ప్రేమ వ్యవహారమే బలిగొంది | Young Murder Case Reveals In Kurnool | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారమే బలిగొంది

Published Fri, Jun 15 2018 1:07 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Young Murder Case Reveals In Kurnool - Sakshi

హరికుమార్‌(ఫైల్‌) ఆసుపత్రి ఆవరణలో రోదిస్తున్న హతుడి తల్లి, కుటుంబ సభ్యులు

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలో సుబ్బాజీ హోటల్‌లో బుధవారం రాత్రి జరిగిన హరికుమార్‌(24) హత్యకు ప్రేమ వ్యవహారమే కారణ మని పోలీసులు నిర్ధారించా రు. గురువారం ఆదోని డీఎస్పీ అంకివీడు ప్రసాద్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుడి తల్లిదండ్రులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. నాగలదిన్నెకు చెందిన శ్రీనివాసులు, బేబీ దంపతులు పట్టణంలోని గీతానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు హరికుమార్‌కు గాంధీనగర్‌లో ఉంటున్న నాగేశ్వరరెడ్డి కుమార్తెతో కొన్నేళ్ల క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో 2013, 2014లో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈక్రమంలో శ్రీనివాసులు తన కుమారుడిని వారణాసిలో తన స్నేహితుడి దగ్గర పనికి వదిలాడు. రెండేళ్ల నుంచి అతడు అక్కడే ఉంటున్నాడు. కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న శ్రీనివాసులు హెచ్‌బీఎస్‌ కాలనీలో వాటర్‌ ప్లాంట్‌ ను పెట్టి కుమారుడిని చూసుకోమని చెప్పాడు.

ఈ మేరకు వారం రోజుల క్రితం హరికుమార్‌ వారణాసి నుంచి ఇంటికి వచ్చాడు. ఇదిలా ఉండగా ఇటీవల హరికుమార్‌ ప్రేమించిన అమ్మాయి అవ్వ చనిపోవడంతో ఆమె సోదరుడు ఓ రోజు రాత్రి వీరింటికి వచ్చి ఉండిపోయాడు. దీంతో అందరూ పాత విషయం మరిచిపోయి స్నేహితులుగా మారారని భావించారు. అయితే బుధవారం రాత్రి హరికుమార్, అమ్మాయి సోదరుడు, మరో స్నేహితుడు గాంధీనగర్‌లో గోబీ తింటుండగా గొడవ జరిగింది. ఈ విషయాన్ని అమ్మాయి సోదరుడు తన తండ్రి నాగేశ్వరరెడ్డికి చేరవేశాడు. అనంతరం వారు అక్కడికి చేరుకొని హరికుమార్‌పై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. అమ్మాయి తాత ఇబ్రహీంపురం శేషారెడ్డి, అతడి కుమారుడు మంజునాథ్‌రెడ్డి ప్రోద్బలంతో  నాగేశ్వరరెడ్డి, అతడి కుమారులు, మరికొందరు కలసి హత్య చేసినట్లు మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement