ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేస్తున్న నాగూర్‌బీ
కర్నూలు, దొర్నిపాడు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి మౌనదీక్షకు దిగింది. మండలంలోని కొండాపురంలో సోమవారం ఈఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బికార్‌సాహెబ్, మౌలాలీబీ దంపతుల కుమార్తె నాగూర్‌బీ ఇదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, నాగేశ్వరమ్మ కుమారుడు అరవింద్‌కుమార్‌రెడ్డి గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. గత నాలుగేళ్ల నుంచి వారి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది.
ఇటీవల వివాహం చేసుకోవాలని ఆ యువతి ప్రియుడిపై ఒత్తిడి తేవడంతో పెళ్లికి నిరాకరించి మరో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న నాగూర్‌బీ ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఆ యువకుడి తల్లిదండ్రులు ఆ యువతిపై దాడికి ప్రయత్నించారు. దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువురిని పోలీస్‌స్టేషన్ తరలించారు. ఇద్దరు మేజర్లు కావడంతో ప్రియుడు, ప్రియురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment