Ambala
-
రైతుల ఢిల్లీ చలో వాయిదా..
farmers Protest Live Updates...👉ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చ్‌పై రైతులు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చర్చలు విఫలమైతే డిసెంబర్ 8న మార్చ్ చేస్తామని రైతులు తెలిపారు. ఢిల్లీ చలో నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉదద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. #WATCH | At the Shambhu border, farmer leader Sarwan Singh Pandher says, "Now 'Jattha' of 101 farmers will march towards Delhi on December 8 at 12 noon. Tomorrow's day has been kept for talks with the central government. They have said that they are ready for talks, so we will… pic.twitter.com/3llMjDGvsd— ANI (@ANI) December 6, 2024👉రైతుల సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టియర్ ప్రయోగించడంతో ఆరుగురు రైతు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. కాసేపు మేమేంతా సమావేశం కాబోతున్నాం. భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తామన్నారు. #WATCH | At the Shambhu border, Farmer leader Sarwan Singh Pandher says, "They (police) will not let us go (to Delhi). Farmer leaders have got injured, we will hold a meeting to decide the future strategy..." https://t.co/jpM65N22Po pic.twitter.com/rOnk0VXgcQ— ANI (@ANI) December 6, 2024 👉హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లోని శంభు వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో, టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. దీంతో, వారికి ఆసుపతత్రికి తరలించారు. #WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/CMon3JDg3I— ANI (@ANI) December 6, 2024 👉దేశంలో రైతులు మరోసారి పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ శంభు సరిహద్దుకు చేరుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేడ్లతో రైతులను భద్రతా బలగాలు అడ్డుకున్నారు. మరోవైపు.. రైతులు నిరసనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.#WATCH | Drone visuals from the Shambhu border where the farmers protesting over various demands have been stopped from entering Delhi. pic.twitter.com/0aBiJTI7sS— ANI (@ANI) December 6, 2024ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.#WATCH | At the Shambhu border, a police official says, "They (farmers) don't have permission to enter Haryana. The Ambala administration has imposed Section 163 of the BNSS..." https://t.co/zVSRcePdgO pic.twitter.com/NwkVbliejp— ANI (@ANI) December 6, 2024రైతు నాయకుడు, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ మాట్లాడుతూ.. రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు తేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.#WATCH | Farmers protesting over various demands have been stopped at the Shambhu border from heading towards Delhi. pic.twitter.com/Pm3HxgR2ie— ANI (@ANI) December 6, 2024 -
రైతులపైకి టియర్ గ్యాస్
శంభు: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ సంఘ్ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు. సిమెంట్ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు టియర్ గ్యాస్ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్ గ్యాస్‌తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్ సింగ్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు. -
వరద ఉధృతికి బస్సు బోల్తా.. చావు అంచుల దాకా..
Floods Video viral: ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. కనీసం మోకాళ్ల లోతులో నీట మునిగిన ప్రాంతాల దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కళ్ల ముందే.. కొండ చరియలు విరిగిపడడం, వాహనాలు.. ఇళ్లు.. పెద్ద పెద్ద భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ క్రమంలో హర్యానా వద్ద జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్ వార్తల్లోకి ఎక్కింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు.. అంబాలా-యమునానగర్ రోడ్డు వద్ద హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆ ఉధృతికి బోల్తా పడింది. దీంతో ప్రయాణికులంతా బోల్తా పడిన బస్సు భాగంపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూశారు. వరద క్రమక్రమంగా పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈలోపు అధికారులు ఓ భారీ క్రేన్ తీసుకొచ్చి.. దాని సాయంతో వాళ్లను కాపాడగలిగారు. మొత్తం 27 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. #Watch | Bus Overturns In Flooded #Haryana's Ambala, 27 Rescued Using Crane pic.twitter.com/raEM2U494T — NDTV (@ndtv) July 10, 2023 అంబాలా నగర్లో వరద నీటిలో ఓ మొసలి సంచరిస్తున్న వీడియో సైతం నెట్లో కనిపిస్తోంది. ఇది అక్కడిదేనా అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ये वीडियो आपके लिए चेतावनी हो सकती है 😳😱 पानी के साथ मगर सोसाइटी में घुस गया (📍-ambala nagar, haryana)#Haryana #HaryanaNews #ambala #Heavyrainfall #RainAlert #Monsoon2023 #MonsoonDisaster #chandigarhRains #Shocking #ViralVideo #BreakingVideos pic.twitter.com/zlUdbPqgGi — BreakingVideos (@TheViralHub27) July 10, 2023 మరోవైపు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి దృశ్యం ఒకటి కనిపించగా.. ప్రాణాల కోసం బస్సుపైనుంచి ప్రయాణికులు కొందరు కిందకు దూకేశారు. Watch | Bus Tries To Cross River In Uttarakhand, Starts Tilting, Passengers Jump Out pic.twitter.com/anspZg5PiX — NDTV (@ndtv) July 9, 2023 -
Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు!
అంబాలా/చండీగఢ్: ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు. భారత్ జోడో యాత్రలో సోమవారం హరియాణాలోని అంబాలాలో ఆయన మాట్లాడారు. ‘‘మహాభారతం హరియాణాతో ముడిపడి ఉంది. కౌరవులెవరు? మొదట 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెప్పబోతున్నా. వారు చేతిలో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని బిలియనీర్లు ఆ కౌరవుల ఎదుట సాగిలపడుతున్నారు. పాండవులెప్పుడైనా పెద్ద నోట్లను రద్దు చేశారా? తప్పుడు జీఎస్టీ అమలు చేశారా?’’ అని ప్రశ్నించారు. పాండవులు తపస్వులు గనుక ఎన్నడూ అలా చేయలేదన్నారు. పరస్పరం జైశ్రీరామ్ అంటూ పలుకరించుకోవాలని ప్రజలకు సూచించారు. రాహుల్ ‘పూజారి’ వ్యాఖ్యలపై విమర్శలు న్యూఢిల్లీ:తపస్వులకే తప్ప పూజారులకు భారత్‌లో స్థానం లేదన్న వ్యాఖ్యలతో రాహుల్ తమను చులకన చేశారంటూ ఆలయ పూజారులు మండిపడ్డారు. ప్రయాగ్‌రాజ్ సహా పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. -
ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదిన యువకుడు.. వీడియో వైరల్..
చండీగఢ్: హర్యానా అంబాల జిల్లాలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తన కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతని చొక్కా చింపాడు. అక్టోబర్ 13న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీస్ ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ యువకుడ్ని భటిండాకు చెందిన లావిష్ బత్రాగా గుర్తించారు పోలీసులు. గాయపడ్డ ట్రాఫిక్ పోలీస్.. ఎక్సెంప్టీ సబ్ ఇన్స్పెక్టర్(ఈఎస్ఐ) అశోక్ కుమార్ అని తెలిపారు. A man in Ambala was seen beating up a cop who stopped him for overspeeding. The accused allegedly hit two motorcycles & then tried to flee. He assaulted the victim, ESI Ashok Kumar who also claimed that his uniform tore in the brawl.#ambala #manbeatscop #ashokkumar #lavishbatra pic.twitter.com/FH6n0o6pjS — Mirror Now (@MirrorNow) October 18, 2022 ఘటనకు ముందు రాజ్‌పుర్-అంబాలా రోడ్డులో అశోక్ కుమార్ తనిఖీలు నిర్వహిస్తున్నాడు. రెండు బైక్‌లను ఆపి పత్రాలు పరిశీలిస్తున్నాడు. ఈ సమయంలో ఓ ఎస్యూవీ వేగంగా రావడం చూసి ఆపాడు. అయితే దాన్ని డ్రైవ్ చేస్తున్న యువకుడు వాహనాన్ని నియంత్రించలేక ముందున్న రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీంతో వారు కిందపడి గాయాలపాలయ్యారు. వెంటనే కారులోనుంచి దిగిన యువకుడు ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదడమే గాక అతని దుస్తులు చింపాడు. స్థానికులు అక్కడికి గుంపులుగా రావడంతో భయపడి పారిపోయాడు. ఎస్‌యూవీని రోడ్డుపైనే వదిలిపెట్టాడు. ఈ దృశ్యాలను అక్కడున్నవారు మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అతడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..! -
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
భారత్‌కు రానున్న మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు
కొచ్చి: భారత వాయుసేనకు సేవలందించేందుకుగాను ఫ్రాన్స్ నుంచి కొత్తగా మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు బుధవారం రోజు రానున్నాయి. ఈ యుద్ధవిమానాలు రాత్రి 7 గంటలకు గుజరాత్లో ల్యాండ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవి అంబాలాలోని గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ శిబిరంలో చేరనున్నాయి. రఫెల్ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్‌కు రానున్నాయి. యూఏఈ మధ్యలో గాల్లోనే మిడ్-ఎయిర్ రీ ఫ్యూలింగ్ చేసుకుంటాయి. వీటి చేరికతో స్క్వాడ్రన్‌లోని యుద్ధ విమానాల సంఖ్య 14 కు చేరనుంది. కాగా, తొమ్మిది రాఫెల్ ఫైటర్ జెట్ల తదుపరి బ్యాచ్ ఏప్రిల్‌లో రానుంది. వీటిలో ఐదింటిని పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా ఎయిర్‌బేస్‌లో చేర్చుతారు.ఏప్రిల్ చివరి నాటికి ఐదు అదనపు రాఫెల్ జెట్లను భారత్‌కు వస్తాయని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగళవారం పేర్కొన్నారు. కొచ్చిలో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహామ్మారి ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో యుద్ధ విమానాలను సరఫరా చేశామని తెలిపారు. రాఫెల్ ఫైటర్ జెట్ రెండు ఎమ్88-3 సఫ్రాన్ ఇంజన్లను కలిగి ఉంది. ఈ ఇంజన్లు సుమారు 73 కిలో న్యూటన్ల థ్రస్ట్‌ను ఇవ్వగలవు. అంతేకాకుండా స్మార్ట్ ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. ఈ యుద్ధ విమానం గత ఏడాది జూలై, ఆగస్టులలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాయి. అతి తక్కువ సమయంలో వైమానిక దళం వీటి ఆపరేషన్‌కు అనుమతులు లభించాయి.తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాలలో, పెట్రోలింగ్ కోసం మోహరించారు. 2016 సెప్టెంబరులో ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాలను భారత్ ఆర్డర్‌చేసిన విషయం తెలిసిందే. Total in 2022, the 36 aircraft will have been delivered as per contract: French Envoy to India Emmanuel Lenain https://t.co/yS2sKtxBDQ — ANI (@ANI) March 30, 2021 చదవండి: ‘గోల్డెన్ గర్ల్’ శివాంగి సింగ్ -
‘రియల్ హీరో’పై హత్యాయత్నం కేసు!
చండీగఢ్/ఢిల్లీ: ‘‘నా చదువు పూర్తైన తర్వాత మా నాన్నతో కలిసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. ఆయన రైతు నాయకుడు. రైతుల కోసం పోరాడతారు. నేను గానీ, మా నాన్న గానీ ఇంతవరకు ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. కానీ ఆ రోజు రైతులను గాయపరిచే విధంగా పోలీసులు భాష్పగోళాలు ప్రయోగించడంతో తట్టుకోలేకే వాహనం పైకి ఎక్కి కొళాయి కట్టేశాను. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవడం ఎంత మాత్రం సరైంది కాదు. అంతేతప్ప వేరే ఉద్దేశం లేదు’’ అంటూ అంబాలాకు చెందిన యువ రైతు నవదీప్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు ‘చలో ఢిల్లీ’ పేరిట కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలకు దిగారు. భాష్ప వాయుగోళాలు ప్రయోగిస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో నవదీప్ పోలీసుల వాహనం పైకి.. కొళాయి కట్టేసి కిందకు దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. రైతుల పక్షాన నిలబడ్డ అతడిని ‘రియల్ హీరో’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. (చదవండి: రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి) హత్యాయత్నం కేసు నమోదు తాజా సమాచారం ప్రకారం.. పోలీసులు నవదీప్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటుగా తమ విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన నవదీప్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా గళం కేంద్రానికి వినిపించేలా శాంతియుత పద్ధతిలో నిరసన చేపట్టాం. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు లేదా. కుళాయి కట్టేసినందుకు నాపై కేసు నమోదు చేశారు’’ అని వాపోయాడు. -
చరిత్ర సృష్టించిన శివాంగి సింగ్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి అడుగుపెట్టనున్న మహిళా పైలట్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అంబాలా కేంద్రంగా పనిచేసే ‘గోల్డెన్ యారోస్’ 17 స్క్వాడ్రన్‌లోకి ఎంపికైన తొలి మహిళగా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా శివాంగికి అభినందనలు తెలుపుతూ.. ‘‘దేశమంతా నిన్ను చూసి గర్విస్తోంది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా వారణాసికి చెందిన శివాంగి 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. రాజస్తాన్ బార్డర్ బేస్‌లో అభినందన్ వర్ధమాన్‌తో కలిసి ఫైటర్ జెట్లు నడిపిన శివాంగి త్వరలోనే రఫేల్ స్క్వాడ్రన్‌లో చేరేందుకు అంబాలాలో అడుగుపెట్టనున్నారు. (చదవండి: నావికా నాయికలు) ఇక వారణాసిలో ప్రాథమిక విద్యనభ్యసించిన శివాంగికి చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరిన అనంతరం తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్ క్యాడెట్ కార్స్ప్ 7 యూపీ ఎయిర్ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. కాగా భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రఫేల్ ఫైటర్ జెట్లు తూర్పు లద్ధాక్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఇక ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. -
రఫేల్‌కు మహిళా పైలట్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు. మిగ్–21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి ఒకరు తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ పైలట్ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు. అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్ యుద్ధ విమానాలకు మహిళా పైలట్ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె మిగ్–21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875. కాగా, రఫేల్ ఫైటర్ జెట్లు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ఈ నెల 10వ తేదీన అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా 1951లో అంబాలా వైమానిక స్థావరంలో ఏర్పాటయిన ఈ స్క్వాడ్రన్ పేరిట పలు రికార్డులు నమోదై ఉన్నాయి. 1955లో మొట్టమొదటి ఫైటర్ జెట్ డి హవిల్లాండ్ వాంపైర్ ఈ స్క్వాడ్రన్లోనే చేరింది. ఫ్రాన్సుతో కుదుర్చుకున్న రూ.59వేల కోట్ల ఒప్పందంలో భాగంగా జూలైలో మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ కల్లా రెండో విడతలో మరో నాలుగు, 2021 చివరి నాటికి మొత్తం 36 విమానాలు చేరనున్నాయి. రష్యా నుంచి సుఖోయ్ జెట్లను కొనుగోలు చేసిన 23 ఏళ్ల తర్వాత భారత్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న భారీ ఒప్పందమిది. -
అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు
అంబాలా: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశ వాయుసేన మరింత బలోపేతమైంది. భారత్ అమ్ములపొదిలోకి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఐదు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్‌కి అప్పగించారు. దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్‌కు రాజ్‌నాథ్ అందించారు. రఫేల్ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్ కెనాన్లతో సెల్యూట్ చేశారు. ఆ తర్వాత జరిగిన వైమానిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొత్త పక్షులకు స్వాగతం అని భారత వైమానిక దళం ట్వీట్ చేసింది. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో నాలుగేళ్ల క్రితమే భారత్ ఒప్పందం చేసుకుంది. గత జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి. సార్వభౌమాధికారంపై కన్నేస్తే ఊరుకోం: రాజ్‌నాథ్ రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టాక రాజ్‌నాథ్ మాట్లాడారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని నేరుగానే ప్రస్తావించారు. మన దేశ సార్వభౌమాధికారంపై కన్ను వేసే వారందరికీ ఈ యుద్ధ విమానాల ద్వారా అతి పెద్ద , గట్టి సందేశాన్ని ఇస్తున్నామన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామని ఇదివరకే స్పష్టం చేశానని చెప్పారు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధ విమానాలు మన అమ్ములపొదిలోకి చేరడం అత్యంత కీలకంగా మారింది. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనమూ సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రధాని మోదీ దేశ భద్రతకే పెద్ద పీట వేస్తారని చెప్పడానికి గర్విస్తున్నాను’అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రపంచంలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యుత్తమమైనవని, వాటిని కొనుగోలు చేయడం గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తున్నప్పటికీ తాము శాంతిని కాంక్షిస్తామని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ బంధాల్లో కొత్త అధ్యాయం రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి చేరికతో భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కావడానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గోల్డెన్ ఏరోస్‌కే ఎందుకు ? మొదటి బ్యాచ్‌లో వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్ ఏరోస్‌కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్ 1న లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎల్ స్ప్రింగెట్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల నుంచి గత ఏడాది బాలాకోట్ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్ 2బీ, హాకర్ హంటర్, మిగ్ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్ ఏరోస్ దళం నడిపింది. గత ఏడాది సెప్టెంబర్ 10న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. -
అంబాల : ఎయిర్‌ఫోర్స్‌లోకి రఫెల్ యుద్ధ విమానాలు
-
వెల్కమ్ రఫెల్
-
అంబాలా ఎయిర్‌బేస్‌కు రఫేల్ యుద్ధ విమానాలు
-
పక్షుల్లా వచ్చేశాయ్
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నిప్పులు చిమ్ముకుంటూ పిడుగులు కురిపించేందుకు శత్రువుల్ని గాలిదుమారంలా చుట్టేయడానికి మన దేశ వాయుసేనకు మరింత సత్తా చేకూర్చేలా జాతి యావత్తూ ఎదురుచూపులు ఫలించేలా ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ యుద్ధ విమానాలు రెక్కలు కట్టుకొని మరీ పక్షుల్లా వాలిపోయాయి. అంబాలా: రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. రఫేల్ విమానాలు భారత్ గగనతలంలోకి ప్రవేశించగానే రెండు సుఖోయ్–30 యుద్ధ విమానాలు వాటికి ఎదురేగి వెంట వచ్చాయి. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియాతో పాటుగా భారత వైమానికి దళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు అంబాలా ఎయిర్‌బేస్‌లో స్వాగతం పలికారు. సంప్రదాయ బద్ధమైన వాటర్ కెనాన్లతో విమానాలకు సెల్యూట్ కార్యక్రమం నిర్వహించారు. శత్రువుల వెన్నులో వణుకు: రాజ్‌నాథ్ రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్లు చేశారు. పక్షులు సురక్షితంగా దిగాయంటూ ట్వీట్ చేశారు. చైనాకు హెచ్చరికలు పంపారు. మన ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించాలనుకునే వారికి రఫేల్ రాకతో వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. భారత్ భూభాగంలోకి రఫేల్ యుద్ధవిమానాలు దిగడం మన దేశ సైనిక చరిత్రలో నవ శకానికి నాందిగా అభివర్ణించారు. యుద్ధ విమానాల్లో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని రాజ్‌నాథ్ తన ట్వీట్లో వివరించారు. రఫేల్ యుద్ధ విమానాల రాక దేశానికే గర్వకారణమని హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్ తయారు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, రఫేల్ యుద్ధ విమానాల రావడంపై భారత వాయుసేనకి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఒక్కో యుద్ధ విమానంపై రూ.526 కోట్లకు బదులుగా రూ.1670 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సంస్కృతంలో ప్రధాని ట్వీట్ యుద్ధ విమానాలకు స్వాగతం చెప్తూ ప్రధాని మోదీ సంస్కృతంలో ట్వీట్ చేశారు. ‘జాతి రక్షణకు మించిన ధర్మం లేదు. దేశ భద్రతకు మించిన అత్యుత్తమ యజ్ఞం లేదు’ అని అన్నారు. కీర్తి ప్రతిష్టలతో సమున్నతంగా ఆకాశాన్ని తాకాలని ఆకాక్షించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆగమించిన ‘బాహుబలి’
రణరంగంలో శత్రువుతో హోరాహోరీ తలపడే వేళ మన వైమానిక దళానికి సమర్థవంతంగా తోడ్పడగలదని భావిస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం మన గడ్డపై వాలాయి. అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించినప్పుడు రూ. 59,000 కోట్లు వ్యయం కాగల 36 రఫేల్ యుద్ధ విమానాలు అందించడానికి ఆ ప్రభుత్వంతో అవగాహన కుదిరింది. అనంతరం 2016 సెప్టెంబర్‌లో ఒప్పందంపై సంతకాలయ్యాయి. అధినేతలమధ్య అవగాహన కుది రినప్పుడు రెండేళ్లలో... అంటే 2017లో ఈ యుద్ధ విమానాలను మన దేశానికి అందిస్తామని ఫ్రాన్స్ హామీ ఇచ్చింది. అయితే ఒప్పందం ఖరారులో జరిగిన జాప్యం వల్ల మరో మూడేళ్ల సమయం తీసుకుని తొలి విడతగా అయిదు విమానాలను మనకు అందజేశారు. ఈ యుద్ధ విమానాలు హరి యాణాలోని అంబాలా వైమానిక దళ స్థావరానికి చేరుకుంటున్న తరుణంలో బుధవారం దేశం హర్షాతిరేకాలతో హోరెత్తింది. దాదాపు అన్ని వార్తా చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో రఫేల్ యుద్ధ విమానాలదే హడావుడంతా. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనాతో మనకున్న వివాదం నేపథ్యం ఇందుకు కారణం కావొచ్చు. ఈ విమానాలను ఎల్ఏసీకి సమీపాన వున్న లదాఖ్‌కు తరలించ బోతున్నట్టు చెబుతున్నారు. రక్షణ బలగాలకు సమర్థవంతంగా సేవలందించగల మెరికల్లాంటి యుద్ధ విమానాల కోసం మన దేశం జరుపుతున్న అన్వేషణ ఈనాటిది కాదు. చుట్టూ చైనా కుంపట్లు రాజేస్తున్నదని, పాకిస్తాన్ ఎప్పటిమాదిరే కయ్యానికి కాలుదువ్వుతున్నదని... ఈ పరిణామాలన్నీ మన రక్షణ సంసిద్ధత పెరగ వలసిన అవసరాన్ని సూచిస్తున్నాయని వైమానిక దళం 2000 సంవత్సరం నుంచే చెబుతూ వస్తోంది. చివరకు 4.5 జనరేషన్ బహుళ విధ యుద్ధ విమానాలు అత్యవసరమని 2004లో తుది నిర్ణయాని కొచ్చారు. ఒకప్పుడు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో రక్షణ దళాలకు విజయాలు సాధించిపెట్టిన మిగ్–21 బైసన్, జాగ్వార్ విమానాల వయసు మీరిందని, అవి తరచు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నా యని వైమానిక దళం తెలిపింది. ఉన్నపాటుగా యుద్ధం వస్తే రణరంగంలోకి ఉరకడానికి అనువైన సాధనా సంపత్తి మన దగ్గరలేదన్న సంగతిని గుర్తు చేసింది. అయితే అదేం ప్రారబ్ధమోగానీ ఒకసారి యుద్ధ విమానాలో, మరొకటో కొనాలని నిర్ణయం జరిగాక టెండర్లు పిలవడం మొదలుకొని ఎంపిక చేయడం వరకూ అన్నీ నత్తనడక నడుస్తాయి. ఎంపిక పూర్తయ్యాక వరస ఆరోపణలు వెల్లువెత్తు తాయి. వేరే రకం ఇంతకన్నా మెరుగైనవే అయినా నాసిరకంతో సరిపెడుతున్నారని, ముడుపులు చేతులు మారడమే ఇందుకు కారణమని కథనాలు వస్తాయి. రఫేల్ యుద్ధ విమానాల ఎంపిక సమయంలోనూ అలాంటి సమస్యలు తప్పలేదు. దీన్ని ఎంపిక చేయడానికి ముందు అమెరికా తయారీ ఎఫ్/ఏ–18, ఎఫ్–16, రష్యా మిగ్–35, స్వీడన్ తయారీ గ్రిపెన్ తదితర విమానాల సామర్థ్యాన్ని పరీక్షించారు. మన అవసరాలకు అనుగుణంగా లేవన్న కారణంతో తిరస్కరించారు. చివరకు రఫేల్ తోపాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల కన్షార్షియం ఉత్పత్తి చేసే టైఫూన్లు మిగిలాయి. ఈ రెండింటిలో రఫేల్ అన్నివిధాలా మెరుగైనదని తేల్చారు. ఇంతలోనే బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, సౌదీ అరేబియా వంటి దేశాలు తిరస్కరించిన రఫేల్ ఎలా నచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదంతా 2012నాటి మాట. అప్పట్లో ఈ విమానాలను డసాల్ట్ కంపెనీ ఉత్పత్తి చేసేది. మన దేశానికి ఒప్పందం కుదిరింది కూడా దానితోనే. కానీ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ విషయంలో పేచీ పెట్ట డంతో అది కాస్తా మూలనబడింది. రూ. 54,000 కోట్ల వ్యయం కాగల ఆ ఒప్పందం ప్రకారం డసాల్ట్ సంస్థ 126 రఫేల్ యుద్ధ విమానాలను సమకూర్చాలి. మూడేళ్లలో 18 విమానాలు అందజేయడంతో పాటు మిగిలిన 108 యుద్ధ విమానాలనూ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తానని చెప్పింది. ఏమైతేనేం పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం ఖరారయింది. మొత్తానికి మన బలగాలు కోరుకుంటున్న రఫేల్ విమానాలు ముంగిట్లోకి వచ్చాయి. అయితే వీటిని ఖరారు చేసేనాటికి చైనాతో మనకు ఈ స్థాయి వివాదం లేదు. మన చుట్టూ వున్న దేశాల్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న వైనంపై మన రక్షణ రంగ నిపుణులకు అవగాహన వున్నా, ప్రధానంగా పాకిస్తాన్‌ను దృష్టిలో వుంచుకునే 36 యుద్ధ విమానాలు సరిపోతాయని అంచనా వేశారు. కానీ మారిన పరిస్థితుల్లో పాక్‌తో వున్న అధీన రేఖ(ఎల్ఓసీ)తోపాటు చైనాను ఢీకొనడానికి ఎల్ఏసీ వద్ద కూడా మోహరించడం తప్పనిసరన్నది నిపుణుల భావన. మన వైమానిక దళానికి మంజూరైన స్క్వాడ్రన్లు 42 కాగా వాటిని 50కి పెంచాలన్న డిమాండు వుంది. కానీ మనకున్నవి ప్రస్తుతం 30 మాత్రమే. ఒక్కో స్వాడ్రన్ పరిధిలో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అంటే 2022 నాటికి రాఫెల్ యుద్ధ విమానాలన్నీ మన దగ్గరకొస్తే రెండు స్క్వాడ్రన్లు సంసిద్ధంగా వున్నట్టవుతుంది. ప్రభుత్వం చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటే తప్ప మంజూరైన 42 స్క్వాడ్రన్ లకూ అవసరమైన యుద్ధ విమానాలు సమకూరవు. ఇప్పటికే సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29 యుద్ధ విమానాలు 33 కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. అలాగే హెచ్ఏఎల్ రూపొందించిన తేజస్ మార్క్1 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్ మార్క్2 యుద్ధ విమానాలు, అధునాతన మధ్యశ్రేణి యుద్ధ విమానాలు(ఏఎంఏసీ) వరసగా అందబోతున్నాయి. ఇవన్నీ పూర్తిగా అందేలోగానే ఇప్పటికేవున్న సుఖోయ్–30, మిరేజ్–2000, మిగ్–29లను ఆధునీకరించడం అత్యవసరం. యుద్ధం అవసరం లేని, ఘర్షణలకు తావులేని ప్రపంచం కోసం కృషి చేయడం ముఖ్యమే. అయితే మనం బలమైన స్థితిలో వుంటేనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. ఆ కోణంలో రఫేల్ రాకను స్వాగతించాలి. -
హ్యాపీ ల్యాండింగ్ : రఫేల్ జెట్స్ వచ్చేశాయ్!
-
హ్యాపీ ల్యాండింగ్ : రఫేల్ జెట్స్ వచ్చేశాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం(ఐఏఎఫ్) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి మరికాసేపట్లో చేరుకుంటాయి. భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం తొలి బ్యాచ్‌లో భాగంగా ఐదు రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోగానే భారత నౌకా యుద్ధవిమానం నుంచి భారీ స్వాగతం లభించింది. ‘హిందూ మహా సముద్రానికి స్వాగతం మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు..హ్యాపీ ల్యాండింగ్స్’ అంటూ ఐఎన్ఎస్ కోల్‌కతా రఫేల్ జెట్స్‌కు రేడియో సందేశం పంపింది. ఇందుకు రఫేల్ పైలట్ ధన్యవాదాలు తెలిపారు. రఫేల్ యుద్ధవిమానాలు అంబాలకు చేరగానే వాటిని వైమానిక దళంలో చేర్చే కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. ఇక చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి మరికొద్దిసేపట్లో చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. చదవండి : రా.. రా.. రఫేల్! -
రా.. రా.. రఫేల్!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్సు నుంచి బయలుదేరాయి. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇవి చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి ఈనెల 29వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. ఈ విమానం ప్రత్యేకతలు.. శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ జెట్లకు ఉంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించగలిగే మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతోపాటు ఈ జెట్లలో భారత్ కోరిన విధంగా..ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లో–బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లున్నాయి. మొత్తం భారత్‌కు వచ్చే 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు(ఒకటే సీటుండేది) కాగా, 6 శిక్షణ విమానాలు రెండు సీట్లుండేవి. ఈ తేడా తప్పితే రెండింటి సామర్థ్యం ఒక్కటే. ఒక స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్‌లో. మరో స్క్వాడ్రన్‌ను బెంగాల్‌లోని హసిమారా బేస్‌లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ రూ.400 కోట్లు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేల్‌లను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావ సూచకంగా వైద్య పరికరాలు, నిపుణులతో కూడిన విమానాన్ని కూడా ఫ్రాన్సు పంపిస్తోందని ఫ్రాన్సులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
భారత్‌కు బయల్దేరిన రఫేల్ విమానాలు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలు జూలై 29న భారత్ చేరనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరినట్లు ఫ్రాన్స్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఎల్లుండి భారత్‌లోని అంబాలా వైమానికి స్థావరానికి చేరనున్నాయి. భారత దేశానికి బయలుదేరే ముందు యూఏఈలోని ఎయిర్‌బేస్‌లో ఫ్రాన్స్ వైమానికి దళానికి చెందిన ట్యాంకర్ విమానం ద్వారా ఇంధనం నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. #WATCH Rafale jets taking off from France to join the Indian Air Force fleet in Ambala in Haryana on July 29th. (Video source: Embassy of India in France) pic.twitter.com/UVRd3OL7gZ — ANI (@ANI) July 27, 2020 ఇక భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచనుంది. -
మాకు కరోనా సోకుతుంది.. శవాన్ని తీసుకురావొద్దు
చండీగఢ్ : కరోనా సోకిందేమో అన్న అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళ అంత్యక్రియలు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో వారిపై లాఠీచార్జ్ ప్రయోగించారు. పంజాబ్‌లోని అంబాల కంటోన్మెంట్ సమీపంలోని చంద్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఓ మహిళ శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ సోమవారం కన్నుమూసింది. దహనసంస్కారాల నిమిత్తం బందువులు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుండగా, అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. కరోనా సోకి చనిపోయివుండొచ్చనే అనుమానంతో అడ్డుతగిలారు. దీంతో మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ పరీక్షల కోసం నమూనా సేకరించినట్టు ఆసుపత్రి వర్గాలు సైతం చెప్పాయని పేర్కొన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు వినకపోవడంతో పరిస్థితిని అదుపుచేసేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎట్టకేలకు మృతురాలి దహన సంస్కారాలు జరిపించామని అంబాలా పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ జోర్వాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. -
అమ్మాయిలను టీజ్ చేశాడు.. దాంతో చితక్కొట్టేశారు
చంఢీఘర్: నిర్భయ వంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. వారిపై భౌతిక, లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అంబాలా పట్టణంలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అంబాలాలో ముగ్గురు మైనర్ బాలికలను వేధించిన ఓ ఈవ్‌టీజర్‌ను మహిళలు పట్టుకొని బట్టలు విప్పించి దేహశుద్ధి చేశారు. ముగ్గురు బాలికలు పాఠశాలకు వెళుతుండగా పవన్ అలియాస్ సోను అనే ఆకతాయి వారిని వెంటాడి లైంగికంగా వేధించాడు. బాలికలను వేధించిన ఘటన గురించి తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు ఆకతాయిని పట్టుకొని బట్టలు విప్పించి బహిరంగంగా రోడ్డుపై కొట్టారు. తరువాత అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడు పవన్‌ను అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సెక్షన్56, 12, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. చదవండి: దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్ రేప్ -
‘మోదీ అహంకారమే ఓటమికి కారణం’
చంఢీగడ్: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీని దుర్యోధనుడితో పోల్చారు. దుర్యోధనుడిలా మోదీ దురహంకారి అని, ఆయన అహంకారమే ఈ ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుందని ధ్వజమెత్తారు. హర్యానాలోని అంబాలాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి బీజేపీ నేతలు ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదన్నారు. కేవలం అమరవీరుల పేరుతోనో, లేక మా కుటుంబంపై విమర్శలు, ఆరోపణలతోనో బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల బాధలు వినే ఓపిక మోదీకి లేదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌పై అనవసర ఆరోపణలు చేసి ఓట్లు కోరుతున్నారని అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఒక కుటుంబానికి చెందిన ఎన్నికలు కావని, మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన ఎన్నికలని ప్రియాంక అభిప్రాయపడ్డారు. కాగా మే 4న యూఈలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్‌గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించారు’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఆఫీస్ నుంచి తిరిగి వెళ్తుండగా..
చండీగడ్ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై యాసిడ్దాడి జరిగింది. ఈ ఘటన అంబాలాలోని సెక్టార్ 7లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. లేబర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న కవిత (31) ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ విసిరారు. ఈ దాడిలో కవిత ముఖం, కుడి కన్ను, ఉదర భాగంపై తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితురాలికి 60 శాతం కాలిన గాయాలయ్యాయనీ, ఆమె పరిస్థితి విషమంగా ఉందని సివిల్ ఆస్పత్రి డాక్టర్ సంజయ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను చంఢీగడ్‌లోని జీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. దృశ్యాలున్నాయి.. కానీ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కానీ కెమెరా క్వాలిటీ సరిగా లేనందున దృశ్యాలు అస్పష్టంగా నమోదయ్యాయనీ వెల్లడించారు. నిందితులిద్దరూ హెల్మెట్ ధరించారనీ, బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి మహిళపై యాసిడ్ విసిరాడని తెలిపారు. దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. దాడి జరిగిన సమయంలో కవిత భర్త లడఖ్‌లో ఉన్నారు. ఆయన డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు
అంబాలా: నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న కేసులో ఐదుగురు ముఠా సభ్యులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.15 లక్షల విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేవ్, ఢిల్లీ ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను ఢిల్లీకి చెందిన షాహిద్ హసన్, అతని కుమారుడు షాహబుద్దీన్, అంబాలా పట్టణానికి చెందిన మహేష్ కుమార్, పంజోక్రా వాసి నేయిబ్ సింగ్, బర్వాలకు చెందిన కన్వర్పాల్ అని గుర్తించారు. అంబాలా పట్టణానికి దగ్గర్లోని మోడాఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఈ నవంబర్ 24న నకిలీ వంద రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. కన్వర్ పాల్ నుంచి నోట్లను తీసుకున్నట్లు మోడాఖేడా గ్రామవాసి చెప్పగా, అనంతరం కన్వర్ పాల్‌ను విచారించగా మహేష్ కుమార్ నుంచి నోట్లను పొందినట్లు పోలీసులకు తెలిపాడు. నేపాల్ రాజధాని కఠ్మాండుకు చెందిన ఓ వ్యక్తి నుంచి నకిలీ నోట్లను తీసుకొచ్చి గత కొన్నేళ్లుగా వాటిని చలామనీ చేస్తున్నట్లు ప్రధాన నిందితుడు షాహిద్ హసన్ తెలిపాడు. అసలు నోట్లు లక్ష రూపాయలవి తీసుకుని నకిలీ కరెన్సీ లక్షల రూపాయలు తన ఏజెంట్లకు ఇచ్చేవాడినని పోలీసుల విచారణలో వెల్లడించాడు.