
అంబాలా: హర్యానాలోని అంబాలాలో దారుణం చోటుచేసుకుంది. అంబాలా పరిధిలోగల నారాయణ్‌గఢ్ నుండి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన హర్‌విలాస్ రజ్జుమాజరాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
హర్‌విలాస్ రజ్జుమాజరా కారుపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో హర్‌విలాస్ మృతిచెందగా, అతని ముగ్గురు సహచరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చండీగఢ్ పీజీఐకి తరలించారు. దాడికి పాల్పడినవారిని ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
बहुजन समाज पार्टी हरियाणा के प्रदेश सचिव और नारायणगढ़ से पूर्व प्रत्याशी हरबिलास रज्जूमाजरा जी की गोली मारकर हत्या कर दी गई है। उनके तीन साथी गंभीर रुप से घायल हैं।
मुख्यमंत्री @NayabSainiBJP, @cmohry, @police_haryana जल्द से जल्द कार्यवाही करें और आरोपीयों को गिरफ्तार करें। pic.twitter.com/e2bFu9NV4t— BSP4Haryana (@bspforharyana) January 24, 2025
కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో కాల్పుల శబ్దం వినబడటంతోపాటు, కొంతమంది పారిపోతున్న దృశ్యం కనిపిస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి 7:20 గంటల సమయంలో హర్‌విలాస్‌తో పాటు అతని సహచరులు కారులో ప్రయాణిస్తుండగా, కొంతమంది దుండగులు వారిపై కాల్పులు జరిపారు. దీనిని గమనించిన స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ దాడిని బహుజన్ సమాజ్ పార్టీ హర్యానా చీఫ్ ధరంపాల్ టిగ్రా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, కాల్పుల ఘటనలు సాధారణమైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో
Comments
Please login to add a commentAdd a comment