
సాక్షి, అనంతపురం: కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృధా అని తెలిపారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదని ఆయన చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారని జేసీ దివాకర్‌రెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment