ఆర్మ్‌ స్ట్రాంగ్ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | Another twist InArmstrong murder case | Sakshi
Sakshi News home page

ఆర్మ్‌ స్ట్రాంగ్ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. డైరెక్టర్‌ నెల్సన్‌ దంపతుల విచారణ

Published Wed, Aug 21 2024 10:12 AM | Last Updated on Wed, Aug 21 2024 11:34 AM

Another twist InArmstrong murder case

సినీ రంగం వైపు పోలీసుల చూపు 

సాక్షి, చెన్నై: బీఎస్పీ నేత ఆర్మ్‌ స్ట్రాంగ్‌ హత్య కేసులో మంగళవారం మరో మలుపు చోటు చేసుకుంది. సినీ రంగానికి చెందిన దర్శకుడు నెల్సన్, ఆయన సతీమణి మోనీషాను పోలీసులు ప్రశ్నించడం చర్చకు దారి తీసింది. 

బీఎస్పీ నేత ఆమ్ర్‌స్టాంగ్‌ చెన్నైలో గత నెల  హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో 24 మందిని అరెస్టు చేశారు. ఇందులో  ఓ నిందితుడైన తిరువెంగడం పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.  ఈ కేసు విచారణ సమయంలో అనేక మలుపులు చోటు చేసుకంటూ వస్తున్నాయి. ఇప్పటికే  పలు పార్టీ స్థానిక నాయకులు, కీలక రౌడీలను కేసులో అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో కేసు సినీ రంగం వైపుగా మరలడం చర్చకు దారి తీసింది. ఈ కేసులో ప్రముఖ రౌడీ శంభోశంకర్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన గుండు కృష్ణన్‌ కోసం కూడా వేట సాగుతోంది. 

ఈ పరిస్థితుల్లో తమకు లభించిన ఆధారాలు, పట్టుబడ్డ వారు ఇచ్చిన వివరాలు, సెల్‌ నెంబర్లు, కాల్‌ లిస్టుల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో గుండు కృష్ణన్‌తో జైలర్‌ సినిమా దర్శకుడు నెల్సన్‌ సతీమణి మోనీషా పలుమార్లు మాట్లాడినట్టు విచారణలో తేలింది. దీంతో ఆమెను విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. మంగళవారం పోలీసులు ఆమె వద్ద తీవ్రంగా విచారణ చేపట్టారు. అలాగే నెల్సన్‌ ను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.  దీని ఈ జంట స్పందించాల్సి ఉంది.

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement