bsp leader
-
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, చెన్నై: బీఎస్పీ నేత ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో మంగళవారం మరో మలుపు చోటు చేసుకుంది. సినీ రంగానికి చెందిన దర్శకుడు నెల్సన్, ఆయన సతీమణి మోనీషాను పోలీసులు ప్రశ్నించడం చర్చకు దారి తీసింది. బీఎస్పీ నేత ఆమ్ర్స్టాంగ్ చెన్నైలో గత నెల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో 24 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఓ నిందితుడైన తిరువెంగడం పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ కేసు విచారణ సమయంలో అనేక మలుపులు చోటు చేసుకంటూ వస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీ స్థానిక నాయకులు, కీలక రౌడీలను కేసులో అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో కేసు సినీ రంగం వైపుగా మరలడం చర్చకు దారి తీసింది. ఈ కేసులో ప్రముఖ రౌడీ శంభోశంకర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన గుండు కృష్ణన్ కోసం కూడా వేట సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమకు లభించిన ఆధారాలు, పట్టుబడ్డ వారు ఇచ్చిన వివరాలు, సెల్ నెంబర్లు, కాల్ లిస్టుల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో గుండు కృష్ణన్‌తో జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ సతీమణి మోనీషా పలుమార్లు మాట్లాడినట్టు విచారణలో తేలింది. దీంతో ఆమెను విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. మంగళవారం పోలీసులు ఆమె వద్ద తీవ్రంగా విచారణ చేపట్టారు. అలాగే నెల్సన్ ను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. దీని ఈ జంట స్పందించాల్సి ఉంది. -
ఖాకి చొక్కా విడిచి ఖద్దరుతో బహుజన రాజ్యాధికారం సాధ్యమేనా ?
-
ఎమ్మెల్యే హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష.. బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హతవేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో అఫ్జల్‌ను దోషిగా తేల్చిన ఘాజిపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం వెల్లడించింది. కాగా అఫ్జల్ అన్సారీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే 2005 నవంబర్ 29న అప్పటి ఘాజీపూర్ ఎమ్మెల్యే కృష్ణనాద్ రాయ్ హత్యకు సంబంధించి అఫ్జల్ అన్సారీతోపాటు అతని సోదరుడిపై యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా వీరిద్దరు దోషులుగా తేలారు. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష, అతని సోదరుడు, గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. చదవండి: ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్ -
48 గంటల్లో నా భార్య ఆచూకీ కనుక్కోండి!
తాండూరు: తన భార్య కనిపించకుండా పోయి నాలుగు నెలలు కావస్తున్నా పోలీసులు ఆమె ఆచూకీని కనుక్కోవడం లేదని, 48 గంటల్లో కేసును ఛేదించకపోతే ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి ఓ వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారస్తుడు దొరిశెట్టి సత్యమూర్తి ప్రస్తుతం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ మార్చి 6వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయారు. దీనిపై సత్యమూర్తి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకు న్నారు. అయితే పోలీసులు కేసు గురించి పట్టించు కోవడం లేదని సత్యమూర్తి ఆరోపించారు. శుక్రవా రం రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో కలసి సెల్ఫీ వీడి యో తీశారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కను క్కోవాలని, లేదంటే పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని డెడ్‌లైన్ విధించారు. శుక్రవారం రాత్రి 2 గంటల నుంచి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకు ని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, సత్యమూర్తి ఎక్కడున్నా రావాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ కోరారు. సత్యమూర్తి సెల్ఫీ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో శనివారం ఆయన మీడి యా సమావేశం నిర్వహించారు. అన్నపూర్ణ మిస్సిం గ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
వైరల్ వీడియో: ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఏడ్చేసిన బీఎస్పీ నాయకుడు
లక్నో: ప్రస్తుతం దేశమంతా అయిదు రాష్ట్రాల ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. ఈ అయిదింటిలో అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి చాలా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జనవరి 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 11 జిల్లాలు ఫస్ట్ ఫేజ్‌లో ఓటింగ్‌కు వెళ్లనున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో పార్టీ టిక్కెట్ల విషయంలోనూ రగడ మొదలైంది. ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) నాయకుడు అర్షద్ రాణా మీడియా ముందు ఏడుస్తూ కనిపించాడు. రెండేళ్ల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు టికెట్ కోసం రూ. 67 లక్షలు డిమాండ్ చేశాడని, అయితే తనకు తెలియకుండానే తన టికెట్ తొలగించారని అర్షద్ రాణా పోలీసుల ముందు ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు కాగా చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దధేడు గ్రామానికి చెందిన అర్షద్ రాణా చాలా కాలంగా బీఎస్పీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా జిల్లా పంచాయతీ సభ్యుని పదవికి బీఎస్పీ తరపున పోటీ చేశారు. పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న రాణా కొంత కాలంగా బీఎస్పీ నుంచి చార్తావాల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంతలో బీఎస్పీ అధినేత్రి మాయావతి చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుంచి సల్మాన్ సయీద్‌ను పార్టీ పోటీకి దింపినట్లు ట్వీట్ చేసింది. సల్మాన్ సయీద్ హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడు. చదవండి: రెండే రెండు నిమిషాల్లో బాద్షా సాంగ్, స్పందించిన ర్యాపర్ #मुजफ्फरनगर विधानसभा का टिकट न मिलने के कारण थाने में फूट फूट कर रोते ये है बसपा नेता अरशद राणा। इनका आरोप है कि बसपा नेता शमशुद्दीन राइन ने इनसे टिकट के नाम पर 67 लाख रुपए ले लिए। पीड़ित नेता जी अब आत्मदाह करने की घोषणा कर रहे है।#UPElection2022 @bspindia #ViralVideos pic.twitter.com/mhz2mXymjw — Zuber Akhtar (@Zuber_IndiaTV) January 14, 2022 అయితే యామవతి ప్రకటనతో కంగుతున్న రాణా తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బీఎస్పీ నేత షంషుద్దీన్ రైన్ టికెట్ పేరుతో తమ నుంచి రూ.67 లక్షలు తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి నగరానికి చేరుకొని బీఎస్పీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశాడు. కాగా దీనిపై విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిటీ కొత్వాలి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు. -
‘ఆ ఎమ్మెల్యేకి మతిభ్రమించింది’
లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌కు మతిభ్రమించిందని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. మాయావతి నపుసంకురాలి కంటే హీనమని యూపీలోని మొఘల్సరాయ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధనా సింగ్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. లక్నో గెస్ట్ హౌస్‌లో మాయావతి సహా బీఎస్పీ కార్యకర్తలపై గతంలో ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని పరోక్షంగా ప్రస్తావించిన సాధనా సింగ్ ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీల కలయికను తప్పుపడుతూ మాయావతిపై ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని మిశ్రా వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో బీజేపీ నేతలు మానసిక స్థైర్యం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బీజేపీ నేత సాధనా సింగ్ వాడిన భాషే బీజేపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. -
బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : బ్రిటిష్ పాలకులు మరో వందేళ్లు దేశాన్ని పాలించాల్సిందని బీఎస్పీ యూపీ చీఫ్ ధరంవీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని మరో వందేళ్లు పాలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఎదిగేవారని అన్నారు. బీఆర్ అంబేడ్కర్‌ను బ్రిటిషర్లు చదువుకునేందుకు అనుమతించకపోతే దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించగలిగే వారు కాదని వ్యాఖ్యనించారు. బ్రిటిష్ పరిపాలనలో ఆయనకు చదువుకునే అవకాశం దక్కిందని, వారు లేకుంటే దేశంలో ఏ పాఠశాలలోనూ బాబాసాహెబ్‌కు అడ్మిషన్ లభించేది కాదని అన్నారు. ధరంవీర్ వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన నేతలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. బ్రిటిషర్ల పాలనకు గాను మనం రుణం చెల్లించాలని ధరంవీర్ భావిస్తే ఆయన బ్రిటన్‌లో శరణార్ధిగా ఉండాలని కొందరు నేతలు సూచించారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో బిఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ ఏడున జరిగే రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లను టార్గెట్ చేసిన బీఎస్పీ వారిని ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. -
తలపై చర్మాన్ని ఒలిచారు
శివ్‌పురి (మధ్యప్రదేశ్): తలపాగా(టర్బన్) ధరించాడని ఎస్సీ వర్గానికి చెందిన ఓ బీఎస్పీ నేతపై గుజ్జర్ యువకులు దాడి చేసి తల చర్మాన్ని ఒలిచారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో చోటు చేసుకుంది. శివ్‌పురిలోని మొహోబా గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ జాదవ్ (45) స్థానిక బీఎస్పీ నేతగా ఉన్నారు. ఈ నెల 3న సర్దార్ సింగ్‌ను ఓ విషయంపై మాట్లాడాలని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిందితుల్లో ఒకరైన సురేంద్ర గుజ్జర్ ఇంటికి పిలిచారు. దీంతో అక్కడకు చేరుకున్న సర్దార్ సింగ్‌ను నిందితులు ఒక్కసారిగా దూషించటం ప్రారంభించారు. అనంతరం నిందితులు సర్దార్‌పై కత్తితో దాడి చేసి అతని తలపై చర్మాన్ని ఒలిచేశారు. సర్దార్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నర్వార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ బదం సింగ్ యాదవ్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సర్దార్‌ను గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా, టర్బన్ ధరించిన కారణంగానే జాదవ్‌పై గుజ్జర్ యువకులు దాడికి పాల్పడ్డారని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దయాశంకర్ గౌతమ్ ఆరోపించారు. జాదవ్ రోజూ నీలం రంగు తలపాగా ధరిస్తాడని, దీనిపై నిందితులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారని వెల్లడించారు. -
బీఎస్పీ నేత హత్య.. భగ్గుమన్న అల్లర్లు!
అలహాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడిని కాల్చిచంపడం ఉత్తరప్రదేశ్‌లోని తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఎస్పీ నేత రాజేశ్ యాదవ్‌ను అలహాబాద్ యూనివర్సిటీ ఎదురుగానే సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనతో భగ్గుమన్న బీఎస్పీ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి హింసకు దిగారు. తమ నేత హత్యకు కారకులను వెంటనే అరెస్టుచేయాలంటూ రెండు బస్సులకు నిప్పుపెట్టారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిపై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి దాటకుండా అలహాబాద్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సోమవారం అర్ధరాత్రి సమయంలో రాజేశ్ యాదవ్ కొంతమందిని కలిసేందుకు యూనివర్సిటీ సమీపంలోని తారాచంద్ హాస్టల్‌కు వెళ్లారు. డాక్టర్ ముకుల్ సింగ్‌తో కలిసి అక్కడికి వెళ్లిన రాజేశ్ కొందరితో గొడవపడ్డాడు. దీంతో దుండగులు ఆయనపై దాడి చేశారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి ముకుల్ సింగ్ తెలిపారు. రాజేశ్ యాదవ్ హత్యతో అలహాబాద్‌లో బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. -
ప్రధానిపై పోస్టింగ్..బీఎస్పీ నేత అరెస్ట్
అలీగఢ్(ఉత్తరప్రదేశ్): షోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఫేస్బుక్లో అభ్యంతరకర చిత్రాన్ని పోస్ట్ చేసిన నేరానికి బీఎస్పీ నేతను, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే అలీగఢ్ జిల్లా జలాలి పట్టణానికి చెందిన శంకర్ లాల్ పిప్పల్ బీఎస్పీ జిల్లా ఛీప్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 4వ తేదీన శంకర్‌లాల్ తన ఫేస్బుక్ ఖాతాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేశాడు. దీనిని అదే పట్టణానికి చెందిన అతని స్నేహితుడు జావెద్ అలం షేర్ చేశాడు. దీనిపై జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర పాల్ సింగ్, అలీగఢ్ మేయర్ శకుంతల భారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిద్దరిపై కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. -
మాయావతి పార్టీకి మరో తలనొప్పి
లక్నో: మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 4 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో బీఎస్పీ యూపీ అధ్యక్షుడు రామ్ ఆచల్ రాజ్‌భర్‌పై ఉత్తరప్రదేశ్ విజిలెన్స్ విభాగం చార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆయనపై కేసు నమోదు చేసే అవకాశముందని తెలిపాయి. 2007-2012లో తన ఆదాయం రూ. 34 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్న రాజ్‌భర్ ఎన్నికల్లో రూ. 4 కోట్లు ఖర్చు చేశారు. ఈ సమయంలో యూపీలో బీఎస్పీ అధికారంలో ఉంది. ఆయనపై 2012లో రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు మొదలైంది. తనపై విచారణను అడ్డుకునేందుకు అంబుడ్స్‌మన్ ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. తర్వాత వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం దర్యాప్తు గురించి పట్టించుకోకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. -
పొలిటీషియన్ హోటల్లో ఆరు జంటల అరెస్టు
ఘజియాబాద్: బీఎస్పీ నాయకుడికి చెందిన హోటల్లో అభ్యంతరకర పొజిషన్లలో ఉన్న ఆరు యువ జంటలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువ జంటలకు గంటల చొప్పున గడపడానికి రూంలను హోటల్ రాయల్‌ప్యాలెస్ ఇస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. దీంతో మహిళా పోలీసులు, యాంటీ రోమియో స్క్వాడ్లు సంయుక్తంగా హోటల్‌పై రైడింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. రైడింగ్‌లో ఆరు యువ జంటలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. హోటల్ బీఎస్పీ లీడర్ కమల్ జాదవ్‌కు చెందినదిగా వివరించారు. జంటలను విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వెల్లడించారు. -
బీజేపీలోకి స్వామిప్రసాద్ మౌర్య..!?
లక్నోః ఇటీవల పార్టీకి రాజీనామాచేసిన బహుజన సమాజ్ వాద్ పార్టీ మాజీ నాయకుడు, పడ్రౌనా ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలోని తన మద్దతుదారులు సహా కొంతమంది మాజీ పార్టీ నాయకులతోపాటు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బహుజన సమాజ్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ స్వామిప్రసాద్ మౌర్య.. జూన్ 22న మాయావతి పార్టీకి రాజీనామా చేశారు. మాయావతి పార్టీ టికెట్లను వేలం వేస్తున్నారని, దళితులను మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష నేత అయిన స్వామి ప్రసాద్ మౌర్య.. 2017 ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైనవని, పార్టీ విజయంకోసం మంచి అభ్యర్థులను ఎంపిక చేయకుండా.. డబ్బు ఎక్కువగా ఇచ్చినవారికి మాయావతి పార్టీ టికెట్లు వేలం వేస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతం మౌర్య.. తన మద్దతుదారులతోపాటు ఢిల్లీవెళ్ళి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అదే విషయాన్ని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు కూడా సమర్థించినట్లు తెలుస్తోంది. శివ్ పూర్ ఎమ్మెల్యే ఉడియాలాల్ సహా కొందరు మాజీ బీఎస్పీ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మౌర్య బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పయనమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజీపే ఫుల్పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్యను స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేసిన బీజేపీకి.. స్వామి ప్రసాద్ చేరికతో ఉత్తర ప్రదేశ్ లో అన్నివిధాలుగా కలసివచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. -
మాయావతికి మరో షాక్!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి వరుస ఎదురుదెబ్బలు తగులున్నాయి. ప్రతిపక్ష నేత, బీఎస్పీ సీనియర్ నాయకుడు, పార్టీ శాసనసభాపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి గుడ్ బై చెప్పి 10 రోజులు కూడా గడవకముందే మరో సీనియర్ నాయకుడు పార్టీకి దూరమయ్యారు. మాజీ మంత్రి ఆర్కే చౌదరి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రసాద్ మౌర్య కూడా మాయావతిపై సరిగ్గా ఇలాంటి ఆరోపణలే చేశారు. 'మాయావతి స్వయంగా టికెట్లను వేలం వేస్తున్నారు. ఆమె సొంత నిర్ణయం ప్రకారమే ఇప్పటినుంచి టికెట్ల కేటాయింపు జరుగుతోంది. ఆమె సరైన అభ్యర్థులను ఎంచుకోవడం లేదు' అంటూ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండడం పట్ల బీఎస్పీలో కలవరం రేపుతోంది. -
ఆశీర్వాదం కోసం వచ్చి.. కాల్చేశారు
వారణాసి: ఉత్తర ప్రదేశ్ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ బిహారీ చౌబీను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఆశీర్వాదం కావాలంటూ శుక్రవారం శ్రీకాంత్‌పూర్లోని రామ్ బిహారీ ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అయిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రామ్ బిహారీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సుశీల్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్థానిక రాజకీయాల్లో కీలకంగా ఉండే ఆయన.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేయడానికి టికెట్ ఆశిస్తున్న వారిలో ముందున్నారు. అలాగే మాఫియా డాన్ బ్రజేష్ సింగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. రామ్ బిహారీ హత్యపై బంధువులు, పార్టీ అనుచరులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో గత నెలలో బీజేపీ కార్పొరేటర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
బీఎస్పీ నేత ధర్మేంద్ర చౌదరి దారుణ హత్య
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ధర్మేంద్ర చౌదరి దారుణ హత్యకు గురైయ్యారు. ఈ సభలో పాల్గొనేందుకు తన కారులో వెళుతున్న ఆయనను ఇద్దరు దుండగులు ఆపి తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. బన్నాదేవి ప్రాంతంలోని ఓల్డ్ నగర్ నిగమ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ద్రువీకరించారని పోలీసులు తెలిపారు. 2017లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అట్రౌలీ నుంచి పోటీ చేసేందుకు ధర్మేంద్ర టికెట్ సాధించారు.