kethireddy venkatarami reddy
-
పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ పవన్ పై కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ఎల్లోమీడియా తప్పుడు వార్తలపై మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
-
వైఎస్సార్సీపీ వినాశనమే షర్మిల లక్ష్యం..
-
కారుపైకి ఎక్కి టీడీపీ దాడులు
-
కేతిరెడ్డిపై టీడీపీ రౌడీల దాడి
-
పవన్,బాబుపై కేతిరెడ్డి సంచలన కామెంట్స్
-
అసత్యపు వార్త ప్రచారాలపై స్పందించిన కేతిరెడ్డి
-
ఎంతమంది వచ్చినా.. ధర్మవరం గడ్డ కేతిరెడ్డి అడ్డా..
-
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్
సాక్షి, సత్యసాయి: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేతిరెడ్డి మాట్లాడారు. సత్యకుమార్ ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు. అలా చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. అలాగే సత్యకుమార్ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని కేతిరెడ్డి సవాల్ చేశారు. కేతిరెడ్డి సమక్షంలో పలువురు నేత వైఎస్సార్సీపీలో చేరారు. -
ధర్మవరం కేతిరెడ్డి అడ్డా.. ప్రతిపక్షాలకు ఇచ్చిపడేసిన కేతిరెడ్డి
-
ధర్మవరం కేతిరెడ్డి అడ్డా.. ప్రతిపక్షాలకు ఇచ్చిపడేసిన కేతిరెడ్డి
-
పనికిమాలిన వెధవలు చేసిన పని అందరు బయటకి వస్తారు: కేతిరెడ్డి
-
ధర్మవరంలో జోరుగా కేతిరెడ్డి భార్య ఎన్నికల ప్రచారం...!
-
సీఎం జగన్ పై దాడి...చంద్రబాబు, పవన్ కి కేతిరెడ్డి మాస్ వార్నింగ్..
-
చంద్రబాబుకు కేతిరెడ్డి అదిరిపోయే కౌంటర్
-
నిన్నటి దొంగ నేడు ముత్యమా?
గుంతకల్లు: ‘నిన్నటి వరకూ గుమ్మనూరు జయరాంను బాబు బండబూతులు తిట్టారు. ఇప్పుడు టీడీపీలో చేరగానే అదే జయరాం ముత్యమైపోతాడా? అప్పుడు జయరాం దొంగ అని అన్నారు. ఇప్పుడు మంచి వాడయ్యాడా?’ అని అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు కర్నూలు వెళ్లినప్పుడల్లా పేకాట మంత్రి అని, బెంజ్ కారు మంత్రి అంటూ గుమ్మనూరును విమర్శించేవారని, అదే వ్యక్తికి బాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారని, పసుపు కండువా కప్పుకోగానే పునీతుడయ్యారా అంటూ ప్రశ్నించారు. అప్పుడాయన అవినీతి చేసి ఉంటే టీడీపీలోకి రాగానే ఆ పాపాలన్నీ ప్రక్షాళన అయినట్టని బాబు భావిస్తున్నారా అని నిలదీశారు. రెడ్‌బుక్‌లో పేరు తొలగిస్తారా? లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆలూరు వెళ్లినప్పుడు ఇక్కడి పేకాట మంత్రి పేరు రెడ్‌బుక్‌లో రాసుకున్నా అని, అధికారంలోకి వచ్చాక ఆయన పని చెబుతా అంటూ గుమ్మనూరును ఉద్దేశించి అన్నారని చెప్పారు. జయరాం ఇప్పుడు టీడీపీలోకి వచ్చినందున, ఆయన పేరు రెడ్ బుక్‌లో నుంచి తీసేస్తారా అని ప్రశ్నించారు. ఈనాడులో గుమ్మనూరు పై కథనం రాశారని, ఇప్పుడు బెంజ్ కారులో గుమ్మంలోకి అవినీతిని తెచ్చుకున్నామని రాయగలరా అని నిలదీశారు. పేకాట జయరాం మాకొద్దంటూ టీడీపీ క్యాడర్ నిరసన గుంతకల్లు: పేకాట మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు గుంతకల్లు టికెట్ కేటాయిస్తే డిపాజిట్లు కూడా దక్కనివ్వబోమని టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. అసలు జయరాంకు గుంతకల్లుతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులోని టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేశారు. పేకాట మాజీ మంత్రి మనకు వద్దంటూ నినాదాలు చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని, అరాచకాలు చేసే జయరాంతో అది సాధ్యం కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, జయరాంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆలూరులో చెత్త (గుమ్మనూరు జయరాం) ఇక్కడ బంగారం అవుతుందా అని చంద్రబాబును ప్రశ్నించారు. నారా లోకేశ్‌ను దూషించిన గుమ్మనూరు సోదరులను పార్టీలోకి చేర్చుకోవడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ప్రశాంతతకు మారుపేరైన గుంతకల్లు సీటును ఈ అరాచక వ్యక్తికి ఇస్తే పేకాట క్లబ్బులు, నకిలీ మద్యానికి అడ్డాగా మార్చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. జితేంద్రగౌడ్‌ను కాదని జయరామ్‌కు టికెట్ ఇస్తే డిపాజిట్టు కూడా రాకుండా ఓడిస్తామని శపథం చేశారు. -
ఈనాడు పత్రికపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
-
కేతి రెడ్లా మజాకా.. చంద్రబాబు అదిరిపోయే షాక్
-
చంద్రబాబుకు కేతిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
చంద్రబాబుకు కేతిరెడ్డి అదిరిపోయే కౌంటర్
-
పవన్ కళ్యాణ్ కి కేతిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
నాడు తిట్టి నేడు కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లిన వాళ్లను ఏమనాలి?
-
ఐటీ అంటే చంద్రబాబు కాదు.. ఐటీ అభివృద్ధి చేసింది వైఎస్ఆర్.. ఎలాగో ఈ వీడియో చూడండి..
-
బాబు కోసమంటూ పెయిడ్ ఆర్టిస్టులు రోడ్డెక్కితే ఏం చేయాలి?
-
సీఎం జగన్‌కు నేతన్నల సంఘీభావం.. ధర్మవరంలో భారీ ర్యాలీ
సాక్షి, సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతన్నల సంఘీభావం తెలిపారు. ఈ మేరకు చేనేత కార్మికులు ధర్మవరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రతి ఏటా నేతన్న నేస్తం పేరుతో సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతన్న నేస్తం పథకాన్ని స్వాగతిస్తూ లబ్దిదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి శివానగర్ దాకా సాగిన ర్యాలీలో.. జై జగన్ అంటూ ధర్మవరం చేనేత కార్మికులు నినాదాలు చేశారు. -
2014 నాటి మేనిఫెస్టో కరకట్ట కింద దాచేసిన బాబు
-
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘నువ్వు అవినీతి, అక్రమాల్లో పీకల్లోతు కూరుకుపోయావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. పూటకో మాట మాట్లాడతావు. ఏ ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వో ఔట్ డేటెడ్ పొలిటీషియన్. వ్యక్తిత్వం లేని నీలాంటి వ్యక్తుల ప్రవర్తన జుగుప్స కల్గిస్తోంది. మరోసారి నాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోను’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం బీజేపీ నేత వరదాపురం సూరిని హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఆధారాలతో సహా వివరించారు. మార్కెట్ రేటుకు కొన్నాను 2015లో సూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని భూములను కొనుగోలు చేసిందన్నారు. అయితే సదరు కంపెనీ ప్రతినిధులను సూరి రూ.4 కోట్లు డిమాండ్ చేయడంతో అంత ఇవ్వలేని వారు కంపెనీ ఏర్పాటు చేయకుండానే వెళ్లిపోయారన్నారు. ఈ విషయంపై అప్పట్లో అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయని, వాటిని మీడియాకు చూపించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఆ భూములను సదరు ప్రైవేట్ కంపెనీ వేరొక కంపెనీకి విక్రయిస్తే తాను ఆ కంపెనీ నుంచి మార్కెట్ ధరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు. తన తాత సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే తాము భూస్వాములమని, సూరి లాగా పేదల రక్తాన్ని పీల్చి ఉన్నత స్థాయికి ఎదగలేదన్నారు. తమకు డీజీపీ బంధువని సూరి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, తనకు డీజీపీ ఏ విధంగా బంధువో తెలియజేయాలన్నారు. తాను ఆయనలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయనన్నారు. ఇదే సూరి టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా జేవీ రాముడు ఉన్నప్పుడు ఆయన తనకు మామ అవుతారని పోలీసులపై స్వైర విహారం చేసిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన దాడి ఘటనలో నిందితులుగా ఉన్న తన అభిమానులపై కూడా చట్ట ప్రకారం కేసు కట్టించి రిమాండ్‌కు పంపామన్నారు. పోలీసులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. తాను ధర్మవరం పట్టణంలో 20 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చానని, ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలోనూ రైతులకు న్యాయం చేశానన్నారు. టీడీపీ హయాంలో రైతుల పొట్టగొట్టి ఎకరానికి రూ.5 లక్షలు ఇచ్చి భూసేకరణ చేసి వారికి అన్యాయం చేశారని, తాము రేగాటిపల్లి పొలాలను ఎకరాకు రూ.25 లక్షల పరిహారం అందించి భూసేకరణ జరిపి పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు. వరదాపురం సూరి చేసిన అవినీతి, అక్రమాలు, నిబంధనలకు పాతరేసి ఏ బ్యాంకులలో ఎన్ని రూ.కోట్ల రుణం తీసుకున్నారో త్వరలోనే బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిపై మాట్లాడేందుకు నైతికత ఉందా? ధర్మవరం నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,387 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని సూరి అబద్ధాలు చెప్పారని, వాటి తాలూకు ఆధారాలు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా.. అని ప్రశ్నించారు. సూరి లాంటి నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత ఉందా..? అని ప్రశ్నించారు. చదవండి: (విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం) -
ఇంతవరకూ ఓపిక పట్టా.. ఇకపై సహించే ప్రసక్తే లేదు: కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘‘నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అందువల్లే జనమంతా మా వెంట నడుస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా నాకు ఆపాదిస్తున్నారు. అయినా ఇంతవరకూ ఓపిక పట్టాను. ఇకపై సహించే ప్రసక్తే లేదు. అవాస్తవాలతో బురదజల్లుడు రాజకీయాలు చేస్తే ఊరుకోను’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎల్లో మీడియా, టీడీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ►ఇటీవల కందిపంట ధ్వంసం... వైకాపా నాయకుడి దౌర్జన్యం అనే కథనాన్ని ఓ ఎల్లో మీడియా వండి వార్చిందన్నారు. కందిపంట సాగు చేసిన భూమిని 2004లోనే ప్రభుత్వం సేకరించి రైతు గోనుగుంట్ల రమణప్ప అనే టీడీపీ కార్యకర్తకు పరిహారం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత భూమిలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో కొందరు ఆ భూమిలో కందిపంట సాగుచేయగా, అధికారులు తొలగించారన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యమంటూ తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు. ►ధర్మవరం పట్టణం సర్వే నంబర్ 661లోని స్థలం ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉండగా, ఈ స్థలాన్ని ‘అమృత్’ పథకంలో భాగంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు కేటాయించామన్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం దర్జాగా కబ్జా అంటూ కథనం అల్లేసిందన్నారు. అలాగే ఓ సర్వేనంబర్ 536లో స్థలాన్ని ఎవరో శుభ్రం చేయిస్తుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరులంటూ అసత్య కథనాలు ప్రచురిందని కేతిరెడ్డి మండిపడ్డారు. అలాగే అప్రాచెరువు సర్పంచ్ ఈశ్వర్‌రెడ్డి మార్కెట్ ధరకు స్థలం కొనుగోలు చేస్తే కబ్జా చేశారంటూ కథనాలు రాశారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా తప్పుడు రాతలు రాయడం ఎల్లో మీడియాకు దాని వెనుక ఉన్న పచ్చ నేతలకు అలవాటైందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నిరాధార కథనాలు రాయడం మానుకోవాలన్నారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉనికి కోసమే విమర్శలు.. ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ నాయకులకు కేతిరెడ్డిని విమర్శిస్తే తప్ప ఉనికిలేదన్నారు. భూకబ్జాల గురించి పరిటాల శ్రీరామ్ మాట్లాడటం చూస్తే నవ్వు వస్తోందన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన వరదాపురం సూరి... చివరకు అక్రమంగా డీజిల్‌ను అమ్ముకునే స్థాయికి దిగజారారన్నారు. తాను ఆధారాలతో సహా సూరి అవినీతిని బయటపెడుతున్నానన్నారు. అనంతపురం నడిబొడ్డున రూ.వంద కోట్ల ప్రాపరీ్టని తన సొంత ఊరికి చెందిన సబ్ రిజి్రస్టార్‌తో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమిని కొట్టేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. అలాగే ముదిగుబ్బ మండలంలో 151 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని స్వాహా చేయలేదా...? మీరా నన్ను విమర్శించేది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు
సాక్షి, ధర్మవరం: ఎల్లో మీడియా బరితెగించింది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ విషపు రాతలతో జనానికి కనికట్టు కడుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేసింది. కట్టుకథలతో అసత్యాలు వల్లిస్తోంది. టీడీపీ డైరెక్షన్లో నిరాధార కథనాలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయతి్నస్తోంది. కానీ వాస్తవాలు చూస్తున్న జనం ఎల్లో మీడియా తీరును బహిరంగంగానే కడిగిపారేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లంటూ విష ప్రచారం ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు పని చేయలేక రాజకీయ ఒత్తిళ్లతో సెలవులో వెళ్లి పోతున్నారంటూ ఇటీవల ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. డీఎస్పీ, తహసీల్దార్, సెబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్లు సెలవులో వెళ్లిపోయరాని తప్పుడు రాతలు రాసింది. వాస్తవాలు ఇలా... కొన్నిరోజుల క్రితమే డీఎస్పీ రమాకాంత్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఆయన రెండేళ్లకుపైగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వర్తించారు. రాజకీయ ఒత్తిళ్లే ఉంటే రెండేళ్లు ఇక్కడ ఎలా పనిచేస్తారని ప్రజలే చర్చించుకుంటున్నారు. ►తహసీల్దార్ నీలకంఠారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం ఇటీవలే విధుల్లోకి వచ్చారు. అయినా ఆరోగ్యం సహకరించక పోవడంతో వైద్యుల సూచన మేరకు..మరో నెల రోజులు సెలవు పెట్టారు. ►వారం రోజుల క్రితం సెబ్ ఇన్స్పెక్టర్ సైదుల్ తన డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైదుల్పై కేసు నమోదు కాగా, అతను సెలవుపై వెళ్లారు. ►తాజాగా బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టారు. ఈ విషయాన్ని కమిషనరే స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. అయినా ఎల్లో మీడియా ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కమిషనర్ సెలవులో వెళ్తున్నారని విష ప్రచారం చేసింది. ►ఇలా ఏ కారణంతో అధికారులు సెలవు పెట్టినా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ టీడీపీ, దాని అనుకూల ఎల్లోమీడియా కట్టుకథలతో విష ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సెలవునూ రాజకీయం చేస్తారా ? నేను ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా రెండున్నరేళ్ల నుంచీ విధులు నిర్వర్తిస్తున్నా. ఏనాడూ రాజకీయ ఒత్తిళ్లు రాలేదు. నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కువ రోజులు సెలవు తీసుకోలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయడం బాధ కల్గిస్తోంది. సెలవు ముగియగానే మళ్లీ విధుల్లో చేరుతా. –మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్, ధర్మవరం వైద్య చికిత్స కోసం సెలవు నేను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాను. వైద్యుల సూచనతో విశ్రాంతి కోసం సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మవరంలో రెండేళ్లకుపైగానే విధులు నిర్వర్తించా. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పని చేశాను. మాపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. –నీలకంఠారెడ్డి, తహసీల్దార్, ధర్మవరం -
ఎమ్మెల్యే కారులో విద్యార్థులు బడికి..
సాక్షి, ధర్మవరం రూరల్: సాధారణంగా ఎమ్మెల్యే కారులో ఉన్నతస్థాయి అధికారులో లేకపోతే రాజకీయ నాయకులు, వారి బంధువులు కూర్చోవడం పరిపాటి. అయితే నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను తనకారులో ఎక్కించుకొని తానే స్వయంగా కారు నడుపుతూ వారి బడి వద్ద దిగబెట్టారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. వివరాల్లోకెళితే... శుక్రవారం ఉదయం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో 5వ వార్డులో చేపట్టారు. అయితే కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన నివాసానికి బయలు దేరారు. ఆ సమయంలో కొంత మంది విద్యార్థినులు కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. విద్యార్థినులను గమనించిన ఎమ్మెల్యే ... కారులో ఉన్న వారిని దించివేసి ఆ విద్యార్థినులను తన కారులో ఎక్కించుకొని వారి పాఠశాల వద్ద దింపారు. దీంతో ఎమ్మెల్యే కారులో పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థినులు ఎంతో ఆనందపడిపోయారు. -
Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి
సాక్షి, సత్యసాయి జిల్లా(ధర్మవరం): ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కృషి ఫలించింది. నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చేది. దీంతో ముదిగుబ్బ మండల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్లోని ముదిగుబ్బను సర్కిల్‌గా ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ నెం.132 విడుదల చేసింది. ముదిగుబ్బ సర్కిల్ పరిధిలోకి తాడిమర్రి, ముదిగుబ్బ, పట్నం పోలీస్స్టేషన్లు వస్తాయి. చదవండి: (YSR Kadapa: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే) -
ప్రజా క్షేత్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు
-
బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం (సత్యసాయి జిల్లా): ‘‘రాజకీయ నాయకుడంటే విలువలు ఉండాలి. కష్టమైనా.. నష్టమైనా కార్యకర్తలకు అండగా ఉండాలి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాలి. నీలా ఓడిపోయిన రెండు నెలలకే పార్టీ మారి కార్యకర్తలను గాలికి వదిలేయడం నాకు రాదు. పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులిచ్చి కుటుంబ సభ్యులను తిట్టిస్తే ఇకపై సహించేది లేదు’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాడిమర్రి మండలంలో ఆటోపై విద్యుత్ తీగ పడి చెలరేగిన మంటల్లో ఐదుగురు మృతి చెందగా.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్నారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. ఫ్యాక్షన్ వద్దనుకునే... ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంచాలనే తన తల్లిదండ్రులు తనను విదేశాల్లో చదివించారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇష్టం లేకపోయినా 2006లో రాజకీయాల్లోకి వచ్చానని, అందువల్లే ఫ్యాక్షన్ వద్దనుకుని అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నానన్నారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు .. సంగాలలో పార్వతమ్మ అనే మహిళను కొట్టంలోకి వేసి సూరి నిప్పంటించాడనీ, రామలింగారెడ్డి అనే వ్యక్తిని జీపుకు కట్టేసి చంపాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. అక్కడి నుంచి అనంతపురం వెళ్లి అక్కడ పరిటాల రవితో సన్నిహితంగా ఉంటూ డబ్బులు సంపాదించాడన్నారు. అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం సూరి నైజమన్నారు. సూరి అనంతపురంలో భూకబ్జాలు చేయగా.. అప్పటి ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర బహిష్కరణ చేస్తే రాష్ట్రం వదిలి వెళ్లిపోయాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు తన మనుషులతో పోలీసులపైనే దాడి చేయించాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు అరాచకమే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. చదవండి: (ఈజ్ ఆఫ్ సెల్లింగ్‌లో బీజేపీ టాప్) ఇక సహించబోం.. జీతానికి, కులానికి ఒకరిని పెట్టుకుని నోటికి ఎంత పడితే అంత తిట్టిస్తే ఇక సహించబోమని కేతిరెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను తిడుతుంటే ఎవరైనా రెచ్చిపోతారన్నారు. కేతిరెడ్డిపై మాట్లాడితే క్రేజ్ వస్తుందని సూరి సోషల్ మీడియా వేదికగా తన అనుచరులతో బూతులు తిట్టిస్తున్నాడన్నారు. తాను 20, 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాననీ, సూరి టీడీపీ టికెట్ కోసం అడ్డదారులు తొక్కుతున్నాడన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పులు చూపించాలి గానీ వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడితే సహించబోమన్నారు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. ఆర్అండ్బీ రోడ్డు కబ్జా చేశావు అంటున్నావే ఎక్కడో చూపించు అని కేతిరెడ్డి... ప్రశ్నించారు. వ్యాపారులు ఆర్అండ్బీ స్థలంలో సొంత ఖర్చుతో రోడ్డు వేసుకుంటుంటే నేను కబ్జా చేసినట్టా? కరెంటు వైరు తెగి ప్రమాదం జరిగితే కాంట్రాక్టర్‌తో కమీషన్ తీసుకున్నాడని నీచంగా మాట్లాడుతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. సోలార్ కంపెనీ నీకు భయపడి వెనక్కి పోలేదా? అని ప్రశ్నించారు. కర్ణాటక బ్యాంకుల్లో లోన్లు ఎలా తెచ్చుకుంటున్నావో చెప్పాలా అని సూరిని కేతిరెడ్డి ప్రశ్నించారు. 151 ఎకరాలు భూకబ్జా చేశావని కలెక్టర్ నాగలక్ష్మి నిర్ధారించారన్నారు. చేనేతలకు డబ్బులు ఎగ్గొట్టిన కళానికేతన్ వాళ్లతో ఎంత డబ్బు వసూలు చేశావో అందరికీ తెలుసన్నారు. -
ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్: సూరీ.. ప్రమాణానికి సిద్ధమా ?
సాక్షి, ధర్మవరం టౌన్: ‘మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం తక్కువ ధరకే అన్ని సౌకర్యాలతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో ఎంఐజీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఇస్తోంది. అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో ఎల్లో మీడియా, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి దుష్ప్రచారానికి తెరతీయడం సిగ్గుచేటు’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంఐజీ లేఅవుట్లపై ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా చూపించారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీఐఐసీ కుణుతూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఎకరా రూ.4.75 లక్షలు నిర్ణయించి 126 ఎకరాలను ఎంఐజీ లేఅవుట్ కోసం సేకరించిందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ప్రకారం పరిహారం అందించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఇక జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్ కింద ఇస్తున్న ప్లాట్లు అభివృద్ధి చేయకుండానే ఇచ్చేస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. లేఅవుట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందని, ఈనెల 17న టెండర్ కూడా పూర్తి చేశామన్నారు. ఈ ఏడాదిలోపే లేఅవుట్లో సౌకర్యాలన్నీ కల్పిస్తామన్నారు. ఇవేవి తెలుసుకోకుండానే ప్రభుత్వంపై బురద జల్లే వార్తలు రాయడం దారుణమన్నారు. ఎంఐజీ సమీపంలో తాను కూడా వెంచర్ వేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నానని ఆరోపిస్తున్నారని, వాస్తవంగా ఎంఐజీ లేవుట్ ప్రతిపాదన రాక ముందే తాను వెంచర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంఐజీ లేఅవుట్ ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోందని, ఆ లేవుట్ రావడం వల్ల ప్రైవేటు వెంచర్లకు నష్టం తప్ప లాభం ఉండదన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: (Railways: ఇకపై ఆ రైళ్లలో జనరల్ ప్రయాణం) సూరీ... ప్రమాణానికి సిద్ధమా ? ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సూరి చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. తాను ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలో బ్రిటీష్ కాలంలోనే పట్టాలు పొందిన రైతులకు సంబంధించిన 25 ఎకరాలను కొనుగోలు చేశానన్నారు. ఎన్ఓసీ లేకుండానే వాటిని రిజిస్టర్ చేసుకోవచ్చని గత టీడీపీ ప్రభుత్వం 575 జీఓ ఇచ్చిందని వివరించారు. ఇవన్నీ పక్కన పెట్టి వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా భూములకు సంబంధించిన ఆర్‌హెచ్, డైక్లాట్, రైతుల వివరాలను మీడియాకు అందించారు. తాను కొనుగోలు చేసిన భూమిలో రూ.25 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మిస్తే రూ,కోట్లతో ఇంటి నిర్మాణం చేపట్టానని ఆరోపించడం హేయమన్నారు. రూ.7.50 లక్షల వ్యయంతో కొన్న చిన్నబోటును చెరువులోకి తీసుకెళ్తే... స్టీమర్లు కొన్నారని సూరి చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. గత లాక్డౌన్లో హార్స్‌రైడింగ్ నేర్చుకునేందుకు తాను, తన స్నేహితులు అనంతపురం నుంచి గుర్రాలను అద్దెకు తెచ్చుకుంటే... రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని సూరి ఆరోపించారని మండిపడ్డారు. తుంపర్తి పొలంలో నాగమ్మ దేవాలయాన్ని ఆక్రమించానని, గుప్తనిధులు తీశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాగమ్మ కట్ట వద్ద ఉన్న వేప చెట్టు స్థలాన్ని వదిలి కంచె వేసిన ఫొటోలను, చెరువు ఆక్రమించలేదని నిరూపించే శాటిలైట్ చిత్రాలను మీడియాకు అందించారు. వరదాపురం సూరికి దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలో గానీ, తాడిపత్రి చింతల రాయుడు దేవాలయంలో గానీ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. -
అవినీతికి బ్రాండ్ వరదాపురం సూరి
ధర్మవరం టౌన్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి∙అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆయన హయాంలోనే ఉపాధి హామీ పనులు, ఉద్యాన పథకాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. సామాజిక తనిఖీల్లో ఈ విషయాలు బట్టబయలవ్వడంతో సూరిలో కలవరం మొదలైందన్నారు. ఆదివారం ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ నిధులు వ్యక్తిగతంగా డ్రా చేయడం సాధ్యం కాదనే విషయం కూడా తెలియకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో నిధులు ఖర్చు చేస్తారన్న కనీస అవగాహన లేకుండా ప్రజాప్రతినిధిగా ఎలా చలామణి అయ్యావంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సూరి చేసిన అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, డబ్బులు వసూళ్లపై లఘు చిత్రం తీసి ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ముదిగుబ్బ మండలంలోనే మొత్తం రూ.27.73కోట్ల పనులు జరిగితే రూ.9 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఇందులోనూ సంకేపల్లి పంచాయతీ పరిధిలో రూ.4.36కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీలో బట్టబయలైందని గుర్తు చేశారు. ఇందుకు కారకులైన 24 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నీరు చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పందిరి తీగలు, పాత తోటల పునరుద్ధరణ, పండ్ల తోటల విస్తరణ తదితర పథకాలకు సంబంధించి రూ.కోట్లను బినామీ పేర్లతో టీడీపీ నేతలు దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే టీడీపీ పాలనలో సూరి సాగించిన అవినీతి, ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డి సాధించిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. సమావేశంలో సర్పంచ్ నాగానందరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పోతిరెడ్డి, కత్తెకొట్టాల కృష్ట, వెంకట్రామిరెడ్డి, నాయకులు మల్లాకాలువ మురళి, కనంపల్లి రామచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, తుంపర్తి కృష్ణారెడ్డి, పోతులనాగేపల్లి శివారెడ్డి, బిల్వంపల్లి హరి, గొట్లూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూపురంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి బస్టాండ్‌లోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ..' మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఇక్బాల్ పేర్కొన్నారు. ఏడాదిలోనే మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి'. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రాల్లో లేరని ఇతర రాష్ట్రాల ప్రజలు మాట్లాడటంతోనే ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని తేలిపోయిందని పేర్కొన్నారు. జననేత సుపరిపాలన చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ' ప్రతిపక్ష పార్టీలను పాతాళానికి తొక్కి వైఎస్సార్ పార్టీ తారాజువ్వాలగా ఎగిరిన రోజు మే 23 . కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ సంక్షేమాలు ఆపలేదని, నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయలేని పనిని, ఇచ్చిన మాటను,ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న ఓకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికి అమలు చేయలేడని ప్రతిపక్షాల చేసిన వాఖ్యలను తిప్పికొడుతూ ఏడాదిలోనే చేసి చూపించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎల్లపుడు ఇలాగే ఉండాలని ప్రతిపక్ష పార్టీలు,నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ' తెలిపారు. ప్రజారంజక నేతగా మారారు సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మట్లాడుతూ.. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలు ప్రజలు విశ్వసించడంతో భారీ ఎత్తున విజయాన్ని ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ 90 శాతం మేరకు హామీలను నెరవేర్చి ప్రజారంజక నేతగా మారారని తెలిపారు. కరోనా కష్టకాలం కావడంతో ప్రజా ప్రయోగ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ.. ' సాధారణ వ్యక్తి అయినా నన్ను వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో.. ముఖ్యమంత్రి అయ్యాక వాటికే ప్రాధాన్యత ఇచ్చి 90 శాతం మేరకు పూర్తి చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. కరోనాను అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యంగా ఉన్నాయి'. -
చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ చేపట్టాలి
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమాస్తులపై విచారణ జరగాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోగస్ కంపెనీల ద్వారా చంద్రబాబు వేల కోట్ల రూపాయలు మళ్లించారని.. ఈ విషయం ఐటీ దాడుల్లో బయటపడిందని పేర్కొన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు ఇంట్లో వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని తెలిపారు. రూ.2.63 లక్షల నగదు పేపర్‌ను పట్టుకుని తప్పించుకోవాలని చూస్తే ఎలా అని మండిపడ్డారు. ఐటీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను టీడీపీ నేతలు క్షుణ్ణంగా చదవాలని సూచించారు. టీడీపీ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, 50 కోట్ల పనికి టీడీపీ నేతలు 250 కోట్ల బిల్లులు డ్రా చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఫోన్ కలిపింది పీఎస్ శ్రీనివాసరావే అని అన్నారు. చంద్రబాబు అక్రమ లావాదేవీలన్నీ పీఏ శ్రీనివాసరావు ద్వారానే జరిగాయని తెలిపారు. టీడీపీ పాలనలో ప్రజా ధనం లూటీ అయ్యిందని అన్నారు. వేల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు జేబుల్లో నింపుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలని, చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: కొండలను దోచుకోవడంలో జేసీ దిట్ట: కేతిరెడ్డి -
కొండలను దోచుకోవడంలో జేసీ దిట్ట: కేతిరెడ్డి
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా జేసీ మారారని విమర్శించారు. శనివారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. జేసీ దివాకర్ నీతులు మాట్లాడుతారు కానీ పాటించరని మండిపడ్డారు. ఇంట్లో పనిచేసే పని మనుషుల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్‌ను అక్రమంగా పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని మనుషుల షేర్లను జేసీ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని దుయ్యబట్టారు. అదే విధంగా రూ. 200 కోట్ల రూపాయల విలువైన సున్నపురాయి గనులను జేసీ అక్రమంగా విక్రయించారని, జేసీకి ఇచ్చిన త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు ప్రభుత్వం రద్ధు చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కొండలను దోచుకోవడంతో జేసీ దిట్ట అని.. ఆయన అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. దివాకర్ రెడ్డిపై బినామీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
నీ స్వార్థం కోసం ప్రజలను బలిచేయొద్దు
సాక్షి, ధర్మవరం: చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజలను బలిచేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉనికి కోల్పోయిన టీడీపీని తిరిగి ప్రజల్లోకి తీసుకువచ్చేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే రాజకీయ స్వార్థంతో గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నాడని, సాయం కోసం వెళ్లిన వారిని స్వార్థ రాజకీయాలకు వినియోగించి వారి పొట్టకొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల ఫలితాల రోజున వైఎస్సార్సీపీ నేతల దాడిలో గాయపడినట్లు చెప్పిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లికి చెందిన శివయ్యతోనే వాస్తవం చెప్పించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ, తనకు 5 నెలల క్రితం పక్షవాతం వచ్చిందని, ఆర్థిక సాయం అడిగేందుకు చంద్రబాబు వద్దకు వెళ్లగా.. టీడీపీ నేతలు తమకు కావాల్సినట్లు అన్వయించుకుని తనను బదనాం చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీశారు. గుర్తింపు కోసం ఇలా అడ్డదారులు తొక్కడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అదేవిధంగా బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు స్థలం కోసం గొడవపడితే.. దాన్ని కూడా చంద్రబాబు వైఎస్సార్‌సీపీపైకి నెట్టే యత్నం చేశాడన్నారు. శాంతిభద్రతలు గాడి తప్పనివ్వం చంద్రబాబు ఎదుటే మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని చెబుతుంటే ఆయన్ను వారించాల్సిన ప్రతిపక్ష నేత.. ఆనందంగా ఆస్వాదించారన్నారు. తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్య రానివ్వబోమన్నారు. ప్ర¿ోదానంద ఆశ్రమం వ్యవహారంలో దివాకర్‌రెడ్డి కారణంగా ఒకరు చనిపోగా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు తాళం వేసిన ఉదంతం జిల్లా వాసులందరికీ తెలుసన్నారు. పోలీసులను విమర్శించిన జేసీ దివాకర్‌రెడ్డి తిమ్మంపల్లికి వచ్చేందుకు 800 మంది పోలీసులను రక్షణగా తెచ్చుకున్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఆర్వోసీ చేసిన హత్యలు లెక్కలేవని, వారు ఎంతమందిని పొట్టనపెట్టుకున్నారో జిల్లావాసులందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు అధికారకాంక్షతో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు కారణభూతుడవుతున్నాడని దుయ్యబట్టారు. అబద్ధాలతో వ్యవస్థను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా ఆయన స్వార్థ రాజకీయాలు మానుకుని ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. -
‘నేతన్న నేస్తం అద్భుత పథకం’
సాక్షి, ధర్మవరం: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలు ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24000 ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ధర్మవరం పట్టు చీరలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో చేనేతలకు మేలు జరిగిందని, ఆయన బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుంబిగించారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం అద్భుత పథకమని కొనియాడారు. చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్ గతంలో మూడు రోజులు నిరాహారదీక్ష చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిగజారుతున్న రాజకీయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తున్నారని, ఎన్నికల హామీలను నిక్కచ్చిగా అమలు చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. -
దందాపై ఎమ్మెల్యే కేతిరెడ్డి కన్నెర్ర
ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత టీడీపీ హయాంలో మొదలైన అవినీతి వసూళ్ల దందా నేటికీ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్ అయిన డాక్యుమెంట్‌కు సెంటుకు ఒక రేటు, ఎకరాకు ఒక రేటు చొప్పన లంచం వసూలు చేస్తున్నారు. ఈ దందాలో రియల్టర్లు, బ్రోకర్లు, దస్తావేజులేఖర్లు, దళారులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కలసి పాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధి పేరుతో వసూళ్లు నిర్వహిస్తూ అవినీతికి తెర లేపడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కన్నెర్ర చేశారు. అక్రమార్కుల అంతు చూడాలని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన అధికార యంత్రాంగం ఆరోపణలున్న దస్తావేజులేఖర్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపైన కేసులు నమోదు చేశారు. సాక్షి, ధర్మవరం: ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని టీడీపీ పాలనా కాలం మొత్తం ఆదాయ వనరుగా చేసుకున్నారు. అప్పట్లో రిజిస్ట్రేషన్ కావాలంటే టీడీపీ ప్రజా ప్రతినిధులకు సొమ్ము ముట్టజెప్పాల్సిన దారుణమైన పరిస్థితులు ఉండేవి. టీడీపీ నాయకులు ఏకంగా కార్యాలయంలో తిష్ట వేసుకొని దళారులుగా మారి దస్తావేజు లేఖర్లు, కార్యాలయ సిబ్బందితో కుమ్మకై డబ్బులు వసూలు చేసేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అవినీతికి తావు లేకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఏకంగా ‘లంచం అడిగితే ఫిర్యాదు చేయండి’అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.. అవినీతికి పాల్పడేవారి వివరాలు అందించాలని ఫ్లెక్సీలో తన సెల్‌నెంబర్, ఉన్నతాధికారుల సెల్‌నెంబర్లు పొందుపరిచారు. ఈ పరిణామంతో కొంత కాలం అక్రమార్కులు స్తబ్దుగా ఉండిపోయారు. అక్రమార్జనకు కొత్త పంథా అక్రమార్జనకు అలవాటుపడిన వారు కొత్త పంథా ఎంచుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు నానా కొర్రీలు పెట్టడం రిజిస్ట్రేషన్‌ను కాలయాపన చేయడం మొదటగా చేస్తారు. దీంతో సదరు బాధితులు కార్యాలయం చుట్టూ తిరిగిన తర్వాత సదరు అక్రమార్కులు, దస్తావేజులేఖరుల ద్వారా లంచం డిమాండ్ చేస్తారు. లంచం విషయం ఎక్కడ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారోనని ఏకంగా ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రచారం చేశారు. దీంతో బాధితులు ఏం చేయాలో పాలుపోక కొంతకాలం లంచాలు ముట్టజెప్పారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ అక్రమార్కుల నయా దందా గురించి కొంతమంది బాధితులు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన అక్రమార్కులపై కన్నెర్ర చేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందాకు కారకులు ఎంతటి వారైన చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని సబ్‌రిజిస్ట్రార్, పోలీస్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అక్రమార్కులపై కేసులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందా సాగిస్తున్న 16మంది దస్తావేజు లేఖరులను, ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని రెండు రోజలు క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలిసింది. అంతటితో ఆగకుండా ఆరు నెలలుగా ధర్మవరం సబ్‌రిస్టార్ కార్యాలయ పరిధిలో అయిన రిజిస్ట్రేషన్లను పరిశీలించి, ఆయా వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుడుతోంది. -
చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేస్తాం
సాక్షి, ధర్మవరం: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంటరామిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన ముదిగుబ్బ మండలం చిన్నకోట్లలో ముంపు బాధితులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. చిన్నకోట్ల, యర్రగుంటపల్లి, మొగిలిచెట్లపల్లి, రాఘవపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ భూములు కోల్పోయినా ఇంకా పరిహారం అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ముంపు గ్రామాలకు సంబంధించి ఏఏ సర్వే నంబర్లు ముంపునకు గురయ్యాయో గుర్తించాలని, పరిహారం అందని వారి వివరాలను సేకరించాలని తహసీల్దార్ అన్వర్‌హుస్సేన్‌ను అదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి చిత్రావతి ముంపు బాధితులకు ముదిగుబ్బలో ఇంటి పట్టాలు ఇచ్చారని, అయితే ఆయా పట్టాలను కొందరు దోచుకున్నారని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఇంటిపట్టాలు పంపిణీలో అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, బాబురెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
‘దొంగఓట్లపై విచారణ జరిపించండి’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దొంగఓట్లను అరికట్టి, స్వేచ్ఛగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు, ఆ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓట్ల గల్లంతు, ఓట్ల డూప్లికేషన్, దొంగ ఓట్లపై సమీక్షించాలని కోరామని తెలిపారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను ప్రధానాధికారికి సమర్పించామని, రాష్ట్రంలో దాదాపు 34 లక్షల డూప్లికేషన్ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్లా 18 లక్షల మంది ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలని కోరగా సీఈఓ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. -
సూరీ.. ప్రజలను మోసం చేయొద్దు
ధర్మవరం: ‘‘చేనేతలు అధికంగా జీవిస్తున్న ధర్మవరం పట్టణానికి అపార్టుమెంట్లు ఎందుకూ పనికి రావు. కేవలం వరదాపురం సూరి కంకర కట్టబెట్టేందుకు, చినబాబు కమీషన్లు దండుకునేందుకే వీటిని పేద ప్రజల మీద రుద్దుతున్నారు.’’ అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో అపార్టుమెంటుకు అయ్యే ఖర్చు, పక్కా ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు మధ్య తేడాను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు వివరించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న అపార్టుమెంట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకునే రుణం కలిపి మూడు కేటగిరీల్లో వరుసగా రూ.5.98 లక్షలు, రూ.6.83, రూ.7.68లక్షలుగా ఉందన్నారు. ప్రతి నెలా వినియోగదారుడు రూ.4వేల చొప్పున 20 సంవత్సరాలు ఆ మొత్తాన్ని చెల్లించాలన్నారు. ధర్మవరం పట్టణంలో 8,832 మందికి అపార్టుమెంట్లు మంజూరయ్యాయని, ఇందుకు రూ.529 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ఇదే 8,832 మందికి తలా రెండు సెంట్ల భూమి చొప్పున, మున్సిపల్ నిబంధనల ప్రకారం లేఅవుట్లు వేసి ప్లాట్లు మంజూరు చేసేందుకు 232 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. ఆ భూమిని కొనుగోలు చేసేందుకు రైతుకు రూ.10లక్షలు చొప్పున ఎకరానికి చెల్లించినా రూ.232కోట్లు అవుతుందన్నారు. ఇక ఇంటికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న విధంగానే రూ.2.50లక్షల చొప్పున 8,832 మందికి అన్ని సౌకర్యాలతో ఇళ్లు కట్టించేందుకు రూ.220 కోట్లు సరిపోతుందన్నారు. అపార్టుమెంట్ల నిర్మాణం పెద్ద స్కాం అన్నారు. అందుకోసం కేటాయించే మొత్తాన్ని మాకిస్తే రైతులతో పాటు చేనేత కార్మికులు మగ్గాలు వేసుకునేందుకు వీలుగా పక్కా ఇళ్లు నిర్మించి చూపుతామని సవాల్ విసిరారు. నాలుగేళ్లుగా ఆ ప్రేమ ఏమైంది..? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని, ఆ కులానికి అన్ని ఎకరాలు, ఈ సంఘానికి ఇన్ని ఎకరాలు ఇస్తామనే హామీలు ఇస్తున్నారని, ఆ ప్రేమ నాలుగేళ్లు ఏమైందని కేతిరెడ్డి ప్రశ్నించారు. 734 ఎకరాల భూమికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసిందని, ఆ మొత్తంతో రైతుల భూమిని ఎలా కొంటారో చెప్పాలన్నారు. అదే మొత్తం సూరి తీసుకొని, అందులో సగం భూమిని ఇచ్చినా చాలని సవాల్ విసిరారు. రైతులు ఏళ్ల తరబడి నమ్ముకున్న భూములను పావలాకు, అర్ధకు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కంకర అమ్మడం, కమీషన్లు దండుకోవడం అభివృద్ధి ఎలా అవుతుందన్నారు. అభివృద్ధిని తాము ఏనాడూ అడ్డుకోలేదని.. టీడీపీ నాయకుల కమీషన్లు, దందాలను మాత్రమే అడ్డుకున్నామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. -
భజన చేయడం జేసీకి పరిపాటిగా మారింది..
ధర్మవరం: అవకాశ వాద రాజకీయాలకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాయలసీమకు నీరురాకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ జేసీతోపాటు రాజసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించడాన్ని తప్పుబట్టారు. మంత్రి పదవి కోసం ఎవరి వద్దకు వెళితే వారి భజన చేయడం జేసీకి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపర భగీరథుడని, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిని యువకుడు.. పనిమంతుడని కొనియాడిన జేసీ ఇప్పుడేమో ఇప్పుడేమో ముఖ్యమంత్రి చం ద్రబాబును తెగపొడిడేస్తున్నాడని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలపించేలా పాలన చేస్తానని జగన్ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఏడు నియోజకవర్గాలకు ఎంపీ అయిన వ్యక్తి కేవలం చాగల్లుకు మాత్రమే నీరుకావాలని రాజీనామా డ్రామా ఎందుకు ఆడారని సూ టిగా ప్రశ్నించారు. చాగల్లుకు నీరిస్తే మిలిగిలిన ప్రాంతాలు ఏం కావాలని నిలదీశారు. ఏ ప్రజాప్రతినిధి అయినా తమ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడం సహజమేనని, అదే రీతిలో పల్నాడు ప్రాం త నాయకులు పోరాటం చేయడంలో తప్పేముందని ప్రశ్నిం చారు. పదవుల కోసం ప్రతిపక్ష నేతను తూలనాడటం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. హంద్రీ – నీవా వైఎస్ పుణ్యమే హంద్రీ– నీవా ఎవరి పుణ్యమో జిల్లా ప్రజలందరికీ తెలుసునని, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యానే జిల్లాలోకి కృష్ణాజలాలు వస్తున్నాయని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. 10శాతం పనులు పూర్తిచేసి, వాటికి ‘పచ్చ’ రంగులు వేసుకున్నంత మాత్రాన ఆ పథకాలన్నీ టీడీపీ నాయకులు తీసుకువచ్చినట్లు కాదన్నారు. 11 కిలోమీటర్ల మేర స్లూయిజ్ ద్వారా ధర్మవరం చెరువుకు నీటిని తీసుకొచ్చి తామేదో గొప్ప చేశామని చెప్పుకోవడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. ఆ నీటిలో చేపలు వదలాలంటే తమకు వాటాలు కావాలని అడుగుతున్నారని దుయ్యబట్టారు. అయినా నియోజవకర్గంలో మొత్తం 80 చెరువులు ఉన్నాయని, వాటన్నింటినీ నీటితో నింపాలని సూచించారు. తాగేనీటిలో బల్లులు, ఎలుకలు పడి ఆ నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే పట్టించుకోవడం లేదు కానీ.. ప్రచారాలు మాత్రం గొప్పగా చేసుకుంటున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మూడు దఫాలు తెప్పోత్సవం నిర్వహించామని, రైతులకు పంట పండించేందుకు కూడా నీళ్లు ఇచ్చామని కేతిరెడ్డి గుర్తు చేశారు. షోలు చేయడం మాని ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. -
చంద్రబాబు విధానాల వల్లే చేనేత నిర్వీర్యం
ధర్మవరం: చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల వల్లే చేనేత రంగం నిర్వర్యమవుతోందని, చేనేత కార్మికులను కేవలం ఓట్లు వేసేవారిగా చూస్తున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం చేనేత రిలేదీక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేతిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా నిలిపివేస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముడిరేషం ధరలు రూ.2,400 ఉండేదనీ, అప్పుడే చేనేత ముడిపట్టు రాయితీ పథకం తీసుకువచ్చి ఒక్కో చేనేత కార్మికునికి రూ.600 అందించామని గుర్తు చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పథకానికి నిధులు మంజూరు చేయకుండా నిలిపివేసిందన్నారు. ధర్మవరం వచ్చిన చంద్రబాబు రాయితీ మొత్తాన్ని రూ.600 నుంచి రూ.1,000కి పెంచి కేవలం రెండు నెలలు మాత్రమే ఇచ్చారన్నారు. అదేవిధంగా కమిషన్ల కోసం ఎన్‌హెచ్‌డీసీ పథకాన్ని నిలిపివేశారని, రాష్ట్రమంతా ఆ పథకం అమలవుతుంటే టీడీపీ నాయకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా ధర్మవరంలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే జిల్లా నుంచి దాదాపు 10 వేల చేనేత కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లగా...దిక్కుతోచని స్థితిలో 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చేనేత ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలని తాము 37 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. అదే మంత్రి కొడుకు పెళ్లి చేస్తే..జిల్లాలోని అధికార యంత్రాంగం మొత్తం వారి సేవలోనే మునిగిపోయిందని దుయ్యబట్టారు. చేనేతల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనన్నారు. చేనేతలకు భరోసా ఇచ్చేందుకు జగన్మోహనరెడ్డి ధర్మవరం వచ్చారని, చేనేత కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి హామీలు ఇవ్వాలని జగన్మోహనరెడ్డిని కోరారు. ధర్మం కోసం పోరాటం: తోపుదుర్తి తమకు న్యాయంగా అందాల్సిన పథకాల గురించి చేనేత కార్మికులు పోరాడుతున్నారని, వారు చేస్తున్నది ధర్మం కోసం పోరాటమని రాప్తాడు నియోజవకర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. చేనేతలు చేస్తున్న దీక్షలకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేతరంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందనీ, దగాకోరు చంద్రబాబు పరిపాలనకు అందరం కలసి చరమగీతం పాడుదామన్నారు. సాయం చేయరేం : ఆలూరి చేనేతల ఓట్లతో గెలిచిన చంద్రబాబు ప్రభుత్వం... వారి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మాత్రం చేతులు రావడం లేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి ఆరోపించారు. దోచుకోవడానికి అలవాటు పడిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవని, తెలుగుదేశం పార్టీని సాగనంపేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
'డీజీపీ అండ చూసుకుని రెచ్చిపోతున్నారు'
ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని జీర్ణించుకోలేక బత్తనపల్లిలో తమ పార్టీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారని ఆయన విమర్శించారు. ఆ దాడికి పాల్పడింది డీజీపీ బంధువులే అని ఆయన ఆరోపించారు. ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ అండ చూసుకుని టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి రెచ్చిపోతున్నారని ఆరోపించారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చురిల్లాయని వెల్లడించారు. అంతేకాకుండా తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. -
'సీఎం దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు'
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో చేపట్టిన మౌన దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సమైక్య ముసుగులో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులు విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. విభజనకు అనుకూలమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.