రైతుల ఢిల్లీ చలో వాయిదా.. | Farmers Delhi March Over MSP Demand Protest Live Updates | Sakshi
Sakshi News home page

రైతుల ఢిల్లీ చలో వాయిదా..

Published Fri, Dec 6 2024 2:30 PM | Last Updated on Fri, Dec 6 2024 5:21 PM

Farmers Delhi March Over MSP Demand Protest Live Updates

farmers Protest Live Updates...

👉ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చ్‌పై రైతులు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చర్చలు విఫలమైతే డిసెంబర్‌ 8న మార్చ్‌ చేస్తామని రైతులు తెలిపారు. ఢిల్లీ చలో నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉదద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పలువురు రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. 


👉రైతుల సంఘాల నాయకుడు సర్వన్‌ సింగ్‌ పందేర్‌ మాట్లాడుతూ.. మమ్మల్ని ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టియర్‌ ప్రయోగించడంతో ఆరుగురు రైతు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. కాసేపు మేమేంతా సమావేశం కాబోతున్నాం. భవిష్యత్‌ ప్రణాళికపై చర్చిస్తామన్నారు. 


 

👉హర్యానా-పంజాబ్‌ సరిహద్దుల్లోని శంభు వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో, టియర్‌ గ్యాస్‌ కారణంగా పలువురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. దీంతో, వారికి ఆసుపతత్రికి తరలించారు. 
 

 

👉దేశంలో రైతులు మరోసారి పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్‌-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

👉రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ శంభు సరిహద్దుకు చేరుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేడ్లతో రైతులను భద్రతా బలగాలు అడ్డుకున్నారు. మరోవైపు.. రైతులు నిరసనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. గ్రేటర్‌ నోయిడాలోని పరి చౌక్‌ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్‌ నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.

రైతు నాయకుడు, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కేఎంఎం) సమన్వయకర్త శర్వణ్‌ సింగ్‌ పాంథేర్‌ మాట్లాడుతూ.. రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు తేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement