ప్రబోధానందస్వామి ఆశ్రమం (ఫైల్ ఫొటో)
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో ప్రబోధానందస్వామి ఆశ్రమంపై దాడి కేసులో టీడీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జిలాన్ సహా నలుగురు జేసీ వర్గీయులు అరెస్టయ్యారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రబోధానందస్వామి ఆశ్రమం మీదుగా గణేశ్ నిమజ్జం సందర్భంగా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడ గ్రామంలో ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రబోధానంద ఆశ్రమ భక్తులు, జేసీ వర్గీయులు పరస్పర దాడులకు పాల్పడటంతో ఒకరి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. గొడవ జరుగుతుండగా పోలీసులు పారిపోయారని, వారిని ‘కొజ్జా’లతో పోల్చి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనమైంది.
Comments
Please login to add a commentAdd a comment