టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫోర్జరీ కేసుతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీకి మరో షాక్ తగిలింది. తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి మరో చీటింగ్ వ్యవహారం బయటపడింది. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన 10 లారీలను అడ్డదారిలో అనంతపురంలో విక్రయించారు. స్క్రాప్ కింద ఒక్కో లారీని రూ.6లక్షలకు కొనుగోలు చేసి రూ.23 లక్షలకు విక్రయించారు.