భర్త ఇంటి ముందు భార్య మౌన దీక్ష
సుభాష్‌నగర్: కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు..ఆపై బిడ్డను కన్నాడు..సన్నిహితంగా ఉంటూనే విడాకుల నోటీసు ఇచ్చాడు. ఇదేంటని అమ్మాయి తల్లిదండ్రులు, పెద్దమనుషుల సమక్షంలో ప్రశ్నస్తే నిష్కారణంగా నాకు వద్దు అంటున్నాడు. దీంతో ఆ అమ్మాయి తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. సూరారం పరిధిలోని లక్ష్మీనగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెల్పిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వనాథ్, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె శ్రీరమ్యకు సూరారం లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన మైనం భాస్కరరావు, విజయలక్ష్మిల కుమారుడు శ్రీ తేజతో 2023లో వివాహం జరిగింది. మొదట్లో 3 నెలల పాటు కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలో గర్భందాల్సిన రమ్యను అబార్షన్ చేయించుకోవాలని శ్రీతేజ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె అంగీకరించక పోవడంతో భార్యపైకి కోపం పెంచుకున్నాడు.
ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళిన భార్యతో ప్రేమగా ఉంటూనే పథకం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేశాడు. ప్రసవం తర్వాత పుట్టిన బాబును చూడడానికి రాలేదు సరికదా..విడాకుల నోటీసు చేతిలో పెట్టాడు. దీంతో రమ్య 9 నెలల కొడుకును, తల్లిదండ్రులను తీసుకుని రెండురోజుల క్రితం భర్త ఇంటికి వచి్చంది. వీరిని శ్రీతేజతోపాటు కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వకుండా..తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో రమ్య తన గోడును కాలనీ వాసులకు చెప్పి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. శ్రీతేజపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రమ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment