
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న న్యాయవాదుల జేఏసీ నేతలు
యాకుత్‌పురా: తెలంగాణ హైకోర్టు ఏర్పాటును కోరుతూ ఈ నెల 25న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి కోరారు. పురానీహవేలిలోని సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ హాల్‌లో గురువారం చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
హైకోర్టు విభజన, న్యాయాధికారుల తొలగింపు, సీమాంధ్ర జడ్జిల ఆప్షన్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. హైకోర్టు విభజన కోరుతూ ఉద్యమించిన జ్యుడీషియల్ అధికారులను విధుల నుంచి తొలగించడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మాణిక్ ప్రభు గౌడ్, తిరుమల్‌రావు, లక్కరాజు హరిరావు, ప్రవీణ్ కుమార్, రాం బాబు, యాదవ్, అశోక్ కుమార్, శ్రీలత, శివ కుమార్ దాస్ పాల్గొన్నారు.