'డీజీపీ అండ చూసుకుని రెచ్చిపోతున్నారు' | YSR Congress party leader kethireddy venkatarami reddy takes on AndhraPradesh DGP J.V.Ramudu | Sakshi
Sakshi News home page

'డీజీపీ అండ చూసుకుని రెచ్చిపోతున్నారు'

Published Sat, Jul 5 2014 12:24 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

YSR Congress party leader kethireddy venkatarami reddy takes on AndhraPradesh DGP J.V.Ramudu

ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని జీర్ణించుకోలేక బత్తనపల్లిలో తమ పార్టీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారని ఆయన విమర్శించారు. ఆ దాడికి పాల్పడింది డీజీపీ బంధువులే అని ఆయన ఆరోపించారు.

ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ అండ చూసుకుని టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి రెచ్చిపోతున్నారని ఆరోపించారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చురిల్లాయని వెల్లడించారు. అంతేకాకుండా తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement