
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా జేసీ మారారని విమర్శించారు. శనివారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. జేసీ దివాకర్ నీతులు మాట్లాడుతారు కానీ పాటించరని మండిపడ్డారు. ఇంట్లో పనిచేసే పని మనుషుల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్‌ను అక్రమంగా పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని మనుషుల షేర్లను జేసీ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని దుయ్యబట్టారు.
అదే విధంగా రూ. 200 కోట్ల రూపాయల విలువైన సున్నపురాయి గనులను జేసీ అక్రమంగా విక్రయించారని, జేసీకి ఇచ్చిన త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు ప్రభుత్వం రద్ధు చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కొండలను దోచుకోవడంతో జేసీ దిట్ట అని.. ఆయన అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. దివాకర్ రెడ్డిపై బినామీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment