Farmer's Protest 2024 Latest Updates
టియర్ గ్యాస్ షెల్ తగిలి యువరైతు మృతి
- ఖానౌరీ సరిహద్దులో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ వదలటం షెల్ తగిలి 24 ఏళ్ల యువరైతు మృతి.
- శుభ్ కరణ్ సింగ్ అనే యువ రైతును ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల ధృవీకరణ
24-year-old farmer Subh Karan dies in police firing at Khanauri border.
— Sunil rahar (@Sunilrahar10) February 21, 2024
@htTweets @HTPunjab @ramanmann1974 @RakeshTikaitBKU @priyankagandhi @deependerdeswal pic.twitter.com/5yWKCtOVZ0
కేంద్రం వాదనను తప్పుపట్టిన పంజాబ్ ప్రభుత్వం
- రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది
- సరిహద్దుల్లో రైతులు చేరడానికి పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న కేంద్రం వాదనను పంజాబ్ ప్రభుత్వం తప్పు పట్టింది
- హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిటం వల్ల 160 మంది రైతులు గాయపడ్డారు
- పంజాబ్ ప్రభుత్వం బాధ్యతతో శాంతిభద్రతలను నిర్వహిస్తోంది
ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
- శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత
- రైతులను అడ్డుకుంటున్న పోలీసులు
- టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు
- డ్రోన్లతో రైతులపైకి టియర్ గ్యాస్ వదులుతున్న పోలీసులు
- కొందరు రైతులకు స్వల్ప గాయాలు
రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం
- ఛలో ఢిల్లీ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులను చర్చలకు పిలిచిన వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా
- ట్విట్టర్‌లో పోస్టు పెట్టిన అర్జున్ ముండా
- అయినా స్పందించని రైతులు
- శంభూ బార్డర్‌లో రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు
#WATCH | Union Agriculture Minister Arjun Munda says, "...In the 5th round of meeting, we are ready to talk with farmers and discuss issues like MSP, stubble, FIR, and crop diversification. I appeal to them to maintain peace and we should find a solution through dialogue." pic.twitter.com/F17XwZs3Ur
— ANI (@ANI) February 21, 2024
హర్యానా పోలీసులే టియర్ గ్యాస్ ప్రయోగించారు: పంజాబ్ డీజీపీ
- హర్యానా పోలీసులే కావాలని రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
- మొత్తం 14 టియర్ గ్యాస్ గుళ్లను ఇందుకు వాడారు.
- రైతుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే సంఘటనలు లేకపోయినా హర్యానా పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
- దీనిపై మేం మా నిరసనను హర్యానా పోలీసులకు తెలియజేశాం
శంభూ సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్.. ఉద్రిక్తత
- చర్చలకు రావాలన్న కేంద్రం పిలుపును రైతులు పట్టించుకోలేదు
- పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ వైపునకు రైతులు కదిలారు.
- వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను పేల్చారు.
- దీంతో అక్కడ రైతులంతా చెల్లా చెదురయ్యారు.
- రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
ఢిల్లీ ఛలో.. పునఃప్రారంభం
- ఢిల్లీ ఛలో యాత్రను రైతులు ప్రారంభించారు
- ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు సరిహద్దులో మానవహారంగా పోలీసులు మోహరించి ఉన్నారు
- ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది
ఢిల్లీ, సాక్షి: రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేంద్రం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్లపాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే.. అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని పట్టుబట్టాయి రైతు సంఘాలు. దీంతో చర్చలు విఫలమై.. మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ - హర్యానా సరిహద్దు వద్ద రైతులను నిలువరిస్తున్నారు పోలీసులు. ఒకవైపు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో, ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదే సమయంలో.. తొలి రోజు నాటి అనుభవాల దృష్ట్యా రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలను చేధించేందుకు జేసీబీలు, వాటిని నడిపేవాళ్లపై టియర్ గ్యాస్ ప్రభావం పడకుండా ప్రత్యేక ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో రైతులూ సిద్ధమయ్యారు.
శంభు సరిహద్దు వద్ద 1,200 ట్రాక్టర్లు, 14 వేల మంది మోహరించినట్లు కేంద్రం హోం శాఖ నివేదిక రూపొందించింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.
ఎన్డీయే ఎంపీల ఘెరావ్
ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎమ్) పిలుపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్‌కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: మళ్లీ ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా?
Comments
Please login to add a commentAdd a comment