Krishna Das
-
బంగ్లా హిందూ నేతపై దేశ ద్రోహం కేసు
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి అక్కడి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాజధాని ఢాకా, చిట్టోగ్రామ్ తదితర ప్రాంతాల్లో హిందువులు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయని తెలిపింది. ఇస్కాన్ మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జోత్ అనే హిందూ సంఘం నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి సోమవారం చిట్టోగ్రామ్కు వెళ్లేందుకు ఢాకా విమానాశ్రయానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిట్టోగ్రామ్కు తరలించారు.చిట్టోగ్రామ్‌లోని లాల్డిగి మైదాన్‌లో అక్టోబర్ 25న హిందువులు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ దాస్, మరో 18 మందిపై మాజీ ప్రధాని ఖలేదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ)నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో చిట్టోగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాస్‌ను పోలీసులు మంగళవారం ఆరో మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కాజీ షరీఫుల్ ఇస్లాం ఎదుట హాజరు పరిచారు. దాస్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజి్రస్టేట్..చిట్టోగ్రామ్ వెలుపల ఈ అరెస్ట్ జరిగినందున నిబంధనల మేరకు 24 గంటలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.నిబంధనలకు లోబడి జైలులో మతాచారం ప్రకారం పూజాకార్యక్రమాలు జరుపుకోవచ్చన్నారు. దాస్‌ను జైలుకు తరలిస్తుండగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు నినాదాలు చేశారు. దాస్‌ను తరలిస్తున్న వ్యాన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జైలు వ్యానులో నుంచి విక్టరీ సింబల్ చూపుతూ దాస్ ప్రసంగించారు. తాము సమైక్య బంగ్లాదేశ్‌ను కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, డిమాండ్లు నెరవేరాదాకా శాంతియుత పోరాటం సాగించాలని మద్దతుదారులను దాస్ కోరారు. ఈ మేరకు ఒక వీడియో ఆన్లైన్లో వైరలవుతోంది. పోలీసులు లాఠీచార్జీ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. దాస్ అరెస్ట్‌పై నిరసనలు దాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఢాకా, చిట్టోగ్రామ్, ఖుల్నా, దినాజ్‌పూర్, కాక్స్ బజార్ కుమిల్లా తదితర చోట్ల హిందువులు ర్యాలీలు చేపట్టారు. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దాస్ అరెస్ట్‌ను ఖండించింది. దాస్ అరెస్ట్‌పై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు ఇతర మైనారిటీల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బంగ్లా అధికారులను కోరింది. దాస్ అరెస్ట్‌ను ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధా రామణ్ దాస్ ఖండించారు. బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తుగా మరో జెండాను ఎగరేయడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అంతే తప్ప అగౌరపర్చలేదని ఆయన పేర్కొన్నారు. -
బీజేపీ రాష్ట్ర సారథి ఎంపికపై కసరత్తు
రెండు రోజుల్లో అధినాయకత్వానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి నివేదిక సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక కోసం పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కృష్ణదాసు రెండురోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేశారు. బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులు, ముఖ్యనాయకులు, జిల్లాల అధ్యక్షులతో కృష్ణదాసు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. వీరి నుంచి సేకరించిన అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి నివేదించనున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత బలం, బలహీనత, రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీ బలోపేతం కావడానికి అనుసరించాల్సిన వ్యూహం, సామాజిక వర్గం, ఆర్థిక బలం, సమన్వయం చేసుకునే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా ఆయన అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎంపికయ్యే రాష్ట్ర అధ్యక్షుని పదవీ కాలంలోనే 2019లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుడిని ఎంపిక చేయాలని రాష్ట్రనేతలు నివేదించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొందరు నేతలు రాష్ట్ర అధ్యక్షుని పదవికోసం నేరుగా పేర్లు సూచించగా, మరికొందరు అధ్యక్షునికి ఉండాల్సిన లక్షణాలను చెప్పి, నిర్ణయా న్ని అధిష్టానానికే వదలి పెట్టారని తెలిసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మరో నేత పేరాల చంద్రశేఖర్‌రావు పేర్లు అధ్యక్ష పదవి కోసం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే అధ్యక్ష పదవిని స్వీకరించడానికి మురళీధర్‌రావు, లక్ష్మణ్ నిరాసక్తతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేరు ప్రముఖంగా వినబడుతోంది. పార్టీ రాష్ట్ర నేతల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి కృష్ణదాసు మరో రెండు రోజుల్లో జాతీయ నాయకత్వానికి నివేదించనున్నారని తెలిసింది. అయితే పార్టీ రాష్ట్ర నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా అంతిమంగా జాతీయ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ల నిర్ణయమే కీలకం కానుంది. ఈ నెల 19, 20 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలోగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
మరో అవినీతి చేప ఏసీబీ వల్లో చిక్కింది. విధుల నుంచి ఇటీవల సస్పెండ్ అయిన అక్కయ్య పాలెం సబ్ రిజిస్ట్రార్ కృష్ణదాస్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ పట్టణం రవీంద్రనగర్ లో సబ్ రిజిస్ట్రార్ కృష్ణదాస్ ఇంటిలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ ఇంటి తో పాటు.. అతని బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అతడి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అక్కయ పాలెం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన కృష్ణదాస్ అవినీతి ఆరపణలతో ఇటీవలే ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. -
బీసీలంటే బిజినెస్ క్లాస్ అనుకున్నట్టుంది!
చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ నేత కృష్ణదాస్ విమర్శ బీసీలను కాదని సుజనాకి పదవా? ఆరోపణలున్న వ్యక్తిని కేంద్ర మంత్రిని చేస్తారా? సాక్షి, హైదరాబాద్: బీసీలంటే ‘బిజినెస్ క్లాస్’ (వ్యాపార తరగతి) అని సీఎం చంద్రబాబు భావించినట్లుగా ఉందని.. అందుకే వెనుకబడిన తరగతుల వారిని కాదని తన వ్యాపారవర్గానికి చెందిన సుజనా చౌదరికి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించారని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఎన్నికలకు ముందు బీసీ జపం చేసిన బాబు అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించి ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పి వారి మద్దతు పొందే ప్రయత్నం చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక.. మంత్రివర్గ విస్తరణల్లో ఆ వర్గాల వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్డీయే తొలి విడత మంత్రివర్గంలో అశోక్‌గజపతిరాజుకు, ఆదివారం జరిగిన విస్తరణలో వ్యాపారవేత్త సుజనా చౌదరికి టీడీపీ తరఫున అవకాశం కల్పించి బీసీలను నిర్లక్ష్యం చేశారన్నారు. ‘‘సుజనా చౌదరిపై అనేక ఆరోపణలున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉండే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలోనే చౌదరి పాల్పడిన అక్రమాలపై ఎన్నో వార్తలు వచ్చాయి. 12.03.2009న ‘సుజనా’త్మక మాయాబజార్’, 13.03.2009న ‘పన్ను ఎగవేత కుదిరింది’, 15.03.2009న ‘ఛత్రం కోసం చక్రం-రాజకీయ బేహారి సుజనా చౌదరి’, 01.09.2009న ‘సుజనాత్మక మాయాబజార్ నిజమే’ ...అనే శీర్షికలతో ఆ పత్రికలో వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి ఆరోపణలున్న వ్యక్తిని కేంద్రంలో మంత్రిని చేస్తారా?’’ అని కృష్ణదాస్ ప్రశ్నించారు. (ఆయా వార్తల క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తూ..) దీనిని బట్టి బీసీలను పావులుగా వాడుకుంటున్న సీఎంకు వారిపై ఉన్నది కపట ప్రేమే నని స్పష్టం అవుతోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు గెలిచే స్థానాల్లో సీట్లు ఇవ్వకుండా ఆ వర్గానికి అన్యాయం చేశారని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం బాబు ఏ మాత్రం కృషి చేయడం లేదని దుయ్యబట్టారు. బీసీలకు మేలు జరిగింది దివంగత నేత వైఎస్ హయాంలోనేనని, ఆయన పాలనలో ప్రవేశపెట్టిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది బీసీలేనని కృష్ణదాస్ గుర్తు చేశారు. ఎప్పటికైనా బీసీలకు మేలు చేసేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. బాబు ఇప్పటికైనా బీసీలకు ప్రాధాన్యమివ్వాలని తమ పార్టీ తరఫున కోరుతున్నామని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.