silent protest
-
వనపర్తిలో ఓ డాక్టర్ మౌనపోరాటం..
వనపర్తి: వనపర్తికి చెందిన ఒక మహిళా డాక్టర్ పట్ల ఆమె భర్త అమానుష వైఖరితో వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మౌనపోరాటం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రి కల్పించుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వనపర్తి జిలా కలెక్టరుకు లేఖ రాశారు. డా. లక్ష్మి కుమారి వనపర్తిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తోన్న చర్మవ్యాధి నిపుణురాలు. ఆమె భర్త ఎం.ఎన్. ప్రమోద్ కుమార్ గృహ నిర్వహణలో ఏమాత్రం సహాయపడకపోగా తనను చాలాకాలంగా వేధిస్తున్నారని, 23 ఏళ్లుగా అతనితో నరకాన్ని అనుభవిస్తున్నానని ఆమె లేఖలో రాశారు. చిన్న క్లినిక్ నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నానని ఇప్పుడైతే భర్త వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. శారీరకంగానూ, మానసికంగానూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతూ క్లినిక్ మూసివేయాలని ఒత్తిడి చేస్తూ నానా హింసలకు గురిచేస్తూ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. నా పని నన్ను చేసుకోనీయకుండా ఇంట్లోనే ఉంచి బంధించడం, క్లినిక్ కు తాళాలు వేసేయడం వంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. దీంతో నేను పేషేంట్ లకు క్లినిక్ బయట రోడ్డు మీదే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది. దయచేసి సంబంధిత మంత్రిగారు కల్పించుకుని నన్ను, నా బిడ్డను కాపాడాలని కోరుతూ మౌనపోరాటం చేస్తున్నాను. ఇంతవరకు జిల్లా అధికారులు ఎవ్వరూ నా క్లినిక్ విషయమై నాకు ఎలాంటి అభయం ఇవ్వలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు.. -
కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సర్కార్‌కు వ్యతిరేకంగా, తెలంగాణ మహిళలకు సంఘీభావంగా దీక్షకు దిగిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా.. ట్యాంక్ బండ్‌పై బుధవారం ఆమె మౌన దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకు ముందు.. రాణి రుద్రమ దేవి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించి దీక్షకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. ఆమె కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల్లో నెంబర్ వన్. మహిళలను ఎత్తుకుపోవడంలో నెంబర్ వన్. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌కి మహిళల భద్రత పట్ల చిత్త శుద్ది లేదు. కేసీఆర్ దృష్టిలో మహిళలు ఓట్లు వేసే యంత్రాలు. మహిళ భద్రతకు చిన్న దొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడు. ఎక్కడుంది భరోసా యాప్?. నేను ఫోన్ లో చెక్ చేశా.. ఎక్కడ కనపడలేదు యాప్. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర,పెద్ద దొర. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుంది తెలియదు. .. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారామె. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కు లేదు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు. ‘ఆడపిల్లల పై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతా’.. అని చెప్పిన కేసీఅర్ ఎంత మంది గుడ్లు పీకారు. స్వయంగా మంత్రుల బంధువులు రేపులు చేసినా దిక్కు లేదు. కేసీఆర్‌కి ఆడవాళ్లు అంటే వివక్ష. కేసీఆర్‌కి ఆడవాళ్లు అంటే కక్ష. దళిత మహిళలపై దాడులు చేస్తున్నారు. లాకప్ డెత్ లు చేస్తున్నారు. తెలంగాణలో ఓకే ఒక్క మహిళకు రక్షణ ఉంది. ఆమె కల్వకుంట్ల కవిత. మిగతా మహిళలంటే కేసీఆర్‌కి లెక్కే లేదు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ మీదనే అసభ్య పదజాలం వాడుతున్నారు. గవర్నర్‌కే గౌరవం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ. స్వయంగా నేనే ఫిర్యాదు చేసినా దిక్కు లేదు. సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారు నన్ను. ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం. గవర్నర్, సాధారణ మహిళలకు, మహిళా నేతలకే కాదు.. ఐఏఎస్ మహిళా అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు. పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారు. ఇది దిక్కుమాలిన పాలన. కేసీఆర్ బిడ్డకు తప్పితే ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటూ లేదు. ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టి.. అదే మహిళలకు దక్కిన గౌరవం అని ప్రచారం చేసుకున్నారు. కవిత సిగ్గులేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. స్కాంలో చిక్కి.. మహిళల గౌరవాన్ని దెబ్బ తీశారు. రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా చేస్తారట!. అసలు రాష్ట్రంలో 33 శాతం ఎక్కడ అమలు అవుతుంది. ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదు. రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. మహిళా మంత్రులకు దిక్కు లేదు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలను చేశారు. అసలు మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదు. కేసీఆర్‌ది నియంత పాలన.. మహిళల పట్ల సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా మౌన దీక్షఅని ప్రకటించారామె. -
నోటికి నల్లగుడ్డతో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ
సాక్షి, వనపర్తి: ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని పోలీసుల నిర్భందాలతో ఆపాలనుకోవడం ప్రభుత్వ అవివేక చర్య అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్.గోపిగౌడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సమ్మెశిబిరం నుంచి ఆర్టీసీ కార్మికులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని బస్టాండ్ మీదుగా, రాజీవ్‌చౌక్, బస్ డిపోరోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆర్టీసీ డిపోఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో ట్యాం క్‌బండ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. పోలీసుల తీరు అమానుషమని, సమైక్య పాల కుల హయాంలోకంటే దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా డిమాండ్లు సా ధించే వరకు పోరు ఆపబోమని అన్నారు. న్యా యస్థానాలు సూచించినా, 36 రోజులుగా ఏకధాటిగా ప్రజలు పోరాటం చేస్తున్నా.. ప్రభు త్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దే శం ప్రభుత్వానికి ఉంటే చర్చలకు ఎందుకు పిలవడం లేదన్నారు. ఆర్టీసీని నిర్మూలించాలనే ఆశయంతోనే ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలతో పదుల సంఖ్యలో కార్మికులు అమరులు అవుతు న్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీని బతికించుకునేందుకు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు పస్తులతో పోరాటం చేస్తున్నార ని అన్నారు. తెలంగాణపోరాట స్ఫూర్తితోనే ఆర్టీ సీని కాపాడుకునేంత వరకు ప్రజాస్వామ్యపద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీపై ఉన్నతాధికారులు హైకోర్టుకు ఇస్తున్న నివేదికలతోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు వెంకటయ్య, రమేష్, వీవీమూర్తి, శ్రీలత, ప్రభరాణి, లక్ష్మీ, రేణుక, చపలతిరెడ్డి, నందిమల్ల నాగరాజు పాల్గొన్నారు. -
వివాహిత మౌన పోరాటం
పరిటాల (నందిగామ టౌన్) : కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఓ వివాహిత మౌన పోరాటానికి దిగింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన కర్ల రాంబాబు, నందిగామ మండలం అంబారుపేటకు చెందిన స్రవంతిలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పొడసూపాయి. దీంతో గతంలో స్రవంతి పోలీసులను కూడా ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు, గ్రామ పెద్దలు పలుమార్లు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారి కాపురం కుదుటపడలేదు దీంతో ఇరువురు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తనను కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ స్రవంతి భర్త రాంబాబు ఇంటి ఎదుట గురువారం ఆందోళనకు దిగింది. స్రవంతి నిరసన చేపడుతుండగానే భర్త రాంబాబు, అతని తల్లి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆ దగ్గరల్లోనే అతను పనిచేసే టెంట్ హౌస్ ఎదుట బంధువులతో కలిసి ఆమె నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికుమార్.. స్రవంతికి రక్షణగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను పంపించారు. కాగా, వివాహమైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని స్రవంతి ఆరోపిస్తోంది. అయితే, రాంబాబు మాత్రం మూడున్నరేళ్లుగా ఇద్దరి మధ్య సఖ్యత లేదని, ఇప్పటి వరకు గుర్తుకురాని భర్త ప్రస్తుతం ఎందుకు గుర్తుకు వచ్చాడో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ పరుపు ప్రతిష్టలను మంటగలిపేందుకే నిరసన చేస్తోందని వాపోయాడు. -
పిల్లలను దూరం చేశారు
టెక్కలి: అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తింటివారు కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురి చేశారు. చివరకు పిల్లల్ని నా నుంచి దూరం చేశారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా సరైన న్యాయం అందలేదు. పిల్లల్ని పంపించేంత వరకూ పోరాటం చేస్తానంటూ కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన వివాహిత డొంకాన నిరోష తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మంగళవారం టెక్కలి సీఐ కార్యాలయం ఎదుట మౌన పోరాటానికి దిగింది. అంతకు ముందు సీఐ శ్రీనివాస్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. పిల్లలిద్దరూ తండ్రి వద్ద ఉన్నారు. చట్టపరంగా పిల్లల్ని అందజేస్తామని సీఐతో తండ్రి తెలిపాడు. దీంతో ఆమె సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి మౌన పోరాటానికి దిగింది. బాధితురాలు నిరోష విలేకర్లతో మాట్లాడుతూ...కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డొంకాన మోహన్‌రావుతో 2016లో తనకు వివాహం జరిగిందన్నారు. సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన తన తల్లిదండ్రులు రూ.6లక్షల నగదు, 9 తులాల బంగారం, రూ.50వేల ఆడపడుచుల కట్నం, రూ.70 వేల విలువైన ద్విచక్రవాహనం కట్నంగా ఇచ్చారని తెలిపింది. పెళ్లైన రెండు నెలల తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని వాపోయింది. తన భర్త అన్న కృష్ణారావు పలుమార్లు తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందింది. అత్తమామలు వజ్రం, రామారావు, బావ కృష్ణారావు, తోటి కోడలు దమయంతి ప్రోద్బలంతో తన భర్త తీవ్రంగా వేధించేవాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని పలుమార్లు స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు జిల్లా స్థాయి పోలీసుల చుట్టూ తిరిగానని, అయినా న్యాయం జరగలేదని వాపోయింది. ఇద్దరు పిల్లల్ని తన నుంచి దూరం చేశారని, తక్షణమే పిల్లల్ని తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంది. ఆమెకు కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకరరావు మద్దతు పలికారు. -
ప్రేమ పేరుతో మోసం
కర్నూలు, దొర్నిపాడు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి మౌనదీక్షకు దిగింది. మండలంలోని కొండాపురంలో సోమవారం ఈఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బికార్సాహెబ్, మౌలాలీబీ దంపతుల కుమార్తె నాగూర్‌బీ ఇదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, నాగేశ్వరమ్మ కుమారుడు అరవింద్‌కుమార్‌రెడ్డి గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. గత నాలుగేళ్ల నుంచి వారి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇటీవల వివాహం చేసుకోవాలని ఆ యువతి ప్రియుడిపై ఒత్తిడి తేవడంతో పెళ్లికి నిరాకరించి మరో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న నాగూర్‌బీ ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఆ యువకుడి తల్లిదండ్రులు ఆ యువతిపై దాడికి ప్రయత్నించారు. దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువురిని పోలీస్‌స్టేషన్ తరలించారు. ఇద్దరు మేజర్లు కావడంతో ప్రియుడు, ప్రియురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. -
పవన్‌కు సంఘీభావంగా ప్రవాసాంధ్రుల మౌన నిరసన
హ్యూస్టన్ : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా హ్యూస్టన్‌లోని 'రే మిల్లర్ పార్కు (రవింద్రనాథ్ ఠాగూర్ పార్క్)'లో జనసేన కార్యకర్తలు ఫ్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. రాజేష్ యాళ్లబండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కి తమ సంఘీభావం తెలుపుతూ, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా 'సైలెంట్ ప్రొటెస్ట్' చేశారు. ఈ కార్యక్రమానికి సాన్ ఆంటోనియో నుంచి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, సోషల్ మీడియా యాక్టివ్ కాంట్రిబ్యూటర్ విష్ణు నాగిరెడ్డి వచ్చారు. ప్రతీ కార్యకర్త ఎల్లో మీడియాని బాయ్ కాట్ చేయాలని విష్ణు నాగిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలు మరింత బాధ్యతతో జనసేన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పవణ్ కళ్యాణ్ సహకారంతో నాలుగేళ్లకిందట అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, అదే పవణ్ కళ్యాణ్‌ని రాజకీయంగా, మానసికంగానే కాకుండా చివరకు కుటుంబ పరంగా కూడా ఎల్లో మీడియాతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాను సామాజిక మాధ్యమాల్లో కూడా అన్‌ఫాలో కావాలని, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో ఏ విధంగా 'బ్లాక్ / అన్-ఫాలో' కావాలో వివరించారు. నవసమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించవలసిన బాధ్యత మీడియా పై ఉందని వెంకట్ శీలం పేర్కొన్నారు. మీడియా తీరుమారవలసిన సమయమాసన్నమైందన్నారు. మీడియా తప్పుడు ప్రచారాలతో, అభూత కల్పనలతో ప్రజలని, రాజకీయాలని గణనీయంగా ప్రభావితం చేస్తున్నారని కృష్ణ చిరుమామిళ్ల తెలిపారు. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పైపైకి అని శ్రీ శ్రీ స్పూర్తిని శశి లింగినేని మరోసారి జనసేన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. నవసమాజంకోసం ప్రస్తుత మీడియాలో మార్పు అవసరమన్నారు. మెరుగైన సమాజం కోసం నీతీ, నిబద్ధత, నిజాయితీతో పనన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని, వారికి ఎన్ఆర్ఐలందరూ సహకరిస్తారని వీరా కంబాల చెప్పారు. ప్రతీ కార్యకర్త జనసేన సిద్ధాంతాలను, స్పెషల్ స్టేటస్ ఆవశ్యకతను పల్లెపల్లెకి, ప్రతీ పౌరుడికీ చేర్చాలని రాజేష్ యాళ్లబండి కోరారు. ఈ కుళ్లు రాజకీయాలని తిప్పికొట్టాలని, 'స్వచ్ఛ మీడియా' కోసం ప్రస్తుత అవసరమైతే ఎల్లోమీడియాను బాన్ చేయాలని కోరారు. అమ్ముడుపోయిన మీడియాలతో రాష్ట్ర ప్రజలు అశాంతికి గురవుతున్నారన్నారు. ప్రస్తుత కలుషిత మీడియా ప్రధాన సమస్యలను ప్రక్కతోవ పట్టించడంలో సఫలీకృతమౌతుందని శేషాద్రి మంచం అన్నారు. అలాంటి చానళ్ళని బ్యాన్ చేయవలసినదిగా జనసేన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జగన్ రాయవరపు, శేషగిరి రావు యల్లాప్రగడ, కిరణ్ వర్రే, శశి లింగినేని, సందీప్ రామినేని, రాం సింహాద్రి, కిషోర్ అధికారి, రమేష్ వరంగంటి, వెంకట్ బోనం, సుబ్రమణ్యం వంగల, వెంకట్ శీలం, వీరా కంబాల, దుర్గారావ్ నుప్పులేటి, శేషద్రి మంచెం, నాగ్ మేకల, సురేష్ సత్తి, చైతన్య కూచిపూడి, మహేష్ ముద్దాల, కృష్ణ చిరుమామిళ్ళ, రాజేష్ యాళ్లబండి, విష్ణు నాగిరెడ్డి, శ్రీకాంత్, హ్యూస్టన్‌లోని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలందరూ, జనసేన పార్టీ నిర్మాణానికి బలోపేతానికీ తమ పూర్తి సహాయసహకారలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. -
న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న పవన్
-
ఫిల్మ్ ఛాంబర్ వద్ద దీక్షకు దిగిన మాధవీ లత
-
క్రమబద్ధీకరణ వెంటనే చేయాలి
నిర్మల్‌టౌన్ : కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే క్రమబద్దీకరించాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు నిరవధిక దీక్షలో భాగంగా సోమవారం మౌన దీక్ష చేశారు. అంతకుముందు వారు మాట్లాడారు. క్రమబద్దీకరణను చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలçస్యం చేస్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్దీకరణ ఆలస్యం అవుతుండడం వల్ల అప్పటి వరకు 10వ పీఆర్సీ ప్రకారం బేసిక్ పే చెల్లించడంతో పాటు డీఏ ఇవ్వాలని కోరారు. మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాన్ సాంక్షన్ పోస్టులను వెంటనే సాంక్షన్ పోస్టులుగా మర్చాలని అన్నారు. ఇందులో నాయకులు సంజీవ్, పురుషోత్తం, లక్షీ్మకాంత్, నాగేశ్వర్రావు, సుధారాణి, సురేఖ, సుమన్ గౌడ్, సవిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భర్త కోసం వివాహిత మౌనపోరాటం
మల్లాపురం (యాదగిరిగుట్ట) అదనపు కట్నం తేలేదని.. తనను వదిలించుకోవాలని చూస్తున్న భర్తకు కనువిప్పు కలిగించి.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత అత్తారింటి ఎదుట మౌనపోరాటానికి పూనుకుంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో సోమవారరం చోటు చేసుకుంది. బాధితురాలు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపురానికి చెందిన అక్కినపల్లి వరస్వామి–రాములమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజుచారికి మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన పానుగంటి చక్రపాణి–వెంకటమ్మల రెండవ కూతురు సంధ్యారాణికి నాలుగేళ్ల (10–03–2012) క్రితం వివాహం జరిగింది. మొదటి రెండేళ్లు వీరి సంసార జీవితం సాఫీగానే సాగినా అనంతరం అదనపు కట్నం ఆ కుటుంబంలో చిచ్చురేపింది. వివాహ సమయంలో పుట్టింటి వారు పెట్టిన బంగారు ఆభరణాలను తన అత్త, భర్త అమ్ముకుని చిత్రహింసలు పెట్టారని వాపోయింది. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా వారి తీరులో మార్పు రాలేదని ఆవేదనచెందింది. కట్నం తేవాలని పుట్టింటికి పంపి ఇప్పుడు విడాకులు కావాలని లాయర్‌తో నోటీసులు పంపించారని తెలిపింది. దీంతో గత్యంతరం లేక మౌనపోరాటానికి పూనుకున్నట్టు వివరించింది. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడడని కిరోసిన్ డబ్బాను చూపించింది. ఈ విషయంలో గ్రామస్తులు సంధ్యారాణికి మద్దతుగా నిలిచారు. -
మసీదుల తొలగింపుపై ముస్లింల మౌన దీక్ష
దేవాలయాల తొలగింపులో భాగంగా ధ్వంసం చేసిన మసీదులను ప్రార్థన స్థలాలను తిరిగి నిర్మించాలని కోరుతూ మస్లింలు మౌన దీక్ష చేపట్టారు. ప్రార్థనా స్థలాలను, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఉత్తర్వులను పాటించాలనే డిమాండ్‌తో నగరంలోని తారా మసీదువద్ద శుక్రవారం సామూహిక ప్రార్థనల అనంతరం మౌన దీక్షకు దిగారు. -
న్యాయం కోసం యువతి మౌన దీక్ష
అడ్డపనస (సారవకోట): మండలంలోని అంగూరు పంచాయతీ అడ్డపనస గ్రామంలో కొల్లి అనసూయ తనను వివాహం చేసుకోవాలని చీడి సూర్యనారాయణ అలియాస్ సురేష్ ఇంటి దగ్గర గురువారం మౌన దీక్షకు దిగింది. ఆమె చేస్తున్న మౌన దీక్షకు ఆదీవాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు, ఐకార్డ్ కార్యదర్శి కొల్లి సింహాచలం మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీడి సూర్యనారాయణతో ఏడాది కిందట నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుందని తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. దీంతో తాను గర్భం దాల్చానని ప్రస్తుతం ఏడు నెలల గర్భవతినని తెలిపింది. ఈ విషయమై తనను సంప్రదిస్తే ఇప్పుడు తనకేమీ సంబంధం లేదని చెబుతున్నాడని పేర్కొంది. దీనిపై తన తల్లిదండ్రులైన కొల్లి లింగయ్య, ఆదిలక్ష్మిలకు తెలపగా గ్రామంలోని పెద్ద మనుషులతో మాట్లాడారని పేర్కొంది. వారు సైతం తనకు న్యాయం చేయకపోవడంతో న్యాయం కోసం మౌనదీక్ష చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అదీకాక పది రోజుల నుంచి సూర్యనారాయణ గ్రామంలో అందుబాటులో సహితం లేడని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
తెలంగాణ కరువుపై మౌన దీక్ష
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రానంతరం అతి పెద్ద కరువును ఎదుర్కొంటున్నామని, మునుపెన్నడూ లేని రీతిలో చివరకు తాగునీటికి కష్టాలు పడుతున్నామని, ఉపాధి లేకుండా అయిపోయి పల్లె వలస వెళ్లిపోతోందని టీ జేఏసీ కరువు సమాలోచన సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా రాష్ట్రం మొత్తాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, వివిధ రైతు సంఘాల నేతలు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, ఆయా జేఏసీల నాయకులు పాల్గొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఇప్పటి దాకా కనీసం ఒక్క సమీక్ష సమావేశం కూడా జరపలేదని, కనీసం శుక్రవారం జరగనున్న కలెక్టర్ల సమావేశంలోనైనా కరువుపై సమగ్ర చర్చించి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలని ఈ సమావేశం కోరింది. త్వరలో మౌన దీక్ష కరువు తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు అన్ని జేఏసీలు, రైతు సంఘాల ప్రముఖులతో కలిసి త్వరలోనే ఒక రోజు మౌన దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని పక్షాలతో చర్చించి మౌనదీక్ష తేదీని ప్రకటిస్తామన్నారు. అంతకు ముందు గవర్నర్‌ను కలిసి కరువు నివేదికను అందజేస్తామని తెలిపారు. వీటితో పాటు మే 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో చేపట్టాల్సిన పోరాట రూపాలపైనా చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం చెప్పారు. తక్షణం తాగునీటిని సరఫరా చేయడం, నీటి నిల్వలను కాపాడడం, పశువులకు తాగునీరు, మేత అందించేందుకు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో నీటి తొట్టెల ఏర్పాటు, గ్రామీణ ఉపాధి కూలీలకు వెంటనే ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని, వృద్ధులు, వికలాంగులకూ మధ్యాహ్న భోజనం అందించాలని, ఆరోగ్య సేవలు అందించేందుకు మొబైల్ వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని, వడగాడ్పులతో చనిపోయిన వారికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తదితర తీర్మానాలు చేశారు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటుపై స్పందనే లేదు వాస్తవాలను అంగీకరించని పాలకవర్గం రావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కేసీఆర్ సీఎం కాకముందే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరానని కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఏ సలహాలు తీసుకునే స్థితిలో లేదన్నారు. కరువు ప్రకృతి వైఫల్యం కాదని, మానవ వైఫల్యమని ప్రముఖ ఆర్ధికవేత్త అమర్త్యసేన్ చెప్పిన మాటలను తెలంగాణ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారని, ప్రతిపక్షాలు బలహీన పడితే ప్రజలే ప్రతిపక్షం అవుతారని చెప్పారు. పోరాడిన గ్రామాలు యాచిస్తున్నాయి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన గ్రామాలు ప్రస్తుతం యాచిస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవేదన చెందారు. కరువు వల్ల పల్లెల నుంచి 60 శాతం మంది ప్రజలు వలస పోయారని అన్నారు. నీళ్ల కోసం చెరువులు తవ్విస్తున్నారు కానీ, పూడికలు తీసిన కాంట్రాక్టర్లు బాగుపడ్డారన్నారు. తెలంగాణలో వ్యవసాయం ప్రకృతి ఆధార పడి ఉందని, తెలంగాణకు కొత్త కరువు మాన్యువల్ అవసరమని తెలిపారు. తెలంగాణ గడ్డ రాజకీయంగా నీర పడిందని, గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. -
'స్కాలర్షిప్' ల కోసం మౌన ప్రదర్శన
రామాయంపేట (మెదక్‌జిల్లా) : మెదక్ జిల్లా రామాయం పేటలో గురువారం వివిధ కళాశాలల విద్యార్థులు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్నేహ, సాయికృప, వాసవి కళాశాలలకు చెందిన వందలాది మంది జూనియర్ కళాశాలల విద్యార్థులు వందల సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2014-15 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల కోసం తాము దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. అనంతరం వారు స్థానిక తహశీల్దార్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. -
మౌన దీక్ష
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమ అధినేత్రి జయలలితకు శిక్ష ఖరారు కావడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న విషయం తెలిసిందే. తీర్పును జీర్ణించుకోలేని పార్టీ వర్గాలు విధ్వంసాలకు దిగాయి. గవర్నర్ రోశయ్య రంగంలోకి దిగడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఆందోళన కారులపై లాఠీలు ఝుళిపించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, అర్ధరాత్రి వేళ ఎలాంటి విధ్వంసాలకు పాల్పడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో రాత్రంతా భద్రతను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించింది. అయితే, అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేగా...తామే విధ్వంసాలకు పాల్పడితే చెడ్డ పేరు తప్పదన్న విషయాన్ని అన్నాడీఎంకే వర్గాలు గ్రహించి, శాంతియుత మార్గానికి సిద్ధమయ్యూయి. మౌన ప్రదర్శన : ఆదివారం ఉదయాన్నే రాష్ట్రంలో కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి, నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని మౌనంగా నిరసన తెలియజేశారు. మరి కొన్ని చోట్ల ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నైలో అయితే, వందలాది మంది మహిళలు, కార్యకర్తలు ఉదయాన్నే మెరీనా తీరానికి చేరుకున్నారు. దివంగత నేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీయార్ సమాధి వద్ద బైఠాయించారు. తరలి వచ్చిన మహిళలు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ(జయలలిత)ను నిర్బంధిచడంపై కన్నీటి పర్యంతమయ్యారు. జయలలిత చిత్ర పటాలను చేత బట్టి మౌన దీక్షలో సాయంత్రం వరకు కూర్చున్నారు. శనివారం తీర్పు వెలువడటంతో నిర్మానుష్యంగా మారిన అన్నాడీఎంకే కార్యాలయంలో ఆదివారం ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన నాయకులు బోరును విలపించారు. ఓ దశలో కార్యాలయం వెలుపలకు తరలి వచ్చిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారుల్ని శాంతింప చేశారు. దుకాణాల మూత: విధ్వంసాన్ని వీడి, శాంతియుత మార్గంలో నిరస బాటకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమైనా, రాష్ట్రంలో అనేక నగరాలు, జిల్లా కేంద్రాల్లో అక్కడక్కడ దుకాణాలు మూతపడ్డారుు. ఆదివారం సెలవు దినం అయినా, సాధారణంగా తెరచి ఉండే దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అయితే, జన జీవనానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. దక్షిణాది జిల్లాల్లో అనేక నగరాల్లో, జిల్లా కేంద్రాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వాణిజ్య కేంద్రాల పరిసరాల్లో పాక్షికంగా బంద్ వాతావరణం నెలకొంది. చెన్నైలో అక్కడక్కడ దుకాణాలు మూతబడ్డాయి. నిత్యం రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే కొన్ని మార్గాలు నిర్మానుష్యంగా దర్శనిమిచ్చాయి. బస్సు సేవలు అంతంత మాత్రం కొనసాగారుు. ఇదే పరిస్థితి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నెలకొంది. మారుమూల గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులు షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక రాష్ట్రం నుంచి కర్ణాటకకు బస్సు సేవలు పూర్తిగా ఆగిపోయూరుు. అదుపులో పరిస్థితి - జార్జ్ : రాజధాని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిస్థితి అదుపులో ఉందని కమిషనర్ జార్జ్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామన్నారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచామని తెలిపారు. ఇతర పార్టీల నాయకుల ఇళ్లు, ఆ మార్గాల్ని భద్రతా వలయంలోకి తెచ్చామని వివరించారు. అన్నాడీఎంకే వర్గాలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచామని తెలిపారు. జాలర్ల నిరసన : జయలలితకు శిక్ష ఖరారు కావడంతో జాలర్లలో ఆగ్రహం రేగింది. ఉదయాన్నే నాగపట్నం, వేదారణ్యం జాలర్లు చేపల వేటను బహిష్కరించారు. పడవలను ఒడ్డుకు పరిమితం చేసి, రోడ్డెక్కారు. జయలలితను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగాయి. పోలీసులు రంగంలోకి దిగి బుజ్జగించినా, జాలర్లు మాత్రం తగ్గలేదు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో రాస్తారోకో వీడి, నిరసన దీక్ష నిర్వహించారు. నాగై టోల్ గేట్ కూతవేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాహనానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సుకు నిప్పుతో కలకలం : శాంతియుతంగా నిరసనలు సాగుతున్న వేళ విరుదునగర్‌లో ఓ బస్సుకు నిప్పంటించడం కలకలం రేపింది. అయితే, ఇది తమ పని కాదంటూ అక్కడి అన్నాడీఎంకే వర్గాలు పేర్కొనడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విరుదునగర్ సమీపంలోని నడికుడి బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులోని కొందరు ప్రయాణికుల్ని దించేసి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేయడంతో బస్సు పాక్షికంగా కాలింది. అయితే, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించడంతో ఈ బస్సుకు నిప్పు అంటించిన వారి భరతం పట్టేందుకు విరుదునగర్ పోలీసులు సిద్ధం అయ్యారు. -
కొడుకు కోసం ఓ తల్లి మౌనదీక్ష
చిత్తూరు: తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటు చేసుకుంది. మౌన దీక్ష చేపట్టిన ఉమామహేశ్వరి అనే గృహిణికి ఆమె భర్తకు మధ్య గత కొద్దికాలంగా విభేదాలు నెలకొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తండ్రి బలవంతంగా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే తన నాలుగేళ్ల కొడుకును తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉమామహేశ్వరి దీక్ష చేపట్టింది. తన కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఉమామహేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేసింది. -
'సీఎం దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు'
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో చేపట్టిన మౌన దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సమైక్య ముసుగులో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులు విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. విభజనకు అనుకూలమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. -
సీఎంది దొంగ దీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల కిరణ్ ఎమ్మెల్యేగా గెలిచే దమ్ము లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కిరణ్ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు తప్పుల తడకగా ఉన్న నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్ర అసెంబ్లీ తిప్పి రాష్ట్రపతికి పంపింది. అయిన రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర తనదైన శైలిలో దూసుకుపోతుంది. దాంతో సీఎం కిరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద మౌన దీక్ష చేపట్టాలని ఆయన భావించారు. అనివార్య కారణాల వల్ల శక్తిస్థల్ వద్ద దీక్ష రద్దు అయింది. దాంతో సీఎం మౌన దీక్ష జంతర్ మంతర్ వద్దకు మార్చారు. దీంతో సీఎంతోపాటు సీమాంధ్రకు చెందిన కేంద్రంమంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పలువురు నాయకలు పాల్గొన్నారు. దీంతో సీఎం మౌన దీక్షపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తుపై విధంగా స్పందించారు. -
సీమాంధ్ర ఉద్యోగుల మౌన ప్రదర్శన
సచివాలయంలో ఆందోళన విభజన నిర్ణయాన్ని యూపీఏ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం గురువారం కూడా నిరసనలు కొనసాగించింది. ఎల్ బ్లాక్ నుంచి హెచ్ బ్లాక్ వరకు ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఎల్ బ్లాకు వద్ద ఉద్యోగులను ఉద్దేశించి ఫోరం నాయకులు మాట్లాడుతూ.. విదేశీ వనిత సోనియాగాంధీ రూపురేఖల్లో భారతీయతను అనుకరిస్తే సరిపోదని, ఆలోచనల్లో కూడా భారతీయతను అనుసరిస్తే అనీబిసెంట్ మాదిరిగా గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని భారతీయతను అనుసరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సచివాలయంలో గురువారం తెలంగాణ ఉద్యోగులు బోనాలు నిర్వహించారు. బోనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సీమాంధ్ర ఉద్యోగులు మౌన ప్రదర్శనకు పరిమితమయ్యారు. సీమాంధ్ర ఉద్యోగులు కూడా బోనాల్లో పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి భోజనాలు చేశారు. సచివాలయ తెలంగాణ సమన్వయ కమిటీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాటిని ప్రతిపాదనల దశలోనే అడ్డుకోవడానికి సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు అనుక్షణం జాగరూకతతో ఉండి, పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకొనే లక్ష్యంతో ‘సచివాలయ తెలంగాణ సమన్వయ కమిటీ’ ఏర్పాటైంది. సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం, రికార్డు అసిస్టెంట్ల సంఘం, ఏపీ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, డ్రైవర్ల సంఘం, డీఆర్అండ్టీ అసిస్టెంట్ల సంఘం, లిఫ్ట్ ఆపరేటర్ల సంఘం, రోనియో ఆపరేటర్ల సంఘాలు కలిసి సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీకి ఎన్.శంకర్ చైర్మన్‌గా, జె.సుభద్ర సలహాదారుగా, యం.నరేందర్‌రావు సెక్రటరీ జనరల్‌గా, వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సంయుక్త కార్యదర్శులుగా నర్సింగ్‌రావు, కిషన్‌లాల్, కోశాధికారిగా మోహన్, సభ్యులుగా యాసిన్, జగన్, శ్రీనివాస్, సూర్యనారాయణ నియమితులయ్యారు. రాజకీయ డిమాండ్లు మినహా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ఈనెల 12న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులను కూడా కమిటీ ఆహ్వానించింది.