Chalo Delhi
-
రైతులపైకి టియర్‌గ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు ప్రాంతం మళ్లీ రణరంగంగా మారింది. పంటలకు మద్దతు ధరతో సహా పలు డిమాండ్లతో రైతు సంఘాలకు చెందిన 101 మంది రైతులు మధ్యాహ్నం మరోసారి శాంతియుతంగా చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడం గత పది రోజుల్లో ఇది మూడోసారి. రైతులను అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అంబాలా డిప్యూటీ కమిషనర్ రైతులతో సుమారు 40 నిమిషాలసేపు చర్చలు జరిపారు. రైతుల ఆందోళనలకు సంబంధించి 18న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు సంయమనం పాటించాలని కోరారు. అయినా రైతులు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో 17 మంది రైతులు గాయాలపాలైనట్లు సమాచారం. రైతులు తమ సొంత వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శంభు చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈనెల 17 వరకు మొబైల్, ఇంటర్నెట్‌సేవలు నిలిపివేసింది. హరియాణాకు చెందిన రెజ్లర్, కాంగ్రెస్ నేత భజరంగ్ పునియా శంభు సరిహద్దు చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. డల్లేవాల్ ఆరోగ్యం విషమం ఖన్నౌరీలో 19 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా మారిందని రైతు నేతలు చెబుతున్నారు. ఆయనకు చికిత్స అందించాలని కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. కానీ చికిత్స తీసుకునేందుకు డల్లేవాల్ నిరాకరిస్తున్నారు. ‘రైతుల కోసం దీక్ష చేస్తున్నా. వారి నడుమే చివరి శ్వాస తీసుకుంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఆయన బెడ్‌ను శుక్రవారం ఆందోళన వేదిక వద్దకే మార్చారు.16న ట్రాక్టర్ ర్యాలీ రైతులపై పోలీసుల బలప్రయోగాన్ని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పంథేర్ తీవ్రంగా ఖండించారు. ‘’మార్చ్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లే 101 మంది రైతుల కారణంగా శాంతి భద్రతలకు భంగమెలా కలుగుతుంది? పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చిస్తున్నారు. రైతుల ఆందోళనలను అణచివేయాలని ఏ రాజ్యాంగం చెప్పింది?’’ అని మీడియాతో ఆయన అన్నారు. పార్లమెంట్లో రైతుల సమస్యలపై చర్చనే జరగలేదని ఆక్షేపించారు. ‘‘మా కార్యాచరణలో భాగంగా సోమవారం పంజాబ్ మినహా మిగతా చోట్ల ట్రాక్టర్ మార్చ్ ఉంటుంది. 18న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా పంజాబ్‌లో రైల్ రోకో చేపడతాం’’ అని ప్రకటించారు. -
రైతులపై టియర్ గ్యాస్.. ఢిల్లీ చలో వాయిదా
ఢిల్లీ : కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఆదివారం వాయిదా పడింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి వందలాది మంది రైతులు పాదయాత్రగా ఢిల్లీ చలో కార్యక్రమాన్నిపున:ప్రారంభించారు. అయితే రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో కార్యక్రమంపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు శంభు సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. పాదయాత్రగా తరలివస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాదయాత్ర సాగకుండా ఇనుపు కంచెలు ఏర్పాటు చేయడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆదివారం చేస్తున్న ఢిల్లీ చలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ పాదయాత్రపై సోమవారం తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు సరిహద్దు నుంచి ముందుకెళుతున్న రైతులపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారురైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారుటియర్ గ్యాస్ ప్రయోగంతో రైతులు చెల్లాచెదురయ్యారు.తమకు చెప్పిన 101 మంది ఇతరులు ర్యాలో పాల్గొన్నారంటున్న పోలీసులు అందుకే అడ్డుకున్నామని సమర్థింపు #WATCH | Farmers' 'Dilli Chalo' march | Visulas from the Shambhu border where Police use tear gas to disperse farmers"We will first identify them (farmers) and then we can allow them to go ahead. We have a list of the names of 101 farmers, and they are not those people - they… pic.twitter.com/qpZM8LK1vw— ANI (@ANI) December 8, 2024 పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు కొనసాగిస్తున్నారు.డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ ఆదివారం(డిసెంబర్8) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.#WATCH | Farmers begin their "Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border, protesting over various demands. pic.twitter.com/9EHUU2Xt1j— ANI (@ANI) December 8, 2024 ‘ఢిల్లీ చలో’ నేపథ్యంలో దేశ రాజధాని శంభు సరిహద్దు వద్ద ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొందిరైతుల ర్యాలీని అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను సిద్ధంగా ఉంచారు.#WATCH | Morning visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. A 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon according to farmer leader Sarwan Singh Pandher pic.twitter.com/NG9VfXL6cg— ANI (@ANI) December 8, 2024సరిహద్దు వద్ద కవరేజీకి మీడియాకు అనుమతి నిరాకరించిన పోలీసులుఇది పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేసి కుట్ర అని ఆరోపించిన రైతులుగత ఆందోళనల్లో మీడియా ప్రతినిధులు గాయపడ్డారంటున్న పోలీసులు#WATCH | SSP Patiala, Nanak Singh says, "Media has not been stopped. We have no such intentions. But, it was needed to brief the media. Last time we came to know that 3-4 media people were injured. To avoid that we briefed the media... We will try not to let this happen - but if… https://t.co/bStxTaLs8x pic.twitter.com/iacEB95jHQ— ANI (@ANI) December 8, 2024 నిజానికి శుక్రవారం నుంచే చలో ఢిల్లీ మలి విడత మొదలైంది.రైతుల ర్యాలీపై హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడ్డారు.. వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారు:రైతు నేతలుపలువురు రైతులు గాయపడడంతో శనివారం ర్యాలీని నిలిపివేశాం.తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు.మాతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే చలో ఢిల్లీని ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. -
ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్.. యువరైతు మృతి
ఢిల్లీ:పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హర్యానా పోలీసులు రైతులపై ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్లింగ్‌లో యువరైతు మృతి చెందారు. హర్యానా కనౌరీ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 24-year-old farmer Subh Karan dies in police firing at Khanauri border. @htTweets @HTPunjab @ramanmann1974 @RakeshTikaitBKU @priyankagandhi @deependerdeswal pic.twitter.com/5yWKCtOVZ0 — Sunil rahar (@Sunilrahar10) February 21, 2024 పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి 24 ఏళ్ల శుభ్‌కరణ్ సింగ్ కన్నుముశాడు. తీవ్రంగా గాయపడిన శుభ్ కరణ్ సింగ్‌ను స్థానిక ఆస్ప్రతికి తరలించాగా.. అప్పటికే అతను మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సరిహద్దుల్లో 160 మంది రైతులు గాయపడ్డారని పంజాబ్ పోలిసులు తెలిపారు. రైతులు బుధవారం మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం చేశారు. శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు. డ్రోన్లతో రైతులపైకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో కొందరు రైతులకు స్వల్ప గాయపడ్డారు. ఈ క్రమంలోనే యువ రైతు శుభ్‌కరణ్ సింగ్‌కు హర్యానా పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి మృతి చెందాడు. -
ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
Farmer's Protest 2024 Latest Updates టియర్ గ్యాస్ షెల్ తగిలి యువరైతు మృతి ఖానౌరీ సరిహద్దులో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ వదలటం షెల్ తగిలి 24 ఏళ్ల యువరైతు మృతి. శుభ్ కరణ్ సింగ్ అనే యువ రైతును ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల ధృవీకరణ 24-year-old farmer Subh Karan dies in police firing at Khanauri border. @htTweets @HTPunjab @ramanmann1974 @RakeshTikaitBKU @priyankagandhi @deependerdeswal pic.twitter.com/5yWKCtOVZ0 — Sunil rahar (@Sunilrahar10) February 21, 2024 కేంద్రం వాదనను తప్పుపట్టిన పంజాబ్ ప్రభుత్వం రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది సరిహద్దుల్లో రైతులు చేరడానికి పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న కేంద్రం వాదనను పంజాబ్ ప్రభుత్వం తప్పు పట్టింది హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిటం వల్ల 160 మంది రైతులు గాయపడ్డారు పంజాబ్ ప్రభుత్వం బాధ్యతతో శాంతిభద్రతలను నిర్వహిస్తోంది ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్ శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత రైతులను అడ్డుకుంటున్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు డ్రోన్లతో రైతులపైకి టియర్ గ్యాస్ వదులుతున్న పోలీసులు కొందరు రైతులకు స్వల్ప గాయాలు రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం ఛలో ఢిల్లీ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులను చర్చలకు పిలిచిన వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ట్విట్టర్లో పోస్టు పెట్టిన అర్జున్ ముండా అయినా స్పందించని రైతులు శంభూ బార్డర్లో రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు #WATCH | Union Agriculture Minister Arjun Munda says, "...In the 5th round of meeting, we are ready to talk with farmers and discuss issues like MSP, stubble, FIR, and crop diversification. I appeal to them to maintain peace and we should find a solution through dialogue." pic.twitter.com/F17XwZs3Ur — ANI (@ANI) February 21, 2024 హర్యానా పోలీసులే టియర్ గ్యాస్ ప్రయోగించారు: పంజాబ్ డీజీపీ హర్యానా పోలీసులే కావాలని రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. మొత్తం 14 టియర్ గ్యాస్ గుళ్లను ఇందుకు వాడారు. రైతుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే సంఘటనలు లేకపోయినా హర్యానా పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనిపై మేం మా నిరసనను హర్యానా పోలీసులకు తెలియజేశాం శంభూ సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్.. ఉద్రిక్తత చర్చలకు రావాలన్న కేంద్రం పిలుపును రైతులు పట్టించుకోలేదు పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ వైపునకు రైతులు కదిలారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను పేల్చారు. దీంతో అక్కడ రైతులంతా చెల్లా చెదురయ్యారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ ఛలో.. పునఃప్రారంభం ఢిల్లీ ఛలో యాత్రను రైతులు ప్రారంభించారు ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు సరిహద్దులో మానవహారంగా పోలీసులు మోహరించి ఉన్నారు ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది ఢిల్లీ, సాక్షి: రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్లపాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే.. అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని పట్టుబట్టాయి రైతు సంఘాలు. దీంతో చర్చలు విఫలమై.. మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ - హర్యానా సరిహద్దు వద్ద రైతులను నిలువరిస్తున్నారు పోలీసులు. ఒకవైపు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో, ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదే సమయంలో.. తొలి రోజు నాటి అనుభవాల దృష్ట్యా రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలను చేధించేందుకు జేసీబీలు, వాటిని నడిపేవాళ్లపై టియర్ గ్యాస్ ప్రభావం పడకుండా ప్రత్యేక ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో రైతులూ సిద్ధమయ్యారు. శంభు సరిహద్దు వద్ద 1,200 ట్రాక్టర్లు, 14 వేల మంది మోహరించినట్లు కేంద్రం హోం శాఖ నివేదిక రూపొందించింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్డీయే ఎంపీల ఘెరావ్ ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పిలుపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: మళ్లీ ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా? -
Farmers movement, Delhi Chalo: రెండో రోజూ ఉద్రిక్తత
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజు బుధవారం సైతం కొనసాగాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పంజాబ్–హరియాణా శంభు సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఇక్కడికి చేరుకున్న వేలాది మంది రైతులు రాత్రంతా ట్రాక్టర్లపైనే ఉండిపోయారు. బుధవారం ఉదయం రక్షణ వలయాన్ని ఛేదించుకొని, ఢిల్లీవైపు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు ఆగ్రహావేశాలతో రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టడానికి డ్రోన్లతో బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. శంభు బోర్డర్లో రోజంతా యుద్ధ వాతావరణం కనిపించింది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకొని తమ గళం వినిపించడం తథ్యమని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రైతులు తేలి్చచెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత జగజీత్ సింగ్ దలీవాల్ చెప్పారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లోనూ బుధవారం ఉద్రిక్తత కొనసాగింది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డ్రోన్లను కూల్చడానికి పతంగులు శంభు బోర్డర్ వద్ద పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు వినూత్న ప్రయత్నం చేశారు. పతంగులు ఎగురవేశారు. పతంగుల దారాలతో డ్రోన్లను బంధించి, కూల్చివేయాలన్నదే వారి ఆలోచన. డ్రోన్లతో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్లు ప్రయోగించడం పట్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. తమ రాష్ట్ర భూభాగంలోకి డ్రోన్లను పంపొద్దని స్పష్టం చేశారు. తమ ఆందోళన కొనసాగిస్తామని, గురువారం పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. నేడు మూడో దశ చర్చలు! రైతుల డిమాండ్ల విషయంలో రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం చెప్పారు. చర్చలకు సానుకూల వాతావరణం కలి్పంచాలని, నిరసన కార్యక్రమాలు విరమించాలని రైతులకు సూచించారు. అసాంఘీక శక్తుల వలలో చిక్కుకోవద్దని చెప్పారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు గురువారం మధ్యాహ్నం చండీగఢ్‌లో జరుగనున్నట్లు తెలిసింది. -
సరిహద్దులో రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతోపాటు ఇతర డిమాండ్ల సాధనకు దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లపై ర్యాలీగా బయలుదేరిన వేలాది మంది రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పంజాబ్, హరియాణా శంభు సరిహద్దులో పోలీసులపై నిరసనకారుల రాళ్ల దాడులు, బారికేడ్ల విధ్వంసం, రైతన్నలపై బాష్పవాయువు ప్రయోగం వంటి ఘటనలు చోటుచేసుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువుతోపాటు జల ఫిరంగులు ప్రయోగించారు. దాదాపు 100 మంది రైతులు గాయపడ్డారని రైతు సంఘాల నాయకులు చెప్పారు. శంభు బోర్డర్ వద్ద రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. మరోవైపు ఢిల్లీ శివార్లలోని సింఘు, చిల్లా, తిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాలన్న రైతు సంఘాల ప్రణాళిక అమలు కాలేదు. ‘చలో ఢిల్లీ’ని మంగళవారం రాత్రికి నిలిపివేస్తున్నామని, బుధవారం ఉదయం కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఎలాగైనా ఢిల్లీకి చేరుకొని, తమ గళం వినిపించడం ఖాయమన్నారు. శంభు సరిహద్దులో యుద్ధ వాతావరణం శంభు సరిహద్దు వద్ద ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రైతులను ముందుకు వెళ్లనివ్వలేదు. చలో ఢిల్లీకి అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వంతెనపై బారికేడ్లను నదిలోకి తోసేశారు. సిమెంట్ బారికేడ్లను ట్రాక్టర్లతో తొలగించేందుకు ప్రయతి్నంచారు. పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో పోలీసులు జల ఫిరంగులు, డ్రోన్లతో బాష్పవాయు గోళాలు ప్రయోగించి రైతులను చెదరగొట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. చర్చలు అసంపూర్ణం రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం రాత్రి జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ర్యాలీని విరమించాలని మంత్రులు కోరగా నేతలు అంగీకరించలేదు. డిమాండ్లు నెరవేరే దాకా ఉద్యమం కొనసాగిస్తామని తే ల్చిచెప్పారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని మంత్రులు చెప్పారు. మిగతా డిమాండ్ల పరిష్కారానికి కమిటీ వేస్తామని ప్రతిపాదించగా నేతలు ఒప్పుకోలేదు. 2020–21 ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసుల ఉపసంహరణకు, మరణించిన వారి కటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు అప్పట్లోనే కేంద్రం ముందుకొచ్చింది. అవిప్పటికీ నెరవేరలేదని నేతలు ఆక్షేపించారు. పంటలు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని వారు మరోసారి తేల్చిచెప్పారు. తక్షణం చర్చలు ప్రారంభించాలి రైతులతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని, డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ చెప్పారు. ఉద్యమంపై కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదకరంగా మారవచ్చన్నారు. ఈ నెల 16న బంద్ పిలుపు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందన్నారు. తామెప్పుడూ రైతుల పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. ‘‘డిమాండ్లు నెరవేరాలంటే రైతన్నలు ప్రతిసారీ ఉద్యమబాట పట్టాల్సిందేనా? ఢిల్లీకి వెళ్లాల్సిందేనా? ప్రభుత్వానికి బాధ్యత లేదా?’’ అని ప్రశ్నించారు. -
ఢిల్లీ ఛలో’ యాత్ర: కేంద్రానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: రైతుల ‘ఢిల్లీ ఛలో’ యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. సింగు బోర్డర్ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో నిరనసన కారులు చెల్లాచెదురయ్యారు. శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీంతో రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సమస్యగా సృష్టిస్తే ఊరుకోమని అన్నారు. పలు రైతుల సంఘాలు భిన్నమైన సమస్యలపై పోరాటం చేస్తాయని తెలిపారు. కానీ, నేడు(మంగళవారం) చేపట్టిన రైతుల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌ను సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోమని మండిపడ్డారు. తాము రైతులకు దూరంగా లేమని.. నిరసన తెలిపే రైతులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గుర్తుచేశారు. #WATCH | On farmers' 'Delhi Chalo' march, farmer leader Naresh Tikait says "Protests are underway in the entire country...The government should sit with us and hold discussions and give respect to the farmers. Government should think about this issue and try to solve this..." pic.twitter.com/2itfTQ6AlR — ANI (@ANI) February 13, 2024 అదేవిధంగా రాకేశ్ టికాయత్ సోదరుడు నరేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై చర్చ జరపాలని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపి అంతేవిధంగా రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇక.. రైతుల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’ నిర్వహించాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) దేశంలోని అతిపెద్ద రైతు సమాఖ్యలలో ఒకటి. నేడు ప్రారంభమైన ‘ఢిల్లీ ఛలో’ రైతుల ఆందోళనలో అది చేరితే.. కేంద్రం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు నిరసనకారుల్లో చర్చజరుగుతోంది. చదవండి: Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్ -
Dilli Chalo 2.0: ఢిల్లీ సరిహద్దులో యుద్ధవాతావరణం
అష్ట దిగ్బంధనంలో దేశ రాజధాని ఢిల్లీ సింగు బోర్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరనసన కారులు శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు #WATCH | Protesting farmers vandalise flyover safety barriers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/vPJZrFE0T0 — ANI (@ANI) February 13, 2024 పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడిక్కడ రహదారులను మూసివేసిన పోలీసులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహిద్దుల్లో పటిష్ట భద్రత కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతుల డిమాండ్ #WATCH | Protesting farmers throw police barricade down from the flyover at Shambhu on the Punjab-Haryana border as they march towards Delhi to press for their demands. pic.twitter.com/oI0ouWwlCj — ANI (@ANI) February 13, 2024 ఢిల్లీ వ్యాప్తంగా నెలరోజులపాటు 144 సెక్షన్ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న భద్రతా బలగాలు అంబాల హైవేపైకి భారీగా రైతులు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం రైతుల చలో ఢిల్లీ రహదారులను మూసివేసిన పోలీసులు పలుచోట్ల అతినెమ్మదిగా కదులుతున్న వాహనాలు ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. పంజాబ్,హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత సరిహద్దుల వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు రైతుల టియర్ గ్యాస్ ప్రయోగం ఢిల్లీ ముట్టడికి రైతుల యత్నం 2020 ఉద్యమం తరహాలో పోరుగు సిద్ధమైన రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదన్న రైతులు ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలతో బయల్దేరిన రైతులు ధీర్ఘకాలిక ఉద్యమాన్ని కొనసాగించాలని రైతులు నిర్ణయం మంత్రులతో చర్చలు విఫలం కావడంతో మొదలైన రైతుల మార్చ్ శాంతియూతంగా ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం సాక్షి, ఢిల్లీ: రైతుల ఢిల్లీ ఛలో యాత్రతో నగర సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది. ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు.. అంబాల హైవే పైకి చేరారు. #WATCH | Police use tear gas drones at the Haryana-Punjab Shambhu border to disperse protesting farmers. pic.twitter.com/LcyGpDuFbv — ANI (@ANI) February 13, 2024 మరోవైపు.. పంజాబ్, హర్యానాల నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తేఉన్నారు. ఇంకోపక్క రైతన్నల ఢిల్లీ ఛలో ప్రభావంతో.. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపు.. తనిఖీలతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహదనదారులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. రైతుల మెగా మార్చ్‌ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్ దిమ్మెలు, కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్‌లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు. #Traffic snarls on the highway from #Gurugram towards #DelhiPolice place concrete slabs on the road as a part of measures to stop farmers from marching to Delhi#DelhiNCR #FarmersProtest pic.twitter.com/oqCel5wEUf — cliQ India (@cliQIndiaMedia) February 13, 2024 అలాగే అత్యవసరాల వస్తువులను సైతం అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్ 48పై కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆందోళనకు తరలివస్తున్న రైతుల్ని పంజాబ్ పోలీసులు అనుమతిస్తుండడం గమనార్హం. #WATCH | Punjab Police allows protesting farmers to cross Rajpura bypass to head towards Haryana's Ambala onward to Delhi for their protest to press for their demands pic.twitter.com/yCMvdNnD8t — ANI (@ANI) February 13, 2024 ఇదిలా ఉంటే.. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. మంగళవారం ఉదయం పంజాబ్, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. #WATCH | Delhi Police personnel and barricades deployed at ITO intersection, section 144 CrPC imposed, in view of farmers' protest march to Delhi demanding a law guaranteeing MSP for crops pic.twitter.com/ZSUhHhFFA7 — ANI (@ANI) February 13, 2024 కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపుభగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Fatehgarh Sahib in Punjab. pic.twitter.com/WE7mXiPu9J — ANI (@ANI) February 13, 2024 #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Shambhu Border. pic.twitter.com/tKEF6iEHkZ — ANI (@ANI) February 13, 2024 సోమవారం నాడు.. యాత్రను విరమించుకోవాలని సూచించిన కేంద్రం.. రైతుసంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా సోమవారం దాదాపు అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్ తదితరులతో సమాలోచనలు జరిపింది. డిమాండ్లు ఏంటంటే.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటరుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం, మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉండిఉంటే.. వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ మార్చ్ యథాతథంగా కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్‌సింగ్ పంధేర్ ప్రకటించారు. మరోవైపు రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆంక్షల వలయంలో హస్తిన రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల పాటు సెక్షన్-144 విధిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనను సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Jharoda border) pic.twitter.com/xcFCYaeoMz — ANI (@ANI) February 13, 2024 -
Delhi Chalo: హస్తినలో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పలు డిమాండ్ల సాధనతో మంగళవారం దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధం అయ్యారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నెల రోజులపాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు. రైతు సంఘాల ‘చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైనా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | Ambala, Haryana: Security heightened at the Shambhu border in view of the march declared by farmers towards Delhi today. pic.twitter.com/AwRAHprtgC — ANI (@ANI) February 13, 2024 రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్‌లు పంపడంపైనా నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతోపాటుఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు మంగళవారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. రోడ్లపై బారికేడ్లు.. కొయ్యముక్కలు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 13వ తేదీన పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారులను ∙అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్యముక్కలు బిగించారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Gazipur Border) pic.twitter.com/XeKWMWi1S9 — ANI (@ANI) February 13, 2024 రైతు సంఘాలతో మంత్రుల చర్చలు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలతో రెండో దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో డిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020–2021 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు -
Farmers movement: రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. సోమవారం చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహా్వనించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సరీ్వసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020–21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లనే ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను నియోగించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా ఘగ్గర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుపïÙట్లను అమర్చారు. ఏదేమైనా కనీసం 20 వేల మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కారు నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోజూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు. -
డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ
కాచిగూడ (హైదరాబాద్): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, అత్యధిక స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంతోనే సరిపోదని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్రప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తేలిందని వెల్లడించారు. బీసీ బిల్లు కోసం బీసీలు సంఘటితంగా పోరాటం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు ఎన్.మారేశ్, బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మహేందర్, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, జయంతి, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, సుధాకర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీం బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు మంగళవారం హస్తిన పయనమయ్యారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారమే ఢిల్లీ వెళ్లగా, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్, సురేశ్ షెట్కార్ తదితరులు బుధవారం బయలుదేరనున్నారు. వీరంతా బుధ లేదా గురువారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఖరారు చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు కనీసం 34 స్థానాలు కేటాయించడమే ఎజెండాగా తెలంగాణ బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ప్రదేశ్ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలని కోరుతూ టీం బీసీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య నేతలను కలిశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్‌షెట్కార్, గాలి అనిల్‌కుమార్, ఎర్రశేఖర్, సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం అందుబాటులో ఉన్న నేతలు నల్లగొండ ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలవనున్నారు. -
బీసీల మహాధర్నాతో హోరెత్తిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్‌మంతర్ హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ‘బీసీల మహాధర్నా’ జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం రూ.లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీ కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుండి 50%కి పెంచాలన్న డిమాండ్లపై పార్లమెంట్లో రోజూ పోరాడుతున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను బీసీ ప్రధానినని చెప్పుకొంటున్నా.. తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఐక్యంగా ముందుకు సాగితే కేంద్రం దిగిరాక తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. ధర్నాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్ యాదవ్ సమన్వయం చేయగా.. ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే (మహారాష్ట్ర), ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే, మాజీ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (పంజాబ్), హన్సరాజ్ (ఢిల్లీ) రాజేష్ షైనీ (హరియాణా), విక్రమ్ సాహా మాట్లాడారు. -
24న చలో ఢిల్లీ.. పార్లమెంట్ ముట్టడి
కాచిగూడ: దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని వేలాదిమందితో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం కాచిగూ డలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లా డారు. చట్ట సభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ రెండేళ్ల కితమే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిందని ఈ బిల్లుకు మద్దతుగా 14 పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. కానీ బీజేపీ మద్దతు ఇవ్వకపోవడంతో బిల్లు పాస్ కాలేదన్నారు. బీసీలంతా తమ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీపై ఆశలు పెట్టుకున్నారని, ఆయన హయాంలో బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. కార్యక్రమంలో నీలం వెంకటేష్, సి.రాజేందర్, అంగిరేకుల వరప్రసాద్, అనంతయ్య, రాజ్‌కుమార్, నిఖిల్, రాజు పాల్గొన్నారు. -
తెలంగాణ మంత్రుల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యం కొనుగో లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముందే ప్రకటించినట్టుగా రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం రాజధానికి పయనమైవెళ్లారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో పాటు బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్, హరియాణా తరహాలో రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో మంత్రులు కేంద్ర మంత్రితో సమావేశం కావాలని భావిస్తున్నారు. కనీస మద్దతు ధరతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరువాత కేంద్రం తన అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకున్నా తమకు అభ్యంతరం లేదనే వాదనను ఈసారి తెరపైకి తెచ్చారు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి భేటీలో కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు.. అంశాల పైనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. బుధవారం గోయల్ ఇచ్చే అపాయింట్మెంట్ను బట్టి ఢిల్లీలో మంత్రులు, ఎంపీల కార్యాచరణ ఉండనుంది. ఇదే విషయాన్ని ఢిల్లీకి బయలుదేరుతూ మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడించారు. గోధుమలు, పత్తి తరహాలోనే.. ‘దేశంలో పండిన గోధుమలు, పత్తిని కనీస మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేస్తోంది తప్ప గోధుమను పిండి చేసి, పత్తిని బేల్ చేసి కొనడం లేదు. మరి వరి ధాన్యం విషయంలో ఈ తేడా ఎందుకు? రైతు పండించిన ధాన్యాన్ని బియ్యంగా సేకరించే ఎఫ్‌సీఐ కేంద్రం చేతుల్లోనే ఉంది. బాయిల్డ్ రైస్‌ను పరిచయం చేసిందే ఈ ఎఫ్‌సీఐ. బాయిల్డ్ రైస్, రా రైస్ అనే దానితో మాకు సంబంధం లేదు. పంజాబ్ తరహాలో రైతులు ఏది పండిస్తే అది కొనాలి..’అని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రధానికి సమస్యను వివరిస్తాం.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే వస్తామని, సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు. దానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోం దని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ గంగుల విమర్శించారు. కేంద్రం తీరుతో రైతాంగం అయోమయంలో ఉందన్నారు. ప్రధానిని కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. బియ్యం తీసుకోకుండా నిందలు.. ‘యాసంగి ధాన్యం కొనుగోలుపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలన్నదే మా డిమాండ్. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్రం సేకరించేందుకు ఒప్పుకుంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అప్పగిస్తాం. గత సీజన్లో వచ్చిన ధాన్యాన్ని బియ్యం పట్టిస్తే ఎఫ్‌సీఐ తీసుకోకుండా మా మీద నిందలు వేస్తున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చిస్తాం..’అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ‘వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి.. లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఏం సంబంధం?’అని ప్రశ్నించారు. -
‘8న పార్లమెంట్ ముట్టడిస్తాం’
ముషీరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేయాలని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సాకు చెందిన ముఖ్య బీసీ నాయకుల సమావేశం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చలో ఢిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే డిసెంబర్ 10న అన్ని ప్రతిపక్ష నాయకులు, బీసీ నాయకులతో అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం జరుపుతామని తెలిపారు. కులగణన జరపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింప చేయా లని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ తదితరులు మాట్లాడారు. -
వ్యవసాయ చట్టాలపై రైతుల పోరు తీవ్రతరం..
-
నేడు రైతు సంఘ నేతల నిరాహారదీక్ష
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘చలో ఢిల్లీ’లో భాగంగా ఢిల్లీ–జైపూర్ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు ఆదివారం మధ్యాహ్నం నుంచి షాజహాన్‌పూర్ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరిస్తున్నారు. జైపూర్ మార్గంలో రాకపోకలకు ఆటంకం రైతు సంఘాల పిలుపు మేరకు ఆల్వార్ జిల్లా షాజహాన్‌పూర్ వద్ద జాతీయ రహదారి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, మేథా పాట్కర్, సీపీఎం నేత ఆమ్రా రామ్ తదితరులు వీరిలో ఉన్నారు. రైతుల నిరసనల కారణంగా జైపూర్–ఢిల్లీ హైవే ట్రాఫిక్‌ను ఆల్వార్ జిల్లా బన్సూర్ తదితర మార్గాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఒన్‌వే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఆందోళనల విచ్ఛిన్నానికి సర్కారు కుట్ర కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు సోమవారం ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష పాటిస్తారని రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చదుని తెలిపారు. దీంతో పాటు సోమ వారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు. చిల్లా వద్ద రైతు ఆందోళనల విరమణపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయంటూ కొన్ని గ్రూపుల నేతలు ఆందోళనలను విరమిస్తున్నారు. రైతుల పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సాగు చట్టాలు మూడింటిని రద్దు చేయాలనే విషయంలో రైతు సంఘాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి’అని ఆయన ప్రకటించారు. ఈ నెల 19వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేప ట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు మరో నేత సందీప్ గిద్దె తెలిపారు. చిల్లా మీదుగా రాకపోకలు మొదలు చిల్లా మీదుగా వెళ్లే నోయిడా– ఢిల్లీ లింక్ రోడ్డులోని రవాణా వాహనాలు వెళ్లే ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేయడంతో ఆ మార్గంలో రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇక్కడ రైతులు ధర్నా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, నోయిడాలకు కలిపే డీఎన్డీ, కాళిందీ కుంజ్ మార్గంలో వాహనాల రాకపోకలు నిరాటంకంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆందోళనల్లో సామాన్య మహిళలు హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెందిన పలువురు సామాన్య గృహిణులు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల్లో చురుగ్గా పాలుపంచు కుంటున్నారు. . ‘వ్యవసాయానికి ఆడామగా తేడా లేదు.చాలా మంది పురుషులు ఇక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. మేమెందుకు ఆందోళనల్లో పాల్గొనకూడదు?’అని లూధియా నాకు చెందిన మన్దీప్ కౌర్అన్నారు. కాగా, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తదుపరి దఫా చర్చల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రి కైలాశ్ చౌధరి తెలిపారు. ఈసారి సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య ఐదు రౌండ్ల చర్చలు జరిగినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. 9వ తేదీన జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయిన విషయం తెలిసిందే. రైతు ఆందోళనలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, సోమ్ ప్రకాశ్ ఆదివారం హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దీక్షలో నేనూ పాల్గొంటున్నా: కేజ్రీవాల్ కేంద్రం అహంకారం వీడి కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 14వ తేదీన రైతు సంఘాల పిలుపు మేరకు తనతో పాటు ఆప్ పార్టీ కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష పాటిస్తారని ఆయన వెల్లడించారు. రైతుల ఆందోళనలను మావో యిస్టులు, వామపక్ష పార్టీలు, జాతి వ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయంటూ కొందరు కేంద్ర మంత్రులు ఆరోపించడంపై ఎన్సీపీ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ డీఐజీ రాజీనామా రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేసినట్లు పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(జైళ్లు) లఖ్మీందర్ సింగ్ జాఖర్ ఆదివారం ప్రకటించారు. తన రాజీనా మా లేఖను శనివారం రాష్ట్ర ప్రభుత్వా నికి పంపినట్లు వెల్లడించారు. రైతు కుటుంబానికి చెందిన తను, రైతులు శాంతియు తంగా సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రహదారుల దిగ్బంధంపై 16న సుప్రీం విచారణ రైతుల నిరసనల కారణంగా వాహ నదారులు ఇబ్బందులు పడుతున్నారనీ, భారీ సంఖ్యలో రైతులు గుమి గూడుతుండటంతో కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 16న సుప్రీంకోర్టు విచారణ చేప ట్టనుంది. ఢిల్లీ సరిహద్దులను తిరిగి తెరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ వచ్చిన పిటిషన్‌ను ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించనుంది. -
ఉద్యమం ఇక ఉధృతం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరోవిడత చర్చలకు ముందు రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉదయం రైతు సంఘాలకు కొన్ని ప్రతిపాదనలను పంపించింది. వ్యవసాయ చట్టాల రద్దు కుదరదని అందులో స్పష్టం చేసింది. ప్రతిగా, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సవరణలకు సిద్ధమని పేర్కొంది. కనీస మద్దతు ధర విధానం కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇస్తామని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదనలను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే తమ ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రం చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. అందుకు ఒక కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో రెండు వారాలుగా వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కొత్తవేం లేవు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన అనంతరం రైతు నేతలు విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రతిపాదనల్లో కొత్తవేం లేవని, గతంలో చర్చల సందర్భంగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవే ప్రతిపాదనలను తమ ముందు ఉంచారని వివరించారు. వాటిని ‘సంయుక్త కిసాన్ కమిటీ’ పూర్తిగా తిరస్కరిస్తోందని రైతు నేత శివ కుమార్ కక్కా తెలిపారు. ఆ ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా రైతులను అవమానించేవిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం నుంచి కొత్తగా ఏవైనా ప్రతిపాదనలు వస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా, డిసెంబర్ 14న ఉత్తరాది రాష్ట్రాల రైతులు ‘ చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడ్తారని, దక్షిణాది రాష్ట్రాల రైతులు స్థానిక జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుపడంతో పాటు, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తారని రైతు నేతలు తెలిపారు. అలాగే, డిసెంబర్ 12న అన్ని టోల్ ప్లాజాల వద్ద ‘టోల్ ఫ్రీ’ కార్యక్రమం చేపడ్తామన్నారు. అదే రోజు ఢిల్లీ –జైపూర్ హైవే, ఢిల్లీ–ఆగ్రా హైవేలను దిగ్బంధిస్తామన్నారు. పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీలకు చెందిన సంస్థలకు సంబంధించిన సేవలు, ఉత్పత్తులను బహిష్కరించాలని, టెలీకాం సేవలను జియో నుంచి వేరే సంస్థలకు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులను ఘొరావ్ చేయాలని, నాయకుల ఇళ్లు, కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు జరపాలని విజ్ఞప్తి చేశారు. మీడియాలో వస్తున్నట్లు రైతు సంఘాల నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కక్కా స్పష్టం చేశారు. రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు రైతు ఆందోళన అంశంపై బుధవారం ప్రతిపక్ష పార్టీల నాయకుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వారు రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, డీఎంకే నాయకుడు టికెఎస్ ఎలంగోవన్ ఉన్నారు. ఆ బిల్లులకు ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదం పొందిందని వివరించారు. -
8న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్ 8న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్ సింగ్ లఖ్వాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవ కవాతులో రైతులు పాల్గొనాలని ఢిల్లీ –ఘజియాబాద్ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లాహ్ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని మొల్లాహ్ హెచ్చరించారు. కెనడాకు వార్నింగ్ గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. రైతులు చేస్తున్న నిరసనలు పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ భారత్‌లో కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్‌ను శుక్రవారం హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కెనడా ప్రధాని, కేబి నెట్ మంత్రులు భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందించడాన్ని తప్పుబడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. -
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్‌ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్‌లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్‌సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్‌సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్‌లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలను బుధవారం వరుసగా ఏడోరోజు రైతులు దిగ్బంధించారు. నిరసనల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన ఢిల్లీ–నోయిడా మార్గాన్ని అధికారులు మూసేశారు. ఢిల్లీ–హరియాణా మార్గంలోని సింఘు, టిక్రీల వద్ద ట్రాఫిక్‌ను నిలిపేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్లను అంగీకరించేంతవరకు నిరసన కొనసాగుతుందని రైతు సంఘాలు పునరుద్ఘాటించాయి. ప్రభుత్వంతో మరో విడత చర్చలను నేడు రైతులు జరప నున్న విషయం తెలిసిందే. రైతుల నిరసనలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సూటు, బూటు సర్కారు హయాంలో రైతుల ఆదాయం సగమయిందన్నారు. మరోవైపు, రైతుల నిరసనలకు మద్దతుగా ఉత్తర భారతదేశం వ్యాప్తంగా రవాణా సేవలు నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) హెచ్చరించింది. రైతుల డిమాండ్లను నెరవేర్చనట్లయితే డిసెంబర్ 8 నుంచి రవాణా సేవలు ఆగిపోతాయని స్పష్టం చేసింది. రవాణా(కార్గో, ప్యాసెంజర్) సేవలందించే దాదాపు 95 లక్షల ట్రక్కు యజమానులు, సుమారు 50 లక్షల ట్యాక్సీ, బస్ ఆపరేటర్లకు, ఇతర సంబంధిత వర్గాలకు ఏఐఎంటీసీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘రవాణా సేవలు నిలిచిపోతే ఆహారధాన్యాలు, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, పాలు, పళ్లు, ఔషధాలు.. తదితర నిత్యావసరాల రవాణా ఆగిపోతుంది. ప్రస్తుతం యాపిల్ పళ్ల సీజన్ నడుస్తోంది. రవాణా నిలిచిపోతే అవి పాడైపోతాయి’ అని ఏఐఎంటీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక సమావేశాలు పెట్టండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. డిమాండ్లను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తే ఢిల్లీలోకి ప్రవేశించే ఇతర మార్గాలను కూడా దిగ్బంధిస్తామని హెచ్చరించాయి. గురువారం జరగనున్న చర్చల్లో తమ అభ్యంతరాలను పాయింట్లవారీగా వివరిస్తామన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దూకి సీఎం నివాసం వైపు వెళ్తున్న కార్యకర్తలపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బరీందర్ ధిల్లాన్, పలువురు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. మంత్రుల చర్చలు ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలను ఏ విధంగా తొలగించాలనే విషయంపై వారు చర్చించారు. సింగూ సరిహద్దు వద్ద భారీ స్థాయిలో గుమిగూడిన రైతులు -
చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి డిసెంబర్ 3న రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు.. అక్టోబర్ 14, నవంబర్ 13న రైతులతో చర్చించింది. మంగళవారం(డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతులు, రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. సాగు చట్టాలు కరోనా కంటే ప్రమాదం కరోనా›హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. కరోనాతో ముప్పు ఉంటుందన్న విషయం తమకు తెలుసని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలు కరోనా కంటే మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ధర్నాలో ఉన్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏడుగురు వైద్యులతో కూడిన బృందం నవంబర్ 28 నుంచి 90 మంది రైతులకు పరీక్షలు చేసింది. వీరిలో ఎవరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు చెప్పారు. షరతులు పెడితే.. ఢిల్లీని ముట్టడిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: చర్చల విషయం లో కేంద్రం ఎలాంటి షరతులు విధించరాదని రైతులు పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. యూనియన్ల మద్దతు.. నిరసన తెలుపుతున్న రైతులకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు (సీఐటీయూ) సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, అధ్యక్షురాలు కె.హేమలత, సీఐటీయూ కార్యదర్శి కరుమలియన్లు మద్దతు తెలిపారు. రైతుల పోరాటాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేయాలని ఏఐఏడబ్ల్యూయూ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ కార్యాచరణ ప్రకటించింది. -
‘భారత ప్రజలమైన మేము..’ ఎక్కడ?
భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే సమయానికి రాజ్యాంగ ఉపోద్ఘాతంలో పొందుపరిచి హామీ పడిన ప్రజల ప్రాథమిక హక్కులపై అత్యంత దారుణమైన దాడి జరుగుతోంది. రాజ్యాంగాన్ని విధిగా ఆచరణలో అమలు పరచడానికి అవసరమైన అత్యంత కీలకమైన 32వ అధికరణను కాస్తా పాలకులు జావగార్చు తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఉన్న అధికరణలు ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల అమలుకు హామీపడిన కీలకమైన క్లాజులు. వీటినే తొలగించే ప్రయత్నం చేస్తే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ? దేశ రాజధానిలో రైతుల నిరసన ఘటనను పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రైతాంగం కన్నీటితో ఒలకబోసుకుంటున్న అనంతబాధల పాటల పల్లవిగానే మనం బాధిత హృదయంతో భావించాలి. ప్రతి ఏటా మనం నవంబర్ 26న సంవిధాన (రాజ్యాంగ) దినోత్సవం జరుపు కుంటున్నాం. 1949లో ఆ రోజున భారత రాజ్యాంగ నిర్ణయ సభ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించింది. అలాంటి సంవిధాన పత్రాన్ని ఆమోదించడమంటే, దాన్ని ఆచరణలో తు.చ. తప్పకుండా అమలు జరుపుతామన్న భరోసాను ప్రజలకు హామీ పడడమని అర్ధం. కాని ఈ ఏటి ఈ సంవిధాన దినోత్సవం సమయానికి, రాజ్యాంగాన్ని విధిగా ఆచరణలో అమలు పరచడానికి అవసరమైన అత్యంత కీలకమైన 32వ అధికరణను కాస్తా పాలకులు జావగార్చుతుండటంపై సర్వత్రా ఆందో ళన వ్యక్తం అవుతోంది. అంటే ప్రజలు తమకు తాముగా (వియ్ ది పీపుల్) రూపొందించుకొని తమకు అంకితం చేసుకున్న రాజ్యాంగ ఉపోద్ఘాతానికి, అందులో పొందుపరిచి హామీ పడిన ప్రజల ప్రాథమిక హక్కులపై నేడు అత్యంత దారుణమైన దాడి జరుగుతోంది. ఇందుకు నరేంద్ర మోదీ పాలన తీరు తెన్నులతోపాటు సుప్రీంకోర్టు వ్యవహ రిస్తున్న తీరూ నిరాశ నిస్పృహలకు కారణమవుతోంది. కంచే చేనును కాస్తా మేసేస్తే పంటకు రక్షణ ఎక్కడ? 2020 సంవిధాన దినోత్సవం రోజున ప్రజలను ఎదుర్కొంటున్న పెద్ద ప్రశ్నలు. –ఏ. వెంకటేశన్, సుప్రసిద్ధ లీగల్ వ్యవహారాల పాత్రికేయ ప్రముఖుడు, ‘వైర్’ లీగల్ ఎడిటర్ ఈ ఏడాది విషాద ఘడియగా ముగిసిన రాజ్యాంగ దినోత్సవం దేశంలో పెక్కు బాధాకరమైన పరిణామాలకు సాక్షీభూతంగా నిలి చింది. రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఉన్న అధికరణలు ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల అమలుకు హామీపడిన కీలకమైన క్లాజులు. వీటిలో 32వ అధికరణ.. ప్రజలు తమ ప్రాథమిక హక్కుల్ని ఆచరణలో అమలు జరిపించుకోడానికి సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కును గ్యారంటీ చేసింది. అందుకే భారత రాజ్యాంగ రూపకర్తలలో ప్రముఖుడైన డాక్టర్ అంబేద్కర్ ఈప్రత్యేక అధికరణను (ఆర్టికల్ 32) మొత్తం రాజ్యాంగానికే ఆత్మగా పేర్కొన్నాడు. అలాగే ఈ అధికరణ దృష్ట్యానే లీగల్ వ్యవహారాలపై పండితుడైన రోహిత్ డే సుప్రీం కోర్టును ‘ప్రజా న్యాయస్థానమని’ భావించవలసి వచ్చింది. అయితే రానురాను పాలకుల ప్రవర్తన మాదిరే సుప్రీం ఆచరణ కూడా మారిపోయిందనే భావన దేశంలో ప్రబలంగా ఉంది. ఈ దశలో ‘రాజ్యాంగంలోని అధికరణ 32ను అమలు జరిపించుకోవడానికి సామాన్య పౌరుడు చొరవ చేయడాన్ని ‘నిరుత్సాహపరచవలసి వస్తుం దన్న’ అభిప్రాయానికి రావడానికి న్యాయమూర్తులు నిర్ణయించు కుంటే, రాజ్యాంగానికీ ఆత్మగా భావిస్తున్న 32వ అధికరణను నిర్వీర్య పరిచే రాజ్యాంగచట్టం ఆత్మనే చంపేసినట్టవుతుందని న్యాయశాస్త్ర నిపుణులు భావిస్తున్నారని మరువరాదు. దేశ పౌరసత్వ సవరణ చట్టం పేరుతో దేశంలో ‘విదేశీయుల’ ముద్రపేరిట అన్యమతస్తుల్ని వెలివేసి వేధించే చట్టాలను రూపొందించడం ఈ కోవకు చెందిన పాలక చేష్టలే. అయినా సరే, బీజేపీ నాయకులు అంబేడ్కర్ వారసత్వానికి తామే సిసలైన వారసులమని నిస్సిగ్గుగా ప్రకటించుకోవటం ఆశ్చర్యకరం. ‘భీమాకోరెగావ్ కేసు’ పేరిట వివిధ రాష్ట్రాలలో పౌర ఉద్యమ కార్య కర్తల్ని, నాయకులను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి, మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పుబట్టి వ్యతిరేకించినా బీజేపీ నాయకులకు చలనం లేకపోయింది. ఇప్పటికీ గత రెండేళ్లుగా పౌరహక్కుల నాయకులు కోరెగావ్ ప్రాంత దళిత ఉద్య మకారులూ, జర్నలిస్టులు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. పౌరుల భిన్నాభిప్రాయ ప్రకటన హక్కు రాజ్యాంగానికి జీవనాడి అని జస్టిస్ గుప్తా ప్రకటించినా.. కేంద్ర పాలకులకు ‘చీమకుట్టదు’. పాల కుల ఈ రాజ్యాంగ వ్యతిరేక వైఖరే క్రమంగా భారతదేశ ఫెడరల్ వ్యవస్థ స్వరూప స్వభావానికే చేటు కల్గిస్తుంది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు) దేశానికి అవ సరమని, తరచూ దేశంలో ఎన్నికలు జరగడం అభివృద్ధికి ఆటంక మని, ప్రధాని మోదీ అఖిల భారత సభాపతుల (స్పీకర్స్) మహా సభలో (26–11–20) ప్రకటన చేయడానికి మూడు రోజుల ముందు చేసిన మరో ప్రకటనతో కలిపి విశ్లేషించుకుంటే ఒక సత్యం బయట పడుతోంది. ‘2014–2029 మధ్య కాలం భారతదేశానికి చాలా ముఖ్యమైన సమయం. ఇండియాలాంటి యువ భారత ప్రజాస్వా మ్యానికి 16వ–18వ లోక్‌సభ మధ్యకాలం (అంటే 15 ఏళ్లు) కీలక మైనది. ఈ దృష్ట్యా చూస్తే ఇప్పటికి గడిచిన ఆరేళ్లు (అంటే బీజేపీ పాలన తొలి ఆరేళ్లు) దేశాభివృద్ధిలో చరిత్రాత్మకం. కాబట్టి ఇకమీదట మిగతా రాబోయే నాలుగేళ్లు (2024) కాలం కలిసొస్తే ఆపైన మరి అయిదేళ్లపాటు (2029) భారతదేశానికి చాలా ముఖ్యమైన కాలంగా భావించాలి. ఈ కాలంలో మనం చేయాల్సింది చాలా ఉంది అని మోదీ ప్రకటించారంటే ఆయన బీజేపీ అధికార ‘ఉట్టికి పెద్ద నిచ్చెనే’ వేశారని అర్థమవుతోంది. బయటికి ఆ ప్రకటనలోని మర్మాన్ని చెప్ప కుండానే చెప్పినట్లు అయింది. సుమారు గత ఆరేళ్లపాలనలోనూ దేశా భివృద్ధిని ఎక్కడిదాకా దిగజార్చుతూ వచ్చారో చూశాం. ప్రస్తుతం గత ఆరేడు మాసాలుగా దేశ జన జీవితాన్ని, ఆర్థిక వ్యవస్థను అతలా కుతలం చేస్తూన్న ‘కరోనా’ (కోవిడ్–19) దశను మినహాయిస్తే అంత కుముందు ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయక జాతీయోత్పత్తి, ఉద్యోగ రంగాలన్నిటా విస్తృతస్థాయిలో ప్రభుత్వరంగ శాఖలు పెక్కింటిని ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసే చర్యలకే పాలకులు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఆర్థిక వ్యవస్థ ప్రగతికి చోదకులుగా పాలకులున్నారో, లేక వారి స్థానాన్ని రిజర్వుబ్యాంకు ఆక్రమించిందో తెలియని దశలో దేశ ప్రజలున్నారు. సంప్రదాయ వ్యవసాయ రంగంలో రైతులు దశాబ్దాల తరబడి ఆశిస్తున్న సంస్కరణలను పంటలకు కనీస మద్దతు ధరను, తమ పంటకు తగిన మార్కెటింగ్ సౌకర్యాలను పాలకులు కల్పించనందున రైతాంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే మూడు రకాల కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను ప్రస్తుత పాలకులు రైతాంగం నెత్తిన రుద్దారు. ఫలితంగా పంజాబ్, హరియాణా, రాజస్తాన్, రైతాంగం కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమించి బీజేపీ పాలకులకు కంపరం కల్పిస్తోంది. తమ ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా సాగుతోందని ప్రక టించి, తమ ఉద్యమం పరిష్కారమయ్యేదాకా ఢిల్లీలోనే మకాంవేసి ఆరునెలల పాటయినా సాగించడానికి సరిపడా తిండీ తిప్పలకు సరిపడా సంభా రాలన్నీ సమకూర్చుకున్నామని రైతాంగ ఉద్యమకారులు ప్రకటించా రంటే వ్యవసాయ రంగ దుస్థితి భారతదేశంలో ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతోంది. విద్యుత్ పంపిణీ, బ్యాంకులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక ఉద్యో గుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా.. బడా పారిశ్రామిక వర్గాల కోసం విదేశీ బ్యాంకర్లకు, విదేశీ గుత్త సంస్థలకు అనుకూలంగా ప్రైవేటీకరణకు భారీస్థాయిలో నిర్ణయాలు, చట్టాలు పాలకులు చేశారు. చివరికి, కరోనా చాటున జూన్‌లో (2020) అత్యవసర సరుకుల నియంత్రణ బిల్లుకు ఆర్డినెన్స్‌గా తీసుకొచ్చారు. ‘మంచిసమయం మించిపోతుందన్న’ ప్రాచీన వ్యంగ్యోక్తికి బీజేపీ పాలకుల హడావుడి చర్యలే ప్రత్యక్ష నిదర్శనం. ఢిల్లీ సరిహద్దుల్లో భారీస్థాయిలో వేలాదిగా మోహరించిన రైతాంగంలో 70 ఏళ్ల వృద్ధ రైతు గాద్గదిక స్వరంలో మోదీని ఉద్దేశించి చేసిన హెచ్చరిక నిన్న, ఈనాటి, రేపటి పాలకులందరికీ కనువిప్పు కాగలదని ఆశిద్దాం. ‘ప్రధానమంత్రిగారికి చెప్పండి ఆయన తినే రొట్టె పెరిగేది మా పొలా ల్లోనని మరచిపోవద్దని, ఆమాటకొస్తే రైతులంతా మేం మా పొలాల్లో పండించే గోధుమలనే యావత్తు దేశానికి అంది స్తున్నాం. రైతాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీనీ మేము సహించం. మంచిరోజులు చూపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఆ మంచి ఎప్పుడు చూపిస్తాడట. పండించిన పంటను మేము మండీ లలో అమ్ముకునేవాళ్లం. కానీ కనీస ధర పండిన పంటకు రాకపోవడం వల్ల ఆ మండీల నిర్వాహకుల, ప్రైవేటు వ్యాపారుల దోపిడీకి బలి అవుతున్నాం’ అని ఆ రైతాంగం మొత్తుకోవటం. అటు కాంగ్రెస్ పాలనలోనూ, ఇటు బీజేపీ పరిపాలనలోనూ ఇదే పద్ధతి. 1995లో దేశం మొత్తంమీద 2,98,438 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఈ మొత్తం దేశంలో జరిగే అన్నిరకాల ఆత్మ హత్యలలో 11.2 శాతం అని అంచనా. ఈ హత్యలన్నీ మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి. తాజా పరిణామాన్ని పంజాబ్, హరి యాణా, రాజస్తాన్ రైతాంగం కన్నీటితో ఒలకబోసుకుంటున్న అనంత బాధల పాటల పల్లవిగానే మనం బాధిత హృదయంతో భావించాలి. అయినా పాలకుల కన్నుమాత్రం సంవిధానం పాతర మీదనుంచి 2024 నుంచి 2029 దాకా పక్కకు తొలగదు. తలలు బోడులైన తల పులు బోడులా? వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
షరతులతో చర్చలకు ఒప్పుకోం
న్యూఢిల్లీ: షరతులతో కూడిన చర్చలకు సిద్ధంగా లేమని రైతులు కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే అన్ని మార్గాలను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రహదారులపై నిరసన విరమించి, బురాడీ గ్రౌండ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ సూచనపై ఆదివారం రైతులు పైవిధంగా స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా రైతులు ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టలు రైతులకు కొత్త హక్కులను, కొత్త అవకాశాలని అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో పునరుద్ఘాటించారు. రైతుల సమస్యలు త్వరలోనే అంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. రైతులు తాము చెప్పిన బురాడీ గ్రౌండ్‌కు తరలితే.. వారితో ఉన్నతస్థాయి మంత్రుల బృందం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ షరతుపై దాదాపు 30 రైతు సంఘాలు చర్చించి, షరతులతో కూడిన చర్చలకు వ్యతిరేకమని స్పష్టం చేశాయి. బురాడీ గ్రౌండ్‌ను ఓపెన్ జైలుగా అభివర్ణించాయి. ‘హోంమంత్రి పెట్టిన షరతుకు మేం అంగీకరించబోం. షరతులతో చర్చలకు మేం సిద్ధంగా లేం. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. మా నిరసన, రహదారుల దిగ్బంధం కొనసాగుతుంది. ఢిల్లీలోకి ప్రవేశానికి వీలు కల్పించే ఐదు మార్గాలకు కూడా మూసేస్తాం’ అని భారతీయ కిసాన్ యూనియన్ పంజాబ్ శాఖ అధ్యక్షుడు సుర్జీత్ ఎస్ ఫుల్ స్పష్టం చేశారు. చర్చలు జరిపేందుకు షరతులు పెట్టడం రైతులను అవమానించడమేనన్నారు. పంజాబ్, హరియాణాల నుంచి మరింత మంది రైతులు త్వరలో తమతో చేరనున్నారని వెల్లడించారు. రైతులతో చర్చలు జరపాలని విపక్ష పార్టీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కోవిడ్–19 ముప్పు, పెరుగుతున్న చలి కారణాలుగా చూపుతూ రైతులు వెంటనే బురాడీ గ్రౌండ్‌కు తరలివెళ్లాలని, అలా వెళ్లిన మర్నాడే ఉన్నతాస్థాయి మంత్రుల బృందం వారితో చర్చలు జరుపుతుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా శనివారం నిరసనల్లో పాల్గొంటున్న 32 రైతు సంఘాలను ఉద్దేశించి ఒక లేఖ పంపించారు. కాగా, హరియాణాలోని పలు కుల సంఘాలు రైతుల నిరసనకు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ముఖ్యంగా..సింఘు, టిక్రి ప్రాంతాల్లో రైతులు చలిని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. వారికి ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆహారం అందజేస్తోంది. రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ నేత, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. రైతులు హరియాణా నుంచి ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా హరియాణా సీఎం ఖట్టర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నిరసన తో కరోనా విజృంభిస్తే ఆ బాధ్యత అమరీందర్‌దేనని ఖట్టర్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మద్దతు తెలిపారు. మంత్రులు చర్చలు: రైతుల నిరసనలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి తోమర్ చర్చిం చారు. -
డిమాండ్లు నెరవేర్చేదాకా కదలం
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే దాకా తమ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానంలో శాంతియుతంగా ధర్నా చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వేలాది మంది పంజాబ్, హరియాణా రైతులు శనివారం ఢిల్లీ శివార్లలోని సింగూ, టిక్రీ సరిహద్దులోనే బైఠాయించారు. సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లే ప్రసక్తే లేదని, తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవర్చే వరకూ ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వంట పాత్రలు సైతం తెచ్చుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీలు, వాహనాల్లోనే నిద్రిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారు లెక్కచేయడం లేదు. ఆదివారం సమావేశమై, తదుపరి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్జీత్‌సింగ్ మహల్ చెప్పారు. పంజాబ్, హరియాణా రైతులకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్ రైతులు కూడా ఘాజీపూర్ సరిహద్దు వద్ద బైఠాయించారు. ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ–మీర్జాపూర్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రైతులు ధర్నా చేయాలనుకుంటే ఉత్తర ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లాలని జాయింట్ కమిషనర్ సురేందర్ సింగ్ యాదవ్ సూచించారు. అయితే, జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సంత్ నిరంకారీ గ్రౌండ్లో రైతుల నిరసన కొనసాగుతోంది. శనివారం రైతుల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 3న రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఉద్యమం వెనుక పంజాబ్ సీఎం కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కార్యాలయ సిబ్బంది రైతులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడికి వెళ్తే చర్చలకు సిద్ధం: అమిత్ షా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్న రైతులు ఢిల్లీలోని సంత్ నిరంకారీ గ్రౌండ్‌కు వెళ్లాలని హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. అక్కడే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయవచ్చని చెప్పారు. తాము సూచించిన ప్రాంతానికి వెళ్లిన రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ శివార్లలో బైఠాయించిన రైతులు తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే వెంటనే నిరంకారీ మైదానానికి వెళ్లాలని అమిత్ షా హోంశాఖ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. -
రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తొలిరోజు అడ్డుకున్న ప్రభుత్వం రెండోరోజు శుక్రవారం దిగి వచ్చింది. రైతులు శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీకి దారి తీసే మార్గాలపై విధించిన ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. దీంతో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. రాజధానిలో అతి పెద్దదైన నిరంకారీ మైదానంలో ధర్నా నిర్వహించారు. సాగును కార్పొరేట్లకు అప్పగిస్తూ రైతులను దగా చేసే కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పంజాబ్–హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి బయలుదేరిన రైతులపైహరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. హరియాణాలో పలుచోట్ల రైతులపై దాష్టీకం ప్రదర్శించారు. శుక్రవారం పరిస్థితి చాలావరకు సద్దుమణిగింది. ఆంక్షలను ఎత్తివేయడంతో అన్నదాతలు తిక్రీ బోర్డర్ నుంచి పోలీసు ఎస్కార్ట్‌తో నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. ధర్నాతో ఢిల్లీలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హరియాణాలోని భీవానిలో జరిగిన ప్రమాదంలో ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పంజాబ్ రైతు తాన్నాసింగ్(40) మృతి చెందాడు. రైతులతో చర్చించేందుకు సిద్ధం రైతులతో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రైతన్నలు ఆందోళన విరమించుకోవాలని కోరారు. కొత్త సాగు చట్టాలతో అన్నదాతల జీవితాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. 3న జరిగే భేటీకి రైతు నేతలను ఆహ్వానించామన్నారు. సింఘు సరిహద్దు వద్ద రైతుపై లాఠీచార్జ్ చేస్తున్న జవాను -
‘చలో ఢిల్లీ’ రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను, ఇతర నిరసనకారులను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు. రైతన్నలపై పోలీసుల జులుం పంజాబ్–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్సర్–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్ జిల్లాలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్ కేనన్ల ప్రయోగం -
చలో ఢిల్లీ!
మెదక్ కాంగ్రెస్ టికెట్ విషయంలో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ టికెట్‌ను దాదాపుగా పద్నాలుగు మంది నాయకులు ఆశిస్తున్నారు. కానీ ఇందులో పీసీసీ కొంత మంది పేర్లను గుర్తించి వాటిని ఏఐసీసీకి పంపించింది. దీంతో ఆశావహుల చూపు హస్తినవైపు మళ్లింది. స్థానికంగా ఉంటే సీటు వస్తుందో? రాదో? అన్న అనుమానంతో ఢిల్లీకి వెళ్లి ఎలాగైనా టికెట్‌ను దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తమకే వస్తుందని ఆశావహులందరూ ఆశాభావం వ్యక్తం చేయడం కొసమెరుపు. సాక్షి, మెదక్: జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. మెదక్ నియోజకవర్గ ఆశావహుల ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కొందరు నాయకులు ఇది వరకే ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్ టికెట్ సాధనలో నిమగ్నమయ్యారు. అధిష్టానం పెద్దలను కలుసుకుని ఎలాగైనా టికెట్ సాధించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి సీన్ ఢిల్లీకి మారింది. మెదక్ టికెట్ కోసం కాంగ్రెస్‌లో గట్టి పోటీ ఉంది. 14 మంది ఆశావహులు ఎమ్మెల్యే టికెట్‌ను కోరుతూ పీసీసీకి దరఖాస్తులు సమర్పించిన విషయం తెలిసిందె. ఎవరికివారే తమకు టికెట్ కేటాయిస్తే గెలిపిచూపిస్తామని స్క్రీనింగ్ కమిటీకి తెలియజేశారు. మెదక్ అసెంబ్లీ నుంచి తమకు గల విజయావకాశాలను, ఆర్థిక స్థితిగతులు తదితర విషయాలను చెప్పుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌లోని తమ “గాడ్‌ఫాదర్’ల ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కుంతియా తదితర కీలక నేతలను కలిసి టికెట్ ఇప్పించాలంటూ కోరుతున్నారు. ఈ వరసలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నాయకులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ, మామిళ్ల ఆంజనేయులు, అమరసేనారెడ్డి, శ్రీనివాస్, ముక్తార్, రామచంద్రాగౌడ్, బానాపురం మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు. వీరంతా టికెట్ కోసం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసే స్క్రీనింగ్‌కమిటీ ఆశావహుల దరఖాస్తులను పరిశీలించటంతోపాటు సర్వే రిపోర్టులను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే వివిధ వర్గాల ద్వారా మెదక్అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్న వివరాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది. మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయింపు విషయంలో మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యే టికెట్ కోసం ముగ్గురు నుంచి ఐదుగురు పేర్లను ఏఐసీసీకి పంపినట్లు సమాచారం. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25వతేదీన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పర్యటన ముగిసిన వెంటనే.. మెదక్ టికెట్ కేటాయింపు అంశం ఢిల్లీకి చేరడంతో ఆశావహులు ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన లిస్టులో తమ పేరు ఉందని తెలుసుకున్న నేతలంతా ఢిల్లీ వెళ్లి టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. శశిధర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత జైపాల్‌రెడ్డితోపాటు సీడబ్ల్యూసీలోని ఇద్దరు నేతలను కలిసి తనకు మెదక్ టికెట్ ఇప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలు సైతం ఆయనకు టికెట్ వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మెదక్‌కు తిరుపయనమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మైనార్టీ నేత ముక్తార్ ఇది వరకే ఢిల్లీ వెళ్లివచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత అహ్మాద్పటేల్ను కలిసి మైనార్టీకోటాలో తనకు మెదక్ టికెట్ ఇప్పించాలని కోరారు. తాజాగా స్క్రీనింగ్ కమిటీ పంపిన జాబితాలో తమపేరు ఉందని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, మ్యాడం బాలకృష్ణ తదితరులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో రాహుల్‌గాం« దీ పర్యటన ముగిసిన వెంటనే వీరంతా ఢిల్లీ లో టికెట్ వేట సాగించేందుకు సిద్ధం అవుతున్నారు. -
‘మమ్మల్ని చంపడం ఆపండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ ఒక్క నెలలోనే 11 మంది పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణించడంతో పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారంతా ఛలో ఢిల్లీ అంటూ మంగళవారం ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ‘మమ్మల్ని చంపడం ఆపండి’ అంటూ నినదించారు. వీధుల్లోని, కాలనీల్లోని, గృహ సముదాయాల్లోని మాన్హోల్స్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం కోసం వాటిలోకి దిగుతూ పారిశుద్ధ్య కార్మికులు అర్ధంతరంగా మరణిస్తున్నారు. ఈ నెల మొదట్లో ఢిల్లీలోని మోతీ నగర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించిన విషయం తెల్సిందే. గత ఐదేళ్లలోనే ఒక్క ఢిల్లీలోనే ఇలా 2,403 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. ఆ ఐదుగురు మరణానికి బాధ్యలైన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించినా ఏ ప్రభుత్వం ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదు. ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి వినతి పత్రం అందజేశామని, స్వచ్ఛ భారత్ కోరుకునే మోదీ తప్పకుండా తమకు న్యాయం చేస్తామని భావించి రెండు వారాలకుపైగా నిరీక్షించామని, ఆయన నుంచి గానీ, ఆయన ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని ‘సఫాయి కర్మచారి ఆందోళన్’కు చెందిన బెజవాడ విల్సన్ తెలిపారు. సఫాయి కర్మచారి ఆందోళన్ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీకి తరలి వచ్చారు. మానవ పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థను దేశంలో 2013లోనే భారత్ నిషేధించిన ఈ వ్యవస్థ ఇంకా కొనసాగడం శోచనీయమైతే పారిశుద్ధ్య పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదే సంవత్సరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను సూచించినా వాటిని కాంట్రాక్టులుగానీ, యజమానులుగానీ, ప్రభుత్వంగానీ పాటించక పోవడం మరీ దారుణం. దేశంలో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కోసం ఈ ఏడాది బడ్జెట్లో 17,843 కోట్ల రూపాయలను కేటాయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పారిశుద్ధ్య పనివారల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అన్యాయమని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నాయకుడు డీ. రాజా విమర్శించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఓ ఆడంబరమే తప్ప ఆచరణలో ఏమీ జరగడం లేదని ఆయన ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ఐదు వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని శుభ్రం చేస్తున్నా మా పారిశుద్ధ్య కార్మికుల గోడును పట్టించుకోనప్పుడు ఇంకెలా స్వచ్ఛ భారత్ సాధ్యం అవుతుంది’ అని బేజ్వాడ విల్సన్ వ్యాఖ్యానించారు. కుల వ్యవస్థకు అంటుకున్న అంటరానితనం వల్ల తమకు ఇతర పనులేమీ దొరకడం లేదని, విధిలేకే ఈ వృత్తి మీద ఆధారపడి బతకాల్సి వస్తోందని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చదవండి: ఈ ఐదుగురు చావుకు ఎవరు బాధ్యులు? -
టార్గెట్ ‘లాల్ ఖిలా’... మమత సరికొత్త నినాదం!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ‘చలో ఢిల్లీ’ అంటూ పిలుపునిచ్చారు. ఇక తమ లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే అని ప్రకటించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఇక తమ లక్ష్యం బెంగాల్ అంటూ బీజేపీ నినాదానికి ప్రతిగా ‘టార్గెట్ లాల్ ఖిలా’ పోరుకేకను ఆమె అందుకున్నారు. త్రిపురలో పాతికేళ్ల సీపీఎం పాలనకు బీజేపీ తెరదించిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్, ఒడిశా, కేరళలో విజయాలు సాధిస్తేనే.. కమలానికి సంపూర్ణ స్వర్ణయుగం వచ్చినట్టు అని పేర్కొన్నారు. అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై మమత ఘటుగా స్పందించారు. సోమవారం పురాలియా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇక తమ తదుపరి టార్గెట్ బెంగాలేనని కొందరు అంటున్నారు. అలాగైతే మన లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే. ఢిల్లీ దిశగా సాగుదాం. ఛలో ఢిల్లీ అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాన్ని మేం నమ్ముతాం. బెంగాల్ దేశాన్నే కాదు భవిష్యత్తులో ప్రపంచాన్ని గెలుచుకోగలదు’ అని ఆమె పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ‘థర్డ్ ప్రంట్’ ప్రకటనపై మమతా బెనర్జీ చురుగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు ఆమె ఫోన్ చేసి.. మద్దతు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమి ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. గతంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుచేసేందుకు మమత ఉత్సాహం చూపారు. -
‘చలో ఢిల్లీ’ నినాదంతో నేడు పాదయాత్ర
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదంతో అన్ని యూనివర్సిటీలు, నగరాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విద్యార్థి విభాగం నాయకులకు సూచించింది. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, నగర విభాగం అధ్యక్షులు, యూనివర్సిటీ అధ్యక్షులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరింది. -
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం : వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల హక్కు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన్ని కలిసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా విద్యార్థుల జేఏసీ డిసెంబర్ 20న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వారంతా జగన్‌ను కలిసి మద్దతు కోరారు. ఛలో ఢిల్లీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తమ ఎంపీలు గళం వినిపిస్తారాని ఆయన విద్యార్థులకు తెలిపారు. కాగా, పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ కూడేరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించి.. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించిన విషయం తెలిసిందే. -
జూలై 7న చలో ఢిల్లీ
అనంతపురం రూరల్ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ఆందోళనకు మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో ‘చలో ఢిల్లీ’ కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను మాలలకు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. మాదిగలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటేష్, చంద్ర, జయప్రకాష్, లక్ష్మన్న, నరసింహులు, రాజు, నాగప్ప, గంగాధర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు ఉద్యమం
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 19న చలో దిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి తెలిపారు. గురువారం కడపలోని ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ర ఘునాథరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విషయమై రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలువనున్నట్లు తెలిపారు. అలాగే దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా కూడా చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఏకీకృత సర్వీస్‌లు, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను కూడా తక్షణం భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
25న చలో ఢిల్లీ:న్యాయవాదుల జేఏసీ
యాకుత్‌పురా: తెలంగాణ హైకోర్టు ఏర్పాటును కోరుతూ ఈ నెల 25న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి కోరారు. పురానీహవేలిలోని సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో గురువారం చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైకోర్టు విభజన, న్యాయాధికారుల తొలగింపు, సీమాంధ్ర జడ్జిల ఆప్షన్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. హైకోర్టు విభజన కోరుతూ ఉద్యమించిన జ్యుడీషియల్ అధికారులను విధుల నుంచి తొలగించడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మాణిక్ ప్రభు గౌడ్, తిరుమల్‌రావు, లక్కరాజు హరిరావు, ప్రవీణ్ కుమార్, రాం బాబు, యాదవ్, అశోక్ కుమార్, శ్రీలత, శివ కుమార్ దాస్ పాల్గొన్నారు. -
28న ఎంపీటీసీల ఫోరం ‘చలో ఢిల్లీ’
ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అభివృద్ధి నిధులను కేంద్రం రద్దు చేసినందుకు నిరసనగా ఈ నెల 28న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తలపెట్టామని తెలంగాణ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ పేర్కొన్నారు.రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం గురువారం హోటల్ సరోవర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 13వ ఆర్థిక సంఘం నుంచి ఎంపీటీసీలకు 25శాతం అభివృద్ధి నిధులు కేటాయించగా, ఈ విధానాన్ని రద్దు చేసిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లుగా 14వ ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన బీఆర్జీఎఫ్ గ్రాంట్‌ను కూడా ఎన్డీఏ రాష్ట్రానికి నిలిపివేసిందన్నారు. గ్రామాభివృద్ధి పట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి కారణంగా పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. సుమారు 2వేలమంది ఎంపీటీసీలతో జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించి నిరసనను కేంద్రానికి తెలియజేయడమే ‘చలో ఢిల్లీ’ ప్రధాన ఉద్దేశమన్నారు. సమస్యల పరిష్కారానికి తలపెట్టిన కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎంపీటీసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరారం యాదగరి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
బీసీల రిజర్వేషన్ల కోసం 9న చలో ఢిల్లీ
- టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం మే 9న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నేతలను కలసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి అఖిలపక్షాన్ని పంపాలని డిమాండ్ చేశారు. ఏపీలో కాపులను బీసీ చేర్చాలనడం, గుజరాత్లో పటేళ్లను, హరియాణాలో జాట్లను ఇలా ప్రతీ చోట అగ్ర కులాలను చేర్చి బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. -
జాతీయ నాయకులను కలిసిన రఘువీరా బృందం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం జాతీయ నాయకులను కలిశారు. శరద్‌యాదవ్, నితీశ్‌కుమార్,శరత్ పవార్లను కలసి ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పూర్తి మద్దతుంటుందని తెలిపారు. ఏపీతో పాటు బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు నితీశ్ వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రత్యేక హోదా కోసం చేసినా కోటి సంతకాలను ప్రధాని మోదీకి సమర్పిస్తారు. -
ఛలో ఢిల్లీ కార్యక్రమంలో అపశ్రుతి..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకయ్య గుండెపోటుతో మృతిచెందారు. లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఆయన మృతదేహానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నివాళులర్పించారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో 300మంది కాంగ్రెస్ నేతలు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రత్యేక హోదా అమలు డిమాండ్‌తో చేపట్టిన కోటి సంతకాలను రఘువీరా నేతృత్వంలో ప్రధాని మోదీకి సమర్పించనున్నారు. -
'కేంద్రంతో చంద్రబాబు రాజీపడ్డారు'
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా అమలు కోరుతూ రేపు ఢిల్లీకి ఏపీ పీసీసీ రఘువీరారెడ్డి వెళ్లనున్నారు. ప్రత్యేక హోదా అమలు డిమాండ్ తో చేపట్టిన కోటి సంతకాలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పిస్తామని రఘువీరా తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్ట హామీల అమలులో కేంద్రం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావట్లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ప్రయోజనాలపై చంద్రబాబు రాజీపడ్డారంటూ ఆయన మండిపడ్డారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులు 300 మంది కాంగ్రెస్ నేతలు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం అందింది. 14,15,16 తేదీల్లో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. -
చలో ఢిల్లీ పోస్టర్ విడుదల చేసిన రాహుల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం అమలు కోసం కోటి సంతకాల సేకరణకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. న్యూఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇందుకు సంబంధించి గురువారం ఓ పోస్టర్ విడుదల చేశారు. కోటి సంతకాల సేకరణతో మార్చి 12న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేయనున్నట్లు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కన్నారు. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జైరాం రమేష్, పార్టీ ఎంపీలు కేవీపీ రామచందర్ రావు, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, జేడీ శీలం, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రోహిత్ ఘటనపై 20న చలో ఢిల్లీ
♦ 8 నుంచి తెలుగు రాష్ట్రాల్లో బస్సు యాత్ర ♦ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ నాయకులు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మృతి ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. హెచ్‌సీయూలోని బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన జేఏసీ నాయకులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ రోహిత్ ఘటనకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ చలో ఢిల్లీకి పూనుకున్నామన్నారు. ఢిల్లీలో అన్ని వర్సిటీల విద్యార్థులతో నాలుగు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న ప్రత్యేక సమావేశం, 6న హెచ్‌సీయూలో రౌండ్ టేబుల్ సమావేశం, పబ్లిక్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ముఖ్య వక్తలుగా ఆలిండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సభ్యులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, రమేష్ పట్నాయక్, తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ జగేంద్రబాబు, చక్రధర్రావులతో పాటు పలువురు ప్రసంగిస్తారని చెప్పారు. రిలే నిరాహారదీక్షలు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. కొనసాగుతున్న రిలే దీక్షలు.. రోహిత్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షల్లో విద్యార్థులు ప్రకాష్, సందీప్ కాంబ్లే, రాహుల్, తుషార్ గాడ్గే, యోగేష్ పాల్గొన్నారు. పరిపాలనకు, తరగతులకు అంతరాయం కలగకుండా సాయంత్రం వేళల్లో జేఏసీ ప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
'చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి'
హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ బీసీ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ బల్లుపై మే 5,6 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. -
16న వికలాంగుల ‘చలో ఢిల్లీ’
హైదరాబాద్ : ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వికలాంగుల హక్కుల చట్టం - 2013’ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపచేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 16న వికలాంగుల ‘చలో ఢిల్లీ’ నిర్వహిస్తున్నట్లు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిల భారత వికలాంగుల హక్కులవేదిక, హెలెన్‌కెల్లర్ వికలాంగుల ప్రాంతీయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంఘాల అధ్యక్షులు నాగేశ్వరరావు, పీవీ రావు మాట్లాడారు. -
జయ్‌తో చలో ఢిల్లీ
యువ నటుడు జయ్‌తో చలో ఢిల్లీ అంటోంది నటి ఆండ్రియా. ఈ ఇద్దరూ సంచలన తారలే. అంతేకాదు మోస్ట్ ఎలిజిబిటీ బ్యాచ్‌ల్లో లిస్టులో వీరిద్దరూ ఉన్నారన్నది గమనార్హం. అలాంటి ఈ జంట ఒక చిత్రంలో కలిసి నటిస్తే ఆ క్రేజే వేరు. సరిగ్గా అలాంటి చిత్రం త్వరలో తెరపైకి రానుంది. జయ్, ఆండ్రియాల కలయికలో వలియవన్ అనే చిత్రం, చిత్ర నిర్మాణం జరుపుకుంటోంది. ఎంగేయుం ఎప్పోదుం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శరవణన్ ఈ చిత్రానికి రూపకర్త. విభిన్న యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను దేశ రాజధాని ఢిల్లీలో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీంతో జయ్, ఆండ్రియాలు త్వరలో ఢిల్లీకి పయనం కానున్నారన్నది తాజా వార్త. అక్కడ జయ్, ఆండ్రియలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. డీ.ఇమాన్ సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌వర్గాల మాట. -
సమైక్య చలో ఢిల్లీ
-
సమైక్య చలో ఢిల్లీ
-
ఢిల్లీకి తరలివెళ్లిన ఎన్జీఓలు
విజయనగరం టౌన్, కలెక్టరేట్ న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో నూకలు చెల్లిపోయాయని సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమి తి సభ్యులు అన్నా రు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తుతున్న పరిణామాలపై వారు తీవ్రంగా స్పం దించారు. ఈ నెల 17న ఢిల్లీలో జరగనున్న నిరసనకు జిల్లా నుంచి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు సుమారు 500 మంది శని వారం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఈ సందర్భంగా స్టేషన్ మొత్తం సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిపోయింది. సమైక్యాం ధ్రను పరిరక్షించుకుంటామని వారంతా నినాదాలు చేశారు. అనంతరం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకుడు గంటా వెంకటరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లుపై సీమాంధ్ర ఎంపీలను మాట్లాడనివ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే సహించేది లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న నాయకులకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఢిల్లీ సభ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా సీఎం కిరణ్ తదితరులు హాజరవుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు న్న కుట్రలను తిప్పికొట్టేందుకు నాయకులందరితో కలిసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ‘సమ్మె చేసేందుకు వెనుకాడం’ విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏ క్షణానైనా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి డి.వి.రమణ పేర్కొన్నార ు. పార్లమెంట్లో సీమాంధ్రకు చెందిన ఎంపీలపై దాడికి నిరసనగా శనివారం పట్టణంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ముందు రిలే నిరశన దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ దీక్షలు చేపడుతున్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి శేషుకుమారి, దీక్షలో ప్రశాంత్, ఎన్.శ్రీధర్, బి.శివప్రకాష్, మౌళి, టి.రమణమూర్తి, పి.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య దండుగా..సంగ్రామానికి..
‘బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కి..’ అన్న మాటలు వారి గుండెల నిండా విశ్వాసాన్ని నింపాయి. చేయీచేయీ కలిపి.. ‘సమైక్య దండు’గా ఐక్యమై హస్తినపై సమరానికి కదిలారు. అటు శ్రీకాకుళం నుంచి.. ఇటు రాజమహేంద్రి వరకూ వేల గొంతుల్ని ఒక్కటి చేసి.. సమైక్యాంధ్ర పరిరక్షణే తమ ధ్యేయమంటూ నినదించారు. ఢిల్లీ గద్దెపై ఏలుబడి సాగిస్తూ.. తెలుగుతల్లిని ముక్కచెక్కలు చేసేందుకు పరమ తెంపరితనంతో యత్నిస్తున్న కాంగ్రెస్ ‘పెద్దల’కు తెలుగోడి సత్తాను రుచి చూపుతామంటూ ప్రతినబూనిన సమైక్యవాదులు ప్రత్యేక రైళ్లలో కురుక్షేత్రం దిశగా సాగారు. తమ అభిప్రాయాన్ని మన్నించకుంటే మహాసంగ్రామం తప్పదంటూ హెచ్చరించారు. సాక్షి, రాజమండ్రి :‘సోనియమ్మా.. తెలుగువారిని ముక్కలుచెక్కలు చేసే అధికారం నీకెవరిచ్చారో ఢిల్లీలోనే తేల్చుకుందాంరూ. అని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హస్తిన దిశగా కదిలాయి. రాజ్యాంగ నిబంధనలను తోసిరాజని.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును అప్రజాస్వామికంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద సమైక్య ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు రాజమండ్రి వరకూ నాలుగు జిల్లాల కార్యకర్తలు, నేతలు ప్రత్యేక రైలులో శనివారం ఢిల్లీకి బయలుదేరారు. ఈ రైలు రాజమండ్రి నుంచి సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. మొక్కవోని దీక్షతో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సమైక్య పోరాటంలో పాలుపంచుకునేందుకు రైలులో వెళ్తున్న సమరయోధులకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అదే సమయంలో మాజీ మంత్రి, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పార్టీ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ అంతటా ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ‘మేం ఇక్కడ ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్రం పట్టించుకోవడంలేదు. అసలు రాష్ట్రానికి సంబంధం లేనివారు దీనిని ముక్కలు చేస్తున్నారు. తెలంగాణలో ఎవరికో అధికారం కట్టబెట్టాలని, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చుకోవాలని ఒక రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది యూపీఏ ప్రభుత్వం’ అని ఈ సందర్భంగా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు మాగోడు పట్టకపోతే మేమే ఢిల్లీ వచ్చి మావాణి ఎంత బలమైనదో వినిపిస్తాం. మీ దాష్టీకాన్ని అడ్డుకుంటాం’ అని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా రాజమండ్రి అర్బన్ అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఇతర నేతలు ఆదిరెడ్డి వాసు, ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి, రాయవరం మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్తున్న కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. 22 బోగీల్లోని 2,200 మందికి వీటిని పంపిణీ చేసినట్టు ఆదిరెడ్డి అప్పారావు హైదరాబాద్ నుంచి ఫోన్లో తెలిపారు. కాకినాడ నుంచి ఏపీఎన్జీవోలు పయనం కాకినాడ సిటీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించతలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీఎన్జీవోలు శనివారం మధ్యాహ్నం కాకినాడ నుంచి ప్రత్యేక రైలులో బయల్దేరి వెళ్లారు. కాకినాడ నుంచి 18 బోగీలతో ఈ రైలు బయలుదేరింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాధ్ల నాయకత్వంలో వివిధ శాఖల ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఆశీర్వాదం మాట్లాడుతూ స్లీపర్ బోగీలకు సొమ్ము చెల్లించినప్పటికీ జనరల్ బోగీలు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చలో ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెనకడుగు వేసేది లేదని ఢిల్లీలో సమైక్యాంధ్ర సత్తా చాటుతామని చెప్పారు. -
చలో ఢిల్లీ వెళ్తున్న రైలుపై రాళ్లదాడి
-
చలో ఢిల్లీ వెళ్తున్న రైలుపై రాళ్లదాడి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమవారం నాడు ఢిల్లీలో జరుగుతున్న మహాధర్నాలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు వెళ్తున్న ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ సమీపంలో కొంతమంది దుండగులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. దాంతో కొన్ని బోగీల అద్దాలు పగిలిపోయాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఈ రైలునే లక్ష్యంగా కొంతమంది దుండగులు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. కేవలం సమైక్య నినాదాలతోనే తాము వెళ్తున్నామని, తమను తాము రక్షించుకోడానికి కూడా ఎలాంటి అవకాశం లేదని శ్రీనివాస్ అనే ప్రత్యక్ష సాక్షి ఫోన్ ద్వారా తెలిపారు. -
చలో ఢిల్లీని జయప్రదం చేయండి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి కోనాల భీమారావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఏలూరులో మంగళవారం ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. భీమారావు మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం నెలకు రూ.12 వేల 500లు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కార్మిక చట్టాలు, ధరల నియంత్రణ కోరుతూ 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నామని వివరించారు. 20న భవన నిర్మాణ కార్మికుల ధర్నా మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్, హెల్త్ కార్డుల వర్తింప చేయాలని కోరుతూ ఈ నెల 20న డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, నాయకులు బండి వెంకటేశ్వరరావు, డి.లక్ష్మణమూర్తి, కందుల బాబ్జి, తాడికొండ వాసు, ఎ. కొండాజీ, గంధం అంజమ్మ, డీవీఏవీ ప్రసాదరాజు , పి.విజయ, వీఎస్ మల్లికార్జున్, బి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు -
ఆంక్షలంటే కాంగ్రెస్ గల్లంతే
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆంక్షలు లేని ప్రత్యేక తెలంగాణ బిల్లును డిసెంబర్ 9వతేదీలోపు పార్లమెంట్లో పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఆంక్షలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. సీమాంధ్రుల డిమాండ్‌కు తలొగ్గి తెలంగాణ ఏర్పాటుపై ఆంక్షలు విధించాలని ప్రయత్నిస్తే విద్యార్థుల నాయకత్వంలో ‘చలో ఢిల్లీ’ నిర్వహిస్తామన్నారు. ఓయూలో విద్యార్థుల దీక్షలకు మద్దతుగా మంగళవారం నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో దీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రం స్పందించకుంటే రిలే దీక్షలను ఆమరణ నిరాహార దీక్షలుగా మారుస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేంద్రం చిన్న చిన్న ఆంక్షలు విధించినా ఒప్పుకుంటామని తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్ పేర్కొనటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విద్యార్థి నాయకులు దరువు ఎల్లన్న, బండారు వీరబాబు చెప్పారు. మొదటి రోజు దీక్షలో విద్యార్థి నేతలు దరువు రమేష్, మంజుల, పూర్ణావతి, వాణి, మాధురి, భూమేశ్, అశోక్, సంగమేశ్వర్, లత, కొత్తపల్లి తిరుపతి పాల్గొన్నారు. లా కళాశాల ప్రొఫెసర్ రమాకాంత్ దీక్షలో ఉన్న విద్యార్థులకు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. -
తెలంగాణ కోసం ‘చలో ఢిల్లీ’
షరతులు లేని సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కోసం ముంబైటీ ఐకాస నాయకులు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లును పాస్ చేయాలని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలతో షరతులు లేని సంపూర్ణ తెలంగాణ కావాలని, కేవలం మూడేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని డిమాం డ్తో ముంబై టీ-ఐకాస ప్రతినిధుల బృందం ఢిల్లీకి బయలుదేరింది. శనివారం సాయంత్రం ఏడు గంటలకు ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి ఢిల్లీ స్పెషల్ ట్రైన్ లో ఐకాస చైర్మన్ మూల్ నివాసి మాల, వైస్ చైర్మన్లు బి.హేమంత్‌కుమార్, కె.నర్సింహగౌడ్, కన్వీనర్లు బోగ సుదర్శన్ పద్మశాలి, అల్లెపాండురంగ్ పద్మశాలి తది తరులు బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లి వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, కేంద్ర మంత్రులు, హోం మంత్రిని కలిసి డిమాండ్ల నివేదికను అందజేస్తారు. తెలం గాణ ఐకాస చైర్మన్ కోదండరాం సమ్మతి మేరకు ఈ యాత్ర చేపట్టారు. -
23న సీమాంధ్ర విద్యార్థి జేఏసీ చలో ఢిల్లీ
తాడేపల్లిగూడెం రూరల్ : ఈనెల 23న సీమాంధ్ర (13 జిల్లాల) విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యార్థి జేఏసీ కోఆర్డినేటర్ తులా ప్రభాకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడించి వారు రాజీనామా చేసే వరకు ఆందోళన చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు వలంటీర్లుగా 5 వేల మంది విద్యార్థులు సేవలు అందించారని పేర్కొన్నారు. ఏపీఎన్జీవో భవనంలో జిల్లా విద్యార్థి జేఏసీని రాష్ట్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ డీవీ కృష్ణాయాదవ్ ప్రకటించారని ప్రభాకరరావు తెలిపారు. -
బీసీలకు అన్యాయం చేస్తోన్న కేంద్రం: ఆర్. కృష్ణయ్య
దేశంలోని 70 కోట్ల మంది వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సమర్థులైన బీసీ నేతలున్నా వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని ఆయన విమర్శించారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీసీ కులంలో పుట్టడమే ముఖ్యమంత్రి పదవికి అనర్హతగా మారిందని, ఇప్పటివరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా 30 మంది ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క బీసీ కూడా ఆ జాబితాలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన జరపాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగరమేశ్, ఎస్. దుర్గయ్యగౌడ్, కె. బాలరాజ్, నీలవెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, పెరిక సురేశ్, అశోక్‌గౌడ్, నర్సింహనాయక్, జి. అంజి, ఎ.పాండు, పి.సతీశ్, జి.భాస్కర్, బి.సదానందం తదితరులు పాల్గొన్నారు.