనిషి’ ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. నిజాయితీ అధికారులకు వేధింపులు మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలోని అక్రమాల గురించి తెలిసి షాక్ అయ్యారు. ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దందా ఏ స్థాయిలో సాగిందో ఈ జరిమానాలు చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి నిజాయితీ అధికారి ఇక్కడ ఉంటే ఆటలు సాగవని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని ఏ1గా, గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుండి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించేది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ట్రాన్స్‌పోర్టు ద్వారా రూ.300 కోట్లు అర్జాస్ స్టీల్‌ప్లాంట్ కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2వేల ఎకరాల వరకు స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇస్తూ వచ్చేవారు. అయతే ఇందుకు సంబందించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లో వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్ళలోట్రాన్స్పోర్టు ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టారు అర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ను టన్ను రూ.10 తో టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అ్రల్టాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100కోట్ల ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. దేవుని మాన్యాన్నీ వదలని సోదరద్వయం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదనే ఆరోపణలు వినిపించాయి. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు ఆ భూములన్నీ జేసీ ఆధీనంలో ఉన్నాయని గుర్తించారు. మూడు నెలల క్రితం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆదర్శ మున్సిపాలిటీని గలీజు చేసి.. తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం. జేసీ సోదరులు, వారి అనుచరులు ఆదర్శ మున్సిపాలిటీ మాటున రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ఎస్.వి.రవీంద్రారెడ్డి తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనికి గుడ్‌విల్ రూపంలో రూ.2.66 కోట్లు మున్సిపాలిటీకి బకాయి చెల్లించాల్సి ఉంది. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73 కోట్లు మున్సిపాలిటీకి బకాయి పడ్డారు. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను దాదాపు 50 మంది వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశారు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల చొప్పున అద్దె వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షలు ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 షాపులు కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి సంబంధించి రూ.3.52 లక్షలు గుడ్‌విల్ రూ.3.33 లక్షలు బాడుగ కలిపి మొత్తం రూ.7.83 లక్షలు బకాయి పడ్డారు. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నాడు. వ్యాపారులకు మాత్రం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సబ్లీజుకు ఇచ్చుకున్నాడు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. -
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి – ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.