ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్) తెలిపింది.
ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.
Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.
Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024
బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.
బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు
Comments
Please login to add a commentAdd a comment