సీఎం కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో చేపట్టిన మౌన దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సమైక్య ముసుగులో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులు విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. విభజనకు అనుకూలమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.