
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు: ప్రేమ వ్యవహారానికి సంబంధించి ప్రియుడి తండ్రిని.. హత్య చేసిన ప్రియురాలి నాన్న పోలీసుస్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. వివరాలు.. మదురై దిడీర్ నగర్, భాస్కర్‌దాస్ నగర్‌కు చెందిన వ్యక్తి సడయాండి. ఇతని కుమార్తె అదే ప్రాంతానికి చెందిన రామచంద్రన్ (45) కుమారుడిని ప్రేమిస్తున్నట్టు తెలిసింది. వీరి ప్రేమను ఆయన ఖండించాడు. అలాగే కుమార్తెను ప్రేమిస్తున్న యువకుడిని హెచ్చరించారు.
అతని ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో యువకుడి తండ్రి రామచంద్రన్‌కు సడయాండి ఈ వ్యవహారంపై చర్చించారు. దీనిపై రామచంద్రన్ స్పందించలేదని తెలిసింది. దీంతో సడయాండి ఆగ్రహానికి గురై శుక్రవారం అర్ధరాత్రి యువకుడి తండ్రి రామచంద్రన్‌పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం దిడీర్ నగర్ పోలీసుస్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రామచంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.